Commemorative assembly
-
వాజ్‌పేయి దైవ దూత ; మెహబూబా ముఫ్తీ
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ ప్రజలకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి దైవ దూత అని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కొనియాడారు. సోమవారం ఢిల్లీలో జరిగిన వాజ్‌పేయి సంస్మరణ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాజ్‌పేయితో కశ్మీర్ ప్రజలకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘వాజ్‌పేయి గొప్ప మానవతావాది. ఆయన కశ్మీర్ ప్రజల కోసం ఎంతగానో శ్రమించారు. కశ్మీర్ ప్రజలను నమ్మిన తొలి భారత నాయకుడు వాజ్‌పేయి. అలాగే అక్కడి ప్రజలు నమ్మిన నాయకుడు కూడా ఆయనే. అతి కొద్ది కాలంలోనే వాజ్‌పేయి కశ్మీర్ ప్రజల మన్నలను అందుకున్నారని ఆమె తెలిపారు. అక్కడ ఎన్నికల స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా జరపడం ద్వారా ఆయన ప్రజలు అభిమానాన్ని గెలుచుకున్నార’ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఎల్కే అద్వానీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, యోగా గురు రామ్‌దేవ్, కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, ఇతర విపక్ష నేతలతో పాటు అటల్ బిహారి వాజ్‌పేయి దత్తపుత్రిక నమితా భట్టాచార్య, మనుమరాలు నీహారిక తదితరులు పాల్గొన్నారు. -
కార్టూనిస్టు మోహన్ సంస్మరణ సభ
-
సాహితీ లోకంలో అద్వితీయుడు... సినారె
బంజారాహిల్స్: జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, మహాకవి డాక్టర్ సి.నారాయణరెడ్డి ప్రపంచ తెలుగు సాహితీ లోకంలో అద్వితీయుడని పలువురు వక్తలు కొనియాడారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం మాజీ ఉప కులపతి సినారె సంస్మరణ సభ మంగళవారం వర్సిటీలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్ర సాహిత్యీ అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య ఎన్. గోపి, తెలుగు విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య కె.సీతారామారావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పల్లెల్లో వాడే భాష, మాండలికాలను తన సినీ పాటల రచనల్లో వాడి తెలంగాణ భాషను విశ్వ వ్యాప్తం చేశారన్నారు. సినారె జీవితం నేటి తరాలకు ఆదర్శనీయమన్నారు. ప్రబంధ సాహిత్యం, కావ్యరచన, ప్రాచీన కవిత్వం, జానపదం, గజల్స్, ప్రజల యాస..ఇలా ఏం రాసినా అది గొప్ప ప్రాచుర్యాన్ని పొందిందని కీర్తించారు. అంబేద్కర్ వర్సిటీ వ్యాప్తి, మౌలిక వసతుల కల్పనలో ఆయన దూర దృష్టి మర్చిపోలేనిదన్నారు.