సినీ హీరో వెంకటేష్ గురువారం రాజమహేంద్రవరంలో సందడి చేశారు. నగరంలోని కోటగుమ్మం సెంటర్‌లో సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన అభిమానులను ఉత్సాహ పరిచారు.
దానవాయిపేట (రాజమహేంద్రవరం): కచ్చితమైన ధరలు, నాణ్యమైన వస్త్రాలు, బీఐఎస్ హాల్‌మార్క్ కలిగిన బంగారు ఆభరణాలతో సీఎంఆర్ షాపింగ్ మాల్ తూర్పుగోదావరి జిల్లాలో నూతన శాఖ ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రముఖ సినీ హీరో ‘విక్టరీ’ వెంకటేష్ అన్నారు. కచ్చితమైన రేట్‌కార్డు, గ్యారంటీ కార్డు, తక్కువ తరుగుతో ఆభరణాలు సీఎంఆర్‌లో లభ్యమవుతున్నాయని పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల వాణిజ్య రాజధాని రాజమహేంద్రవరంలో కోటగుమ్మం సెంటర్‌లో ఏర్పాటు చేసిన సీఎంఆర్ షాపింగ్‌మాల్‌ను గురువారం ఆయన అభిమానుల కోలాహలం మధ్య ప్రారంభించారు. వస్త్ర విభాగాన్ని మేయర్ పంతం రజనీ శేషసాయి, సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, గుడా చైర్మన్ గన్ని కృష్ణలతో కలసి రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ ప్రారంభించారు.
ఆభరణాల విభాగాన్ని ప్రారంభించిన అనంతరం హీరో వెంకటేష్ మాట్లాడుతూ 40 ఏళ్ల క్రితం రాజమహేంద్రవరంలో ప్రారంభమైన చందన బ్రదర్స్ తిరిగి సీఎంఆర్‌గా అవతరించి ఇక్కడ మాల్ ఏర్పాటు చేయడం విశేషమన్నారు. ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ సీఎంఆర్ బ్రాంచ్‌ని చారిత్రక నగరంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. మేయర్ రజనీశేషసాయి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రిఘాకోళ్లపు శివరామసుబ్రమణ్యం, వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్లు బాపన సుధారాణి, మజ్జి నూకరత్నం, పితాని లక్ష్మీకుమారి, మర్రి దుర్గాశ్రీనివాస్, కళింగ సూర్యనారాయణ, పి.వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ షాపింగ్ మాల్‌ను సందర్శించి సీఎంఆర్ వ్యవస్థాపకుడు చందన మోహనరావు, సంస్థ చైర్మన్ మావూరి వెంకటరమణ, డైరెక్లర్లు బాలాజీ, రాజేశ్వరిలకు శుభాకాంక్షలు తెలిపారు.
అభిమానుల సందడి..
వెంకటేష్‌రాకతో కోటగుమ్మం సెంటర్ సందడిగా మారింది. ఉదయం నుంచే కోటగుమ్మం సెంటర్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను మళ్లించారు. షాపింగ్‌మాల్ ఎదుట వివిధ రాష్ట్రాల సాంప్రదాయ నృత్యాలు ప్రజలను అలరించాయి. వెంకటేష్ తనదైన స్టైల్‌లో ప్రేక్షకులకు అభివాదం చేస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ డీఎస్సీ ఎం.వి.రమణకుమార్ పర్యవేక్షించగా, త్రీ టౌన్, టూ టౌన్ ఇన్స్‌పెక్టర్లు మారుతీరావు, రవీంద్ర బందోబస్తును పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment