coffins
-
2,500 ఏళ్ల తర్వాత 'మమ్మీ'ని బయటకు తీశారు!
కైరో: ఈజిప్టు చరిత్రను చూస్తే మమ్మీలు గుర్తుకు రాక మానవు. ఏళ్ల నాటి మమ్మీలను వెలికి తీసి వాటి చరిత్రను తవ్వి తీయడంలో అక్కడి సైంటిస్టులు కూడా ఎంతో ఆసక్తి చూపుతుంటారు. అయితే పురావస్తు శాస్త్రవేత్తలు ఈ సంవత్సరం ఆరంభంలో సక్కారా ప్రాంతంలో 59 మమ్మీలను వెలికి తీశారు. సక్కారా అనేది ఈజిప్టులో విస్తారమైన, పురాతన శ్మశానవాటిక. ఇక్కడ వెలికి తీసిన మమ్మీలు దాదాపు 2,500 ఏళ్ల క్రితానికి చెందినవిగా గుర్తించారు. శనివారం రోజున అందుకు సంబంధించిన ఓ శవపేటికను ఈజిప్టు పురావస్తు శాస్త్రవేత్తలు తెరిచారు. బయటకు తీసిన శవపేటికలు, అందులోని మమ్మీలు కూడా చెక్కుచెదరకుండా ఉండటాన్ని గుర్తించారు. ఇవి ఈజిప్టు సమాజంలోని పూజారులు, ఇతర గొప్ప వ్యక్తులువిగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఈజిప్ట్ పర్యాటక, పురావస్తు మంత్రిత్వ శాఖ తన ఖాతాలో పోస్ట్‌లో చేయగా.. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈజిప్టులోని న్యూజిలాండ్ రాయబారి గ్రెగ్ లూయిస్ కూడా శనివారం ట్విటర్లో అన్‌సీలింగ్ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో శవపేటికలో మమ్మీ వస్త్రంతో చుట్టబడి, ఏమాత్రం పాడవకుండా ఉంది. ఈజిప్టు పురావస్తు శాఖ షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటిదాకా 9 మిలియన్ల మంది వీక్షించారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 2020 సంవత్సరంలో ఒక మిలీనియా పాత శవపేటికను తెరవడం ఉత్తమమైన చర్య కాకపోవచ్చు అంటూ ఓ నెటిజన్ చమత్కరించారు. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం, పాప్ సంస్కృతిలోని జానపద కథల్లో మమ్మీలను తెరవడం ద్వారా మరణాలకు, శాపాలకు దారితీస్తుందనే అపోహ కూడా ఉంది. (ఒక ఫొటో ఎంపీకి నిద్ర లేకుండా చేస్తోంది!) The mummy tomb, which has been sealed for 2500 years, has been opened for the first time. pic.twitter.com/KWGT95girv — Psychedelic Art (@VisuallySt) October 5, 2020 కాగా.. ఈజిప్టు పర్యాటక, పురాతన మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం మొదట 13 శవపేటికలతో మూడు బావులు సక్కారాలో కనుగొనబడ్డాయి. ఆ తర్వాత మరో 14 శవపేటికలు బయటపడ్డాయి. అలా ఈ రోజు వరకు మొత్తం 59 శవపేటికలను వెలికితీశారు. అయితే వీటిని గిజాలోని కొత్త గ్రాండ్ ఈజిప్టియన్ మ్యూజియానికి తరలించి ప్రదర్శన కోసం ఉంచనున్నారు. -
ఇలాంటి గిఫ్ట్ కూడా ఇస్తారా..?
చిన్నప్పుడు ఆటల పోటీల్లో నెగ్గితే ఏ గిఫ్ట్ ఇచ్చేవారు.. ఏ గ్లాసో.. స్టీల్ గిన్నెనో ఇచ్చేవారు. ఇప్పుడైతే కార్పొరేట్ చదువులు కాబట్టి ఓ షీల్డ్.. మెడల్ ఇస్తున్నారు. ఇంకా ఏం గిఫ్ట్‌లు ఇచ్చేవారు. ఓసారి గుర్తు తెచ్చుకోండి.. మహా అయితే ప్రైజ్‌మనీ ఇస్తారు. పెరూలోని జూలియాకా అనే పట్టణంలో మాత్రం ప్రపంచంలోనే ఎక్కడా కనీవినీ ఎరుగని బహుమతి అందజేస్తారు. అక్కడ ఏటా జరిగే ఫుట్సల్ ఫుట్‌బాల్ టోర్నీలో శవపేటికను గెలిచిన జట్టుకు ఇస్తారు. అది కూడా అలాంటిలాంటి పేటిక కాదండోయ్.. దాదాపు రూ.1 లక్ష విలువైన దాన్ని ఇస్తుంటారు. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన వారికి అంతకన్నా తక్కువ విలువైన శవపేటికను బహుమతిగా ఇస్తారు. ఈ పోటీల్లో దాదాపు 12 జట్లు హోరాహోరీగా పాల్గొని చివరకు శవపేటికను తీసుకెళ్తారు. జట్టు సభ్యులు భుజాలపై ఎత్తుకుని పాటలు పాడుకుంటూ ఆట మైదానం మొత్తం తిరుగుతుంటారు. అయితే పేటికను జట్టు సభ్యులు ఎలా పంచుకుంటారో తెలియదు.. బహుశా దాన్ని అమ్ముకుని వచ్చిన డబ్బును పంచుకుంటారేమో. పెరూలోని పునో ప్రాంతంలో శవపేటికల వ్యాపారం ఎక్కువగా జరుగుతుందట. అందుకే దానికి గుర్తుగా ఇలా బహుమతులుగా ఇస్తుంటారని ఆట నిర్వాహకులు చెబుతుంటారు. -
ఈ సమాధులు ప్రత్యేకమైనవి
లక్నో : భారతదేశంలో తొలిసారిగా అతి ప్రాచీన నాగరికతకు చెందిన సమాధుల్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బగ్‌పత్ జిల్లాలో కాంస్యయుగం నాటి సమాధులతో పాటు కొన్ని వస్తువులు పురావస్తు తవ్వకాలలో బయటపడ్డాయి. ఈ అవశేషాలు దాదాపు 4000ఏళ్ల నాటివని పురావస్తు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. క్రీస్తుపూర్వం 2000-1800 ప్రాంతానికి చెందినవిగా వారు భావిస్తున్నారు. పురావస్తు శాస్త్రవేత్త మంజుల్ మాట్లాడుతూ.. గతంలో హరప్పా, మొహంజోదారో, ధొలవీర ప్రాంతాలలో తవ్వకాలు జరిపినపుడు చాలా సమాధులు బయటపడినా సమాధులపై రాగితో అలంకరణ చేయలేదన్నారు. ప్రస్తుతం బయటపడ్డ సమాధుల్లో ఎనిమిది మానవరూపాలను, పూల బొమ్మలను రాగితో తయారుచేసి ఉంచారని తెలిపారు. సమాధుల్లో దొరికిన వస్తువులు, వాటిపై అలంకరణను బట్టి చూస్తుంటే ఆ సమాధులు రాజ కుటుంబాలకు చెంది ఉంటాయన్నారు. ఇలాంటి సమాధుల్ని కనుక్కొవటం భారతదేశ చరిత్రలో మొదటిసారన్నారు. ప్రపంచంలోనే అతిపురాతన నాగరికతలో ఒకటిగా చెప్పుకునే ‘‘మెసపుటేమియా’’ క్రీస్తుపూర్వం 3500 నాటిది. అప్పటి ప్రజలు యుద్ధ సమయంలో కత్తులు, రథాలు, శిరస్త్రాణాలు ఉపయోగించే వారు. భారతదేశంలో కూడా అలాంటి వస్తువులే బయటపడటం విశేషం. తవ్వకాలు జరిపిన ప్రాంతంలో అతి ప్రాచీనమైన నాగరికత విలసిల్లి ఉంటుందని పురావస్తు శాస్త్రజ్ఞులు విశ్వసిస్తున్నారు. మూడు నెలల పాటు కొనసాగిన తవ్వకాలలో శవపేటికలు, కత్తులు, బాకులు, దువ్వెనలు, ఆభరణాలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. -
ఒక మమ్మీ.. ఏడు శాపాలు
చావుకు చావు ఉండదన్నది మమ్మీని చూస్తేనే అర్థం కావాలేమో! మట్టిలో కొట్టుకుపోవాల్సింది ఇసుకై లేస్తుందని మనకెలా తెలుసు? వంద శవపేటికలు కూడా బందీ చెయ్యలేని దానిని కట్లు కట్టి.. పీట ముడులు వేసి, పాతి పెడితే... ఏడు శాపాలను ఈనింది.. ఈ మమ్మీ! ఏడు సమాధుల్ని కట్టింది. అనగనగా ఏడుగురు రాకుమారులు. ఏడుగురూ వేటకెళ్లి... కథ తెలిసిందే. కానీ ఇది ఏడు చేపల కథ కాదు. ఏడు శాపాల కథ. లొకేషన్ : ఈస్ట్ వ్యాలీ ఆఫ్ కింగ్స్ కంట్రీ : ఈజిప్టు ::: సంవత్సరం : 1922 హోవర్డ్ కార్టర్, ఆయన పరిశోధక బృందం ఇసుక మేటల్లో నడుస్తోంది. వాళ్లంతా ఆర్కియాలజిస్టులు, ఈజిప్టాలజిస్టులు. ప్రాచీన ఈజిప్టులోని మార్మికతల్ని శోధించడం కోసం కొన్నాళ్లుగా అక్కడక్కడే తిరుగుతున్నారు. ‘‘మిస్టర్ హోవర్ట్.. ఇక్కడేదో కనిపిస్తోంది’’... పెద్దగా అరిచాడు ఆ బృందంలోని ఒక సైంటిస్ట్. అవును కనిపిస్తోంది. మెట్లమార్గం! ఆ రోజు నవంబర్ 4. మర్నాటికి బృందమంతా ఆ మెట్ల మార్గంలోంచి లోపలికి వెళ్లగలిగింది. అక్కడొక సమాధి ఉంది! ‘తెరిచి చూద్దాం’ అనుకున్నారంతా. కానీ ఇరవై ఐదు రోజులకు గానీ తెరవలేకపోయారు. అంత మిస్టిక్‌గా ఉంది సమాధి చుట్టూ ఉన్న నిర్మాణం. మొత్తానికి నవంబర్ 29న సమాధి మూత తెరిచారు. మర్నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. పర్మిషన్ల కోసం మధ్యలో కొన్ని రోజులు పని ఆగింది. డిసెంబర్ 27న సమాధిలోపలి పేటిక పక్కన ఉన్న ఒక పురావస్తువును బయటికి తీశారు. తర్వాత మళ్లీ కొన్ని రోజులు పని ఆగింది. 1923 ఫిబ్రవరి 16న.. సమాధి లోపలి శవపేటికను తెరిచారు. ఏప్రిల్ 5న లార్డ్ కార్నర్వాన్ చనిపోయాడు! కార్నర్వాన్... ఈ పురావస్తు పరిశోధనకు డబ్బులు పెట్టిన పెద్దమనిషి. శవపేటికలో మమ్మీ ఉంది! ఆ మమ్మీలో ఉన్నది ఈజిప్టు చక్రవర్తి టుటంఖమున్. ఎవరో అన్నారు.. టుటంఖమున్ మమ్మీ శపించి ఉంటుందని! టెర్రర్ మొదలైంది. మమ్మీని చూసి ఎవరైనా టెర్రర్ అవ్వాల్సిందేమీ లేదు! మమ్మీ శపిస్తేనే.. వర్రీ అవ్వాలి! మమ్మీ శపిస్తుందా! అవునట. సమాధిలో తన నిద్రను డిస్టర్బ్ చేస్తే అంతు చూస్తుందట. టుటంఖమున్ కూడా శపించే ఉంటాడా? టుటంఖమున్ క్రీ.పూ. 1332 నుంచి 1322 వరకు కింగ్. అతడెలా చనిపోయాడో ఎవరికీ తెలీదు. అదొక మిస్టరీ. దాన్ని ఛేదించడానికి రాల్ఫ్ మిషెల్ అనే హార్వర్డ్ యూనివర్సిటీ మైక్రోబయాలజిస్ట్ బయల్దేరాడు. సమాధి చుట్టూ ఉండే గోడలపై కొన్ని చోట్ల పచ్చిగా ఉన్నప్పుడే పెయింట్ చెదిరిపోయినట్లుగా ఉన్నట్లుంది. సో.. టుటంఖమున్ని హర్రీగా పూడ్చిపెట్టారు. ఖతం చేసి, ఖననం చేశారు. ఇదీ ఆయన అబ్జర్వేషన్. అక్కడితో ఊరుకున్నాడు రాల్ఫ్. బతికిపోయాడు. కానీ.. లార్డ్ కర్నార్వన్ అలా ఊరుకోలేదు. తవ్వి తియ్యండి చూద్దాం అన్నాడు. ఎవరైనా దుస్సాహసాలు చేస్తుంటే డబ్బులిచ్చి ప్రోత్సహించడం కర్నార్వన్కి.. అదో కిక్కు. ఆ డబ్బులు తీసుకుని హోవార్డ్ కార్టర్ అండ్ టీమ్.. టుటంఖమున్ సమాధిని ఓపెన్ చేసింది. మమ్మీకి నిద్రాభంగం అయింది. ఇది జరిగిన ఏడాదికి కర్నార్వన్.. దోమ కుట్టి చచ్చిపోయాడు! అంతా అది సమాధిలోంచి వచ్చిన దోమ అన్నారు. అది కాదు విషయం. ఇక్కడ సమాధిని తవ్వుతుండగానే అక్కడ హోవార్డ్ కార్టర్ గారి పాటలు పాడే పెంపుడు పక్షి పంజరంలోనే కోబ్రా కాటేసి చనిపోయింది! మమ్మీ కోపం అక్కడితో చల్లారిపోలేదు. టుటంఖమున్ సమాధితో ఏదో ఒక విధంగా సంబంధం ఉన్నవారు ఏడుగురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. హోవార్డ్ కార్టర్ లక్ ఏంటంటే.. మమ్మీ అతడిని వదిలేసింది! 1939లో అతడు తనకై తను కాలం తీరి చనిపోయాడు. శాపగ్రస్థులు 1 – 2 : లార్డ్ కార్నర్వాన్, జార్జి జే గోల్డ్ లార్డ్ కార్నర్వాన్ చనిపోయినప్పుడు ఎవ్వరూ అతడు మమ్మీ శాపం వల్ల చనిపోయాడని అనుకోలేదు. తర్వాత కొద్ది రోజులకు మే 16 ఫ్రాన్స్‌లో జార్జి జే గోల్డ్ అనే అతను హటాత్తుగా మరణించాడు. అతడొక ఫైనాన్షియర్. టుటంఖమున్ మమ్మీ మూత తెరిచారన్న వార్త తెలిసి ఈజిప్టు Ðð ళ్లి చూసి వచ్చాక అతడి మరణం సంభవించడంతో మమ్మీ శపిస్తోందన్న అనుమానం బయల్దేరింది! శాపగ్రస్థుడు 3 : ప్రిన్స్ అలి కామెల్ ఫామీ బే ఫామీ బే ఈజిప్టు రాకుమారుడు. అతడి భార్య మేరీ మార్గరెట్. మొదటి భర్తకు విడాకులు ఇచ్చాక ఇతడిని చేసుకుంది. దంపతులిద్దరూ లండ¯Œ లో ఉన్నప్పుడు మాటామాట వచ్చి పిస్టల్‌తో అతడిని కాల్చి చంపేసింది మేరీ మార్గరెట్. ఈ హత్య జూలై 9న జరిగింది. అంతకుముందే ప్రిన్స్ ఫామీ బే.. టుటంఖమున్ సమాధిని చూసి వచ్చాడు. శాపగ్రస్థుడు 4: ఆబ్రే హెర్బెట్ ఈయన బ్రిటిష్ దౌత్య అధికారి. ట్రావెలర్. అంతకన్నా కూడా కర్నార్వన్ (మొదటి శాపగ్రస్థుడు) కజిన్ బ్రదర్. ఎప్పుడూ దేశాలు తిరుగుతుంటాడు. టుటంఖమున్ సమాధిని చూసి వచ్చిన వెంటనే జబ్బున పడ్డాడు. చూపు మందగించింది. చికిత్స చేస్తుంటే వికటించి రక్తానికి ఇన్ఫెక్షన్ సోకింది. మొదటి ముగ్గురూ చనిపోయిన ఏడాదే ఈయనా చనిపోయాడు సెప్టెంబర్ 23న. కర్నార్వన్ శాపం కొద్దిగా ఈయనకూ తగిలినట్లుంది. శాపగ్రస్థుడు 5 : సర్ ఆర్చిబాల్డ్ డగ్లాస్ రీడ్ ఇతడు రేడియాలజిస్టు. టుంటంఖమున్ మమ్మీకి ఎక్స్‌రే తీసింది ఇతడే. తర్వాత ఇతడికి తెలియని అనారోగ్యమేదో పట్టుకుంది. 1924 జనవరి 15న చనిపోయాడు. శాపగ్రస్థుడు 6 : సర్ లీ స్టాక్ ఈ సైడాన్ గవర్నర్ జనరల్ 1924 నవంబర్ 19న కారులో కైరోకు ప్రయాణిస్తుండగా ఆగంతకులు రివాల్వర్‌తో కాల్చి చంపారు. సర్ టీ స్టాక్.. టుటంఖుమున్ సమాధి ఉన్న ప్రదేశాన్ని కలియదిరిగి వచ్చిన కొన్నాళ్లకే ఇలా జరిగింది. శాపగ్రస్థుడు 7 : ఎ.సి.మేస్ బ్రిటిష్ ఈజిప్టాలజిస్టు. టుటంఖుమున్ సమాధిన తవ్విన హోవార్డ్ కార్టర్ బృందంలో సభ్యుడు. టుటంఖుమున్ సమాధిని తవ్వేటప్పుడు తనూ ఒక చెయ్యి వేశాడు. మేస్‌కి వెంటనే ఏమీ కాలేదు కానీ పరిశోధనలు చేస్తున్నప్పుడు చేతికి అంటుకున్న అర్సెనిక్ మూలకాలు క్రమంగా అతడిలో చొరబడి 1928లో అతడి ప్రాణం తీశాయి. నిజానికి మమ్మీలలో చెడ్డ మమ్మీలు, శపించే మమ్మీలు ఉండవు. వాటి చుట్టూ మాత్రమే శాపాలు, కోపాల కథలు ఉంటాయి. ఆ కథల్లోంచి వచ్చిన కొత్త హాలీవుడ్ మూవీ ‘ది మమ్మీ’ గతవారమే విడుదలైంది. ఇప్పుడొక ఓల్డెస్టు మమ్మీ గురించి, లేటెస్టు మమ్మీ గురించి తెలుసుకుని కథ ముగిద్దాం. ఓల్డెస్టు మమ్మీ మమ్మీలు వేల ఏళ్లనాటివే అయినా ప్రపంచం చూసిన ఫస్ట్ మమ్మీ.. జింజర్ మమ్మీ. ఈజిప్టు ఏడారి సమాధులలో 1900 సం. తవ్వకాల్లో జింజర్ మమ్మీ బయటపడింది. 18–20 మధ్య వయసుగల ఈ మమ్మీ క్రీ.పూ.3400 నాటిది. మనిషి చనిపోయాక ఏమౌతాడు అనే ప్రశ్న అన్ని దేశాల్లోనూ ఉంది. కానీ ఈజిప్టులో ఎక్కువగా ఉంది. అందుకే అక్కడ అన్ని మమ్మీలు. భద్రపరిచిన మమ్మీ ఏదో ఒక రోజు తిరిగి ప్రాణంతో లేస్తుందని వారి నమ్మకం. అందుకే ఈజిప్టియన్లు గొప్పగొప్ప మమ్మీలకు పిరమిడ్లు కట్టేశారు! మమ్మిఫికేషన్ చాలా పకడ్బందీగా జరుగుతుంది. డెడ్‌బాడీ మొత్తాన్ని గుడ్డలో చుట్టేయరు. కాలేయం, పేగులు, ఊపిరితిత్తులు వేరుగా తీసి ‘కేనోపిన్’ అనే జార్లలో ఉంచుతారు. వీటిని పెద్ద మమ్మీతో పాటు ఉంచుతారు. పెద్ద మమ్మీని శుద్ధి చేసి, అవి పాడవకుండా పొరలు పొరలుగా రసాయనాలు పూస్తారు. పైన గుడ్డలు చుడతారు. మమ్మీ.. దేహం కాదు. బతికున్నవాళ్ల ఆత్మ. మమ్మీల గురించి మనిషి ఏం తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడో అవి తెలుస్తూనే ఉన్నా, వాటి వెంటే తెలియని మిస్టరీలు.. సమాధుల నుంచి పైకి లేస్తున్నాయి. ఇదొక అంతులేని అన్వేషణ. ఫేమస్ మమ్మీలు రామసేన్ చక్రవర్తి: మూడవ రామసేస్ చక్రవర్తి సమాధి కెవి11 అనే చోట ఉంది. ఈ కేవీ లెవ¯Œ , కేవీ సిక్స్టీటు.. ఇవన్నీ ఈజిప్టులోని ‘వాలీ ఆఫ్ ది కింగ్’ అనే ప్రాంతంలో ఉంటాయి. రామసేస్–త్రీ క్రీస్తుపూర్వపు ఈజిప్టు చక్రవర్తి. హటాత్తుగా చనిపోయాడు. ఎలా చనిపోయాడన్నది వెయ్యేళ్ల మిస్టరీ. చివరికి భయం భయంగా మమ్మీని ఓపెన్ చేశారు. సీటీ స్కాన్‌లో చక్రవర్తి గొంతులో ఏడు సెంటీమీటర్ల పొడవున కత్తి గాటు కనిపించింది. చరిత్రను గాలించి చూస్తే రామసేస్ను చంపే దమ్ము ఎవరికీ లేదని తేలింది. చంపితే అతడి కొడుకులే చంపి ఉండాలి. అదింకా తేల్లేదు. ది గ్రాబెల్ మ్యాన్: ఈ మమ్మీ 1952లో డెన్మార్క్‌లోని గ్రాబెల్ అనే చోట బయట పడింది. ఇది క్రీ.పూ.3వ శతాబ్దం నాటి మగ మనిషిది. అతడి కాలేయం చెక్కుచెదర్లేదు. ఆ కాలేయానికి రేడియోకార్బన్ డేటింగ్ పరీక్షలు చేసి చూస్తే.. బాడీ కనీసం రెండువేళ ఏళ్ల క్రితం నాటిదని తేలింది. చనిపోయినప్పుడు అతడి వయసు 30. మెడకింద కోసినట్లు ఉంది. ఏవో అంచనాలను బట్టి ఇతడు ప్రాణత్యాగం చేసి ఉండాలని అనుకోవడం తప్ప రూఢీ కాలేదు. యుకోక్ రాకుమారి: ఈ మమ్మీని 1993లో రష్యాలో కనుక్కున్నారు. 2,500 ఏళ్ల క్రితం నాటి మనిషి ఈ మమ్మీ. చనిపోయేనాటికి ఆమె వయసు 25. ఒంటి నిండా పచ్చబొట్టు బొమ్మలు ఉన్నాయి. ఈ అమ్మాయి సెర్బియా కొండల్లో ఉండే పజిరిక్ గిరిజన తెగల పిల్ల అట! ఇలా పచ్చబొట్టు పొడిపించుకున్న వారంతా చనిపోయాక పైన ఒకర్నొకరు కలుసుకుంటారని ఆ తెగల్లో ఒక నమ్మకం. రాకుమారి అన్నది.. ఈ మమ్మీకి ముద్దుపేరు మాత్రమే. పాతికేళ్లకే ఎలా చనిపోయింది? ఒక సాధారణ గిరిజన మహిళను ఇంత కాస్టీ›్లగా ఎవరు మమ్మిఫై చేశారు అన్నది మిస్టరీ. దషీ–దోర్జో ఇటిగిలోవ్: దోర్జో మమ్మీ ఒక బౌద్ధ సన్యాసి. రష్యాలో పుట్టాడు. 1927లో ఓ రోజు రాత్రి తోటి భిక్షువులతో, శిష్యులతో కలిసి ధ్యానంలో ఉండగానే పరలోకాలకు వెళ్లిపోయారు. అప్పుడతడు పద్మాసనంలో ఉన్నాడు. ఆయన్ని ఆ స్థితిలోనే ‘మమ్మిఫై’ చేసి అలా ఉంచేశారు. అప్పట్నుంచీ... శిథిలమవుతున్న ప్రతిసారీ మళ్లీ ఒక కోటింగ్ ఇచ్చి దోర్జో మమ్మీని ‘బతికిస్తున్నారు’. దోర్జో చనిపోయి వందేళ్లు కావస్తున్నా.. 36 గంటల క్రితం చనిపోయిన మనిషిలానే కనిపిస్తుంటాడు. ఆధునికులు ఏం పూసి ఈ మమ్మీని ఫ్రెష్‌గా ఉంచుతున్నారన్నది మిస్టరీ. ఈవా పెరాన్: జువాన్ పెరాన్ 1946–1955 మధ్య కాలంలో అర్జెంటీనాకు అధ్యక్షుడు. ఆయన భార్య ఈవా పెరాన్. 1952 జూలై 26న చనిపోయింది. ఆమె క్యాన్సర్ పేషెంట్. ముప్పై మూడేళ్లకే కన్నుమూసింది. ఈవా మృతదేహాన్ని మమ్మీగా మార్చి భద్రపరిచారు. జువాన్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ రెండో భార్య ఇసాబెల్. ఆమె ఈవా మమ్మీని ఎంతగానో ప్రేమించేవారు. ప్రతిరోజూ పేటిక తెరిచి ఈవా తల దువ్వేవారు. కొన్నిసార్లు శవపేటికలో ఈవా పక్కనే పడుకునేవారు. ఇప్పుడా మమ్మీ జువాన్ వారసుల కుటుంబ ప్రార్థనా స్థలం చర్చి అడుగుభాగంలో ఖననం అయి ఉంది. -
శవాలే మొక్కలుగా పెరిగితే..
ఓ మనిషి చనిపోయాక ఆయన ఓ చిహ్నంగా కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శాశ్వతంగా గుర్తుండిపోవాలంటే ఏం చేయాలి? వాళ్లకో స్మారకం కట్టాలి. అందుకు ఎంతో ఖర్చవుతుంది. కానీ ఖర్చు లేకుండా చనిపోయిన వ్యక్తి ఓ చిహ్నంగా మారితే! ఇదే ఇటలీకి చెందిన డిజైనర్లు రాహుల్ బ్రెడ్జెల్, అన్నా సిటెల్లీలకు ఓ మంచి ఐడియాను ఇచ్చింది. వెంటనే వారు సేంద్రీయ పదార్థాలతో కోడి గుడ్డు ఆకారంలో ఉండే ఓ శవ పేటికను తయారు చేశారు. ఈ పేటికలో మృతదేహాన్ని లేదా అంత్యక్రియల అనంతరం అస్థికలను పెట్టి, వాటిలో తమకిష్టమైన విత్తనం నాటి భూమిలో పాతిపెడితే కొంత కాలానికి ఆ పేటిక నుంచి భూమిపైకి విత్తు మొలకెత్తుతుంది. అది చెట్టై పెరుగుతుంది. అది చనిపోయిన వ్యక్తి జ్ఞాపక చిహ్నంగా శాశ్వతంగా మిగిలిపోతుంది. డిజైనర్లు ఇటలీ భాషలో ‘క్యాప్సులా ముండీ(ప్రపంచ క్యాప్సుల్)’గా పిలుస్తున్న ఈ శవపేటికను తయారు చేయడానికి సేంద్రియ పదార్థాలను ఉపయోగిస్తారు. మానవ అస్థికలు కూడా మొక్కలకు బలాన్ని ఇస్తాయి కనుక మనం నాటే విత్తనాలు చెట్లుగా మంచిగా ఎదుగుతాయని వారు చెబుతున్నారు. సంప్రదాయంగా ప్రస్తుతం తయారుచేస్తున్న శవపేటికల వల్ల బోలడంతా సమయం, ఖర్చు వృధా అవుతుందని కూడా డిజైనర్లు చెబుతున్నారు. ఆ శవపేటికలు అంత త్వరగా మట్టిలో కలసిపోవు కనుక పర్యావరణానికి కూడా ముప్పేనని అమెరికాలోని టెన్నీస్ యూనివర్సిటీలో బయోసిస్టమ్స్ ఇంజనీరింగ్ అండ్ సాయిల్ సైన్స్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జెన్నిఫర్ డెబ్రూయెన్ చెబుతున్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు శ్మశానాలను పచ్చటి వనాలుగా మారుస్తున్న నేటి కాలంలో శవాలే చెట్లుగా పెరగడం ఇంకా మంచిదని డిజైనర్లు అంటున్నారు. తాము ప్రస్తుతం అస్థికలను పెట్టి విత్తును నాటే పేటికలనే తయారు చేశామని, ఇకముందు మృతదేహాలను పెట్టే పేటికలను ఇదే పద్ధతిలో తయారు చేస్తామని వారు చెబుతున్నారు. -
రమ్యని తాగేశారు
ప్రాణం తీయడానికి పర్మిట్లా? బాటిల్లో మందుంటే జబ్బులు నయం చేయాలి. వీలైతే ప్రాణం పోయాలి. ఈ వెధవ మందు ఈ దరిద్రపు బాటిల్‌తో ప్రాణాల్ని తాగేస్తోంది. హ్యాపీ అవర్ అట. ఒక పెగ్గు కొంటే ఇంకో పెగ్గు ఫ్రీ. ఒక ప్రాణం తీస్తే..? ఎక్కువ తాగితే కక్కుకుంటారు. భరించలేని కంపు. ధనమదం, యువమదం, మందు మదం, మదం మదం.... దరిద్రం. పైగా డ్రైవింగ్ అట. ఎంత కోపం వస్తోందంటే బాటిల్ పగలగొట్టి లంఘించాలనుంది. కాని ఏం లాభం? ఎంత ఎత్తుకు దూకినా... స్వర్గం నుంచి రమ్యను వెనక్కి తేగలమా? పాతాళానికి ఇంకుతున్న విలువలను భూమ్మీదకు తేగలమా? ఖజానా నింపాలని ప్రభుత్వాల ప్రయత్నం. శవపేటికలు నిండుతున్నాయి. కన్నీళ్లు పెట్రోల్ అయ్యే ముందు వ్యవస్థ మత్తు దిగితే మంచిది. రమ్య తల్లి వాస్తవాన్ని అంగీకరించలేక మత్తు బిళ్లలు వేసుకుంటున్నారు. ఇలాంటి భద్రకాళీలు మేల్కొనే ముందే ప్రభుత్వాలు మేల్కోవాలి. నా ప్రిన్సెస్... ఏమైంది?! ‘అమ్మా! నా రమ్య.. రమ్యా.. నా తల్లీ... నన్ను వదిలిపెట్టి ఎక్కడికెళ్లావు తల్లీ’ అంటూ ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోతున్న నా బిడ్డను ఎలా ఓదార్చను, ఏమని ఓదార్చను...’ అంటూ ప్రశ్నించింది విజయలక్ష్మి. బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించిన రమ్య కుటుంబీకులను కలుసుకోవడానికి విద్యానగర్‌లోని వారింటికి వెళితే... రమ్య అమ్మమ్మ వేసిన ప్రశ్న ఇది. మంచ మ్మీద జీవశ్చవంలా పడున్న కూతురిని చూపిస్తూ.. ‘‘ఒళ్లంతా అయిన గాయాల బాధ ఓ వైపు, బిడ్డను కోల్పోయిన బాధ మరోవైపు.. ఇల్లంతా పడి ఉంది. కళ్లు తెరిస్తే బిడ్డ జ్ఞాపకాలతో తల్లడిల్లుతున్న నా కూతురిని నిద్రపుచ్చడం కోసం ఇంజక్షన్లు చేయాల్సి వస్తోంది’’ అంటూ వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ ‘‘ఇది ఎప్పటికి లేచి మామూలు మనిషి అవుతుందో!! ఆ రాక్షసులు బంగారంలాంటి నా మనవరాలిని పొట్టనపెట్టుకున్నారు’’... విజయలక్ష్మి, ఆమె భర్త సురేందర్‌నాథ్ కళ్లనీళ్లపర్యంతమయ్యారు. రోడ్డు ప్రమాదంలో తలకు గాయాలై, కాలికి ఫ్రాక్చర్ అయ్యి... మంచానికే పరిమితమైన కూతురి కోసం దుఃఖాన్ని దిగమింగుకుంటున్నారు. నెమలి బొమ్మ వేస్తాను.. ఎప్పుడొస్తావు అక్కా! ‘అమ్మా, లేమ్మా!’ అంటూ తల్లిని లేపే ప్రయత్నం చేస్తున్న ఏడేళ్ల రష్మిని వారిస్తూ... ‘ఇలా రామ్మా అంటూ దగ్గరగా కూర్చోబెట్టుకుంది విజయలక్ష్మి. ‘ఇది రమ్య చెల్లెలు. అక్కా చెల్లెళ్లిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. సందడిగా ఇల్లంతా తిరిగేవారు. కలిసి ఆడుకునేవారు. కలిసి బొమ్మలు గీసుకునేవారు. మొన్నామధ్య పేపర్లో నెమ్మలి బొమ్మ చూశారంట. చాలా బాగుందని, అచ్చు అలాగే వేద్దాం అనుకున్నారట. ఇప్పుడు ఒక్కతే నెమలి బొమ్మ వేద్దాం అని కూచుంటుంది. దీనికి ఇంకా సరిగా రాదు. అక్క హాస్పిటల్లో ఉంది కదా! వచ్చేసరికి డిజైన్ గీసి, కలర్స్ వేసి రెడీ చే సి రాగానే ఇస్తా. అక్క హ్యాపీ అవుతుంది. నువ్వు హెల్ప్ చెయ్యి అమ్మమ్మా అనే ఈ చిన్నదానికి ఏమని చెప్పను’’ అంటూ మనవరాలిని గుండెలకు హత్తుకుంటూ ఎంత కష్టమొచ్చింది తల్లీ మీకు అంటూ ఏడుస్తూనే ఉంది. పుట్టిన రోజు మహారాణి... ‘‘వచ్చే నెల ఎనిమిదిన రమ్య పుట్టిన రోజు. బర్త్‌డే అంటే ఎక్కడలేనంత సంబరం దానికి. నేను ప్రిన్సెస్‌ని. నన్ను ప్రిన్సె స్లా తయారుచేయి అంటూ పేచీ పెట్టేది. ఎక్కడా తగ్గేది కాదు. ఇల్లంతా డెకరేషన్ చేయాలని నన్ను హడావిడి పెట్టేది. ఇంకొద్ది రోజుల్లో బర్త్‌డే. ఏదీ నా ప్రిన్సెస్? ఎక్కడకెళ్లిపోయింది? ఎవరు ఎత్తుకెళ్లిపోయారు?’’ అంటూ కళ్లనీళ్లు పెటుకున్నారు రమ్య తాతయ్య సురేందర్‌నాథ్. మాటల తోట వెళ్లిన చోటేది..? ‘‘రోజుల బిడ్డ నుంచి తొమ్మిదేళ్ల పాటు ఈ చేతుల్లోనే పెరిగింది నా చిట్టితల్లి’’ అంటూ మనవరాలి గురించే పలవరిస్తూ చెప్పుకొచ్చారు రమ్య అమ్మమ్మ విజయలక్ష్మి. ‘‘ఈ మధ్యే స్కూల్ చేంజ్ చేశారు. అందుకే సికింద్రాబాద్‌లో ఇల్లు తీసుకుంటున్నామన్నారు. అమెరికాలో ఉన్న మా అబ్బాయి కుటుంబాన్ని చూడటానికి వారం క్రితమే వెళ్లాం. రోజూ అక్కాచెల్లెళ్లిద్దరూ మాతో ఫోన్లో మాట్లాడ నిదే పడుకునేవారు కాదు. అంత చేరిక మాకు. ఆ రోజు కూడా స్కూల్‌కి వెళుతున్న విషయం చెప్పింది. స్కూల్ బాగుందని చెప్పింది. మేం తిరిగి వచ్చేటప్పుడు ఏమేం తీసుకురావాలో లిస్ట్ అంతా చె ప్పింది. ఆ మాటలే ఆఖరు. జరిగింది తెలిసి వెంటనే వచ్చేశాం. ముద్దులు మూటగట్టే నా మనవరాల్ని బ్యాండేజ్‌లో చుట్టి అందించారు. అప్పటి దాకా తల్లి ఒడిలోనే కూర్చున్నదట. ఐస్‌క్రీమ్ తింటూ అమ్మతో స్కూల్ మొదటి రోజు ముచ్చట్లు చెబుతోందట. కొత్తగా చేరిన స్కూలు ఎంత బాగుందో... ఆ క బుర్లన్నీ ఆపకుండా చెబుతూనే ఉందట. ఆ మాటలు వింటూ తండ్రి, చిన్నాన్నలు, తాతయ్య మురిసిపోతున్నా రంట. ఇంతలో పిడుగు పడినట్టు... ఏం జరిగిందో ఊహకు అందనట్టు జరిగిపోయిందట. నా తల్లి ఆసుపత్రిలో బతుకుతో పోరాడి పోరాడి అటు నుంచి అటే వెళ్లిపోయింది.’’ పెంపకం ఇదేనా! ‘‘డబ్బున్నవారి పిల్లలు చేసే విచ్చలవిడి పనులు ఇప్పుడు మా నాలుగు కుటుంబాల్లో చిచ్చు రేపాయి. రమ్య చిన్నాన్న చనిపోయాడు. ఇంకో చిన్నాన్న, తాతయ్య ఆసుపత్రిలోనే ఉన్నారు. వాళ్లకు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఇటు చూస్తే నా బిడ్డ ఇలా మంచం పట్టింది. ఇంత దారుణం చేసినవాళ్లు పిల్లలా? కాదు... రాక్షసులు. పట్టపగలు తాగి రోడ్ల మీద బండ్లు నడుపుతూ.. మా కుటుంబాల్లో చిచ్చు రేపారు. ఇలాంటివారు ఇంకెంతమంది సంతోషంగా ఉండే కుటుంబాల్లో చిచ్చు రేపుతారో. పట్టపగళ్లు బార్లు. లెసైన్సులు లేకుండానే చేతికి బండ్లు. పంతొమ్మిదేళ్లకు ఇలా పట్టపగలు తాగుతూ తిరుగుతున్నారంటే... వాళ్లు ఎలా పెరుగుతున్నారు? వాళ్ల తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? వాళ్ల సరదా ఇతరుల ప్రాణాల మీదకు వస్తుందని చెప్పకపోతే ఎలా?! ఇప్పుడు మాకు తీరని అన్యాయం చేశారు’’ అంటూ తమ కష్టాన్ని, కన్నబిడ్డ దుస్థితిని చెబుతూ తల్లడిల్లిపోయారు రమ్య అమ్మమ్మ విజయలక్ష్మి, తాతయ్య సురేందర్‌నాథ్. - సురేందర్‌నాథ్ మృత్యు ఘంటికలు ఉదయం 9 గంటలు... రాజేష్ సాప్ట్వేర్ ఇంజినీర్. మాదాపూర్‌లో నివాసముంటున్నాడు. బోరబండలో ఉండే అన్న కూతురు రమ్య అంటే అతనికి ప్రాణం. వారంలో రెండు మూడు సార్లయినా పాపను కలుసుకుని ముచ్చట్లు చెప్పందే రాజేష్‌కు ఏమీ తోచదు. జులై 1 శుక్రవారం... అన్నయ్య ఇంటికెళ్లాడు రాజేశ్. రమ్యను స్కూల్ నుంచి తీసుకొద్దాం అన్నాడు. పనిలో పని పాప స్కూలుకు దగ్గర్లో ఇల్లు కూడా చూడొచ్చని రాజేశ్‌ని, భార్య రాధిక, తండ్రి మధుసూదన్, మరో తమ్ముడు రమేష్‌ని తీసుకుని బయలుదేరాడు రమ్య తండ్రి వెంకటరమణ. ఉదయం 11.30 గంటలు... అందరూ కలిసి రాజేశ్ శాంత్రో కారులో హైదర్‌గూడలోని సెయింట్ పాల్స్ స్కూలుకు చేరుకున్నారంతా. రాజేశ్‌ని చూడగానే రమ్య సంబరపడిపోయింది. ముచ్చట్లలో మునిగిన బాబాయ్ కూతుళ్లను ఇక ఇంటికెళ్దాం రమ్మంటూ పిలిచింది రాధిక. స్కూలు నుంచి ఇంటికి బయలుదే రారు. మధ్యాహ్నం 1 గంట... స్కూల్లో జరిగిన విషయాల్ని దారి పొడవునా చెబుతూనే ఉంది రమ్య. మధ్యమధ్యలో చుట్టుపక్కల కనిపిస్తున్న ఫ్లెక్సీల గురించి అడుగుతోంది. తల్లి చెబుతుంటే... నోట్‌బుక్‌లో ఆ బొమ్మలు వేసేందుకు ప్రయత్నిస్తోంది. నేను శాస్త్రవేత్తనవుతా బాబాయ్ అంది. రాజేశ్ మురిసిపోయాడు. మధ్యాహ్నం 1.30 గంటలు... డివైడర్‌కు మరోవైపు రోడ్డులో ముఫకంజా కాలేజ్ వైపు నుంచి ఐ 10 కారు ప్రమాదకరమైన స్పీడులో వస్తోంది. శ్రావెల్ అనే యువకుడు కారు నడుపుతున్నాడు. విష్ణు, సూర్య, అశ్వినీనాయుడు, అలెన్ జాక్సన్, శరణ్ అనే మరో ఐదుగురు మిత్రులున్నారు. ఆ ఆరుగురూ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు. పొద్దున్నే సినిమా చూసేందుకు సినీమ్సాక్స్కు వెళ్లారు. షో టైం దాటిపోవడంతో అక్కడి బార్లో తలో మూడు పెగ్గుల విస్కీ, ఒక్కో బీర్ తాగారు. తాగిన కిక్కులో స్పీడుగా కారు నడుపుకుంటూ హాస్టల్‌కి బయలుదేరారు. కారు పంజాగుట్ట శ్మశానవాటిక దగ్గరికి రాగానే అదుపుతప్పి డివైడర్ ఎక్కింది. పల్టీలు కొడుతూ గాలిలోకి లేచి, అప్పుడే పంజాగుట్ట ఫ్లై ఓవర్ దిగిన రాజేష్ కారు మీద పడింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో కారు నడుపుతున్న రాజేష్ అక్కడికక్కడే కన్నుమూశాడు. వెంకట రమణకు తప్ప అందరికీ తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద వార్త అందుకుని వచ్చిన పోలీసులు... క్రేన్స్ సహాయంతో రెండు కార్లను అతి కష్టమ్మీద విడదీశారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. మధ్యాహ్నం 2.30 గంటలు.. రమ్యను నిమ్స్‌లో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కేర్ ఆస్పత్రికి మార్చారు. మిగతావారిని యశోద ఆస్పత్రికి తరలించారు. ఆ ఆరుగురు యువకులకు కూడా గాయాలయ్యాయి. వాళ్లని పోలీసులు ఆస్పత్రికి తరలించి, వాళ్లపై డ్రంక్ అండ్ రాష్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన రెండో రోజు... జూలై 2 ఉదయం... మిగతా వారంతా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు కానీ, వారం గడిచినా రమ్య పరిస్థితిలో మార్పు రాలేదు. నిజానికి ప్రమాదం జరిగినప్పుడే రమ్య బ్రెయిన్ డెడ్ అయ్యింది. చివరి ప్రయత్నంగా వెంటిలేటర్‌పై ఉంచి, మెదడు పనితీరును పునరుద్దించేందుకు వైద్యులు శ్రమించారు. కానీ వారం దాటినా రమ్య ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాలేదు. మెదడు స్పందించడం ఆగిపోయింది. జూలై 9 శ నివారం సాయంత్రం సాయంత్రం వైద్యులు రమ్య మరణించిన ట్లు ప్రకటించారు. ఆ విషయాన్ని భార్యతో ఎలా చెప్పాలో వెంకటర మణకు అర్థం కాలేదు. కానీ తప్పక... రమ్య మరణవార్త రాధికకు చెప్పారు. కేర్ ఆస్పత్రికి ఆంబులెన్స్‌లో తీసుకొచ్చి రమ్యను చూపించారు. ఘొల్లుమంది రాధిక. కన్నీళ్లతో కడసారి బిడ్డను ముద్దాడింది. దుఃఖాన్ని తట్టుకోలేక స్పృహ కోల్పోయింది. జూలై 10 ఆదివారం ఉదయం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం చేసి... బాగ్ అంబర్‌పేట డీడీ కాలనీలోని అమ్మమ్మ ఇంటికి రమ్య మృతదేహాన్ని చేర్చారు. మా కంటి దీపం కళ్ల ముందే ఆరిపోయిందంటూ తండ్రి రోదించాడు. రమ్య చెల్లెలు రష్మి.. ‘అక్కా లే అక్కా పార్కులో ఆడుకుందాం’ అంటూ అచేతనంగా ఉన్న రమ్యను పిలవడం అక్కడున్న అందరికీ కన్నీళ్లు తెప్పించింది. జూలై 10 ఆదివారం సాయంత్రం 4 గంటలు.. అంబర్‌పేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. బంగారు భవిష్యత్ ఉన్న ఓ నిండు ప్రాణాన్ని మద్య మహమ్మారి మింగేసింది. అందుకు కారకులైన వారిని శిక్షించేందుకు అవసరమైన సాక్ష్యాలన్నీ పోలీసులు సేకరించారు. కారు నడిపిన వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని అంటున్నారు. ►రమ్య ప్రాణాలను ఎవరిస్తారు? ఇది రమ్య అమ్మమ్మ ప్రశ్న. ►మా కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఎవరు పూడుస్తారు? ఇది రమ్య పిన్ని ఆవేదన. ► దోషులను తెర ముందుకు ఎందుకు తీసుకురావడం లేదింతవరకు? ఇది సామాన్యుల ఆవేశం. ► ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? ఇది విద్యావంతుల ఉద్వేగం. తప్పు ఒక్కరిది కాదు... అందరిదీ! పట్టపగలే మద్యం అమ్మిన షాపు వాళ్లది లెసైన్సు లేని పిల్లలకు కారిచ్చి పంపిన తల్లిదండ్రులది ఓవర్ స్పీడుతో మూడు సిగ్నల్స్ దాటినా ఆపని పోలీసులది ... ఇది ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కన్నీటి భాష్యం.