Command Control Room
-
ఎలా ఎదుర్కొందాం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పలు పాలనా అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) మంత్రులందరితో సమావేశమ య్యారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్కలు శనివారం ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 7:45 నిమిషాల వరకు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. దాదాపు 9గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో అధికారులు, సిబ్బందిని దూరంగా ఉంచిన మంత్రులు అనేక అంశాలపై మనసు విప్పి మాట్లాడుకున్నట్టు సమాచారం. ఈ నెల5న అసెంబ్లీ భేటీ...? బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపు, ఇటీవల రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కులగణన గురించి సీఎం, మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. ⇒ బీసీ రిజర్వేషన్ల విషయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేలా ముందుకెళ్లాలని, ఇటీవల చేపట్టిన కులగణన రిపోర్టును కోర్టు ముందుంచి బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఎలాంటి అడ్డంకి లేకుండా చూడాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈనెల 5వ తేదీన అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచి స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతానికి తగ్గకుండా రిజర్వేషన్లు కల్పించేలా కేంద్రం చొరవ తీసుకోవాలని తీర్మానం చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ⇒ ఎస్సీల వర్గీకరణ అంశంపై కూడా మంత్రులతో సీఎం చర్చించారని, రాజకీయంగా విమర్శలు రాకుండా వీలున్నంత త్వరగా రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణను అమలు చేయాలని, ఎన్నికల కోడ్ ముగిశాక ఈ విషయంలో ప్రభుత్వ విధానాన్ని స్పష్టంగా మరోమారు⇒ త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా మంత్రులు చర్చించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డి గెలుపొందే ప్రణాళికలు రూపొందించే బాధ్యతలు మంత్రులు దామోదర, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్లకు అప్పగించారు. ⇒ తాజాగా వివాదాస్పదమైన పార్టీ ఎమ్మెల్యే డిన్నర్ అంశం కూడా చర్చకు వచ్చిందని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేలకు ఇబ్బంది కలగకుండా మంత్రులు వ్యవహరించాల్సిన తీరు గురించి సీఎం దిశానిర్దేశం చేశారని, మంత్రులంతా సమష్టిగా పనిచేయాలని, ఒక్కటే మాట.. ఒక్కటే పంథా రీతిలో ఇక ముందు పనిచేయాలనే చర్చ కూడా వచ్చినట్టు సమాచారం. అధిష్టానం జోక్యం? ఇటీవల సోషల్‌మీడియా వేదికగా జరిగిన ఓ వ్యవహారంపై సీఎం, మంత్రులు ప్రత్యేకంగా చర్చించినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ అధికారిక హ్యాండిల్లో నిర్వహించిన ఓ పోల్‌లో బీఆర్ఎస్కు అనుకూలంగా ఫలితం రావడం, ఈ హ్యాండిల్ స్క్రీన్‌షాట్‌కు బీఆర్ఎస్ సోషల్‌మీడియా విస్తృతంగా ప్రచారం కల్పించిన నేపథ్యంలో సోషల్ మీడియా విషయంలో అటు పార్టీ, ఇటు ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యవహారంపై మంత్రులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.అయితే, ఈ అంశం పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్లిందని, మరోమారు ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఢిల్లీ పెద్దలు రాష్ట్ర పార్టీని ఆదేశించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సోషల్‌మీడియా, కాంగ్రెస్ వ్యతిరేక సోషల్‌మీడియాలు చేస్తున్న దు్రష్పచారాన్ని అడ్డుకునేలా కాంగ్రెస్ పార్టీ సోషల్‌మీడియాను తయారు చేయాలని, ప్రతి చిన్న అంశంపై చేస్తున్న రాద్ధాంతాన్ని సమర్థవంతంగా అడ్డుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసింది. మీడియాతో మంత్రులు ఏం చెప్పారంటే..సమావేశానంతరం, కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద మీడియాతో మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావులు మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రెండు గంటల్లోనే ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ప్రకటన చేశామని, వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని దామోదర రాజనర్సింహ చెప్పారు.కేబినెట్ సబ్‌కమిటీ సూచన మేరకు వన్ మ్యాన్ కమిషన్‌ను నియమించామని, ఈ కమిషన్ త్వరలో రిపోర్ట్ ఇస్తుందని, ఆ రిపోర్ట్‌పై కేబినెట్లో చర్చించి, అసెంబ్లీలో ప్రవేశపెడుతామని వెల్లడించారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కులగణన కార్యరూపం దాల్చడానికి సంబంధించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సహచర మంత్రులు చర్చించామన్నారు. ఈనెల 5వ తేదీన సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ ముందు పెడతామని, తర్వాత సభలో చర్చకు పెట్టడం ద్వారా ప్రజాస్వామిక విధానాన్ని ముందుకు తీసుకుపోతామన్నారు. -
హైదరాబాద్ మహానగర వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధం
-
మనబడి నాడు-నేడుపై కమాండ్ ఐ
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’ పనులు మరింత పారదర్శకంగా, వేగంగా పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. మొదటి విడతలో పలు పాఠశాలలను సుర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ప్రభుత్వం రెండో విడతకు 979 స్కూళ్లను ఎంపిక చేసింది. ఇందులో 960 స్కూళ్లలో పనులు ప్రారంభమయ్యాయి. పనులను పర్యవేక్షించేందుకు కలెక్టర్ దినేష్‌కుమార్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లో ప్రత్యేకంగా నియమించిన సిబ్బంది నిరంతరం పనులు జరుగుతున్న తీరును పర్యవేక్షించనున్నారు. ఒంగోలు: జిల్లాలో మనబడి నాడు–నేడు పనులు వేగవంతమయ్యాయి. కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పనులు ఊపందుకున్నాయి. పనుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 16 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీచేస్తూ కలెక్టర్ చర్యలు చేపట్టడంతో అప్రమత్తం అయిన అధికార యంత్రాంగం పనుల్లో పురోగతిపై దృష్టి సారించారు. మొన్నటి వరకు 20వ స్థానంలో ఉన్న జిల్లా ఒక్కసారిగా 5వ స్థానానికి చేరుకుంది. 960 గ్రౌండింగ్ పూర్తి జిల్లాలో నాడు–నేడు రెండో దశలో ఇప్పటికే 979 విద్యా సంస్థలకు 960 గ్రౌండింగ్ పూర్తయింది. వాటిలో అంగన్వాడీ సెంటర్లు, డైట్ కాలేజీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, జూనియర్ కాలేజీలు ఉన్నాయి. జిల్లాలోని ఏపీఈడబ్ల్యూఐడీసీ, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్టుమెంట్, రూరల్ వాటర్ సప్లయ్ అండ్ శానిటేషన్, సమగ్రశిక్ష అభియాన్ ఇంజినీరింగ్ విభాగాలు ఈ పనులను పర్యవేక్షిస్తున్నాయి. మొత్తం రూ.425 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో భాగంగా తొలుత 15 శాతం నిధులు విడుదల చేసింది. అంచనాలు రూపొందించడం, ఒప్పందాలు చేసుకోవడం, రివాల్వింగ్ ఫండ్ జమ చేయడం, పరిపాలన పరమైన అనుమతులు పొందడం చకచకా జరిగాయి. ఇప్పటి వరకు రూ.81 కోట్లకుపైగా ఖర్చు చేశారు. మొత్తం ప్రక్రియ ఇంకా ఆరు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. ఏపీఎంలకు దిశా నిర్దేశం డలాల్లో నాడు–నేడు పనుల పర్యవేక్షణకు సంబంధించి సెర్ప్‌లోని ఏపీఎంలను జిల్లా విద్యాశాఖలో అదనపు బాధ్యతలు నిర్వర్తించేందుకు కేటాయించారు. ఇప్పటికే వారికి కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. మొత్తం 37 మంది ఈ బాధ్యతలు నిర్వహించనుండగా వీరంతా ప్రస్తుతం బాపట్లలో శిక్షణ పొందుతున్నారు. వారు కూడా వస్తే పనులు మరింత వేగవంతం అవుతాయి. ఆరు నెలల లక్ష్యాని కన్నా ముందే నాడు–నేడు పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్ జారీ చేస్తున్న ఆదేశాలను అమలు చేస్తున్నాం. – డీఈఓ బి.విజయభాస్కర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు సమగ్రశిక్ష అభియాన్‌లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కలెక్టర్ ప్రారంభించారు. ఇందులో ఐదుగురు సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. వీరు ప్రతి రోజు పనుల ప్రగతిని పర్యవేక్షిస్తుంటారు. ప్రధానంగా సెంట్రల్ ప్రొక్యూర్‌మెంట్‌కు సంబంధించి సిమెంట్, ఇనుము, ఇసుకతో పాటు ఇతర ఫర్నిచర్ రాకపై సమాచారాన్ని సేకరిస్తున్నారు. పనుల్లో తలెత్తే సమస్యలను తక్షణం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తున్నారు. కలెక్టర్ ప్రతి రోజు ఉదయాన్నే వాట్సాప్‌లో పనుల ప్రగతిని సమీక్షించడం, డీఈఓకు తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రతి మంగళవారం నేరుగా మండల విద్యాశాఖ అధికారులతో మాట్లాడుతూ తగు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మొక్కుబడి సమీక్షలు కాకుండా ప్రత్యేకంగా విద్యాశాఖపై కలెక్టర్ నేరుగా పర్యవేక్షిస్తుండడంతో దిగువ స్థాయిలో కూడా సిబ్బంది అప్రమత్తమయ్యారు. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 16 మంది హెచ్ఎంలకు షోకాజ్ నోటీసులిచ్చారు. -
Covid-19: ప్రభుత్వ పనితీరు అభినందనీయం, గవర్నర్ ప్రశంసలు
వెంగళరావునగర్ (హైదరాబాద్): కోవిడ్ కంట్రోల్ కమాండ్ కేంద్రాల ద్వారా జిల్లాల వారీగా కోవిడ్ తీవ్రతను పర్యవేక్షణ చేసి తక్షణ నివారణ చర్యలు చేపట్టే అవకాశాలున్నాయని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లోని కోవిడ్ కంట్రోల్ కమాండ్ కేంద్రాన్ని శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో గవర్నర్ మాట్లాడుతూ...కోవిడ్ కంట్రోల్ కమాండ్ సెంటర్ల ద్వారా రోగ తీవ్రత, బెడ్, ఆక్సిజన్ లభ్యతను ఎప్పటికప్పుడు మానిటర్ చేయవచ్చని పేర్కొన్నారు. ఐసీయూ బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, డెత్ రేషియో, రికవరీ శాతాన్ని ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో తెలుసుకోవడానికి ఇలాంటి కమాండ్ సెంటర్లు ఉపయోగపడతాయని చెప్పారు. కోవిడ్ కంట్రోల్ వార్ రూమ్ ఏర్పా టు ఆలోచన వచ్చినందుకు ప్రభుత్వాన్ని, అధికారులను ఆమె అభినందించారు. చదవండి: Mariyamma Lockup Death : సీల్డ్ కవర్లో హైకోర్టుకు నివేదిక -
ఏపీలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్
-
నేనే చీఫ్ కమాండర్: సీఎం
నా ఆధ్వర్యంలోనే కమాండ్, కమ్యూనికేషన్ సెంటర్ పనిచేస్తుంది సాక్షి, అమరావతి: కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఇకపై కమాండ్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్‌గా మారుస్తామని, దీనికి తానే చీఫ్ కమాండర్‌గా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఇకపై ఈ సెంటర్ ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)లో భాగంగా ఉంటుందన్నారు. జిల్లా, డివిజన్ కేంద్రాల్లోనూ ఈ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అత్యవసర, సంక్షోభ సమయాల్లో మాత్రమేగాక రియల్‌టైమ్ గవర్నెన్స్‌కూ ఇవి ఉపయోగపడతాయన్నారు. విజయవాడలోని వెన్యూ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారుల రెండురోజుల సమావేశంలో మొదటిరోజైన బుధవారం ఆయన మాట్లాడారు. తమ పాలనలో నూటికి 80 శాతం మంది ఆనందంగా ఉండాలని, ఇందుకోసం అన్నిరకాల సర్టిఫికెట్లను రియల్‌టైమ్‌లో అవినీతి లేకుండా ఇవ్వాలని సీఎం సూచించారు. ఇకపై జరిగే కలెక్టర్ల సమావేశాలకు బ్యాంకర్లూ వస్తారని, రుణాలు ఎందుకివ్వరో అప్పుడే తేలుతుందని చెప్పారు. గతేడాది తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకన్నా ఆంధ్రప్రదేశ్ వృద్ధిరేటులో ముందుందని సీఎం చెప్పారు. కాగా, బ్యాంకుల నుంచి రైతుల తీసుకున్న రుణాల వసూలుకు ప్రభుత్వం ప్రత్యేక విధానం రూపొందిస్తుందని తెలిపారు. పనితీరులో తూర్పు, ప్రకాశం ఫస్ట్! ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో కనబరిచిన పనితీరు ఆధారంగా రాష్ట్రంలోని జిల్లాలను మూడు కేటగిరీలుగా విభజించి ప్రభుత్వం రేటింగ్‌లు ఇచ్చింది. ఇందులో తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలు మొదటి స్థానంలో ఉండగా శ్రీకాకుళం జిల్లా ఎప్పటి మాదిరిగానే ఆఖరి స్థానంలో నిలిచింది. కలెక్టర్ల సమావేశంలో ఈ వివరాలను ప్రణాళికా శాఖ విడుదల చేసింది.