CMC Vellore hospital
-
రోగులకు చేదోడుగా ‘ప్లూటో’ రోబోట్.. ప్రత్యేకతలివే..
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (సీఎంసీ) వెల్లూరు సంయుక్తంగా దేశంలోనే మొట్టమొదటి న్యూరో రిహాబిలిటేషన్ రోబోట్-అసిస్టెడ్ థెరపీ సాధనాన్ని తయారు చేశాయి. ప్లూటో (ప్లగ్ అండ్ ట్రైన్ రోబోట్ ఫర్ హ్యాండ్ న్యూరో రిహాబిలిటేషన్) అని పిలవబడే ఈ రోబో న్యూరో, వెన్నుముక సమస్యలు ఉన్న రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తయారీదారులు తెలిపారు. ‘ప్లూటో’ను థ్రైవ్ రిహాబ్ సొల్యూషన్స్ దేశంలో మార్కెట్ చేయబోతున్నట్లు ప్రకటించారు.సీఎంసీ వెల్లూరు బయో ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ శివకుమార్ బాలసుబ్రమణియన్, ఐఐటీ మద్రాస్ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సుజాత శ్రీనివాసన్ ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించారు. టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (టీబీఏఎల్), టాటా ఎలిక్సీ లిమిటెడ్ అందించిన సీఎస్ఆర్ గ్రాంట్లు, భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం నుంచి వచ్చిన నిధులు ప్రాజెక్ట్‌కు ఎంతో ఉపయోగపడినట్లు చెప్పారు.తొమ్మిది క్లినిక్‌ల్లో ట్రయిల్స్ పూర్తి‘ప్లూటో న్యూరో రోగులకు అవసరమైన కచ్చితమైన చికిత్సలు, రియల్ టైమ్ ఫీడ్ బ్యాక్‌ను అందిస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ రోగులకు అవసరమైన మెరుగైన చికిత్సలు, ఫలితాలను అంచనా వేస్తుంది. అధిక చికిత్స ఖర్చులు, దేశంలో చాలా మంది స్ట్రోక్ బాధితులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి ప్లూటోను రూపొందించారు. ఇది ఒక కాంపాక్ట్, పోర్టబుల్ టేబుల్ టాప్ పరికరం. చిన్న సూట్ కేస్ ద్వారా దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. దేశంలోని తొమ్మిది క్లినిక్‌ల్లో ప్లూటోను ట్రయిల్ చేశారు. గత 30 నెలల్లో 1,000 మందికి పైగా రోగులు, 100 మంది వైద్యులు దీన్ని ఉపయోగించారు. ఇంట్లో ఉపయోగిస్తూ రోగుల వ్యాధికి సంబంధించిన కచ్చితమైన థెరపీ అధ్యయనాలు తెలుసుకోడానికి ప్లూటో ఎంతో దోహదం చేస్తుంది’ అని నిర్వాహకులు తెలిపారు.ఇదీ చదవండి: కొత్త ఉద్యోగం కోసం నిపుణులు పడిగాపులుఎవరికి అవసరం అంటే..ఈ టెక్నాలజీకి లైసెన్స్ ఇచ్చిన థ్రైవ్ రిహాబ్ సొల్యూషన్స్ ప్లూటోను బిజినెస్ పరంగా వినియోగించుకునేందుకు భారత మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఆసుపత్రులు, చిన్న క్లినిక్‌లు, కమ్యూనిటీ సెంటర్లు, రోగుల ఇళ్లల్లో దీన్ని సులువు వినియోగించవచ్చని తెలిపింది. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనవారు, చేతి వైకల్యం ఉన్న వ్యక్తులకు ఇది చాలా అవసరం అని పేర్కొంది. -
గాలింపు ముమ్మరం
వేలూరు డ్రైనేజీ కాలువలో పడి కొట్టుకుపోయిన జార్ఖండ్ బాలిక కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వేలూరు, న్యూస్‌లైన్: జార్ఖండ్ రాష్ట్రం కిరిడి జిల్లాకు చెందిన ప్రియాంక(14) తన తండ్రి ఇంద్రజిత్ ముఖర్జీ, బంధువులతో వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చింది. సోమవారం సాయంత్రం భారీ వర్షపు నీటి ప్రవాహంలో నడుస్తూ డ్రైనేజి కాలువలో కొట్టుకుపోరుుంది. అప్పటి నుంచి కార్పొరేషన్‌లోని పారిశుద్ధ్య కార్మికులతో పాటు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. కార్పొరేషన్‌లోని డ్రైనేజీ కాలువలు ఎక్కడికక్కడ తవ్వేసినా ప్రియాంక ఆచూకీ మాత్రం కనిపించలేదు. దీంతో వేలూరు ప్యాలెస్ క్యాప్ ఎదురుగా వున్న కొన్ని కట్టడాలను ప్రొక్లెయినర్లతో కూల్చేస్తున్నారు. అదే విధంగా సీఎంసీ ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న కర్పగం సూపర్ మార్కెట్‌ను ధ్వంసం చేసి వాటి కింద ఉన్న డ్రైనేజీ కాలువను పరిశీలించారు. ఆక్సిజన్ మాస్క్‌తో: సీఎంసీ ఆస్పత్రి నుంచి తోటపాళెం వరకు కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులను డ్రైనేజీ కాలువ లో దింపి కాలువలోపల ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని లోజర్ దీపాలను తలకు కట్టుకొని అధునూతన టార్చ్లైట్లను వేసికొని గాలింపు చర్యలు చేపట్టారు. అదే విధంగా ఆర్కాడు రోడ్డు, సీఎంసీ సిగ్నిల్, జంక్షన్ తదితర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. కలెక్టర్ నందగోపాల్, ఎస్పీ విజయకుమార్, కమిషనర్ జానకి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కార్మికులు వెతికి, వెతికి అలసిపోరుు ఇక తమవల్ల కాదని చెప్పేశారు. దీంతో కలెక్టర్, ఎస్పీలు చర్చించుకొని అరక్కొణంలోని నావికాదళం సిబ్బందిని గాలింపు చర్యలకు రప్పించారు. అరక్కోణంలోని ఐఎన్ఎస్ రాజాళీ నావికాదళం సైనికులు మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో వేలూరు చేరుకొని బేరి సుబ్రమణ్యయార్ వీధిని పరిశీలించారు. అనంతరం డ్రైనేజీ కాలువ ఎంత దూరం వెళుతుంది. ఎక్కడెక్కడ కాలువ ముగుస్తుందనే విషయాలను పరిశీలించి వాటిని అధునాతన కెమెరాల ద్వారా ఫొటోలు తీసుకొని ఆ టీమ్ సభ్యులతో చర్చలు జరిపారు. రాత్రి కావడంతో పాటు విద్యుత్ సరఫరా లేక పోవడంతో గాలింపు చర్యలను కొనసాగించలేకపోయూరు. బుధవారం ఉదయం 6 గంటలకు కమాండర్ అర్జునన్ అధ్యక్షతన 10 మంది సిబ్బంది గాలింపు చర్యల్లోకి దిగారు. సీఎంసీ నుంచి కాలువలను కలెక్టరేట్ వరకు గాలించా రు. అదే విధంగా డ్రైనేజీ కాలువలోని మట్టిని కూడా పరిశీలించారు. కాలువల మ్యాప్ సక్రమంగా లేకపోవడంతో కాలువలు ఎక్కెడెక్కడ వెళుతున్నాయనే విషయాలను అధికారులు పూర్తి నిర్ధారణ చేయలేక పోతున్నారు. డ్రైనేజీ కాలువలపైనే భవనాల నిర్మాణం కార్పొరేషన్ వ్యాప్తంగా డ్రైనేజీ కాలువలపైనే అక్రమంగా కట్టడాలను నిర్మించడంతో గాలింపు చర్యలు కష్టతరంగా మారారుు. అసలు కాలువలు ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపించకపోవడం గమనార్హం. ఇన్ని రోజులుగా ఆక్రమణలను పట్టించుకొని కార్పొరేషన్ అధికారులు ప్రస్తుతం బాలిక కొట్టుకుపోయిన తరువాత డ్రైనేజీ కాలువల దుస్థితి చూసి ఆశ్చర్యపోతున్నారు. స్తంభించిపోరుున వేలూరు బాలిక కొట్టుకుపోయిన సంఘటనతో వేలూరును స్తంభింప జేసింది. పట్టణ నడిబొడ్డున ప్రియాంక గల్లంతు కావడంతో కాట్పాడి రోడ్డు, పాత బస్టాండ్, సీఎంసీ రోడ్డులో డ్రైనేజీ కాలువలను తవ్వి ఆ మట్టిని రోడ్డుపైన వేయడంతో రాకపోకలు స్తంభించిపోయూరుు. కన్నీరు, మున్నీరు ఎంత గాలించినా ప్రియూంక ఆచూకీ తెలియక పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు, మున్నీరవుతున్నారు. క ళ్ల ఎదుటే తన చెల్లెలు కాలువలో కొట్టుకుపోతుంటే కాపాడలేక పోయానని ప్రియాంక అన్న అయూద్ విలపించాడు.