సోమవారం నేతన్న రమేశ్ కుటుంబాన్ని పరామర్శిస్తున్న మంత్రి కేటీఆర్
• మాటల్లో కాదు..చేతల్లో చూపిస్తుండ్రు:మంత్రి కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: నిజమైన లౌకికవాది సీఎం కేసీఆర్ అని, ఆయన మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. సర్వమతాలను గౌరవిస్తూ అన్ని వర్గాలకు కొత్త దుస్తులు అందించే సంప్రదా యానికి శ్రీకారం చుట్టారని ప్రశంసించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం మంత్రి క్రైస్తవులకు కొత్త దుస్తులు పంపిణీ చేశారు. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు కొత్త దుస్తులు ఇవ్వడం గతంలో ఎన్నడూ లేదని తెలిపారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు కొత్త దుస్తు లిచ్చామన్నారు. క్రైస్తవులు విశ్వశాంతికై ప్రార్థ నలు చేస్తారని, అది తెలంగాణకు మంచిద న్నారు.
అనంతరం సిరిసిల్లలో ఇటీవల కేటీఆర్ కు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న నేతకార్మి కుడు దోమల రమేశ్(44) కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. మృతుడి భార్య రేఖకు రూ.లక్షన్నర చెక్కు అందించారు. నేతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుం టోందన్నారు. ఇటీవల ఆర్వీఎం ఆర్డర్లు సైతం ప్రభుత్వం సిరిసిల్ల నేతన్నలకు ఇచ్చిందని భవిష్యత్‌లో మరిన్ని ఆర్డర్లు ఇస్తామని ప్రకటిం చారు. రమేశ్ కూతురు రచనను చదివిస్తామని, ప్రభుత్వమే ఇల్లు కట్టి ఇస్తుందని, వర్క్‌షెడ్ సాంచాలు, రమేశ్ పెద్ద కూతురు సౌమ్యకు కుట్టు మిషన్ అందిస్తామని చెప్పారు. మృతుడి భార్యకు పింఛన్ మంజూరు చేస్తామని వివరించారు. సిరిసిల్లలో ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని మంత్రి కోరారు.