హైదరాబాద్: ప్రముఖ వస్త్ర స్వర్ణాభరణాల సంస్థ సి.ఎం.ఆర్.షాపింగ్ మాల్ నూతన బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి మృణాల్ ఠాకూర్ నియమితులయ్యారు. తెలుగువారి ప్రతి వేడుకలో భాగమైన సి.ఎం.ఆర్.కు ప్రచారకర్తగా ఎంపిక కావడం సంతోషంగా ఉందని మృణాల్ ఠాకూర్ ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
శుభ కార్యాలకు ప్రత్యేక పట్టువ్రస్తాలు, యువత మెచ్చే సరికొత్త ఫ్యాషన్స్, అద్భుతమైన డిజైన్లతో కిడ్స్ వేర్ కలెక్షన్స్ ఇక్కడ లభిస్తాయన్నారు. ‘‘మృణాల్ ఠాకూర్ మా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం సంతోషంగా ఉంది. ప్రపంచ స్థాయి ఫ్యాషన్ ట్రెండ్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త కలెక్షన్స్ మా వద్ద లభిస్తాయి’’ అని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మావూరి మోహన్ బాలాజీ తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment