సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. బొగ్గుగనుల తవ్వకాల్లో ప్రయివేటు కంపెనీల ఎంట్రీకి ఆమోదం తెలుపుతూ నాలుగుదశాబ్దాల్లో మొదటిసారి నిర్ణయం తీసుకుంది. దేశంలో బొగ్గు గనుల తవ్వకాల వేలంలో పాల్గొనేందుకు ప్రయివేటు సంస్థలకు అనుమతినికి కేంద్ర క్యాబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మైనింగ్ అండ్ మినరల్స్ (డెవెలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్, 1957ను ఆమోదిచినట్టు కేంద్ర, రైల్వే, బొగ్గు శాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. తద్వారా తక్కువ ధరకే విద్యుత్ లభించనుందని చెప్పారు. తద్వారా బొగ్గు తవ్వకాల్లో కమర్షియల్ మైనింగ్‌కు గేట్లు తెరిచింది
క్యాబినెట్ భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయంతో ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియాకు భారీ ప్రయోజనం కలగనుందన్నారు. అలాగే కోల్ ఇండియాలో పనితీరును, సామర్థ్యాన్ని మెరుగుపర్చడానికి ప్రైవేటు రంగాల పోటీ దోహదపడుతుందని చెప్పారు. ఒడిషా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గడ్ వంటి వెనుకబడిన రాష్ట్రాల్లో అనేక ఉద్యోగాల కల్పనతోపాటు ఆదాయం పెరగనుందన్నారు. ఈ నిర్ణయం క్లీన్ కోల్ ఉత్పత్తికి కూడా దోహదపడుతుందన్నారు. పారదర్శకంగా ఇ-బిడ్డింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
బొగ్గు గనుల వేలం వాణిజ్య మైనింగ్‌కు అనుమతినివ్వడం చాలామంచి, ప్రోత్సాహకరమైన చర్యగా వేదాంత ప్రతినిది అనిల్ అగర్వాల్ అభివర్ణించారు. ఇది అసాధారణ అవకాశమని పేర్కొన్నారు. మరోవైపు అసోసియేషన్ ఆఫ్ పవర్ ప్రొడ్యూసర్స్ ఈ విధానాన్ని స్వాగతించింది. అయితే ప్రభుత్వం కఠినమైన నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. కాగా భారతదేశ విద్యుత్ ఉత్పాదనలో 70శాతం బొగ్గుదే. ఈ నేపథ్యంలో దేశంలో 2022 నాటికి 1 బిలియన్ టన్నుల ఉత్పత్తిని కేంద్రం టార్గెట్‌గా పెట్టుకుంది. మరోవైపు ఈ ప్రకటనతో స్టాక్‌మార్కెట్‌లో కోల్ ఇండియా, వేదాంత తదితర షేర్లు భారీ లాభాల నార్జిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment