వెంగళరావునగర్ (హైదరాబాద్): కోవిడ్ కంట్రోల్ కమాండ్ కేంద్రాల ద్వారా జిల్లాల వారీగా కోవిడ్ తీవ్రతను పర్యవేక్షణ చేసి తక్షణ నివారణ చర్యలు చేపట్టే అవకాశాలున్నాయని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్‌లోని కోవిడ్ కంట్రోల్ కమాండ్ కేంద్రాన్ని శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో గవర్నర్ మాట్లాడుతూ...కోవిడ్ కంట్రోల్ కమాండ్ సెంటర్ల ద్వారా రోగ తీవ్రత, బెడ్, ఆక్సిజన్ లభ్యతను ఎప్పటికప్పుడు మానిటర్ చేయవచ్చని పేర్కొన్నారు. ఐసీయూ బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, డెత్ రేషియో, రికవరీ శాతాన్ని ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో తెలుసుకోవడానికి ఇలాంటి కమాండ్ సెంటర్లు ఉపయోగపడతాయని చెప్పారు. కోవిడ్ కంట్రోల్ వార్ రూమ్ ఏర్పా టు ఆలోచన వచ్చినందుకు ప్రభుత్వాన్ని, అధికారులను ఆమె అభినందించారు.
చదవండి: Mariyamma Lockup Death : సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు నివేదిక
Comments
Please login to add a commentAdd a comment