comments on reporter
-
‘చంద్రబాబు రాజకీయ జీవితమంతా కుట్రలు, కుతంత్రాలే’
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధిని ఎలాగైనా అడ్డుకోవాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. విశాఖలో రెండోరోజు కొనసాగుతున్న జనాగ్రహ దీక్షలో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయ జీవితమంతా కుట్రలు, కుతంత్రాలతో కూడుకున్నదని విమర్శించారు. సొంత మామను వెన్నుపోటు పొడిచిన చరిత్ర బాబుదన్నారు. తమ ప్రభుత్వం పార్టీలు, కులమతాలకతీతంగా పథకాలు అమలు చేస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహేతుకంగా ఉండాలి: విజయసాయిరెడ్డి ఏపీలో టీడీపీ వెంటిలేటర్‌పై ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో టీడీపీ పాలన ఎలా ఉండేదో ప్రజలకు తెలుసని అన్నారు. 2019 నుంచి ప్రతి ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైందని అన్నారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్నారని అన్నారు. లోకేష్ ట్విట్టర్లో అసభ్య పదజాలాన్ని వాడుతున్నారని మండిపడ్డారు. ప్రతి పక్షం ప్రజా సమస్యలపై పోరాడాలి కానీ అసభ్యంగా దూషించడం సరికాదని ఎంపీ విజయసాయిరెడ్డి హితవు పలికారు. చదవండి: ఏపీలో ఉవ్వెత్తున జనాగ్రహ దీక్షలు -
'క్రిస్ గేల్‌ను ప్రపంచవ్యాప్తంగా నిషేధించండి'
బిగ్‌బాష్ లీగ్ మ్యాచ్ సందర్భంగా టీవీ జర్నలిస్టు మెల్ మెక్‌లాలిన్‌తో అసభ్యంగా మాట్లాడిన వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్‌పై ప్రపంచవ్యాప్తంగా నిషేధం విధించాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్ డిమాండ్ చేశాడు. ఈ మేరకు ఒక ప్రతిపాదన చేయాలని క్రికెట్ ఆస్ట్రేలియాను కోరాడు. గేల్ ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని, దానిపై సహనంతో ఉండాల్సిన అవసరం లేదని చాపెల్ అన్నాడు. ఆస్ట్రేలియాలోని ఏ క్లబ్బూ అతడితో ఇక కాంట్రాక్టు కుదుర్చుకోకూడదని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయిస్తే తనకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని, అలాగే ఐసీసీకి ఈ మేరకు లేఖ రాసినా పర్వాలేదని తెలిపాడు. లేని పక్షంలో విడివిడిగా అన్ని దేశాలకు ఈ విషయం చెప్పాలని కోరాడు. గేల్‌కు ఇప్పటికే రూ. 6.66 లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే. బీబీఎల్ తదుపరి సీజన్లో తాను ఆడే అవకాశం ఉండొచ్చని గేల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. మెక్‌లాలిన్‌తో తాను కేవలం జోక్ చేశాను తప్ప అంతకంటే ఏమీ అనలేదంటూ క్షమాపణలు చెప్పాడు. అయితే.. క్రిస్‌గేల్ తరచు ఇలా చేస్తూనే ఉంటాడని, అందువల్ల అతడిపై ప్రపంచవ్యాప్త నిషేధం విధిస్తే అది యువ క్రికెటర్లకు గట్టి సందేశం పంపినట్లు అవుతుందని చాపెల్ అన్నాడు. కేవలం రూ. 6 లక్షల జరిమానాతో సరిపెడితే సరిపోదని అభిప్రాయపడ్డాడు. గేల్ గురించి తాను ఏ మహిళతో మాట్లాడినా ఒకేలాంటి సమాధానం వచ్చిందని, అందరూ అతడిపై నిషేధం విధించాలనే అడిగారని చెప్పాడు.