cofee shop
-
ఫోన్లో భార్య సతాయింపులు.. భరించలేక భర్త బలవన్మరణం!
కట్టుకున్న భార్య రాచిరంపాన పెడుతుందని ఓ భర్త వాపోతే ఎలా ఉంటుంది?. నవ్వి ఊరుకుంటుంది ఈ సమాజం. కానీ, అతుల్ సుభాష్ అనే భార్యాబాధితుడి బలవన్మరణం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇలాంటి కేసులు.. వ్యక్తుల జీవితాలకు సంబంధించిన విచారణే కాకుండా చట్టాలను సవరించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ఇది ఇక్కడితో ఆగిపోలేదు. ఓ అతుల్.. కర్ణాటకలో ఓ కానిస్టేబుల్ తిప్పన్న.. రాజస్థాన్‌లో ఓ డాక్టర్ అజయ్ కుమార్ .. ఇలా రోజుకొక ఉదంతం ఈ చర్చలో భాగమవుతోంది. ఇదిలా ఉండగానే.. ఢిల్లీలో మరో అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది.వుడ్‌బాక్స్(Woodbox) అనే పాపులర్ కేఫ్ నడిపిస్తున్న పునీత్ ఖురానా(40) బలవనర్మణానికి పాల్పడ్డాడు. కల్యాణ్ విహార్ ప్రాంతం మోడల్ టౌన్ నివాసంలో మంగళవారం సాయంత్రం ఉరేసుకుని చనిపోయాడు. పునీత్ అతని భార్య మానిక జగదీష్ పహ్వాకి మధ్య విడాకుల కేసు నడుస్తోంది. అయితే.. ఈ కేసులో భార్య సతాయింపుల కోణం బయటకు వచ్చింది.తన భార్య వేధింపులకు సంబంధించి 16 నిమిషాల ఫోన్‌కాల్ ఆడియో.. అలాగే ఆమె ఎలా వేధించిందో చెబుతూ 54 నిమిషాల సెల్ఫ్ వీడియో రికార్డింగ్.. రెండింటిని బయటపెట్టి మరీ సూసైడ్ చేసుకున్నాడతను. ఈ మేరకు కుటుంబ సభ్యులు కూడా మానికపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.2016లో ఈ ఇద్దరికీ వివాహం జరిగింది. ఆపై వుడ్‌బాక్స్ కేఫ్‌ను ఆ భార్యాభర్తలిద్దరూ కలిసే ప్రారంభించారు. విడాకుల కేసు నేపథ్యంలో ఇద్దరూ దూరంగా ఉంటున్నప్పటికీ.. వ్యాపారంలో మాత్రం ఇద్దరూ భాగంగానే కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవలు ముదిరాయి. పునీత్ మరణం తర్వాత.. మానికతో జరిగిన జరిగిన ఫోన్ కాల్ సంభాషణ ఒకటి బయటకు వచ్చింది.మనం విడాకులు తీసుకున్నాం. అయినా కూడా నేను వ్యాపార భాగస్వామినే. కాబట్టి, నా బకాయిలు త్వరగా చెల్లించు అని మానిక, పునీత్‌తో వాగ్వాదం పెట్టుకుంది. పునీత్ ఎంత వేడుకుంటున్నా.. ఆమె మాత్రం కఠువుగానే మాట్లాడిందా ఆడియో క్లిప్‌లో. దీంతో.. చేసేది లేక ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మానికను విచారణ జరపాలని నిర్ణయించారు.ఇదిలా ఉంటే.. అతుల్ సుభాష్(Atul Subash) కోసం పుట్టుకొచ్చిన #JusticIsDue హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియా నుంచి కనుమరుగు కాలేదు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న నిఖితా సింఘానియా బెయిల్ కోసం ప్రయత్నిస్తోంది. అయితే.. బిడ్డను సాకుగా చూపి బెయిల్ పొందలేరంటూ బెంగళూరు కోర్టు నిఖిత లాయర్‌కు స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై తదుపురి వాదనలు జనవరి 4వ తేదీన వింటామంది. మరోవైపు.. బెంగళూరు హైకోర్టులోనూ నిఖితా సింఘానియా ఓ పిటిషన్ వేసింది. అదే టైంలో.. మనవడి సంరక్షణ కోరుతూ అతుల్ తల్లిదండ్రులు వేసిన పిటిషన్‌పైనా హైకోర్టు విచారణ జరపుతోంది. ఈ క్రమంలో నిఖితా సింఘానియా రిమాండ్‌లో ఉన్న విషయాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని బెంగళూరు హైకోర్టు అతుల్ పేరెంట్స్‌కు సూచించింది.కొడుకును వంకగా పెట్టుకుని భార్య తన నుంచి డబ్బు గుంజుతోందని.. తప్పుడు కేసులతో కోర్టుల చుట్టూ తిప్పుతూ తనను వేధిస్తోందంటూ 90 నిమిషాల వీడియో.. పేజీలకొద్దీ మరణ వాంగ్మూలం రాసి బెంగళూరు మరాథాహల్లి నివాసంలో అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకన్నాడు. ఆయన సోదరుడు బికాస్ కుమార్ ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ 108, రెడ్‌విత్ 3(5) కింద మారథాహల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన తర్వాత పరారీలో ఉన్న నిఖితను, అటు ఆమె తల్లి సోదరుడ్ని పోలీసులు అరెస్ట్ చేసి బెంగళూరుకు తరలించారు. అయితే.. తన భర్త అదనపు కట్నం కోసం తనను వేధించిన మాట వాస్తవమేనని, అతని మృతిలో తనకుగానీ, తన కుటుంబ సభ్యులకుగానూ ఎలాంటి ప్రమేయం లేదని నిఖిత మొదటి నుంచి వాదిస్తూ వస్తోంది. -
కాఫీ దుకాణంతో ఆదాయం.. 25 దేశాలు పర్యటించిన వృద్ధ దంపతులు!
అవకాశం ఉన్నప్పుడే కలలను నెరవేర్చుకోవాలి. లేదంటే అవి ఎప్పటికీ కల్లలాగే మిగిలిపోతాయి. వాటిని సాకారం చేసుకోవాలంటే వయసు అడ్డంకి ఎప్పుడూ కాదని ఈ జంటను చూస్తే తెలుస్తుంది. 27 యేళ్ల క్రితం ఓ వృద్ధ దంపతులు ప్రపంచదేశాలు చుట్టెయ్యాలని కలగన్నారు. అంతటితో ఊరుకోలేదు. కార్యచరణ కూడా రూపొందించుకున్నారు. ఇప్పటికే దాదాపుగా 25 దేశాలకు వెళ్లివచ్చారు కూడా. ఈ నెలలో 26వ ట్రిప్పుకు వెళ్తున్నారు. కేవలం టీ దుకాణం జీవనోపాధిగా జీవనం సాగిస్తున్నా ఈ వృద్ధ దంపతులు చెప్పే విశేషాలేమిటే తెలుసుకుందాం... కేరళలోని కొచ్చికి చెందిన కేఆర్ విజయన్ (71), అతని భార్య మోహన (69) ‘శ్రీబాలాజీ కాఫీ హౌస్’అనే కాఫీ షాప్ నడుపుతున్నారు. కాఫీ దుకాణం ద్వారా ఆర్జించిన సొమ్ము ద్వారా ప్రపంచదేశాలు తిరిగిరావాలనే కలను నెరవేర్చుకుంటున్నారు. ఇప్పటికే పలు దేశాలు చుట్టేశారు. ఐతే కరోనా మహమ్మారి కారణంగా వీరి ప్రయాణం రెండేళ్లు వాయిదా పడింది. మళ్లీ ఈ నెల21 న తమ ప్రయాణం తిరిగి ప్రారంభించనున్నారు. ఈ ట్రిప్‌లో రష్యాకెళ్లి, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్పుతిన్ను కలవాలను కుంటున్నారట కూడా. 2007లో ఇజ్రాయెల్ సందర్శనతో వీరి మొదటి విదేశీ యాత్ర ప్రారంభమైంది. వీరి చివరి యాత్ర 2009 నవంబర్ - డిసెంబర్లో సాగింది. ఈ సమయంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలను సందర్శించారు. ఈ ట్రిప్‌కు మహీంద్ర గ్రూప్ చైర్మాన్ ఆనంద్ మహీంద్ర స్పాంసర్ చేశారు కూడా. ఇలా అమెరికా, బ్రెజిల్, జర్మనీ.. వంటి ఇతర దేశాలను చుట్టేశారు. వీరు ట్రావెల్ ఏజెన్సీల సహాయంతో కేవలం బేసిక్ ఇంగ్లీష్‌తో విదేశీ యాత్రలు చేస్తున్నారు. ‘కోవిడ్ తర్వాత పర్యాటక ప్రదేశాలు తిరిగితెరిచినట్టు తెలిసింది. మా ట్రావెల్ ఏజెంట్ కూడా ఫోన్ చేసి, తర్వాత ట్రిప్ రష్యా అని చెప్పాడు. రష్యా టూర్లో మొదట మా ఇద్దరి పేర్లను తప్పక చేర్చమని చెప్పాను. ఈ ట్రిప్ అక్టోబర్ 21 నుంచి 28 వరకు ఉంటుంది. ఈ ట్రిప్‌లో మా మనుమలు కూడా పాల్గొంటున్నారని’ కేఆర్ విజయన్ మీడియాకు తెలిపాడు. "ఈ సారి రష్యా వెళ్లాలనుకుంటున్నాను. కోవిడ్ మహమ్మారి కారణంగా మేము చాలా కష్టపడ్డాము. ఇప్పుడు మళ్లీ ప్రయాణించే అవకాశం దక్కింది" అని మోహన అన్నారు. తీర్థయాత్రలకు వెళ్లే వయసులో ప్రపంచదేశాలు చుట్టెయ్యాలని ఉవ్విళ్లూరుతున్న ఈ దంపతులు నేటి యువతకు ఆదర్శం అనడంలో సందేహం లేదు కదా! చదవండి: అలాంటప్పుడు.. తాళం ఎందుకేసుకున్నావయ్యా!! -
పోకిరీ ఐపీఎస్ !
* కాఫీ షాప్‌లో అమ్మాయిల ఫొటోలు తీశారని ఆరోపణ * అడిషనల్ డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను చితకబాదిన స్థానికులు, కాఫీ డే సిబ్బంది * కుట్రతో తనను ఇరికించారని ఆవేదన * రాజీనామా చేసినట్లు వెల్లడి * కేసు విచారణ చేస్తున్నాం : హోం మంత్రి బెంగళూరు, న్యూస్‌లైన్ : బెంగళూరులోని ఓ కాఫీ షాప్‌లో కూర్చుని ఉన్న అమ్మాయిలను ఫొటోలు తీశారనే కారణంతో సీనియర్ ఐపీఎస్ అధికారి, కేఎస్ఆర్పీ అడిషనల్ డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఎడిజిపి) డాక్టర్ రవీంద్రనాథ్ను స్థానికులు చితకబాదారు. యువతుల ఫిర్యాదు మేరకు నగర హైగ్రౌండ్‌స పోలీసులు కేసు నమోదు చేశారు. రవీంద్రనాథ్ ఫోన్‌ను సీజ్ చేశామని, అందులో రెండు ఫొటోలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఆయనను అధికారికంగా అరెస్టు చేసినట్లు పోలీసులు ధ్రువీకరించలేదు. ఏడీజీపీపై ఫిర్యాదు చేసిన యువతుల్లో ఒకరు ఫ్రీలాన్‌స జర్నలిస్ట్ కాగా, మరొకరు ఆమె కజిన్ ఐటీ కంపెనీ ఉద్యోగి అని పోలీసులు తెలిపారు. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. సోమవారం ఉదయం ఇక్కడి కన్నింగ్ హ్యాం రోడ్డులోని జా-బాన్-ఫేన్ కాఫీ షాప్‌నకు ఏడీజీపీ రవీంద్రనాథ్ (ఇతని స్వస్థలం ఆంధ్రప్రదేశ్) మఫ్టీలో వెళ్లారు. పక్క టేబుల్‌పై ఇద్దరు అమ్మాయిలు కూర్చుని ఉన్నారు. వారిని రవీంద్రనాథ్ తన సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీశారు. దీన్ని గమనించిన వారు ఫొటోలు ఎందుకు తీశావ ంటూ ఆయన్ను ప్రశ్నించారు. వారి మధ్య వాగ్వాదం జరిగింది. స్థానికులు, కాఫీ షాప్ ఉద్యోగులు ఏడీజీపీ రవీంద్రనాథ్ను చితకబాదారు. అంతలోనే పోలీసులు వచ్చి రవీంద్రనాథ్ను, యువతులను పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. యువతి ఫిర్యాదు మేరకు వివరాలు న మోదు చేసుకున్నారు. మంగళవారం ఉదయం ఏడీజీపీ డాక్టర్ రవీంద్రనాథ్‌పై కేసు న మోదు చేశారు. కాగా, తనను కుట్ర చేసి ఇరికించారని రవీంద్రనాథ్ ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించినా.. ఇప్పటి వరకు ఎవరిపై కేసు నమోదు చేయలేదు. కన్నీరు పెట్టుకున్న ఏడీజీపీ తాను ఏ తప్పూ చేయలేదని, తనపై అనవసరంగా కేసు నమోదు చేశారని న్యాయస్థానంలో తేల్చుకుంటానని ఏడీజీపీ రవీంద్రనాథ్ అన్నారు. ‘పక్కా ప్లాన్‌తో ఒక ఎస్ఐ సహా కొందరిని అడ్డు పెట్టుకుని కొందరు పోలీసు అధికారులు తనపై కక్ష సాధిస్తున్నారని ఆయన కన్నీరు పెట్టుకున్నారు. మంగళవారం ఆయన కన్నింగ్ హ్యాం రోడ్డులో సంఘటన జరిగిన కాఫీ షాప్‌నకు వచ్చి అక్కడ ఉన్న మీడియాతో మాట్లాడారు. సోమవారం చెల్లించని కాఫీ బిల్లును చెల్లించారు. ఆ సమయంలో జరిగిన సంఘటనను వివరించారు. ‘సోమవారం ఉదయం ఇక్కడే కూర్చొని సెల్ ఫోన్లోని డేటాను చూసుకుని మళ్లీ టేబుల్‌పై పెట్టాను. ఇంతలో మొదటి అంతస్తులో ఉన్న ఓ వ్యక్తి.. అమ్మాయిల ఫొటోలు తీస్తావా అంటూ నా దగ్గరికి వచ్చాడు. మొబైల్, పర్స్ లాక్కున్నాడు. ఆ సంఘటన జరిగిన కొన్ని క్షణాల్లోనే ఒక ఎస్ఐ అక్కడికి వచ్చాడు. నేరుగా జీపు వద్దకు తీసుకెళ్లి అందులో ఎక్కించుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. తన వాదనను ఆయన పట్టించుకోలేదు. తాను ఐపీఎస్ అధికారినంటూ ఐడీ కార్డు చూపించినా ఆ ఎస్ఐ పట్టించుకోలేదు. ఎక్కువ మాట్లాడితే సెల్లో వేస్తానని బెదిరించారు. కళ్లజోడు సైతం లాగేసుకుని నన్ను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశార’ని వాపోయారు. సోమవారం రాత్రి నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ తనతో మాట్లాడి యువతికి క్షమాపణలు చెప్పాలని కోరారని, తాను తప్పు చేయనందున అందుకు నిరాకరించానని చెప్పారు. రాజీనామా లేఖను డీజీపీకి ఇచ్చాను.. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వికాస సౌధలో రాష్ట్ర హోంశాఖ మంత్రి జార్జ్, డీజీపీ పచావో ఆధ్వర్యంలో సీనియర్ ఐపీఎస్ అధికారుల సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన రవీంద్రనాథ్ సమావేశం అనంతరం బయటకు వచ్చి తాను రాజీనామా చేశానని, ఆ లేఖను డీజీపీ పచావోకు అందజేశానని మీడియాకు వెల్లడించారు. అనంతరం బయటకు వచ్చిన హౌం మంత్రి జార్జ్ మీడియాతో మాట్లాడుతూ.. రవీంద్రనాథ్ విషయంపై దర్యాప్తు జరుగుతోందని, డీజీపీ పచావో నివేదిక అనంతరం వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. కాగా, రవీంద్రనాథ్ రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు.