Clothing distribution
-
ఆనందానికి అడ్రెస్ ఇవ్వండి
ఈ కాలం ధరించడానికి సరైన దుస్తులు లేక చల్లటి వాతావరణాన్ని తట్టుకోలేక కొంత మంది కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడే కొందరు దాతలు ముందుకువచ్చి తాము వాడని దుస్తులను అవసరమైన వారికి ఇస్తుంటారు. మీరు దానంగా ఇచ్చే దుస్తులను తీసుకున్నవారి ముఖంలో చిరునవ్వులు వెలిగే విధంగా ఉండాలి. అందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.. ఎంపిక అవసరం మీ దుస్తుల అల్మారాను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి. కొన్నాళ్లుగా పక్కన పెట్టేసినవి, మీకు నచ్చనివి, మరోసారి అవి మీకు తగిన విధంగా ఉన్నాయా అనేది సరిచూసుకోండి. వాటిలో కుటుంబసభ్యులకు ఏవైనా ఉపయోగించవచ్చా అని ఆలోచించి, ఎంపిక చేసి పక్కన పెట్టండి.. చిరిగిన, మరకలు పడిన, ఇంకొద్ది రోజుల్లో పూర్తిగా పనికిరావు అనుకున్న దుస్తులను దానంగా ఇవ్వాలనుకోవద్దు. దారాల బంధం కొన్ని డ్రెస్సులు కొద్దిగా చిరిగినవో, కుట్లు ఊడిపోయినవో ఉంటాయి. ఇలాంటప్పుడు సూది, దారం తీసుకొని ఆ డ్రెస్సులు తిరిగి వాడేలా కుట్లు వేయాలి. మీరు చేసే పని మానవత్వానికి సంబంధించింది కాబట్టి ఆ దయ, ప్రేమ ఆ దుస్తుల ద్వారా వాటిని అందుకున్నవారికి చేరుతుంది. ఇది మీలో ఓ గొప్ప పాజిటివ్ శక్తిని నింపుతుంది. బట్టలన్నీ సేకరించడమే కాదు, వాటిని ఉపయోగించే విధంగా బాగుచేసి ఇవ్వడంలోనే మన గొప్పదనం దాగుంటుంది. ఉదాహరణకు పాత జీన్స్, పాత మోడల్ అనిపించిన ఫుల్ హ్యాండ్ షర్ట్స్, వాడని స్కార్ఫ్స్, స్వెటర్స్.. వంటివి ఇవ్వచ్చు. స్వచ్ఛమైన మనసు ‘దానంగా ఇచ్చే బట్టలే కదా మళ్లీ వాటిని శుభ్రం చేయడం ఎందుకు’ అనే ఆలోచనతో వాటిని అలాగే ఇవ్వకూడదు. సరిచేసిన దుస్తులను, శుభ్రం చేసి, చక్కగా మడతవేసి ఇస్తే వాటిని అందుకున్నవారి మనసు కూడా అంతే ఆనందంగా ఉంటుంది. కాలానికి తగినవి ఏ కాలంలో దుస్తులను ఇస్తున్నాం అనేది కూడా ముఖ్యం. చలికాలం కాబట్టి ఈ కాలం వాడుకోదగిన దుస్తులనే దానంగా ఇస్తే అవి వారికి ఉపయోగపడతాయి. అలాకాకుండా ఇంట్లోని చెత్త తీసేస్తున్నాం అనుకుంటే వేసవి కాలానికి అనువైన డ్రెస్సులు కూడా ఆ జాబితాలో ఉంటాయి. అవి, చివరకు ఎవరికీ ఉపయోగం లేని విధంగా ఉండిపోతాయి. ఎవరికి అవసరమో వారికే! సేకరించిన, బాగు చేసిన బట్టలన్నీ ఒక దగ్గరగా ఉంచాక ఎవరికి ఇవ్వాలో కూడా సరిచూసుకోవాలి. అందుకు స్వచ్ఛంద సంస్థలు గానీ దగ్గరలో ఉన్న ఆశ్రమాలకు గాని వెళ్లి వాటిని ఇవ్వచ్చు. ఇందుకు ఆన్లైన్ సమాచారం కూడా ఉపయోగపడుతుంది. -
కుట్టుకోవాల్సిందే..!
పాఠశాలలకు చేరిన గుడ్డ దుస్తులకు బదులు వస్త్రాల పంపిణీ ఏడునెలల తర్వాత సరఫరా జతకు కుట్టుకూలీగా రూ.40 నిర్ణయించిన ప్రభుత్వం ముందుకురాని దర్జీలు కథలాపూర్ (వేములవాడ) : ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. పాఠశాలలు తెరిచేలోగా విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు రెడీ అంటూ ప్రగల్భాలు పలికారు. తీరా బడులు ప్రారంభమై ఏడు నెలలు గడిచాక కుట్టు వస్త్రాలు కాకుండా కేవలం గుడ్డ సరఫరా చేయడంతో విద్యార్థులు, పాఠశాలల బాధ్యులు అయోమయానికి గురవుతున్నారు. ఒక్కో డ్రెస్సుకు రూ.40 కుట్టుకూలీగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యార్థులపైన ఆర్థికభారం పడుతుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు పునరాలోచించి కుట్టుకూలీ పెంచాలని, విద్యార్థులకు త్వరగా డ్రెస్సులు అందించాలని పలువురు కోరుతున్నారు. ఆప్కో నుంచి చేనేతకు మార్పు.. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 506, ప్రాథమికోన్నత 87, హైస్కూళ్లు 187 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు సుమారు 73 వేల మంది చదువుకుంటున్నారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వం డ్రెస్సులు అందిస్తోంది. వీరు సుమారు 55 వేల మంది వరకు ఉంటారు. ఒక్కో విద్యార్థికి రెండు జతల డ్రెస్సులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. వీరికి గత విద్యాసంవత్సరం వరకు డ్రెస్సులు పంపిణీ చేయగా.. అవి సరిపోకపోవడం, చిరగడం వంటి సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రభుత్వం ఈసారి బట్టను సరఫరా చేసినట్లు సమాచారం. గతంలో బట్టలు ఆప్కో ద్వారా పాఠశాలకు సరఫరా చేసేవారు. ఈసారి చేనేత సహకార సంఘం ద్వారా సరఫరా చేసింది. విద్యార్థులకు బట్టలు పంపిణీ చేసి ఒక్కో డ్రెస్సుకు కుట్టుకూలీగా రూ.40 చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. ఇది గిట్టుబాటు కాదని దర్జీలు అంటున్నారు. ప్రభుత్వ ధరకు అదనంగా విద్యార్థులు కొంత మొత్తం చెల్లిస్తేనే డ్రెస్సులు కుట్టేందుకు సిద్ధమని పేర్కొంటున్నారు. కుట్టుకూలీ ఏ నిధుల నుంచో..? విద్యార్థుల డ్రెస్సుకు రూ.40 చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించనప్పటికీ నిధులు ఎక్కడినుంచి చెల్లిస్తారనేది ఉపాధ్యాయుల్లో అయోమయం నెలకొంది. పాఠశాలల ఎస్ఎస్ఎ నిధుల్లోంచి గతంలో చెల్లించేవారు. ఈ ఏడాది పాఠశాల ఖాతాలో ఉన్న ఆ నిధులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ నిధులను ఇతర శాఖలకు మళ్లించారనే ఆరోపణలున్నాయి. విద్యార్థుల డ్రెస్సుల కుట్టుకూలీకి నిధులు వస్తాయో లేదోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం, ఉన్నతాధికారులు చొరవ చూపి త్వరగా డ్రెస్సులు అందేలా చూడాలని విద్యార్థిసంఘాల నేతలు కోరుతున్నారు. జాప్యం దారుణం డ్రెస్సులు అందించే విషయంలో ప్రభుత్వ నిబంధనలు చూస్తే విద్యాసంవత్సరం ముగిసేవరకు అందే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితులను బట్టి కుట్టుకూలీని పెంచి ప్రభుత్వం మంజూరు చేయాలి. ఎనిమిదేళ్ల నాటి నిబంధనలు అమలు చేసి నెలల తరబడి జాప్యం చేయడం దారుణం. – ఆరెల్లి సాగర్, ఏబీవీపీ మండల కోకన్వీనర్ -
లౌకికవాది సీఎం కేసీఆర్
• మాటల్లో కాదు..చేతల్లో చూపిస్తుండ్రు:మంత్రి కేటీఆర్ సాక్షి, సిరిసిల్ల: నిజమైన లౌకికవాది సీఎం కేసీఆర్ అని, ఆయన మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. సర్వమతాలను గౌరవిస్తూ అన్ని వర్గాలకు కొత్త దుస్తులు అందించే సంప్రదా యానికి శ్రీకారం చుట్టారని ప్రశంసించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం మంత్రి క్రైస్తవులకు కొత్త దుస్తులు పంపిణీ చేశారు. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు కొత్త దుస్తులు ఇవ్వడం గతంలో ఎన్నడూ లేదని తెలిపారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు కొత్త దుస్తు లిచ్చామన్నారు. క్రైస్తవులు విశ్వశాంతికై ప్రార్థ నలు చేస్తారని, అది తెలంగాణకు మంచిద న్నారు. అనంతరం సిరిసిల్లలో ఇటీవల కేటీఆర్ కు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న నేతకార్మి కుడు దోమల రమేశ్(44) కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. మృతుడి భార్య రేఖకు రూ.లక్షన్నర చెక్కు అందించారు. నేతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుం టోందన్నారు. ఇటీవల ఆర్వీఎం ఆర్డర్లు సైతం ప్రభుత్వం సిరిసిల్ల నేతన్నలకు ఇచ్చిందని భవిష్యత్‌లో మరిన్ని ఆర్డర్లు ఇస్తామని ప్రకటిం చారు. రమేశ్ కూతురు రచనను చదివిస్తామని, ప్రభుత్వమే ఇల్లు కట్టి ఇస్తుందని, వర్క్‌షెడ్ సాంచాలు, రమేశ్ పెద్ద కూతురు సౌమ్యకు కుట్టు మిషన్ అందిస్తామని చెప్పారు. మృతుడి భార్యకు పింఛన్ మంజూరు చేస్తామని వివరించారు. సిరిసిల్లలో ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని మంత్రి కోరారు. -
ఐదు నెలలు.. అడ్రెస్ లేదు..!
పాత దుస్తులతోనే పాఠశాలకు.. • సగం విద్యాసంవత్సరం గడిచినా దుస్తులు కరువు • వస్త్రం కొనుగోలు ధర నిర్ణరుుంచని ప్రభుత్వం • పట్టించుకోని విద్యాశాఖ ఉన్నతాధికారులు విద్యార్థుల మధ్య అసమానతలు తొలగిస్తూ.. అంతా సమానమనే భావన కల్పించేందుకు ప్రభుత్వం డ్రెస్ కోడ్ అమలు చేస్తోంది. జిల్లాలోని 21 మండలాల్లో 1,591 పాఠశాలలు ఉన్నారుు. వాటిలో 2,13,093 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 49,336, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 28,983, ఉన్నత పాఠశాలల్లో 1,34,774 మంది విద్యార్థులు చదువుతున్నారు. కుల మతాలు, పేద, ధనిక తారతమ్యం లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదివే బాలబాలికలకు ఒకే రకం దుస్తులు ఉండా లన్న నిబంధన ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కొన్నేళ్లుగా ప్రభుత్వమే దుస్తులు ఉచితంగా పంపిణీ చేస్తోంది. మొదట కుట్టించిన దుస్తులను పంపిణీ చేసేవారు. విద్యార్థులకు పంపిణీ చేసిన దుస్తులు చిన్నవి, పెద్దవి కావడంతో ప్రభుత్వం ఆప్కో ద్వారా వస్త్రం కొనుగోలు చేసి.. ఎస్ఎంసీ ద్వారా కుట్టించి విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేసేవారు. జతకు రూ.40 చొప్పున కుట్టుకూలీ ఇచ్చేవారు లేకపోవడంతో ఈ బాధ్యతను కొన్ని సంస్థలకు అప్పగించారు. ఒక వేళ వస్త్రం కొనుగోలు చేసినా పాఠశాలలకు చేర్చి.. విద్యార్థులకు పంపిణీ చేయడానికి చాలా సమయమే పడుతుంది. ఇప్పటికే సగం విద్యాసంవత్సరం ముగిసిపోరుుంది. అందరికీ ఒకే కొలత... విద్యార్థులకు దుస్తులు అందజేయటం వరకు బాగానే ఉన్నా.. అందరికీ ఒకే విధంగా కుట్టించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నారుు. గత ఏడాది జిల్లావ్యాప్తంగా ఆయా పాఠశాలల్లో చదివిన విద్యార్ధులకు రెండు జతల చొప్పున దుస్తులు అందజేశారు. ఒక్క జత వస్త్రానికి రూ.160, కుట్టేందుకు రూ.40 వెచ్చించారు. దర్జీ అందరికీ ఒకే కొలత ప్రకారం కుట్టి పాఠశాలలకు పంపిణీ చేశారు. దీంతో కొందరు విద్యార్థులు పొడవుగా ఉండటం, మరి కొందరు లావుగా ఉండటంతో ఆ దుస్తులు వేసుకున్న విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈసారి అనుమానమే... ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరిచి ఐదు నెలలు గడుస్తున్నా దుస్తుల పంపిణీ జాడేలేదు. ఇప్పటివరకు వస్త్రం కొనుగోలు చేయకపోవడంతో దుస్తులను పంపిణీ చేస్తారనే నమ్మకం కూడా లేదు. వేసవి సెలవుల్లోనే వస్త్రం ఎంపిక చేయడం.. కుట్టడం ప్రక్రియ చేపడితే పాఠశాలలు తెరిచేలోగా పంపిణీకి సిద్ధం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు వస్త్రానికి సంబంధించిన ధరను ప్రభుత్వ ఖరారు చేయకపోవడంతో కొనుగోలు చేయలేదు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు దుస్తులు అందిస్తాం.. ఇది పాత మాట.. ప్రస్తుతం ఐదు నెలలుగడుస్తోంది.. సగం విద్యా సంవత్సరం గడిచిపోరుుంది.. దుస్తుల పంపిణీ ఏమోగానీ.. అవసరమైన వస్త్రం ఎంపిక కనీసం చేపట్టలేదు.. పాతవి.. చిరిగిన దుస్తులతోనే విద్యార్థులు నెట్టుకొస్తున్నారు.. పాఠశాలల తనిఖీలకు వచ్చిన రాష్ట్రస్థారుు అధికారులు ఉపాధ్యాయుల పనితీరు, సమస్యలను పరిశీలించారే తప్ప విద్యార్థుల దుస్తుల గురించి పట్టించుకోనట్లు తెలుస్తోంది. - వైరా