పందులు తరలిస్తాం
అనంతపురం న్యూసిటీ : విషజ్వరాలకు పందులు కారణమవుతున్నందున యుద్ధప్రాతిపదికన నగరం నుంచి వాటిని వెలుపలకు తరలిస్తున్నట్లు కమిషనర్ చల్లా ఓబులేసు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. డెంగీతో వినాయకనగర్‌లో ఇద్దరు చిన్నారులు మతి చెందారన్నారు.
ఇటువంటి సంఘటనలు పునరావతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పందులు ఎక్కడైనా కన్పిస్తే శానిటేషన్ సూపర్వైజర్ గంగిరెడ్డి(9849907873)కి ఫోన్ చేయాలన్నారు.