సాక్షి, విజయవాడ: సమాజం కోసం తన ప్రాణాన్ని బలిపెట్టడానికి సిద్ధపడిన యోధుడు పోలీస్. ఖాకీ డ్రెస్ అంటే త్యాగనీరతి అని. పోలీస్ ఉద్యోగం అనేది ఓ సవాల్.. బాధ్యత. అలాంటి పోలీస్ కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. శనివారం ఉదయం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన పాల్గొని.. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బందికి నివాళులర్పించారు.
‘‘అక్టోబర్ 21 పోలీస్ అమరుల సంస్మరణ దినం. గడిచిన 64 ఏళ్లుగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ త్యాగాలను స్మరించుకునే రోజు ఈరోజు. దేశప్రజలంతా మన పోలీసులను మనసులో సెల్యూట్ చేసే రోజు. ఈ రోజున అమరులైన పోలీసులందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నా అని సీఎం జగన్ ప్రసంగించారు. విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన పోలీస్ సోదరులకు ప్రభుత్వం అన్నివిధాలుగా తోడుగా ఉంటుందని ఆయన ఉద్ఘాటించారు.
విధి నిర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. శాంతి భద్రతలను పరిరక్షించాలి. సాంకేతికతకు తగ్గట్లు అప్‌డేట్ కావాలి. అసాంఘీక శక్తులు చట్టాల్ని చేతుల్లోకి తీసుకోవాలనుకుంటాయి. అలాంటి వాటిని ఎప్పటికప్పుడు అణచి వేయాలి. అలాంటి దుర్మార్గుల విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా చట్టాన్ని అమలు చేయాలి. దుష్టశక్తులకు గుణపాఠం చెప్పకుంటే సమాజంలో రక్షణ ఉండదు.
అంగళ్లులో ప్రతిపక్ష పార్టీ పోలీసులపై దాడులు చేయించింది. పుంగనూరులో ఘటనలో 40 మంది పోలీస్ సిబ్బందికి గాయలు అయ్యాయి. ఓ పోలీస్ కన్ను కోల్పోయారు. న్యాయమూర్తలుపైనా ట్రోలింగ్ చేస్తున్నారు. అలాంటి దుష్టశక్తుల విషయంలో కఠినంగా ఉండాలి అని పోలీసులకు సూచించారాయన.
ఏపీలో పోలీస్ సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది.వైద్య, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ.. ఆరోగ్య భద్రత కల్పిస్తోంది. ఏపీతో పాటు హైదరాబాద్‌లో గుర్తించిన 283 ఆస్పత్రుల ద్వారా చికిత్స అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment