commemoration day
-
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం-2023లో పాల్గొన్న సీఎం జగన్ (ఫోటోలు)
-
పోలీసులపైనా దాడులు చేశారు: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: సమాజం కోసం తన ప్రాణాన్ని బలిపెట్టడానికి సిద్ధపడిన యోధుడు పోలీస్. ఖాకీ డ్రెస్ అంటే త్యాగనీరతి అని. పోలీస్ ఉద్యోగం అనేది ఓ సవాల్.. బాధ్యత. అలాంటి పోలీస్ కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. శనివారం ఉదయం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన పాల్గొని.. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బందికి నివాళులర్పించారు. ‘‘అక్టోబర్ 21 పోలీస్ అమరుల సంస్మరణ దినం. గడిచిన 64 ఏళ్లుగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ త్యాగాలను స్మరించుకునే రోజు ఈరోజు. దేశప్రజలంతా మన పోలీసులను మనసులో సెల్యూట్ చేసే రోజు. ఈ రోజున అమరులైన పోలీసులందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నా అని సీఎం జగన్ ప్రసంగించారు. విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన పోలీస్ సోదరులకు ప్రభుత్వం అన్నివిధాలుగా తోడుగా ఉంటుందని ఆయన ఉద్ఘాటించారు. విధి నిర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. శాంతి భద్రతలను పరిరక్షించాలి. సాంకేతికతకు తగ్గట్లు అప్డేట్ కావాలి. అసాంఘీక శక్తులు చట్టాల్ని చేతుల్లోకి తీసుకోవాలనుకుంటాయి. అలాంటి వాటిని ఎప్పటికప్పుడు అణచి వేయాలి. అలాంటి దుర్మార్గుల విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా చట్టాన్ని అమలు చేయాలి. దుష్టశక్తులకు గుణపాఠం చెప్పకుంటే సమాజంలో రక్షణ ఉండదు. అంగళ్లులో ప్రతిపక్ష పార్టీ పోలీసులపై దాడులు చేయించింది. పుంగనూరులో ఘటనలో 40 మంది పోలీస్ సిబ్బందికి గాయలు అయ్యాయి. ఓ పోలీస్ కన్ను కోల్పోయారు. న్యాయమూర్తలుపైనా ట్రోలింగ్ చేస్తున్నారు. అలాంటి దుష్టశక్తుల విషయంలో కఠినంగా ఉండాలి అని పోలీసులకు సూచించారాయన. ఏపీలో పోలీస్ సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది.వైద్య, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ.. ఆరోగ్య భద్రత కల్పిస్తోంది. ఏపీతో పాటు హైదరాబాద్‌లో గుర్తించిన 283 ఆస్పత్రుల ద్వారా చికిత్స అందిస్తోంది. -
సమరం ముగిసి శతాబ్దం
పారిస్: మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి ఆదివారానికి ఒక శతాబ్దం పూర్తయిన సందర్భంగా ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ప్రపంచ దేశాల అధినేతలు కలిసి యుద్ధంలో చనిపోయిన సైనికులకు వర్షంలోనే ఘనంగా నివాళులు అర్పించారు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, టర్కీల అధ్యక్షులు వరుసగా డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్, ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌లు, రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్, జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, కెనడా, ఇజ్రాయెల్‌ల ప్రధానులు జస్టిన్ ట్రూడో, బెంజమిన్ నెతన్యాహు, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్, భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా మొత్తం 70 మంది నేతలు ఈ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిస్‌లోని చాంప్స్–ఎలైసెస్‌లో ఉన్న యుద్ధ స్మారకం ‘ఆర్క్ డి ట్రియంఫె’ వద్ద ఈ సంస్మరణ కార్యక్రమం సరిగ్గా ఉదయం 11 గంటలకు జరిగింది. మొదటి ప్రపంచ సమరం 1914 జూలై 28న ప్రారంభమై 1918 నవంబర్ 11న ఉదయం 11 గంటలకు ముగియడం తెలిసిందే. ఈ యుద్ధంలో పౌరులు, సైనికులు కలిసి 1.8 కోట్ల మంది మరణించగా రెండున్నర కోట్ల మందికి పైగానే గాయపడ్డారు. ఆదివారం మేక్రాన్ సారథ్యంలో దేశాధినేతలు ఆర్క్ డి ట్రియంఫె కింద ఉన్న ‘అన్నోన్ సోల్జర్ (గుర్తు తెలియని సైనికుడు)’ సమాధి వద్దకు కాలి నడకన వెళ్లారు. ఫ్రాన్స్ జాతీయగీతంతో ప్రారంభం నివాళి కార్యక్రమాన్ని ఫ్రాన్స్ జాతీయగీతం మార్సెల్లైసెను పాడి ప్రారంభించారు. ఫ్రాన్స్, దాని మిత్ర దేశాల నుంచి 3,400 మంది ప్రస్తుత, మాజీ సైనికులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ దేశాల సైనిక పాఠశాలల నుంచి పిల్లలు వచ్చి, మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణ త్యాగాలు చేసిన సైనికుల గాథలను చదివి వినిపించారు. అంతకుముందు ట్రంప్ చాంప్స్–ఎలైసెస్‌కు చేరుకుంటుండగా ఇద్దరు స్త్రీలు అర్ధనగ్నంగా వచ్చి ట్రంప్ వాహన శ్రేణికి అడ్డు తగిలి నిరసన తెలపగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరూ స్త్రీల హక్కుల సాధన కోసం పోరాడుతున్న ఫెమెన్ అనే బృందానికి చెందిన వారు. అనంతరం సంస్మరణ స్థలం వద్ద ట్రంప్, పుతిన్‌లు ఇద్దరూ కరచాలనం చేసుకుని పలకరించుకున్నారు. మెర్కెల్‌తోపాటు పలు ఇతర నేతలతో కూడా చేయి కలిపిన ట్రంప్.. ట్రూడోను మాత్రం పట్టించుకోలేదు. కొన్ని నెలల క్రితం ట్రూడోను ‘నిజాయితీ లేని, బలహీన వ్యక్తి’గా ట్రంప్ విమర్శించడం తెలిసిందే. జాతీయవాదం వెన్నుపోటు వంటిది ఈ సందర్భంగా ఫ్రాన్సు అధ్యక్షుడు మేక్రాన్ మాట్లాడుతూ..‘జాతీయవాదం వెన్నుపోటు వంటిది. మా ప్రయోజనాలే ముఖ్యం.. మాకు ఇతర దేశాల గురించి బాధ లేదు.. అనడం ద్వారా మన దేశాల గొప్పతనాన్ని, నైతిక విలువలను పోగొడుతున్నాం’ అంటూ పరోక్షంగా ట్రంప్ నుద్దేశించి వ్యాఖ్యానించారు. మోదీ నివాళి భారత్‌తోపాటు బ్రిటన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, మయన్మార్ తదితర దేశాల్లోనూ తొలి ప్రపంచ యుద్ధ సంస్మరణ కార్యక్రమాలు జరిగాయి. కామన్వెల్త్ దేశాల అధినేతలు శాంతి సందేశాలు ఇచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓ ట్వీట్ చేస్తూ ‘భారత్ ప్రత్యక్షంగా పాల్గొనని యుద్ధమిది. అయినా మన సైనికులు కేవలం శాంతి కోసమే ప్రపంచంలో చాలా చోట్ల పోరాడారు’ అని అన్నారు. ‘తొలి ప్రపంచ యుద్ధం ముగిసి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రపంచ దేశాలన్నీ సామరస్యం, సౌభ్రాతృత్వంతో మెలిగేలా కృషి చేసేందుకు, యుద్ధం వల్ల కలిగిన విధ్వంసం పునరావృతం కాకుండా చూసేందుకు కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేస్తున్నాం’ అని మోదీ తెలిపారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ కాన్బెర్రాలో మాట్లాడుతూ ‘మన రేపటి కోసం నాడు ఆ సైనికులు వారి ‘ఈ రోజు’ను త్యాగం చేశారు’ అన్నారు. లండన్‌లో రాణి ఎలిజబెత్, ప్రధాని థెరెసా మే తదితరులు వేలాది మందితో కలిసి యద్ధంలో చనిపోయిన పౌరులకు నివాళులర్పించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య కరచాలనం -
పోలీసు అమరులకు వందనం..
వరంగల్ క్రైం: విధి నిర్వహణలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు 64 మంది పోలీసులు అమరులయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రాణత్యాగాలు చేసిన వారి కోసం ఏటా పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 15 నుంచి 21 వరకు నిర్వహించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసుల పని తీరును ప్రజలు, యువత, విద్యార్థులకు తెలియజేసేందుకు ప్రతి పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ నిర్వహించనున్నారు. ట్రైసిటీగా పేరుగాంచిన వరంగల్, హన్మకొండ, కాజీపేటలో విద్యార్థుల కోసం పోలీసు కమిషనరేట్‌లోని రాణిరుద్రమ దేవి ప్రాంగణంలో ఓపెన్ హౌస్‌కు ఏర్పాట్లు చేశారు. పోలీసులువిధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాలతోపాటు బాంబు డిస్పోజల్, క్లూస్, ఫింగర్ ప్రింట్స్, డాగ్‌స్క్వాడ్, కమ్యూనికేషన్ విభాగాలకు సంబంధించిన స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులకు ప్రతిభా పోటీలు.. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా సోమవారం నుంచి 21వ తేదీ వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్ హౌస్ ప్రదర్శన కొనసాగేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా విద్యార్థులు, సిబ్బందికి వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నారుు. పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు ఈనెల 21న నిర్వహించే స్మృతి పరేడ్‌లో బహుమతులు అందజేయనున్నారు. రక్తదాన శిబిరాలు పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు కమిషనరేట్ పరిధిలోని డివిజన్ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఈ నెల 20న సాయంత్రం ఏడు గంటలకు హన్మకొండలోని అశోక జంక్షన్ నుంచి కమిషనరేట్ కార్యాలయం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించనున్నారు. 21న అమరవీరుల స్థూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించి పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడంతో వారోత్సవాలు ముగియనున్నాయి. విజయవంతం చేయాలి.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన పోలీసు అమరవీరులను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఓపెన్‌హౌస్, రక్తదాన శిబిరాలు, ప్రతిభా పోటీల్లో పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు, అధికారులు, ప్రజలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి. – డాక్టర్ విశ్వనాథ రవీందర్, వరంగల్ పోలీసు కమిషనర్ -
పోలీసుల త్యాగాలకు విలువ కట్టలేం
ఏలూరు అర్బన్ : నేటి సమాజ శాంతి సౌభాగ్యాలు నాటి పోలీసు అమరవీరుల త్యాగ ఫలమేనని, సమాజంలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులు చేస్తున్న త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర మంత్రి పీతల సుజాత అన్నారు. స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో శుక్రవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. మంత్రి ముఖ్య అతిథిగా హాజరై పోలీసు అమరవీరులకు ఘన నివాళులర్పించారు. పోలీసు అంటేనే ఒక ధైర్యమని, కంటిమీద కునుకు లేకుండా శాంతిభద్రతల రక్షణకు పాటు పడే మహావీరులు వారు అని కొనియాడారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రావాల్సిన రాయితీలు ఎప్పటికపుడు అందించడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ పోలీసులకు ఎవరిమీదా పగ ఉండదని, సంఘ విద్రోహశక్తులపైనే పీచమణచడంపైనే వారి దృష్టి ఉంటుందని అన్నారు. పోలీసు క్వార్టర్లలో పోలీసు కుటుంబాలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని పోలీసు అధికారులకు ఆయన సూచించారు. మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ పోలీసులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు. ఎస్పీ భాస్కర్ భూషణ్ మాట్లాడుతూ జన్మభూమిని రక్షించుకోవడంలో అనేక మంది జవానులు వీరమరణం పొందారని, వారు చేసిన ప్రాణత్యాగం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. ఈ సంవత్సరం 473 మంది పోలీసులు దేశంకోసం ప్రాణాలు అర్పించారని, వారందరికీ శతకోటి వందనాలు అంటూ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, కార్టూన్, పెయింటింగ్ వంటి పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లోని అమరవీరుల స్థూపం నుంచి ఆర్‌ఆర్‌పేట మీదుగా ఫైర్‌స్టేçÙన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఇన్చార్జి కలెక్టర్ పి.కోటేశ్వరరావు, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, పితాని సత్యనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు. -
పోలీసుల త్యాగాలకు విలువ కట్టలేం
ఏలూరు అర్బన్ : నేటి సమాజ శాంతి సౌభాగ్యాలు నాటి పోలీసు అమరవీరుల త్యాగ ఫలమేనని, సమాజంలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులు చేస్తున్న త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర మంత్రి పీతల సుజాత అన్నారు. స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో శుక్రవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. మంత్రి ముఖ్య అతిథిగా హాజరై పోలీసు అమరవీరులకు ఘన నివాళులర్పించారు. పోలీసు అంటేనే ఒక ధైర్యమని, కంటిమీద కునుకు లేకుండా శాంతిభద్రతల రక్షణకు పాటు పడే మహావీరులు వారు అని కొనియాడారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రావాల్సిన రాయితీలు ఎప్పటికపుడు అందించడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ పోలీసులకు ఎవరిమీదా పగ ఉండదని, సంఘ విద్రోహశక్తులపైనే పీచమణచడంపైనే వారి దృష్టి ఉంటుందని అన్నారు. పోలీసు క్వార్టర్లలో పోలీసు కుటుంబాలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని పోలీసు అధికారులకు ఆయన సూచించారు. మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ పోలీసులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు. ఎస్పీ భాస్కర్ భూషణ్ మాట్లాడుతూ జన్మభూమిని రక్షించుకోవడంలో అనేక మంది జవానులు వీరమరణం పొందారని, వారు చేసిన ప్రాణత్యాగం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. ఈ సంవత్సరం 473 మంది పోలీసులు దేశంకోసం ప్రాణాలు అర్పించారని, వారందరికీ శతకోటి వందనాలు అంటూ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, కార్టూన్, పెయింటింగ్ వంటి పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లోని అమరవీరుల స్థూపం నుంచి ఆర్‌ఆర్‌పేట మీదుగా ఫైర్‌స్టేçÙన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఇన్చార్జి కలెక్టర్ పి.కోటేశ్వరరావు, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, పితాని సత్యనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు. -
అమరవీరులారా..జోహార్
ఘన నివాళులర్పించిన పోలీస్‌శాఖ కాకినాడ క్రై ం : అంతర్గత, శాంతి భద్రతల కర్తవ్య నిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ ఆధ్వర్యంలో పోలీసులు ఘన నివాళులర్పించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, కాకినాడ నగర, గ్రామీణ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు), పిల్లి అనంతలక్ష్మి, జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ హాజరయ్యారు. పోలీసు అమరవీరుల ఆత్మశాంతిని కోరుతూ మౌనం పాటించారు. పుష్షగుచ్చాలతో అమరవీరుల స్థూపం వద్ధ శ్రద్ధాంజలి ఘటించారు. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల జాబితాను ఓఎస్డీ రవిశంకర్‌రెడ్డి చదివి వినిపించారు. అనంతరం అమర పోలీస్ కుటుంబ సభ్యులకు దుస్తులు, చీరలు అందించారు. పోలీస్ వారోత్సవాలను పురస్కరించుకు నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన, కార్టూ¯ŒS పోటీల్లో రాణించిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. అనంతరం జిల్లా కార్యాలయం నుంచి భానుగుడిసెంటర్ వరకూ పోలీసులు, శ్యామ్ ఇన్టిట్యూట్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఎస్బీ సీఐ శ్రీనివాసరావు, సీఐలు చైతన్య కష్ణ, వి.పవ¯ŒSకిషోర్, మురళీకష్ణారెడ్డి, తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.అనంతరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోలీస్ అమరవీరుల సమాచారాన్ని తెలిపే తూర్పు సింధూరం పుస్తకాన్ని వక్తలు ఆవిష్కరించారు. జిల్లా విజేతలు వీరే.. వ్యాసరచన, కార్టూ¯ŒS పోటీలో అమలాపురానికి చెందిన మహర్షి పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి ఎ¯ŒSఎస్‌డీఎ¯ŒS సాయినా«థ్ జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతిని గెలుచుకున్నాడు. చిత్రలేఖన పోటీలో సామర్లకోటకు చెందిన ప్రగతి పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని వై.రమ్యప్రియ ప్రథమ బహుమతి సాధించింది. ఎస్సైలకు నిర్వహించిన వ్యాసరచనలో సర్పవరం ఎసై డి.తమ్మినాయుడు ప్రథమ బహుమతి, కానిస్టేబుల్ విభాగంలో కిర్లంపూడి స్టేష¯ŒSకి చెందిన అబ్దుల్ దురానీ ప్రథమ బహుమతి సాధించారు. మృతవీరుల త్యాగాలు మరువలేనివి రాజమహేంద్రవరం క్రైం : కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ పోలీసులు విధి నిర్వహణలో చేసే త్యాగాలు మరువలేనివని రాజమహేంద్రవరం పోలీస్ అర్బ¯ŒS జిల్లా ఎస్పీ బి.రాజ కుమారి పేర్కొన్నారు. శుక్రవారం పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జాంపేట పోలీస్ పేరేడ్ గ్రౌండ్స్‌లో మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. ఈ నందర్భంగా నగరంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పౌరులంతా చట్టాలను గౌరవించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా జీవించడమే పోలీస్ అమర వీరులకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. విధి నిర్వహణలో నీతి, నిజాయితీ, నిబద్ధతతో పని చేయాలని సంఘంలో శాంతి భద్రతలు పరిరక్షించాలని పోలీసులకు సూచించారు. అనంతరం రాజమహేంద్రవరం నగర వీధుల్లో పోలీసులు భారీ ర్యాలీ నిర్వహించారు. కోటగుమ్మం సెంటర్లో ఏర్పాటు చేసిన అమర వీరుల స్థూపానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ సీసీసీ చానల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో రెండు కళ్లు దెబ్బతిని అంగవైకల్యంతో ఉన్న ఆత్మారావు అనే ఏఆర్ కానిస్టేబుల్‌ను ఎస్పీ రాజకుమారి, సీసీసీ చానల్ ఎండీ పంతం కొండల రావు, అడిషనల్ ఎస్పీ గంగాధరరావు, టి.కె. విశ్వేశ్వరరెడ్డి చేతులు మీదుగా సత్కరించారు. భారీ గజమాలను అమర వీరుల స్తూపానికి వేసి ఎస్పీ రాజ కుమారి, సీసీసీ చానల్ ఎండీ పంతం కొండలరావు నివాళులర్పించారు.