CMR Shopping Mall
-
సి.ఎం.ఆర్. ప్రచారకర్తగా మృణాల్ ఠాకూర్
హైదరాబాద్: ప్రముఖ వస్త్ర స్వర్ణాభరణాల సంస్థ సి.ఎం.ఆర్.షాపింగ్ మాల్ నూతన బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి మృణాల్ ఠాకూర్ నియమితులయ్యారు. తెలుగువారి ప్రతి వేడుకలో భాగమైన సి.ఎం.ఆర్.కు ప్రచారకర్తగా ఎంపిక కావడం సంతోషంగా ఉందని మృణాల్ ఠాకూర్ ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శుభ కార్యాలకు ప్రత్యేక పట్టువ్రస్తాలు, యువత మెచ్చే సరికొత్త ఫ్యాషన్స్, అద్భుతమైన డిజైన్లతో కిడ్స్ వేర్ కలెక్షన్స్ ఇక్కడ లభిస్తాయన్నారు. ‘‘మృణాల్ ఠాకూర్ మా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం సంతోషంగా ఉంది. ప్రపంచ స్థాయి ఫ్యాషన్ ట్రెండ్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త కలెక్షన్స్ మా వద్ద లభిస్తాయి’’ అని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మావూరి మోహన్ బాలాజీ తెలిపారు -
వైజాగ్ షాపింగ్ మాల్లో సందడి చేసిన 'లెహరాయి' టీం (ఫొటోలు)
-
మంచిర్యాలలో 'మహానటి'.. CMR షాపింగ్ మాల్ ప్రారంభం
-
ప్రమాద సమయంలో సాయి తేజ్‌కు సాయం చేసింది ఈ ఇద్దరే
సరైన సమయంలో చికిత్స అందడం వల్లే సాయి ధరమ్ తేజ్‌కు ప్రాణాపాయం తప్పిందని తేజ్‌కు మొదట ట్రీట్మెంట్ చేసిన మెడికవర్ వైద్యులు తెలిపిన విషయం విధితమే. గోల్డెన్ అవర్‌లో అతన్ని ఆస్పత్రికి తీసుకురావడం, ఆ టైమ్‌లో ఇచ్చిన ట్రీట్మెంట్ వల్లే సాయి తేజ్ ప్రాణాలతో బయటపడ్డారన్నారు. 108 సిబ్బంది సమయానికి అతన్ని ఆస్పత్రికి తీసుకొచ్చారని చెప్పారు. అంతేగాక ప్రమాదం జరిగిన సమయంలో సాయి తేజ్‌కి ఫిట్స్ రాగా, వెంటనే స్పందించిన వైద్యులు అతనికి ఇంజెక్షన్లు ఇవ్వటంతో.. తదుపరి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు మెడికోవర్ వైద్యులు మీడియాతో చెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: Sai Dharam Tej Accident: సాయి తేజ్ వాడిన బైక్ ఏంటి? ధర ఎంత? అయితే శుక్రవారం సాయంత్రం కెబుల్ బ్రిడ్జీ మీదుగా ఐకియా వైపు వెళ్తుండగా సాయి ఈ ప్రమాదం బారిన పడిన సంగతి తెలిసిందే. రోడ్డుపై ఇసుక ఉండటంతో అతడి స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన జరిగిన వెంటనే స్థానికులు స్పందించి 108కు కాల్ చేసి తేజ్ ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడటంలో కీలక పాత్ర పోషించిన ఎవరో తెలుసా! ఆ అతడు ఓ సెక్యూరిటీగార్డ్. పేరు అబ్దుల్. అమీర్‌పెట ఎల్లారెడ్డిగూడకు చెందిన అబ్దుల్ నిజాంపేట క్రాస్‌రోడ్డులో కొత్తగా ప్రారంభమైన సీఎంఆర్ షాపింగ్ మాల్లో వ్యాలెట్ పార్కింగ్ చేస్తుంటాడట. చదవండి: ఆ కడుపు కోత నాకు తెలుసు: బాబు మోహన్ భావోద్వేగం ఈ క్రమంలో శుక్రవారం విధులకు కెబుల్ బ్రిడ్జ్ మీదుగా హైటెక్ సిటీ మార్గం గుండా బైక్‌పై వెళుతున్నాడు. అదే సమయంలో ఐకియా సమీపంలో సాయి ప్రమాదవశాత్తూ కిందపడటంతో అది చూసిన అబ్దుల్ వెంటనే బండి పక్కన ఆపి హుటాహుటిన సాయి దగ్గరకు వెళ్లాడు. ఆ వెంటనే 108, 100కు డయల్ చేసి సమాచారం అందించాడు. 10 నిమిషాల్లో అంబులెన్స్ రావడం దగ్గర్లోని మెడికోవర్ ఆస్పత్రికి తరలించడం వెంటవెంటనే జరిగిపోయాయి. అయితే అబ్దుల్ అంబులెన్స్‌లో సాయితో పాటు ఆస్పత్రికి కూడా వెళ్లినట్లు సమాచారం. చదవండి: నరేశ్ కామెంట్స్ నాకు ఇబ్బందిగా అనిపించాయి: శ్రీకాంత్ అలాగే ప్రమాదం జరిగిన ప్రాంతానికి కాస్త దూరంలో విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇస్లావత్ గోవింద్ కూడా సకాలంలో స్పందించాడు. సమాచారం అందిన వెంటనే.. ట్రాఫిక్ ను కంట్రోల్ చేయటం.. అంబులెన్సు సకాలంలో ఆసుపత్రికి చేరటంలో సాయం చేశారు. అంబులెన్సులో మెడికవర్ హాస్పిటల్‌కు తీసుకెళ్లినప్పుడు మాత్రమే అతను హీరో సాయి తేజ్ అని అతడికి తెలిసిందట. ఏదేమైన వారు సకాలంలో స్పందించడం వలనే ఈ రోజు సాయి తేజ్ సేఫ్‌గా బయటపడ్డాడు. -
చీరల @ రూ.10.. ఎగబడ్డ మహిళలు.. తొక్కిసలాట
-
రూ.10కే చీర.. తొక్కిసలాట
సాక్షి, సిద్ధిపేట: ఆఫర్ల పేరుతో సిద్ధిపేట పట్టణంలో ఓ వస్త్ర దుకాణం మహిళల ప్రాణాల మీదకు తెచ్చింది. పది రూపాయలకే చీర అని ప్రకటించడంతో సీఎంఆర్ షాపింగ్ మాల్‌కు మహిళలు భారీగా తరలివచ్చారు. సిద్ధిపేట చుట్టుపక్కల నుంచి కూడా మహిళలు తరలిరావడంతో వీరిని అదుపు చేయడం దుకాణం నిర్వాహకులకు కష్టంగా మారింది. చవక ధరలో లభ్యమయ్యే చీరలను దక్కించుకునేందుకు మహిళలు పోటీ పడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 20 మంది మహిళలకు గాయాలయ్యాయి. కొంతమంది మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. ఓ మహిళ నుంచి దుండగులు 5 తులాల బంగారం చోరీ చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. కాగా, సరైన ఏర్పాట్లు చేయకుండా తమను ఇబ్బంది పెట్టిన షాపింగ్ మాల్ నిర్వాహకులపై మహిళలు మండిపడుతున్నారు. మీ వ్యాపారం కోసం మా ప్రాణాలతో చెలగాటం ఆడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కాకినాడలో సందడి చేసిన జిగేల్‌రాణి
-
తిరుపతిలో మెహరీన్, రాశీఖన్నా సందడి
-
సందడి చేసిన మెహరీన్
-
మహబూబ్‌నగర్‌లో రష్మిక సందడి
-
సింహపురిలో రాణి ది గ్రేట్
-
విక్టరీ ఎట్ రాజమహేంద్రి
సినీ హీరో వెంకటేష్ గురువారం రాజమహేంద్రవరంలో సందడి చేశారు. నగరంలోని కోటగుమ్మం సెంటర్లో సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన అభిమానులను ఉత్సాహ పరిచారు. దానవాయిపేట (రాజమహేంద్రవరం): కచ్చితమైన ధరలు, నాణ్యమైన వస్త్రాలు, బీఐఎస్ హాల్‌మార్క్ కలిగిన బంగారు ఆభరణాలతో సీఎంఆర్ షాపింగ్ మాల్ తూర్పుగోదావరి జిల్లాలో నూతన శాఖ ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రముఖ సినీ హీరో ‘విక్టరీ’ వెంకటేష్ అన్నారు. కచ్చితమైన రేట్‌కార్డు, గ్యారంటీ కార్డు, తక్కువ తరుగుతో ఆభరణాలు సీఎంఆర్‌లో లభ్యమవుతున్నాయని పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల వాణిజ్య రాజధాని రాజమహేంద్రవరంలో కోటగుమ్మం సెంటర్లో ఏర్పాటు చేసిన సీఎంఆర్ షాపింగ్‌మాల్‌ను గురువారం ఆయన అభిమానుల కోలాహలం మధ్య ప్రారంభించారు. వస్త్ర విభాగాన్ని మేయర్ పంతం రజనీ శేషసాయి, సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, గుడా చైర్మన్ గన్ని కృష్ణలతో కలసి రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ ప్రారంభించారు. ఆభరణాల విభాగాన్ని ప్రారంభించిన అనంతరం హీరో వెంకటేష్ మాట్లాడుతూ 40 ఏళ్ల క్రితం రాజమహేంద్రవరంలో ప్రారంభమైన చందన బ్రదర్స్ తిరిగి సీఎంఆర్‌గా అవతరించి ఇక్కడ మాల్ ఏర్పాటు చేయడం విశేషమన్నారు. ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ సీఎంఆర్ బ్రాంచ్ని చారిత్రక నగరంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. మేయర్ రజనీశేషసాయి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రిఘాకోళ్లపు శివరామసుబ్రమణ్యం, వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్లు బాపన సుధారాణి, మజ్జి నూకరత్నం, పితాని లక్ష్మీకుమారి, మర్రి దుర్గాశ్రీనివాస్, కళింగ సూర్యనారాయణ, పి.వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ షాపింగ్ మాల్‌ను సందర్శించి సీఎంఆర్ వ్యవస్థాపకుడు చందన మోహనరావు, సంస్థ చైర్మన్ మావూరి వెంకటరమణ, డైరెక్లర్లు బాలాజీ, రాజేశ్వరిలకు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానుల సందడి.. వెంకటేష్రాకతో కోటగుమ్మం సెంటర్ సందడిగా మారింది. ఉదయం నుంచే కోటగుమ్మం సెంటర్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను మళ్లించారు. షాపింగ్‌మాల్ ఎదుట వివిధ రాష్ట్రాల సాంప్రదాయ నృత్యాలు ప్రజలను అలరించాయి. వెంకటేష్ తనదైన స్టైల్లో ప్రేక్షకులకు అభివాదం చేస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ డీఎస్సీ ఎం.వి.రమణకుమార్ పర్యవేక్షించగా, త్రీ టౌన్, టూ టౌన్ ఇన్స్పెక్టర్లు మారుతీరావు, రవీంద్ర బందోబస్తును పర్యవేక్షించారు. -
విక్టరీ ఎట్ రాజమహేంద్రి