Clothing Store
-
ఇంతింతై ట్రెండింతై...
అనగనగా ఒక జాస్మిన్ కౌర్. దిల్లీలో వస్త్ర దుకాణం నడుపుతోంది. క్లాత్స్టోర్లోకి కొత్తగా వచ్చిన పీస్‌లను ప్రమోట్ చేయడానికి వాటి ముందు కెమెరా పెట్టి ‘జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్’ అన్నది. ఈ మాట కాస్తా సోషల్ మీడియా ట్రెండై పోయింది. ‘ఇంతింతై ట్రెండింతై’ అన్నట్లు బాలీవుడ్ వరకు వెళ్లింది. బెంగాలీ నటి, పార్లమెంట్ సభ్యురాలు నుస్రత్ జహాన్ ఈ ట్రెండ్‌కు హాయ్ చెప్పింది. ఇంతకుముందు బాలీవుడ్ నటీమణులు దీపికా పదుకోన్, సన్యా మల్హోత్రాలు ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతూ వీడియోలు చేసి ‘వావ్’ అనిపించారు. ఫేమస్ డైలాగ్ ‘సో బ్యూటీఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్’ను లిప్–సింకింగ్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది దీపిక. దీపిక భర్త రణ్‌వీర్‌సింగ్, డైరెక్టర్–ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్ పెట్టారు. -
అద్దం ముందు సమంత చేసిన వీడియో వైరల్
ఫ్యాషన్ ఐకాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు క్లోతింగ్ బిజినెస్‌లోనూ సమంత ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'సాకి' పేరుతో లాంఛ్ అయిన ఈ క్లోతింగ్ బ్రాండ్ అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది. దీంతో ఈ దుస్తులను ప్రపంచవ్యాప్తంగా అమ్మేందుకు సిద్ధమైంది. 'సాకి' ఆన్లైన్ స్టోర్‌కు విదేశాల నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయిని, దీంతో అమెరికా, సింగపూర్, మలేషియా దేశాలకు వీటిని షిప్పింగ్ చేస్తున్నట్లు సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. దీనికి సంబంధించిన ప్రమోషన్‌ను ఎప్పటిలాగే కొత్తగా ఆవిష్కరించింది. 'సాకి' బ్రాండ్‌కు చెందిన దుస్తులను అద్దం ముందు నిలబడి ఒక్కొక్కటిగా మార్చుకుంటూ కెమెరాకు ఫోజిచ్చింది. 'ఇన్‌స్టా' రీల్‌తో మరింత అందంగా రూపొందించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇప్పటికే ఈ వీడియోకు 10 లక్షలకు పైగానే లైక్స్ వచ్చాయి. 'సమంత ఏం చేసినా కొత్తగానే ఉంటుంది..సూపర్భ్ సామ్' అంటూ పలువురు నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' అనే సినిమాలో సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీ ఇటీవలె గ్రాండ్‌గా లాంఛ్ అయింది.ఇందులో టైటిల్ రోల్ సమంత పోషిస్తుండగా దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ కనిపించనున్నారు. 2022లో ఈ సినిమా విడుదల కానుంది. View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) చదవండి :వైరల్: అద్భుతమైన డ్యాన్స్‌తో అదరగొడుతున్న సమంత ఈ సారి సాయి పల్లవి కాదు మంగ్లీ స్టెప్పులేసింది! -
వైరల్ : 8 ప్యాంట్లు తొడుక్కొని.. అడ్డంగా బుక్కైంది
మనం సాధారణంగా వస్త్ర దుకాణానికి వెళితే కావలిసినవి కొనుక్కుంటాం. కానీ ఓ యువతి మాత్రం షాప్‌కు వెళ్లి చోరీ చేద్దామని భావించి అడ్డంగా బుక్కైంది. ఈ వింత ఘటన వెనిజులాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోనూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. వెనిజులాలో ఓ యువతి వస్త్ర దుకాణానికి వెళ్లింది. అక్కడ జీన్స్ ర్యాక్ వద్దకు వెళ్లి 8 ప్యాంట్లు తీసుకొని డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి ఒకదాని మీద ఒకటి ధరించి చోరీ చేసేందుకు యత్నించింది. కాగా, యువతి ప్రవర్తనపై అనుమానం కలిగిన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అడ్డగించి వాష్‌రూమ్‌కు తీసుకెళ్లారు. ఆమె వేసుకున్న ప్యాంట్‌ను విప్పమన్నారు. దీంతో సదరు యువతి ఒక్కొక్క ప్యాంట్ విప్పుతూ.. మొత్తం 8ప్యాంట్లను బయటికి తీయడంతో సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే ఇదంతా వీడియో తీసీ ఫేస్బుక్లో షేర్ చేయడంతో 4.2 మిలియన్స్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. ' ఈమె చోరీలు చేయడంలో చాలా నేర్పరి. కొంచెం అజాగ్రత్తగా వ్యవహరించి ఉంటే దర్జాగా బయటకు వెళ్లిపోయేదే' అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
రెండు నిమిషాల్లో చోరీ
షట్టర్ పగుల గొట్టి రూ.3.31లక్షలు అపహరణ రాంగోపాల్‌పేట్: రెండు షాపుల షట్టర్లను పగుల గొట్టి రూ.3.31లక్షల నగదు ఎత్తుకెళ్లిన సంఘటన రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆగంపూరకు చెందిన ఖాలిద్ ఏఆర్ ఎంటర్ ప్రైజెస్ పేరుతో హోల్‌సేల్ రెడీమేడ్ దుస్తుల దుకాణం నిర్వహిస్తున్నారు. మల్లేపల్లికి చెందిన ఇక్బాల్ అదే ప్రాంతంలో ఆర్కే ట్రేడర్స్ పేరుతో హోల్‌సేల్ దుకాణం ఏర్పాటు చేశాడు. మంగళవారం తెల్లవారు జామున నలుగురు వ్యక్తులు దుకాణాల తాళాలు పగులగొట్టి చోరాలకు పాల్పడ్డారు. ఏఆర్ ఎంటర్ ప్రైజెస్‌లో రూ.2.96 లక్షలు, ఆర్కే ఎంటర్ ప్రైజెస్‌లో రూ.35వేల నగదు అపహరణకు గురయ్యాయి. ఉదయం స్థానికులు షట్టర్లు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఇన్స్పెక్టర్ మురళి కృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. క్షణాల్లో పని పూర్తి ఈ ఘటనలో నలుగురు దుండగులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. దొంగలు కేవలం రెండు నిమిషాల్లోనే తమ పనిపూర్తి చేసుకోవడం గమనార్హం. ఉదయం సీసీ కెమెరా పుటేజీలు పరిశీలించిన పోలీసులు నిందితులు 4.48 నిమిషాలకు వచ్చి 4.50 నిమిషాలకు బయటికి వెళ్లినట్లు గుర్తించారు. -
రెడీమేడ్ వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని సీతాఫల్మండిలో గల 21 సెంచరీ రెడీమేడ్ వస్త్ర దుకాణంలో సోమవారం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్యూట్ వల్ల దుకాణంలో ఒక్క సారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనలో దుకాణంలోని కొన్ని వస్త్రాలకు నిప్పంటుకోవడంతో కాలిపోయాయి. -
సిద్దిపేట బట్టల దుకాణంలో చోరీ
-
రెండిళ్లు దగ్ధం .. రూ. 20 లక్షల ఆస్తి నష్టం
నెల్లిపాక (భద్రాచలం రూరల్) : నెల్లిపాక మండలం తోటపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన అగ్నిప్రమాదంలో రెండిళ్లు దగ్ధమయ్యాయి. బాధితులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, తోటపల్లి ప్రధాన సెంటర్లో జి.పుణ్యవతికి చెందిన శ్లాబ్ ఇంట్లో చల్లా వీరభద్రం కిరణా షాపును, గల్లకోట భాస్కరరావు వస్త్రదుకాణాన్ని నిర్వహిస్తున్నారు. ఈ దుకాణాల వెనుక ఉన్న పెంకుటింట్లో వీరు నివసిస్తున్నారు. శుక్రవారం వేకువజామున వాకింగ్‌కు వెళుతున్న స్థానికులు దుస్తుల దుకాణం నుంచి పొగలు రావడం గుర్తించి ఇంట్లో నిద్రిస్తున్న వారిని లేపారు. అప్పటికే దుస్తుల దుకాణంలో మంటలు వ్యాపించటంతో చాలావరకూ కాలిపోయాయి. సర్పంచ్ సుకోనాయక్, అప్పలరెడ్డి, పూరేటి వెంకటేశ్వర్లు, మెడికల్ షాప్ మురళి తదితరులు ఇంట్లోని గ్యాస్ సిలిండర్, కొన్ని వస్తువులను బయటికి తీసుకువచ్చారు. ఫైర్ సిబ్బంది సుమారు 2గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు. రెండిళ్లు, గృహోపకరణాలుతో పాటు కాలిపోయాయి. రూ.4 లక్షల దుస్తులు, రూ.5 లక్షల విలువైన కిరాణా సామగ్రి, రూ.50 వేల నగదు ఆహుతయ్యాయి. ఇంటి విలువతో కలిపి ఆస్తినష్టం రూ.20 లక్షలని ఫైర్ అధికారులు అంచనా వేశారు. పండుగల సీజన్ కావడంతో రూ.లక్షల విలువైన సామగ్రిని కొని నిల్వ చేశామని, అవి పూర్తిగా దగ్ధం కావడంతో జీవనాధారం కోల్పోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. తాటిపర్తిలో తాటాకిల్లు దగ్ధం గొల్లప్రోలు : తాటిపర్తి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో తాటాకిల్లు దగ్ధమైంది. దీంతో శ్రీమంతుల ధర్మరాజు, శ్రీమంతుల సుబ్రహ్మణ్యంల కుటుంబాలు నిరాశ్రయమయ్యాయి. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్టు బాధితులు తెలిపారు. ఆస్తి నష్టం రూ. లక్ష ఉండవచ్చన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు మడికి సన్యాసిరావు, సర్పంచ్ చల్లా సత్యనారాయణమూర్తి, తహశీల్దార్ వై జయ సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులకు 50 కిలోల బియ్యాన్ని అందచేశారు రెండు తాటాకిళ్లు దగ్ధం నడకుదురు(కరప) : నడకుదురు గ్రామంలో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో రెండు తాటాకిళ్లు దగ్ధంకాగా మూడు కుటుంబాలు నిరాశ్రయమయ్యాయి. పంచాయతీ కార్యాలయం ఎదుటి వీధిలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటల చెలరేగడంతో రెండు తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. కాకినాడ ఫైర్ సిబ్బంది, స్థానికులు మంటలు ఆర్పేందుకు శ్రమించారు. అనసూరి మంగయ్య మ్మ, మల్లువరస సూర్యకాంతం, విష్ణుచక్రం కుటుంబాలవారు నిరాశ్రయులయ్యారు. రూ.2 లక్షల ఆస్తినష్టం సంభవించిందని రెవెన్యూ అధికారులు అంచనావేశారు. వీఆర్వో భుజంగరావు, ఆర్ఐ నాగరాజు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. సర్పంచ్ యాసలపు దుర్గాప్రసాద్, ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాసరావు, ఎంపీటీసీ జవ్వాది సతీష్ బాధితులను పరామర్శించారు.