వావ్.. సిద్దిపేట
♦ కితాబు ఇచ్చిన ‘అస్కీ’ బృందం
♦ పట్టణ ‘పరిశుభ్రత’పై సంతృప్తి
♦ అధికారుల సామూహిక పనితీరుకు సభ్యులు ఫిదా
సిద్దిపేట జోన్: పట్టణంలో పరిశుభ్రతకు తీసుకుంటున్న చర్యలపై అస్కీ(అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా) ఆశ్యర్యం వ్యక్తం చేసింది. మున్సిపాలిటీలో ఒకే అంశాన్ని ప్రామాణికంగా తీసుకొని పాలకవర్గం, అధికారులు సంస్కరణలను చేపట్టడమే కాకుండా లక్ష్యాలు నిర్దేశించుకోవడం అభినందనీయమని సభ్యులు పేర్కొన్నారు. ఇది భవిష్యత్తులో బహుళ ప్రయోజనాలకు దోహదపడుతుందని చెప్పారు.
దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పట్టణాల్లో వాస్తవ స్థితిగతులను అధ్యయనం చేసి సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి త్వరలో అప్పగిస్తామని వారు తెలిపారు. జూన్‌లోగా పూర్తిస్థాయి నివేదికను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు అందిస్తామన్నారు. సిద్దిపేటలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీశ్‌రావు దూరదృష్టిని అభినందించారు.
స్వచ్ఛ భారత్ మిషన్ అవార్డుకు ఎంపికైన సిద్దిపేట స్పెషల్ గ్రేడ్ మున్సిపల్‌ను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు, అధికారులు, మహిళ సంఘాలు, మెప్మా ప్రతినిధులు, స్చచ్చంద సంస్థలు ప్రజాప్రతినిధులతో చర్చించారు.