రెడీమేడ్ వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని సీతాఫల్‌మండిలో గల 21 సెంచరీ రెడీమేడ్ వస్త్ర దుకాణంలో సోమవారం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్యూట్ వల్ల దుకాణంలో ఒక్క సారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనలో దుకాణంలోని కొన్ని వస్త్రాలకు నిప్పంటుకోవడంతో కాలిపోయాయి.