cm speech
-
రెడీ.. వన్..టూ..త్రీ స్టార్ట్!
ప్రచార పిచ్చి పీక్ స్టేజ్‌కు వెళ్లినట్లుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసేది గోరంత.. చూపించేది కొండంతలా మారింది. ఏ పని చేసినా పబ్లిసిటీ స్టంట్‌గానే మారింది. ఈదఫా జన్మభూమి ఎపిసోడ్లో సామాజిక పింఛన్లు అందుకొనే వృద్ధులు, వికలాంగులు, వితంతువులనూ నటులుగా చేర్చారు. ‘దర్శిలో సీఎంగారి సభ అంతా టీవీల్లో చూస్తేనే పింఛన్ ఇచ్చేది’ అంటూ అధికారులు.. పింఛన్ సొమ్ముకోసం పంచాయతీ కార్యాలయాల వద్దకు మంగళవారం వచ్చినవారికి షరతు విధించారు. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల దాకా వాళ్ల డబ్బుమీద చేతులు పెట్టిఎటూ కదలనివ్వలేదు. గిద్దలూరు రూరల్: మండలంలో కె.ఎస్.పల్లి పంచాయతీ పరిధిలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పెన్షన్ల కోసం మంగళవారం పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే అధికారులు ఎంతకూ పెన్షన్ పంపిణీ చేయకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పైగా దర్శిలో మంగళవారం చేపట్టిన సీఎం చంద్రబాబు కార్యక్రమాన్ని టీవీలో చూడాలని కార్యక్రమం అంతా పూర్తిగా చూస్తేనే పెన్షన్ల పంపిణీ చేస్తామంటు అధికారులు చెప్పారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వృద్ధులు, వికలాంగులు, వితంతువులంతా టీవీ చూస్తు ఉండిపోయారు. పెన్షన్ కోసం దిగువమెట్ట, దిగువమెట్ట తండా, పెద్ద చెరువు, ఉప్పలపాడు గ్రామాల నుంచి వచ్చినవారితో కె.ఎస్.పల్లి పంచాయతీ కార్యాలయం నిండిపోయింది. దూర ప్రాంతాల నుంచి డబ్బులు ఖర్చు చేసుకొని ఆటోల్లో వచ్చినవారు తిండీ తిప్పలు లేకుండా సాయంత్రం వరకు ఉండిపోయారు. ఇష్టం లేకున్నా బలవంతంగా కూర్చోబెట్టి టీవీ చూడమంటే ఏం చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి వద్ద పనులు మానుకుని కార్యాలయం వద్ద గంటల తరబడి వేచి ఉండాలంటే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అధికారులు మాత్రం వేలిముద్రలు వేసే యంత్రం పనిచేయకపోవడంతో పెన్షన్లను పంపిణీ చేయలేదని.. మెషీన్‌ను గిద్దలూరుకు పంపామని వచ్చిన వెంటనే పంపిణీ చేస్తామని తెలిపారు. తిండి తిప్పలు లేకుండా ఎలా కూర్చోవాలా? దిగువమెట్ట నుంచి ఉదయం 9 గంటలకు వచ్చాను. సాయంత్రం 5 గంటలవుతున్నా పెన్షన్ ఇవ్వలేదు. ఈ రోజు ఇవ్వమని చెబితే ఇంటికి వెళుతాము కదా! ఆ టీవీలో సీఎం కార్యక్రమం వస్తుంది ఇక్కడే కూర్చోమంటున్నారు. తిండి తిప్పలు లేకుండా ఎలా కూర్చోవాలి? – తిరుపతయ్య చార్జీలు పెట్టుకుని వచ్చా దిగువమెట్ట నుంచి ఉదయం ఆటోలో వచ్చాను. గంటల తరబడి ఇక్కడే వేచి ఉండమంటే ఎలా ఉండాలి. మా పెన్షన్ డబ్బులు మాకు ఇస్తే ఇంటికి వెళ్లి పనులు చేసుకుంటాం. – రామలక్ష్మమ్మబాయి ఎప్పుడిస్తారో ఏందో! చీరాల టౌన్: ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ప్రతినెలా ఒకటో తేదీన అందాల్సిన పింఛన్ కోసం తిప్పలు పడుతున్నారు. జీవిత చరమాంకంలో ఆర్థిక తోడ్పాటునందించేందుకు ప్రవేశపెట్టిన పింఛన్ పథకాన్ని పాలకులు, అధికారులు సక్రమంగా అమలు చేయకపోవడంతో పంచాయతీ కార్యాలయాల వద్ద ఒకటో తేదీ నుంచి వేచి చూడాల్సి వస్తోంది. ఆన్లైన్ కష్టాలు.. ఎన్నో రకాలుగా మారుతూ వస్తోన్న పింఛన్ పంపిణీ వ్యవహారం ప్రస్తుతం ఆన్లైన్ సమస్యతో ముందుకు సాగడంలేదు. ఉదయం 7 గంటల నుంచి ఎదురు చూస్తున్నా ఆన్లైన్ పనిచేయడం లేదంటూ అధికారులు లబ్ధిదారులతో బుకాయిస్తున్నారు. చీరాల మండంలోని 15 గ్రామ పంచాయతీలకు గాను కేవలం 5 గ్రామాల్లోనే సక్రమంగా పింఛన్ పంపిణీ చేస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పింఛన్‌దారులు ఎదురు చూసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో కనీసం బిళ్లలు కూడా కొనుక్కోలేని పరిస్థితి దాపురించింది. పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఏప్పుడు ప్రారంభిస్తారో కనీసం ఆ గ్రామాల్లో కూడా ప్రచారం చేయకపోవటంతో రెండు మూడు రోజులుగా లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. -
కరువు రహిత జిల్లాగా ‘అనంత’ !
– రామగిరిలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ నిర్మాణానికి నిధులు – ‘అనంత’ను హార్టికల్చర్ హబ్‌గా చేస్తా..మరిన్ని పరిశ్రమలు తీసుకొస్తా – ముక్తాపురంలో ఎన్టీఆర్ కాలనీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు – రైతు కృతజ్ఞత యాత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షిప్రతినిధి, అనంతపురం : ‘అనంత’ను కరువు రహిత జిల్లాగా మారుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అనంతను హార్టికల్చర్హబ్గా మారుస్తానన్నారు. ఇన్‌పుట్‌సబ్సిడీ పరిహారం రైతుల ఖాతాల్లో జమ అవుతున్న నేపథ్యంలో రైతు కృతజ్ఞత యాత్ర పేరుతో చంద్రబాబు బుధవారం ‘అనంత’ పర్యటనకు వచ్చారు. విజయవాడ నుంచి పుట్టపర్తికి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన అక్కడి నుండి హెలికాప్టర్లో ముక్తాపురం చేరుకున్నారు. అక్కడ ఎన్టీఆర్ గృహకల్ప కింద నిర్మించిన ఎన్టీఆర్ కాలనీని ప్రారంభించారు. అక్కడే లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఇళ్లు చాలా బాగా ఉన్నాయని, వాటిని చూస్తుంటే తనకు కూడా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోందని చంద్రబాబు అన్నారు. అక్కడి నుంచి బహిరంగసభ వేదిక వద్దకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఆపై ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అనంతపురం ఎడారిగా మారిపోయే ప్రమాదముందని, ఇప్పటికే రాయదుర్గంలో ఎడారి ఛాయలు కన్పిస్తున్నాయన్నారు. అయితే దీన్ని ఎడారిగా మారిపోకుండా కాపాడుతానన్నారు. హంద్రీ–నీవా ద్వారా జిల్లాలోని చెరువులకు నీళ్లిస్తానన్నారు. పేరూరు–బీటీపీకి కూడా నీళ్లిస్తామన్నారు. 2–3నెలల్లో మడకశిర బ్రాంచ్‌కెనాల్ ద్వారా హిందూపురం, మడకశిరకు నీళ్లిస్తామన్నారు. రామగిరిలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీపై గతంలో ప్రకటన చేశానని, కాలేజీ భవాల నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అనంతపురం నుంచి చిగిచెర్ల మీదుగా ధర్మవరం వరకూ 11.5కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. అలాగే అనంతపురం నుంచి ఎగువల్లి, అనంతపురం బైపాస్ నుంచి చిగురుచెట్టు మీదుగా కనగానపల్లి వరకూ రోడ్డు, ఆత్మకూరు–పేరూరు, పేరూరు– ఎర్రబెంచి, కోడూరు– ఒంటికొండకు రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. అనంతపురం బెంగళూరు ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉండటంతో అనంతపురానికి పరిశ్రమలు అధికంగా వస్తున్నాయన్నారు. పెనుకొండ వద్ద ఏర్పాటవుతోన్న కియా కార్లపరిశ్రమ నుంచి 2019 ఎన్నికల కంటే ముందుగానే ఉత్పత్తి ప్రారంభమై కార్లు బయటకు వస్తాయన్నారు. అనంతపురానికి రూ. 1034కోట్ల ఇన్‌పుట్‌సబ్సిడీ ఇచ్చామని, రూ.419కోట్లు ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నామన్నారు. రుణమాఫీ చేసినా, ఇన్‌పుట్‌సబ్సిడీ ఇచ్చినా కొందరు విమర్శలు చేస్తున్నారన్నారు. తనపై కృతజ్ఞతాభావం కలిగి ఉండాలన్నారు. సభ అనంతరం పలు ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు చెక్‌లు పంపిణీ చేశారు. డ్రిప్ పరికరాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు వరదాపురం సూరి, బీకే పార్థసారథి, హనుమంతరాయచౌదరి, ఈరన్న, చాంద్‌బాషా, ఎమ్మెల్సీ శమంతకమణి, జెడ్పీ చైర్మన్ చమన్, మేయర్ స్వరూప, కలెక్టర్ వీరపాండ్యన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి ఐజీ, ఎస్పీ శుభాకాంక్షలు : రాయలసీమ ఐజీగా బాధ్యతలు తీసుకున్న ఇక్బాల్, ఎస్పీగా సోమవారం బాధ్యతలు స్వీకరించిన జీవీజీ అశోక్‌కుమార్ ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించారు. కొత్తగా బాధ్యతలు తీసుకున్నామని పరిచయం చేసుకున్నారు. నిరాశపరిచిన సీఎం పర్యటన కనగానపల్లి (రాప్తాడు) : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనపై ఎన్నో ఆశలతో వచ్చిన అన్నదాతలకు చివరికి నిరాశే మిగిలింది. వ్యవసాయ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీపై రైతు కృతజ్ఞత సభలో ఇప్పటికైనా విడతల వారీగా కాకుండా పూర్తిగా మాఫీ చేస్తారని, ఇక తమ కష్టాలు తీరుతాయని భావించిన రైతులకు స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో నిరాశ చెందారు. ఇప్పటికి రెండు విడతలు మాఫీ చేసిన జిల్లాలో ఇక్క రెండవ విడతలో సగం మంది రైతులకు రుణమాఫీ వర్తించనే లేదు. బుధవారం ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో భాగంగా రాప్తాడు నియోజక వర్గం కనగానపల్లి మండలానికి విచ్చేశారు. ముక్తాపురం గ్రామంలో ఎన్టీఆర్ గృహాలు ప్రారంభం, అనంతరం రైతుల పొలాల్లో ఏర్పాటు చేసిన రైతు కృతజ్ఞత సభలో ఆయన పాల్గొన్నారు. ఇంత వరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రుణమాఫీ చేశానని అనడంతో మాకు రుణమాఫీ ఇంక జరగలేదని రైతులు ఆయన ప్రసంగం మధ్యలోనే రైతులు వెనుతిరిగి పోయారు. అనంతపురం డీఎస్పీ మల్లికార్జున వర్మ, సీఐలు గోరంట్ల మాధవ్, సూర్యనారాయణ, ఎస్‌లు, పోలీసులు ఎంత చెప్పినా మహిళలు వినకుండా బయటకు వెళ్లిపోయారు. అందరికీ గూడు ప్రభుత్వ లక్ష్యం : రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికి గూడు కల్పించటమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యం సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. ముక్తాపురంలో బుధవారం ఆయన మోడల్ హౌసింగ్ కాలనీ ప్రారంభించారు. ఎన్టీఆర్ సృగృహ పథకం కింద ఇక్కడ 33 ఇళ్లను నిర్మించి, ప్రజలకు అవసరమైన మౌళిక వసతులను కల్పించి మోడల్ కాలనీగా తీర్చిదిద్దారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర శిశు సంక్షేమ శాఖామంత్రి పరిటాల సునీతతో పాటు, రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమా, కాలువ శ్రీనివాసులు, పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు కాలనీ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలనీలో కొత్తగా నిర్మించుకున్న పలు గృహాలను సీఎం ప్రారంభించి, నిర్మాణాలను క్షుణంగా పరిశీలించారు. తర్వాత కాలనీ పక్కన నీరు– చెట్టు పథకం కోసం ఏర్పాటు చేసిన పైలాన్‌ను ప్రారంభించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో కాలనీలో గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులతో సీఎం మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, హౌసింగ్ పీడీ రాజశేఖర్, డీఈ మహబూబ్‌సాహెబ్, స్థానిక టీడీపీ నాయకులు ఎల్.నారాయణచౌదరి, నెట్టం వెంకటేష్, రామ్మూర్తీనాయుడు, ముకుందనాయుడు, సర్పంచ్‌లు సూర్యశేఖరరెడ్డి, రామసుబ్బయ్య, ముకుంద, నాయకులు రాజప్ప, సుబ్రమణ్యం, రాము, పలు శాఖల అధికారులు, హౌసింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
అన్ని చెరువులకూ నీరు
- ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ - టెక్నాలజీతో సేద్యంలో ఆదర్శం కావాలని రైతులకు పిలుపు - 74 ఉడేగోళం వద్ద ‘ఏరువాక’ ప్రారంభం రాయదుర్గం/ రాయదుర్గం అర్బన్ : జీడిపల్లి రిజర్వాయర్ నుంచి జిల్లాలోని చెరువులన్నింటికీ నీరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎత్తయిన ప్రదేశంలో ఉన్న చెరువులకు అవసరమైతే మొబైల్ లిఫ్ట్ ద్వారా నీటిని అందిస్తామన్నారు. శుక్రవారం ఆయన రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామం వద్ద ‘ఏరువాక పౌర్ణమి’ని ప్రారంభించారు. సీఎం ఉదయం 10.36 గంటలకు గ్రామానికి చేరుకున్నారు. హెలిప్యాడ్ నుంచి నేరుగా ఉల్లిరైతు ఉడేగోళం అప్పాజీ పొలంలోకి వెళ్లి పంటను పరిశీలించారు. పంటను జియో ట్యాగింగ్ చేశావా అంటూ రైతును అడగ్గా.. లేదని అతను చెప్పాడు. వెంటనే అధికారుల ద్వారా జియోట్యాగింగ్ చేయించి.. పంట పరిస్థితిపై ఆరా తీశారు. పచ్చపురుగు ఆశించిందని, నీమ్ ఆయిల్ వాడాలని శాస్త్రవేత్తలు తెలిపారు. శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా మందు పిచికారీ చేయాలని సీఎం సూచించారు. అక్కడి నుంచి నేరుగా వెళ్లి పంట (సేద్యపు) కుంటలను పరిశీలించి, పూజలు చేశారు. అనంతరం ఎద్దుల బండి తోలారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. వ్యవసాయ శాఖ ఆ«ధ్వర్యంలో వరుణ పూజలో పాల్గొన్నారు. కుమార్ అనే రైతు పొలంలో సీఎం కాడెద్దులతో దుక్కి దున్నారు. పక్కనే వన్నప్ప పొలంలో వేరుశనగ విత్తును ప్రారంభించారు. అలాగే ట్రాక్టర్‌తో సేద్యం చేశారు. నాగరికతకు చిహ్నం, సంప్రదాయానికి ప్రతీక అయిన ఏరువాకను పండుగలా ,చేసుకోవాలని, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయంలో ఆదర్శంగా నిలవాలని రైతులకు సూచించారు. జిల్లాలో సేంద్రియ పద్ధతుల్లో పండించే పండ్లు, కూరగాయలకు ఇతర దేశాలతో పాటు, ఇతర రాష్ట్రాల్లో మంచి గిరాకీ ఉందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలపైనా రైతులు దృష్టి పెట్టాలన్నారు. అధికారులు పనులు చేయకపోయినా, అవినీతికి పాల్పడినా 1100 నంబరుకు ఫోన్ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 6,344 మంది లబ్ధిదారులకు మంజూరైన రుణాలకు సంబంధించి రూ.86,38,98,000 మెగా చెక్కును, రూ.1032 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ చెక్కును విడుదల చేశారు. బీటీ ప్రాజెక్టుకు నీరిచ్చే పనులకు ఆగస్టు 15న శంకుస్థాపన చేస్తామని సీఎం ప్రకటించారు. కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాల్లో ఎడారి నివారణకు రూ.60 కోట్లను మంజూరు చేస్తామన్నారు. ఆస్పత్రి భవనం ప్రారంభం ఏరువాక సభ వేదికపై నుంచే ముఖ్యమంత్రి వివిధ కార్యక్రమాలను ప్రారంభించారు. రాయదుర్గం పట్టణంలో రూ.3.69 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాల నూతన భవనాలను ప్రారంభించారు. గుమ్మఘట్ట మండలం గోనబావిలో రూ.24 కోట్లతో బీసీ బాలికల గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జిల్లా, మండల నీటి బడ్జెట్లను విడుదల చేశారు. జిల్లా నీటి బడ్జెట్‌కు రూ.13,731 కోట్లు కేటాయించినట్లు సీఎం తెలిపారు. వ్యవసాయ ట్రాక్టర్లకు రూ.125 కోట్లు వ్యవసాయం కోసం రైతులకు ట్రాక్టర్లను అందించడానికి బడ్జెట్లో రూ.125 కోట్లు కేటాయించినట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రైతులు పంట కుంటలు తవ్వుకుని.. వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలని కలెక్టర్ జి.వీరపాండియన్ సూచించారు. కార్యక్రమంలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, ఎమ్మెల్యేలు బీకే పార్థసారథి, వరదాపురం సూరి, ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఈరణ్ణ, యామినీ బాల, ఎమ్మెల్సీలు పయ్యావుల కేశవ్, శమంతకమణి, వ్యవసాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్, జేడీఏ శ్రీరామమూర్తి, జాయింట్ కలెక్టర్ రమామణి, జేసీ-2 సయ్యద్ ఖాజామొహిద్దీన్, సీడ్స్ జేడీఏ వెంకటేశ్వర్లు, సిరికల్చర్ జేడీఏ అరుణకుమారి, ఏడీఏ మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. -
నేనింతే !
– ‘అనంత’ అంటే వల్లమాలిన అభిమానమంటూ పదేపదే వల్లె వేస్తున్న చంద్రబాబు – అవసరమైతే ప్రతి పుట్టినరోజునూ ఇక్కడే చేసుకుంటానని ప్రకటన – టీడీపీని ఆదరిస్తోన్న ‘అనంత’వాసులు.. వంచిస్తోన్న చంద్రబాబు – ‘అనంత’ అభివృద్ధికి మూడేళ్లలో ఎలాంటి చర్యలకూ ఉపక్రమించని వైనం – సాగునీరు, పంట నష్టపరిహారం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో తీరని అన్యాయం – సీఎం తీరుపై మండిపడుతున్న విపక్షాలు (సాక్షి ప్రతినిధి, అనంతపురం) - ‘అనంత అంటే నాకు అమితమైన ఇష్టం. మొన్న చైనాకు వెళుతుంటే ఫ్లైట్‌లో కలలోనూ నాకు అనంతపురం గుర్తొచ్చింది. ఏ విషయంలోనైనా ఈ జిల్లాకే మొదటి ప్రాధాన్యం.’ – గత ఏడాది పుట్టినరోజున గొల్లపల్లి రిజర్వాయర్‌లో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు మాటలివి. - ‘పోయిన బర్త్‌డే గొల్లపల్లిలో జరుపుకున్నా. ఇప్పుడు పామిడిలో చేసుకుంటున్నా. ఈ జిల్లా అంటే నాకు చాలా ఇష్టం. అవసరమైతే కరువు రహిత జిల్లాగా మార్చే వరకూ ‘అనంత’లోనే బర్త్‌డే చేసుకుంటా.’ – ఈ నెల 20న పామిడి సభలో సీఎం ప్రకటన . చంద్రబాబు మాటలు వింటే ఆయన ఈ జిల్లాపై ఎంత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారోనని అనిపిస్తుంది. నిజానికి ఆయన మాటలకు, చేతలకు ఏమాత్రమూ పొంతన ఉండటం లేదు. ‘నోరు ఒకటి చెబుతుంది..చెయ్యి ఇంకోటి చేస్తుంది.. దేనిదోవ దానిదే!’ అన్నట్లుంది సీఎం వైఖరి! ‘అనంత’ అంటే ఎంతో ఇష్టమని తరచూ చెప్పే చంద్రబాబు మూడేళ్లలో ఈ జిల్లాకు తానేం చేశానని ఆత్మపరిశీలన చేసుకున్నా... చంద్రబాబు ఏం చేశారని జిల్లావాసులు నిశితంగా పరిశీలించినా తేలేది ఒకే సత్యం! అందరితో పాటు పింఛన్ల పెంపు తప్ప అంతకు మించి ఏమీ చేయలేదని! మూడేళ్లలో ఒక్క పరిశ్రమ లేదా విద్యాసంస్థను జిల్లాలో ఏర్పాటు చేయలేదు. హంద్రీ–నీవా ద్వారా ఐదేళ్లుగా జిల్లాకు కృష్ణాజలాలు వస్తుంటే కనీసం ఒక్క ఎకరాకూ అందివ్వలేదు. మూడేళ్లలో ఒక్క పేదవాడికీ ఇళ్లు నిర్మించలేదు. మంజూరైన వాటినీ తరలించారు! రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లాలో ఎలాంటి సంస్థలనూ నెలకొల్పే చర్యలకు ఉక్రమించకపోగా.. కేంద్రప్రభుత్వం ప్రకటించిన వాటినీ దూరం చేశారు. ‘అనంత’లో ఎయిమ్స్(ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) అనుబంధ కేంద్రాన్ని స్థాపిస్తామని కేంద్రం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు–2014లో పొందుపరిచింది. అయితే.. దీన్ని చంద్రబాబు విజయవాడకు తరలించారు. సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని కూడా బిల్లులో పొందుపరిచారు. రెండేళ్లుగా అదిగో వస్తోంది.. ఇదిగో వస్తోందని చెప్పడం మినహా ఇప్పటి వరకూ ఆమోదముద్ర పడలేదు. రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి స్థల నిర్ధారణ పత్రాలు పంపకపోవడంతో వర్సిటీ ఏర్పాటులో జాప్యం జరుగుతోందని సమాచారం. 21 వరాల్లో ఒక్కటైనా... రాజధాని ప్రకటన సమయంలో చంద్రబాబు అసెంబ్లీలో ప్రతి జిల్లాపై వరాల జల్లు కురిపించారు. అందులో భాగంగా ‘అనంత’కు 21 వరాలిచ్చారు. అనంతను హార్టికల్చర్ హబ్ చేస్తానన్నారు. కనీసం ధరల స్థిరీకరణకు కూడా చర్యలు తీసుకోలేదు. సబ్బుల ఫ్యాక్టరీ స్థాపిస్తామని.. అతీగతీ లేదు. నూతన పారిశ్రామిక నగరం, ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ క్లస్టర్, పెనుకొండలో ఇస్కాన్ ప్రాజెక్టు, పుట్టపర్తిలో విమానాల నిర్వహణ, మరమ్మతుల తయారీ కేంద్రంతో పాటు పలు హామీలిచ్చారు. ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. ఐదేళ్ల పాలనకు గాను మూడేళ్లు ముగిసిపోయింది. మరో రెండేళ్లలో ఏం చేస్తారో ఆయనకే తెలియాలి! కరువు రైతుపై కనికరమేదీ? కరువుతో జిల్లా రైతులు కుదేలవుతున్నారు. తాగు, సాగునీటి కోసం ప్రజలు అవస్థ పడుతున్నారు. 2014లో అధికారం చేపట్టిన తర్వాత ఏడాదిలో హంద్రీ–నీవాను పూర్తి చేసి ఆయకట్టుకు నీరందిస్తామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పలుమార్లు ప్రకటించారు. అయితే.. 2015 ఫిబ్రవరిలో జీవో-22 జారీ చేసి డిస్ట్రిబ్యూటరీలు చేయొద్దని ఉత్తర్వులిచ్చారు. అప్పటినుంచి ఇప్పటి వరకూ ఆయకట్టు గురించి ఆలోచించలేదు. నిజంగా చంద్రబాబుకు జిల్లాపై అంత ప్రేమ ఉంటే మూడేళ్లుగా డిస్ట్రిబ్యూటరీలు ఎందుకు పూర్తి చేయలేదో? ఈ ఏడాది 28 టీఎంసీల నీరొచ్చినా ఒక్క ఎకరాకూ ఎందుకివ్వలేదో చెప్పాలని జిల్లావాసులు డిమాండ్ చేస్తున్నారు. కుప్పం వరకూ ప్రధాన కాలువ పూర్తయ్యే వరకూ డిస్ట్రిబ్యూటరీలు చేయబోమని చంద్రబాబు ‘అనంత’లోనే బాహాటంగా చెప్పారు. అప్పుడు తమ జిల్లాకు నీళ్లివ్వండి.. తర్వాత మీ జిల్లాకూ తీసుకెళ్లండని ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా సీఎంకు చెప్పలేకపోయారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తమ రాజకీయ అవసరాల కోసం జిల్లా ప్రజల సంక్షేమాన్ని ఫణంగా పెడుతున్నారు. జిల్లా వాసులు గత ఎన్నికల్లో 12 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీని గెలిపించారు. ఇంత అభిమానం చూపించిన జిల్లాకు చంద్రబాబు ఏమీ చేయకుండా కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. ఆయన వైఖరిపై ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాల్సిన అవసరముంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా తమ అధినేత ‘అలవిమాలిన ప్రేమ’లో ఎంత నిజాయితీ ఉందో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుని జిల్లా అభివృద్ధికి పాటుపడాల్సి ఉంది. -
లంచమడిగితే తిరగబడండి
(సాక్షిప్రతినిధి, అనంతపురం) : ‘ రెవెన్యూ శాఖలో 50 రకాల సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. వీటిని గణనీయంగా తగ్గిస్తాం. ప్రజలు ఆఫీసులకు వెళ్లకుండా సెల్ఫోన్ల ద్వారానే పనులయ్యేలా టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. పలుశాఖల్లో తప్పులు జరిగాయి. అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. ఎవరైనా డబ్బులడిగితే మీరు తిరగబడండి. అండగా నేనుంటా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు సూచించారు. తమ ప్రభుత్వంలో అవినీతి జరగలేదని ఓవైపు ప్రసంగించిన చంద్రబాబు.. మరోవైపు అధికారుల అవినీతిపై వ్యాఖ్యలు చేసి పరోక్షంగా అవినీతి ఉందంటూ అంగీకరించారు. శనివారం ఆయన ధర్మవరంలో చేనేతల రుణవిముక్తిసభ, బుక్కరాయసముద్రంలో రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.అంతకుముందు ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి వచ్చిన చంద్రబాబు అక్కడి నుంచి హెలికాప్టర్లో ధర్మవరానికి చేరుకున్నారు. రైల్వేఫ్లైఓవర్ను ప్రారంభించారు. అబ్దుల్‌కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. మొక్కలు నాటి నేరుగా సభాస్థలికి చేరుకున్నారు. చేనేత పరిశ్రమపై ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రారంభించారు. ధర్మవరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే వరదాపురం సూరి అధ్యక్షతన జరిగిన సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రసంగం ఇలా సాగింది.. పంట కుంటలపై శ్రద్ధ తీసుకోవాలి ‘నదులు అనుసంధానం చేశా. కాలువలు పూర్తి చేశా. పంటకుంటలకు డబ్బు, రెయిన్గన్లు ఇచ్చా. మీరు మాత్రం కుంటలు తవ్వలేదు. వర్షం రావడంతో తర్వాత చుద్దామని వదిలేశారు. వర్షం వచ్చినప్పుడు కుంటలు తవ్వి నీరునిల్వ చేసుకోవాలి. జూన్‌లో 8, డిసెంబర్లో 3 మీటర్లలో భూగర్భజలమట్టం ఉండాలి. కానీ ఇప్పుడు 17.6 మీటర్లలో ఉంది. భూగర్భజలాల పెంపుపై ప్రత్యేకశ్రద్ధ చూపాలి. అనంతపురం పండ్లు మంచిరుచిగా ఉంటాయి. ఇక్కడ వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. జిల్లాను హార్టికల్చర్హబ్గా మరుస్తాం. వేరుశనగకు కూడా అభివృద్ధి చేస్తాం. అమెరికాలో పీనట్స్గా వేరుశనగ విత్తనాలను విక్రయిస్తారు. భూసార ‡పరీక్షలు చేసి విత్తనాల నాణ్యతను పెంచుతాం. ప్రపంచంలోనే క్వాలిటీగా చేసి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేస్తాం. అప్పుడు మెరుగైన ధరలు వస్తాయి. బెంగళూరు పక్కనే ఉంది. కావున అంతర్జాతీయ పరిశ్రమలు జిల్లాకు వస్తాయి. ఇప్పుడు బెంగళూరుకు ఉద్యోగాల కోసం వెళుతున్నారు. భవిష్యత్తులో అక్కడి నుంచే ఇక్కడికొస్తారు. ఒకప్పుడు దెయ్యాలు కూడా పింఛన్లు తీసుకున్నాయి. ఈ ప్రభుత్వంలో వాటి ఆటలు సాగవు. ఒకప్పుడు బియ్యం ఇవ్వమంటే మధ్యలోనే అమ్మేసుకునేవారు. ఈరోజు ఈ పాస్–ద్వారా అవినీతి జరగకుండా అందరికీ ఇస్తున్నాం.’ రీలింగ్ కాంప్లెక్స్‌కు 30 ఎకరాలు ‘అనంతలో 35 వేల ఎకరాల్లో మల్బరీ ఉంది. జిల్లాలో వెయ్యి రేషం షెడ్లు మంజూరు చేశాం. ఇప్పుడు ఒక్కో షెడ్డుకు రూ.82,500 ఇస్తున్నాం. అదనంగా ఒక్కోషెడ్డుకు రూ.1.10 లక్షల చొప్పున వెయ్యిషెడ్లకు రూ.11 కోట్లు మంజూరు చేస్తున్నా. అలాగే రీలింగ్ కాంప్లెక్స్‌ల కోసం రూ.20 కోట్లు ఇస్తున్నా. ధర్మవరంలో 10, హిందూపురంలో 20 ఎకరాలు తీసుకుని రీలింగ్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తాం. ముడిపట్టు ధర పెరిగింది. కిలో రూ.150 ఉండేది. ఇప్పుడు రూ.250కి పెరిగింది. దీని సబ్సిడీ కోసం రూ.42 కోట్లు విడుదల చేస్తున్నా.’ ధర్మవరం ఆస్పత్రిలో సిబ్బంది పెంపు ధర్మవరంలో వందపడకల ఆస్పత్రికి అవసరమైన సిబ్బందిని కేటాయించేందుకు సీఎం అంగీకరించారు. ధర్మవరం, బుక్కరాయసముద్రంలో రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు సమ్మతించారు. ధర్మవరం పరిధిలోని గొల్లపల్లి– పోట్లమర్రి బీటీరోడ్డుకు రూ.21కోట్లు, మరో ఆరు బీటీరోడ్లకు రూ.7కోట్లు, ధర్మవరాన్ని స్మార్ట్‌సిటీగా చేసేందుకు రూ.25కోట్లు కేటాయించారు. నార్పలలో 30 పడకల ఆస్పత్రికి అంగీకారం తెలిపారు. శింగనమల నియోజకవర్గంలో పలు బీటీరోడ్లకు నిధులు మంజూరు చేశారు. పర్యటనలో మంత్రులు కొల్లు రవీంద్ర, పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు, విప్ యామినీబాల, ఎంపీలు జేసీదివాకర్‌రెడ్డి, నిమ్మలకిష్టప్ప, ఎమ్మెల్యేలు వరదాపురం సూరి, హనుమంతరాయచౌదరి, ఈరన్న, చాంద్‌బాషా, జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పయ్యావుల కేశవ్, మెట్టు గోవిందరెడ్డి, Ô¶ మంతకమణి, గేయానంద్, వ్యవసాయశాఖ డైరెక్టర్ ధనుంజయరెడ్డి, కలెక్టర్ కోన శశిధర్, జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, సెరికల్చర్ జేడీ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రొటోకాల్‌కు విరుద్ధంగా వేదికపై కందికుంట ధర్మవరం స¿¶ వేదికపై మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రొటోకాల్‌కు విరుద్ధంగా ఆశీనులయ్యారు. ఇది పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమం. ప్రొటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రమే వేదికపై ఉండాలి. అందుకు విరుద్ధంగా కందికుంట కూర్చొన్నప్పటికీ ఏఒక్కరూ అడ్డుచెప్పలేదు. దీంతో ప్రజలు ఇది ప్రభుత్వ కార్యక్రమమా? లేకæ టీడీపీ సభనా అని చర్చించుకున్నారు.