Commercial Production
-
రూ.61,127 కోట్ల పెట్టుబడులు రాక
సాక్షి, అమరావతి: పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తేవడంతోపాటు కొత్తగా ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రపథంలో దూసుకెళుతోంది. పారిశ్రామికంగా ఇప్పటికే అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడుతూ ఏపీ భారీగా పెట్టుబడులను ఆకర్షించినట్లు డిపార్ట్మెంట్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) తాజా గణాంకాలు వెల్లడించాయి. 2021 నుంచి 2023 ఏప్రిల్ వరకు 28 నెలల్లో రాష్ట్రంలో 108 యూనిట్లు వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా రూ.61,127 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చినట్లు డీపీఐఐటీ విడుదల చేసిన ఇండ్రస్టియల్ ఎంటర్ప్రెన్యూర్ మెమోరాండం– ఇంప్లిమెంటేషన్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2022లో కొత్తగా 46 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా రూ.45,217 కోట్ల పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తెచ్చి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు 15 యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించడం ద్వారా రూ.5,560 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సులో కుదిరిన రూ.13.11 లక్షల కోట్ల ఒప్పందాలను వేగంగా వాస్తవ రూపంలోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తూ అనుమతులు మంజూరు చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ‘సాక్షి’కి వివరించారు. జీఐఎస్ ఒప్పందాల్లో రూ.1,35,362 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 111 యూనిట్లు ఆరు నెలల్లోనే అమలులోకి వచ్చాయని, డీపీఐఐటీ విడుదల చేసే తదుపరి గణాంకాల్లో ఇవి ప్రతిబింబిస్తాయని అధికారులు తెలిపారు. జోరుగా పార్ట్ ఏ దరఖాస్తులు గత 28 నెలల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా రూ.32,697 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు 121 సంస్థలు ‘ఐఈఎం పార్ట్ ఏ’ సమర్పించినట్లు డీపీఐఐటీ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వంతో పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకుని డీపీఆర్ ఆమోదం, భూ కేటాయింపులు పూర్తై నిర్మాణ పనులు ప్రారంభించే యూనిట్లు పార్ట్ ఏ డీపీఐఐటీకి దరఖాస్తు చేస్తాయి. జీఐఎస్ ఒప్పందాల్లో రూ.3.06 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు భూ కేటాయింపు దశల్లో ఉండగా ఇవి కూడా త్వరలో పార్ట్ ఏకు దరఖాస్తు చేసుకోనున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు కొత్తగా రూ.7,187 కోట్ల విలువైన 20 ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నట్లు పార్ట్ ఏ సమర్పించాయి. ఈ పెట్టుబడుల ప్రతిపాదనల వల్ల లక్షలాది మందికి ఉపాధి లభించనుందని అధికారులు తెలిపారు. -
వాణిజ్య ఉత్పత్తికి సిద్ధమైన వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్
-
‘నెపా’ మళ్లీ షురూ: ఉద్యోగాలపై కోటి ఆశలు
నెపానగర్ (మధ్యప్రదేశ్): ప్రభుత్వరంగ న్యూస్ ప్రింట్ తయారీ సంస్థ అయిన ‘నెపా లిమిటెడ్’ ఆరేళ్ల విరామం తర్వాత తయారీ కార్యకలాపాలను మంగళవారం ప్రారంభించింది. తయారీ సామర్థ్యాన్ని లక్ష టన్నులకు (వార్షిక) పెంచింది. భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే దీన్ని ప్రారంభించారు. సంవత్సరానికి 1 లక్ష టన్నుల మెరుగైన ఉత్పత్తి సామర్థ్యంతో పునఃప్రారంభం కానున్న ఈ కేంద్రం పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని, దీంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. న్యూస్‌ప్రింట్‌లో దేశ స్వయం సమృద్ధికి ఈ ప్లాంట్ దోహదపడుతుందని చెప్పారు. 2018 అక్టోబర్‌లో రూ.469 కోట్లతో ఈ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.395 కోట్ల టర్నోవర్ సాధిస్తామని నెపా చైర్మన్, ఎండీ సౌరభ్దేవ్ తెలిపారు. 2023–24లో రూ.554 కోట్ల టర్నోవర్‌ను చేరుకుంటామన్నారు. మూతబడడానికి ముందు 2015-16లో నెపా టర్నోవర్ రూ.72 కోట్లుగా ఉంది. న్యూస్‌ప్రింట్‌తో పాటు రైటింగ్, ప్రింటింగ్ పేపర్ ముద్రించడంలో కూడా విస్తరించాలని యోచిస్తోంది. కాగా వాణిజ్య ఉత్పత్తి ప్రారంభంతో 1956 ఏప్రిల్ 26న, భారతదేశ మొదటి ప్రధానమంత్రి దివంగత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఈ మిల్లును జాతికి అంకితం చేశారు. అయితే 2016లో మూతపడింది. -
కోల్‌మైనింగ్‌లో కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. బొగ్గుగనుల తవ్వకాల్లో ప్రయివేటు కంపెనీల ఎంట్రీకి ఆమోదం తెలుపుతూ నాలుగుదశాబ్దాల్లో మొదటిసారి నిర్ణయం తీసుకుంది. దేశంలో బొగ్గు గనుల తవ్వకాల వేలంలో పాల్గొనేందుకు ప్రయివేటు సంస్థలకు అనుమతినికి కేంద్ర క్యాబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మైనింగ్ అండ్ మినరల్స్ (డెవెలప్మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్, 1957ను ఆమోదిచినట్టు కేంద్ర, రైల్వే, బొగ్గు శాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. తద్వారా తక్కువ ధరకే విద్యుత్ లభించనుందని చెప్పారు. తద్వారా బొగ్గు తవ్వకాల్లో కమర్షియల్ మైనింగ్‌కు గేట్లు తెరిచింది క్యాబినెట్ భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయంతో ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియాకు భారీ ప్రయోజనం కలగనుందన్నారు. అలాగే కోల్ ఇండియాలో పనితీరును, సామర్థ్యాన్ని మెరుగుపర్చడానికి ప్రైవేటు రంగాల పోటీ దోహదపడుతుందని చెప్పారు. ఒడిషా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్గడ్ వంటి వెనుకబడిన రాష్ట్రాల్లో అనేక ఉద్యోగాల కల్పనతోపాటు ఆదాయం పెరగనుందన్నారు. ఈ నిర్ణయం క్లీన్ కోల్ ఉత్పత్తికి కూడా దోహదపడుతుందన్నారు. పారదర్శకంగా ఇ-బిడ్డింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. బొగ్గు గనుల వేలం వాణిజ్య మైనింగ్‌కు అనుమతినివ్వడం చాలామంచి, ప్రోత్సాహకరమైన చర్యగా వేదాంత ప్రతినిది అనిల్ అగర్వాల్ అభివర్ణించారు. ఇది అసాధారణ అవకాశమని పేర్కొన్నారు. మరోవైపు అసోసియేషన్ ఆఫ్ పవర్ ప్రొడ్యూసర్స్ ఈ విధానాన్ని స్వాగతించింది. అయితే ప్రభుత్వం కఠినమైన నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. కాగా భారతదేశ విద్యుత్ ఉత్పాదనలో 70శాతం బొగ్గుదే. ఈ నేపథ్యంలో దేశంలో 2022 నాటికి 1 బిలియన్ టన్నుల ఉత్పత్తిని కేంద్రం టార్గెట్‌గా పెట్టుకుంది. మరోవైపు ఈ ప్రకటనతో స్టాక్మార్కెట్లో కోల్ ఇండియా, వేదాంత తదితర షేర్లు భారీ లాభాల నార్జిస్తున్నాయి. -
27న ‘కృష్ణపట్నం’ జాతికి అంకితం
సాక్షి, హైదరాబాద్: నెల్లూరు జిల్లాలోని దామోదరం సంజీవయ్య విద్యుత్ కేంద్రాన్ని(కృష్ణపట్నం) ఈ నెల 27న జాతికి అంకితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు ఆవరణలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యంతో కృష్ణపట్నంలో 2 థర్మల్ యూనిట్లను నెలకొల్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు ఇటీవలే వాణిజ్య ఉత్పత్తిలోకి అడుగు పెట్టింది.