జోరందుకున్న సంతకాల సేకరణ
కొండపాక: మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎర్రవల్లిలో భూసేకరణ కోసం చేపట్టిన సమ్మతి ఫారాలపై సంతకాల సేకరణ జోరందుకుందని తహసీల్దార్ విజయ్భాస్కర్జీ పేర్కొన్నారు. మండలంలోని ఎర్రవల్లిలో బుధవారం భూసేకరణ కోసం ఫారం నంబరు (1), (2)లపై రైతుల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. బయట వ్యవసాయ పనులు సాగుతుండటంతో మరింతగా వేగంగా సంతకాల సేకరణకు రైతులు మొగ్గు చూపడం లేదన్నారు. కేవలం 3 గంటల్లో 30 మంది రైతుల వద్ద నుంచి 86 ఎకరాల భూములు ప్రాజెక్టుకు ఇచ్చేందుకు సమ్మతి పత్రాలపై రైతులు సంతకాలు చేశారన్నారు. ప్రభుత్వం చెప్పినట్లుగా 123 జీవో ప్రకారం భూములను అప్పగిస్తున్నారన్నారు.
అందరి రైతుల వద్ద నుంచి సమ్మతి సంతకాల సేకరణలు ముగిసిన వెంటనే ఏ రైతుది ఎన్ని ఎకరాల భూమిని కోల్పోతున్నారో తెలిసేలా గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో పెట్టిస్తామన్నారు. తదుపరి భూముల రిజిస్ట్రేఫన్ పరంపర ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉటుకూరి నర్సింహారెడ్డి , ఎంపీటీసీ ఎడ్ల నర్సింలు, వీఆర్వోలు జలంధర్, వెంకటనర్సయ్య, ప్రవీణ్, యాదగిరి. రమేష్ తదితరులు పాల్గొన్నారు.