Cola
-
కోలా, పెప్సీలకు క్యాంపాకోలా పోటీ!
న్యూఢిల్లీ: దేశీ శీతల పానీయాల మార్కెట్లో స్థానిక బ్రాండ్ క్యాంపాకోలా దిగ్గజాలకు దీటుగా విస్తరించే ప్రణాళికలతో అడుగులు వేస్తోంది. ప్యూర్ డ్రింక్స్ గ్రూపు 1970ల్లో క్యాంపాకోలా బ్రాండ్‌ను దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. మన దేశంలో 1949లో కోకకోలాను పరిచయం చేసింది ఇదే గ్రూప్ కావడం గమనార్హం. 1970ల వరకు కోకకోలాకు తయారీ, డిస్ట్రిబ్యూటర్‌గా పీర్స్గ్రూపు పనిచేయగా, కోకకోలా భారత మార్కెట్ నుంచి వెళ్లిపోయిన తర్వాత తన బ్రాండ్లతో దేశీయంగా చొచ్చుకుపోయింది. విదేశీ కంపెనీల పోటీ లేని దశలో మార్కెట్‌ను శాసించే స్థాయికి చేరింది. ‘ద గ్రేట్ ఇండియన్ టేస్ట్’ నినాదంతో క్యాంపాకోలా స్థానిక రుచులతో కూడిన డ్రింక్స్‌ను పరిచయం చేసింది. అయితే, ఆ తర్వాత కోకకోలా తిరిగి భారత్‌లోకి రావడం, పెప్సీకో కూడా ప్రవేశంతో క్యాంపాకోలా వెనుకబడిపోవడం గమనార్హం. ఇప్పుడు పీర్స్ గ్రూపు వ్యవస్థాపకులైన సర్దార్ మోహన్‌సింగ్ కుటుంబంలో నాలుగో తరానికి చెందిన జయవంత్‌జిత్ సింగ్ దేశీ బ్రాండ్‌కు ఆదరణ తీసుకురావడంతోపాటు దేశవ్యాప్త విస్తరణపై దృష్టి పెట్టారు. త్వరలో చెన్నైకు... పీర్స్ గ్రూపు కార్యకలాపాలను ప్రస్తుతం జయవంత్‌జిత్ సింగ్ పర్యవేక్షిస్తున్నారు. జమ్మూ కశ్మీర్, యూపీ, హరియాణా, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాలు, రాజస్తాన్, ఢిల్లీ, ఉత్తరాంచల్, హిమాచల్‌ప్రదేశ్, బిహార్ తదితర రాష్ట్రాల్లో క్యాంపాకోలా బ్రాండ్లు స్థానికులకు పరిచయమే. ప్రధానంగా, ఉత్తరాది, ఈశాన్య మార్కెట్లలో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు చేరువయ్యేందుకు గాను తమకు ఫ్రాంచైజీ ప్లాంట్లు ఉన్నాయని జయవంత్‌జిత్ సింగ్ తెలిపారు. సిల్వాస్సాలో నిమిషానికి 600 బాటిళ్ల సామర్థ్యంతో యూనిట్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. నేపాల్లోనూ తమ కార్యకలాపాలు ఉన్నాయని తెలిపారు. చెన్నై వంటి దక్షిణాది మార్కెట్లలోకి విస్తరించాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. రోజూ 4 మిలియన్ల కేసులను ప్రస్తుతం తయారు చేస్తున్నట్టు చెప్పారు. కోకకోలా భారత్ నుంచి తప్పుకున్న తర్వాత 1970ల చివర్లో, 1980ల్లో పార్లే గ్రూపు సైతం దేశీయ మార్కెట్లో హవా చలాయించింది. థమ్స్అప్, గోల్డ్‌స్పాట్, లిమ్కా బ్రాండ్లు పార్లేవే. కాకపోతే ఆ తర్వాత వీటిని మళ్లీ 1993లో దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన కోకకోలాకు విక్రయించడం జరిగింది. పెప్సీకో కూడా ప్రవేశించడంతో స్థానిక బ్రాండ్లు చిన్నబోయాయి. దీంతో దేశీయ శీతల పానీయాల మార్కెట్‌ను రెండు విదేశీ సంస్థలే ప్రస్తుతం శాసిస్తున్నాయి. నెగ్గుకొస్తుందా...? శామ్సికా మార్కెటింగ్ కన్సల్టెంట్స్ సీఎండీ జగ్దీప్కపూర్ మాట్లాడుతూ... ‘‘ఉత్తరాదిన క్యాంపాకోలాకు బలమైన బ్రాండ్ ఈక్విటీ ఉంది. అయితే, బ్రాండ్ స్థాయి అతిపెద్ద సవాలు కాగలదు’’ అని పేర్కొన్నారు. థమ్స్అప్, కోకకోలా, పెప్సీ మార్కెట్లో పెద్ద ఎత్తున వాటా ఉన్న బ్రాండ్లు. మరి క్యాంపాకోలా కూడా ఈ స్థాయికి ఎదగాలంటే అంతే దీటుగా బ్రాండ్ కూడా ఉండాలంటున్నారు మార్కెట్ నిపుణులు. పాతతరంతోపాటు, కొత్త తరానికీ మధ్య సమతూకం అవసరమన్నారు కపూర్. ఉత్తరాదిన రిలయన్స్ ఫ్రెష్, డీమార్ట్ తదితర స్టోర్లలోనూ క్యాంపాకోలా అడుగుపెట్టింది. ఆరెంజ్, లెమన్, లైమ్ అండ్ లెమన్, జీరసోడా, ఫిజ్జి యాపిల్ తదితర రుచులతో కూడిన డ్రింక్స్‌ను ప్రస్తుతం క్యాంపాకోలా మార్కెట్ చేస్తోంది. -
జాగృతం కాకపోతే కోలారు ఎడారే
మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్ చెరువుల ఆక్రమణలు, భూగర్భ జలాల వినియోగంపై పరిమితి లేకపోవడంతోనే అనర్థాలు కోలారు : నీటి వినియోగంలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే భవిష్యత్తులో కోలారు జిల్లా ఎడారి కాక తప్పదని రాజస్తాన్‌కు చెందిన ప్రముఖ జలవనరుల నిపుణుడు, మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్ హెచ్చరించారు. జల నిర్వహణపై కోలారులోని చన్నయ్య రంగమందిరంలో శుక్రవారం నిర్వహించిన ఒక రో జు వర్కషాప్లో ఆయన ప్రసంగించారు. నీటి వినియోగంలో కోలారు జిల్లాలోని రైతులు, ప్ర జలు తగిన జాగ్రత్తలు పాటించడం లేదని, ఇది దుష్పరిమాణాలకు దారితీస్తుందని అన్నారు. తాను ఈ జిల్లాలో పర్యటించిన సందర్భంగా మూడు అంశాలను ప్రధానంగా గుర్తించినట్లు తెలిపారు. అందులో నీటిని సక్రమంగా విని యోగం చేయకపోవడం, చెరువుల, రాజకాలువల ఆక్రమణలు, భూగర్భ జలాల వినియోగం పై పరిమితి లేకపోవడం అని స్పష్టం చేశారు. ఈ మూడు కారణాల వల్ల కోలారు జిల్లాలో తీవ్ర నీటి సమస్య ఏర్పడిందని అన్నారు. చెరువుల్లో ఆక్రమణలు తొలగించడం, మలినమైన నీటిని శుద్ధీకరించే వరకూ కోలారు జిల్లాలో భూగర్భ జలాలను రీఛార్జ చేయడం సాధ్యపడదని వివరించారు. కోలారు జిల్లాలోనే కాకుండా కర్ణాటక రాష్ర్టంలోనే నీటి వినియోగంపై రైతులు దృష్టి నిలపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్, లాభాలపై చూపుతున్న ఆసక్తి నీటిని పొదుపుగా వాడుకోవడంపై అన్నదాతలు కనబరచడం లేదని అన్నారు. రాజస్తాన్‌లో నీటి లభ్యతకు అనుగుణంగా రైతులు పంటలు పండిస్తారని తెలిపారు. దీని వల్ల ఏనాడు నీటి సమస్య తలెత్తలేదని అన్నారు. నీటి మూలాలను అన్వేషించడంతో పాటు సద్వినియోగం చేసుకోవడం, వర్షపు నీటిని భూమిలో ఇంకేలా చేయడం ద్వారా భూగర్భ జలాలు పెంచవచ్చునని సూచిం చారు. రాజస్తాన్‌లో సగటు వర్షపాతం 300 మి.మీ ఉండగా, కోలారులో 500 మి.మీ ఉందని తెలిపా రు. అయితే రాజస్తాన్‌లో తీసుకున్న జాగ్రత్తల వల్ల అక్కడి పరిస్థితి మెరుగుపడిందని అన్నారు. వర్షపు నీటిని నిల్వ చేయడం మొదలు ఆ నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. చెక్‌డ్యాంలు, ఇంకు డు గుంతలు (వాటర్ హార్వస్టింగ్) విధానాన్ని ప్రతి చోటా అమలు చేయాలని అన్నారు. ఉద్యాన పంట లకు బిందు సేద్యం తప్పనిసరిగా చేయాలన్నారు. రాజస్తాన్ తాను పడ్డ కృషి వల్ల దాదాపు ఏడు నదులను రీజనరేట్ చేసినట్లు గుర్తు చేశారు. ఇందులో ప్రభుత్వ, ప్రజా ప్రతినిధుల పాత్ర ఎంత మాత్రం లేదని, కేవలం ప్రజలు చేయడం వల్లనే సాధ్యమైం దని అన్నారు. కోలారులో కూడా ప్రజలు నీటి రక్ష ణ, మిత వాడకంపై దృష్టి సారించాలని అన్నారు. చెరువులు, రాజకాలువలలో ఆక్రమణల తొలగింపు ప్రభుత్వం బాధ్యత కాదని ప్రజలే ముందుండి ఆక్రమణలు తొలగిస్తే చెరువులకు నీరు చేరి భూగర్భ జలాలు పెరుగుతాయని అన్నారు. కలెక్టర్ త్రిలోక్‌చంద్ర, జెడ్పీ చైర్పర్సన్ రత్నమ్మ నంజేగౌడ, సీఈఓ పనాలీ, జెడ్పీ సభ్యులు పాల్గొన్నారు. -
మళ్లీ పార్లే కోలా..
ముంబై: రానున్న వేసవిలో శీతల పానీయాల మార్కెట్ వేడెక్కనున్నది. థమ్సప్, లిమ్కా, గోల్డ్‌స్పాట్ వంటి బ్రాండ్లతో ఒకప్పుడు ఈ మార్కెట్‌ను ఒక ఊపు ఊపిన పార్లే ఆగ్రో కంపెనీ కేఫ్ క్యూబా పేరుతో కాఫీ ఫ్లేవర్‌తో కూడిన కార్బొనేటెడ్ డ్రింక్‌ను మార్కెట్లోకి తెస్తోంది. తన బ్రాండ్లను అంతర్జాతీయ దిగ్గజం, కోక-కోలాకు అమ్మేసిన తర్వాత మళ్లీ 20 ఏళ్లకు పార్లే కంపెనీ ఈ రంగంలోకి ప్రవేశిస్తోంది. ఈ కేఫ్ క్యూబా తమ ఫ్లాగ్షిప్ బ్రాండ్ కాబోతోందని, మార్కెట్లోకి తెచ్చిన ఏడాదిన్నర కాలంలోనే 7 శాతం మార్కెట్ వాటాను, రూ.1,000 కోట్ల టర్నోవర్‌ను సాధించగలదని పార్లే కంపెనీ అంచనా వేస్తోంది. పార్లే ఆగ్రో కంపెనీ థమ్సప్, లిమ్కా, గోల్డ్‌స్పాట్, సిట్రా వంటి బ్రాండ్లతో భారత శీతల పానీయాల మార్కెట్లో సంచలనం సృష్టించింది. 1991లో ఆర్ధిక విధానాల కారణంగా అంతర్జాతీయ దిగ్గజాలు కోక-కోలా, పెప్సిలు భారత్‌లోకి ప్రవేశించాయి. పార్లే బ్రాండ్లను తమకు అమ్మేయాలని కోక-కోలా బేరం పెట్టింది. కోక-కోలా రూ.30-40 కోట్లు ఆఫర్ చేస్తుందని పార్లే భావించింది. కానీ ఈ కంపెనీ రూ.300 కోట్లు ఆఫర్ చేసింది. అప్పట్లో ఈ మొత్తం పెద్ద మొత్తం కిందనే లెక్క. పార్లే ఆ బ్రాండ్లను కోక-కోలాకు 1993లో అమ్మేసింది. పదేళ్ల వరకూ ఈ రంగంలోకి రామంటూ నాన్ కాంపీట్ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. థమ్సప్ హవా: థమ్సప్ బ్రాండ్‌ను కోక-కోలా కొనసాగిం చింది. 20 ఏళ్ల తర్వాత కూడా థమ్సప్ హవా కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన తన కోక్ బ్రాండ్‌ను మాత్రం కోక-కోలా కంపెనీ భారత్‌లో హిట్ చేసుకోలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కోక్ విజయయాత్ర అప్రతిహతంగా కొనసాగుతున్నప్పటికీ, భారత్‌లో మాత్రం దీని స్థానం థమ్సప్ తర్వాతనే ఉంది. పార్లే కంపెనీ బిస్లరీ మినరల్ వాటర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. మిన టరల్ వాటర్ అంటే బిస్లరీయే అన్నంతగా అది పాపులర్ అయింది. పదేళ్ల కృషి:ఇక కేఫ్ క్యూబా డ్రింక్‌ను వచ్చే ఏడాది జనవరిలో గాని, ఫిబ్రవరిలో గాని మార్కెట్లోకి తేవాలని పార్లే కంపెనీ యోచిస్తోంది. ప్రస్తుతం కార్బొనేటెడ్ డ్రింక్స్ మార్కెట్లో లెమన్, కోలా, ఆరంజ్ ఫ్లేవర్స్ మాత్రమే ఉన్నాయని పార్లే ఆగ్రో సీఎండీ ప్రకాష్ చౌహాన్ చెప్పారు. ఈ సెగ్మెంట్లో పూర్తిగా భిన్నమైన డ్రింక్‌ను అందించాలనే ఉద్దేశంతో కాఫీ ఫ్లేవర్‌తో కేఫ్ క్యూబాను తెస్తున్నామని వివరించారు. ఈ డ్రింక్‌ను డెవలప్ చేయడానికి తమకు పదేళ్లు పట్టిందని చెప్పారు. కేఫ్ క్యూబా 250 ఎంఎల్ క్యాన్ ధర రూ.20, 250 ఎంఎల్ పెట్ బాటిల్ ధర రూ.15గా ఉండొచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. అయితే ధరల వివరాలను చెప్పడానికి చౌహాన్ నిరాకరించారు. కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్ మార్కెట్లో తీవ్రమైన పోటీ ఉందని, అయినప్పటికీ, ధర విషయంలో రాజీపడబోమని, ధర అధికంగానే ఉండొచ్చని చెప్పారు. తమ మొత్తం టర్నోవర్‌లో 40% వాటా ఈ కొత్త డ్రింక్ నుంచే వస్తుందని రూ.2,000 కోట్ల టర్నోవర్ ఉన్న ఈ కంపెనీ అంచనా వేస్తోంది. 2015 కల్లా టర్నోవర్‌ను రూ.5,000 కోట్లకు పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కేఫ్ క్యూబాలో డైట్ వేరియంట్‌నూ అందించాలని యోచిస్తోంది. పార్లే కంపెనీ ఫ్రూటీ జ్యూస్ బ్రాండ్‌ను కూడా అందిస్తోంది. -
రెండు నెలల్లో ‘కోలారు’ గనులు పునః ప్రారంభం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కోలారు బంగారు గనులను పునఃప్రారంభించడానికి రెండు నెలల్లో టెండర్ ప్రక్రియను ప్రారంభిస్తామని కేంద్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కేహెచ్. మునియప్ప వెల్లడించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గనులను పునఃప్రారంభిస్తామన్నారు. దీనిపై గురువారం ఢిల్లీలో గనుల శాఖ మంత్రితో సుదీర్ఘంగా చర్చించానని తెలిపారు. నగరంలోని హోటల్లో ఇండో అరబ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ శుక్రవారం ఏర్పాటు చేసిన వర్క్‌షాప్ పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గనుల పునఃప్రారంభానికి ఎదురైన ఆటంకాలన్నీ తొలగిపోయాయని చెప్పారు. కోలారులో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించే విషయమై మరో వారంలో నిర్ణయం వెలువడుతుందని తెలిపారు. అంతకు ముందు ఆయన వర్క్‌షాపులో మాట్లాడుతూ.. అరబ్ పారిశ్రామికవేత్తలు ఇండియాలో పెట్టుబడులు పెట్టదలిస్తే, కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలను అందిస్తుందని హామీ ఇచ్చారు. భారత్-అరబ్ సంబంధాలు ఈనాటిది కాదని, అనేక దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోందని తెలిపారు. అనేక రంగాల్లో ఇరు దేశాలు చక్కటి సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. మున్ముందు కూడా ఈ సంబంధాలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. కాగా 12వ పంచ వర్ష ప్రణాళికలో చిన్న తరహా పరిశ్రమలకు రూ.25 వేల కోట్లు కేటాయించారని ఆయన వెల్లడించారు. ప్రారంభోత్సవంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కు చెందిన రవి శంకర్ గురూజీ ప్రభృతులు పాల్గొన్నారు.