రూ. 12 కోట్లతో చెక్‌పోస్టులు ఆధునీకరణ: తలసాని
హైదరాబాద్ : గతేదాడి తమ శాఖ 22,940 కోట్లు వసూలు చేసిందని తెలంగాణ వాణిజ్య పన్నులు శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. మంగళవారం తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో తలసాని సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. వచ్చే ఏడాది రూ. 30 వేల కోట్లు వసూలు చేయడమే తమ శాఖ లక్ష్యంగా చేసుకుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 14 కమర్షియల్ ట్యాక్స్ చెక్ పోస్టులు ఉన్నాయిని... తలసాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వాటిని రూ. 12 కోట్లతో ఆధునీకరిస్తామని స్పష్టం చేశారు.