committee meetings
-
అభివృద్ధి కోసమే అధ్యయనం
విజయవాడ సిటీ: బీసీ వర్గాల ప్రజల అభివృద్ధి కోసమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అధ్యయనం కమిటీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. బీసీల జీవనప్రమాణాలు పెంచేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై జరుగుతున్న బీసీ అధ్యయన కమిటీ సమావేశాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ ఆధ్వర్యంలో విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని బీసీ వర్గాలకు సంబంధించిన వివిధ కులాల ప్రజ సంఘాలు, మేధావులు, పెద్దలతో సంప్రదింపులు జరిపి వారినుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలన్న పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జంగా కృష్ణమూర్తి అధ్యక్షతన బీసీ అ«ధ్య యన కమిటీ నియమించారు. ఇందులో భాగంగా వివిధ కుల సంఘాలతో బీసీ అధ్యాయన కమిటీ సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ మేరకు తొలి రోజున రజక మేధావులతో సమావేశం నిర్వహించగా, 13 జిల్లాల నుంచి రజక నేతలు, ఉద్యోగులు, మేధావులు, మహిళలు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశంలో తొలుత మహాత్మా జ్యోతిరావుపూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. సమస్యల పరిష్కారానికి కృషి జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ, పార్టీలకతీతంగా వెనుకబడిన కులాల నుంచి వారి వెనుబాటుతనాన్ని పోగొట్టేందుకు అవసరమైన చర్యలు, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయపరంగా ముందుకు తీసుకెళ్లాలనే కార్యక్రమంలో భాగంగా బీసీ అధ్యాయన కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వైఎస్సార్ సీపీ మచిలీప్నటం జిల్లా అధ్యక్షుడు కె.పార్థసారథి మాట్లాడుతూ రజకులు సమాజంలో అన్ని వర్గాల ప్రజలతో మమేకమైన ఎంతో సేవ చేస్తున్నారని అన్నారు. రజకులను రాజకీయంగా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎంఎల్సీ స్థానాన్ని కేటాయిస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. సమావేశంలో అఖిలభారత రజక సంఘం ప్రధాన కార్యదర్శి జూపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, దేశంలో 17 రాష్ట్రాల్లో, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటికే రజకులు ఎస్సీలుగా ఉన్నారని, 12 రాష్ట్రాల్లో మాత్రం ఎస్సీలుగా గుర్తించకపోవడం వల్ల శోచనీయమన్నారు. అందులో ఆంధ్రప్రదేశ్‌లో రజకులు వారి కుటుంబాలు నష్టపోతున్నారన్నారు. రజకుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ లింగమయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 72 సంవత్సరాలుగా రజకులను ఎస్సీలుగా చేరుస్తామనే వాగ్దానం నెరవేర్చడం లేదన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీల్లో చేరుస్తామని ప్రయత్నిస్తున్న సమయంలో దురదృష్టవశాత్తు మృతి చెందారన్నారు. రజకులను ఎస్సీల్లో చేర్చారలనే చిరకాల వాంఛను వైఎస్ జగన్ నెరవేర్చాలని కోరారు. కడప జిల్లాకు చెందిన పన్నీట కాశియ్య మాట్లాడుతూ, రాజధానిలో రజక భవన్ నిర్మించాలని, అదేవిధంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కమ్యూనిటీ హాల్స్ నిర్మించాలన్నారు. కర్నూలుకు చెందిన రజక నేత రాంబాబు మాట్లాడుతూ, ఇస్త్రీ పెట్టెలు, ధోబీఘాట్లు రజకులకు ఇక ఏ మాత్రం అవసరం లేదని, వారికి కావల్సింది తమను ఇతర రాష్ట్రాలల్లో మాదిరిగా ఎస్సీల్లో చేర్చాలన్నారు. ఏపీ రజక సంఘాల ఐక్యవేదిక నాయకురాలు దుర్గంపాటి పద్మజ మాట్లాడుతూ, రజక మహిళలను వేధింపుల నుంచి రక్షణకు అట్రాసిటీ చట్టం అవసరమన్నారు. ఎన్నికల అనంతరం అసెంబ్లీలో తొలి బిల్లు రజకులను ఎస్సీల్లో చేరుస్తూ ప్రవేశపెట్టే బిల్లు కావాలన్నారు. రజక అభివృద్ధి సంస్థ చిత్తూరు జిల్లా నేత బొమ్మగుంట రవి మాట్లాడుతూ, వైఎస్ జగన్ ఇచ్చిన మాటపై నిలబడే నేత కాబట్టి రజకుల అభివృద్ధికి పోరాడతారనే నమ్మకం ఉందన్నారు. రజక అభివృద్ధి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమ్మన్న మాట్లాడుతూ, రజకులను ఎస్సీల్లో చేరుస్తామని మేనిఫెస్టోలో పెట్టాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి బీసీ అధ్యయన కమిటీ సభ్యుడు నర్సిగౌడ్ మాట్లాడుతూ, రజక నేతలు చెప్పిన అన్ని అంశాలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే అమలుకు కృషి చేస్తామన్నారు. కమిటీ మరో సభ్యుడు మీసాల రంగన్న మాట్లాడుతూ, బీసీల్లో అన్ని కులాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ బీసీ అధ్యాయన కమిటీని ఏర్పాటు చేశారన్నారు. వివి ధ జిల్లాల నుంచి వచ్చిన వందలాది మంది రజక సంఘ నేతలు వినతిపత్రాలను, సలహాలు, సూచనలు అధ్యయన కమిటీకి అందజేశారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ కేంద్ర కమిటీ కో–ఆర్డినేటర్ కర్నాటి ప్రభాకర్, పార్టీ విజయవాడ పార్లమెంట్ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు కసగోని దుర్గారావు, రజక సంఘాల ఐక్యవేదిక సభ్యుడు అంజిబాబు, రజక రిజర్వేషన్ పోరాట సమితి నేత పొటికలపూడి జయరామ్, బీసీసెల్ నేతలు బొమ్మి శ్రీనివాసరావు, అవ్వారు ముసలయ్య పాల్గొన్నారు. -
‘డబుల్’ కష్టాలు
డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం పేదల నుంచి పోటెత్తుతున్న దరఖాస్తులు ♦ వాటిని పరిష్కరించలేక తలలు పట్టుకున్న అధికారులు ♦ ఇప్పటిదాకా జరగని కమిటీ సమావేశాలు ♦ అన్ని నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు చేసేసిన ఎమ్మెల్యేలు సాక్షి, నెట్వర్క్: సొంతిల్లు ఓ కల.. ఆ కలను సాకారం చేస్తామని, గతంలో మాదిరిగా కాకుండా డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటనలతో నిరుపేదల ప్రజల్లో ఆశలు ఒక్కసారిగా రేగాయి. రెండు పడక గదుల ఇళ్ల కోసం పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాల్లో ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు వచ్చిపడ్డాయి. ఇప్పుడు వాటిని ఎలా పరిష్కరించాలో తెలియక అధికారులు తలలు పట్టుకున్నారు! ఏమీ లేకముందే శంకుస్థాపనలు సాధారణంగా ఏ పథకమైనా.. అన్ని సిద్ధం చేశాక శంకుస్థాపనలు చేయడం ఆనవాయితీ. కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో అందుకు పూర్తి భిన్నంగా జరిగింది. లబ్ధిదారులు లేరు. స్థలాలు, నిధులు లేవు. కానీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు జరిగిపోయాయి. దసరా రోజు సీఎం చంద్రశేఖర్‌రావు స్వయంగా సూర్యాపేటలో శంకుస్థాపన చేయగా.. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు శంకుస్థాపనలు చేశారు. లబ్ధిదారుల్ని ఎలా ఎంపిక చేయాలి? దరఖాస్తులు ఎలా తీసుకోవాలి? ఇళ్ల నిర్మాణానికి స్థలాలు ఎక్కడున్నాయన్న అంశాలను పరిగణలోకి తీసుకోకముందే.. శంకుస్థాపనలు చేశారు. దీంతో ఇళ్ల నిర్మాణం వెంటనే ప్రారంభం అవుతుందన్న ఆశ తో ప్రజలు సర్కారీ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ దరఖాస్తులు చేసుకోవడం ప్రారంభించారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 400 ఇళ్ల నిర్మాణం చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. సీఎం స్వయంగా కొన్ని పట్టణాలకు అదనపు ఇళ్లు నిర్మిస్తామని కూడా ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రచారం కూడా జనంపై విపరీతమైన ప్రభావం చూపించింది. మురికివాడల్లో నివసించేవారు సొంతగూడుపై ఆశతో కలెక్టర్ కార్యాలయాలకు పోటెత్తారు. చివరికి విపరీతమైన రద్దీ ఏర్పడడంతో ఎవరూ కలెక్టరేట్‌కు రావొద్దని, మీ-సేవ కేంద్రాల ద్వారా పంపించాలని అధికారులు విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది. కమిటీ సమావేశాలేవీ..? డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి, లబ్ధిదారుల ఎంపికకు కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని అందులో అధికారులు, ప్రజాప్రతినిధులు సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇప్పటిదాకా ఈ కమిటీల సమావేశాలు జరగలేదు. సీఎం దత్తత తీసుకున్న గ్రామాలు, ఆయన సొంత నియోజకవర్గంలో తప్ప ఇతరచోట ఈ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కానేలేదు. కరీంనగర్ జిల్లా ముల్కనూర్‌లో దాదాపు 200 ఇళ్లను నిర్మిస్తామని ప్రకటించడంతో.. అక్కడి ప్రజలు ఉన్న ఇళ్లను కూల్చేసుకుని, రేకుల షెడ్లలో నివాసం ఉంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం కొన్ని జిల్లాల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తే.. రాష్ట్ర రాజధాని నగరంలో మాత్రం ఏకంగా 4.5 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలో అధికారులు దరఖాస్తులు తీసుకోనేలేదని సమాచారం. ఎన్నికలు జరగాల్సి ఉన్న వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం 582 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. పైరవీలతో అన్యాయం చేశారు బ్యాండ్ వాయించుకుని బతికే నిరుపేదను. నా భార్య పేరిట డబుల్‌బెడ్ రూం ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్న. అధికారులు సర్వే చేసి అర్హుల జాబితాలో చేర్చారు. గ్రామానికి 15 ఇళ్లు మంజూరైతే అందులో ఎస్సీలకు 10, బీసీలకు 4, ఒకటి మైనార్టీకి కేటాయించారు. అర్హత జాబితాలో లేని మరో నలుగురికి ఇళ్లు మంజూరు చేశారు. నా భార్య పేరును తొలగించారు. రాజకీయ నాయకుల పైరవీ లతో మాకు అన్యాయం చేశారు. న్యాయం చేయాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన. - వడ్కాపురం రాజయ్య, కరీంనగర్ జిల్లా వెల్గటూర్ మండలం పడకల్ ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో తెలియడం లేదు ప్రభుత్వం ఇస్తున్న డబుల్బెడ్రూం ఇళ్లకు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో తెలియడం లేదు. గతంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. కానీ స్థలం లేకపోవడంతో నిర్మించుకోలేదు. ఇప్పడైనా ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలి. మాలాంటి వాళ్లకు గూడు కల్పించాలి. - బిరుదు లచ్చమ్మ, గౌరారం, తెలకపల్లి, మహబూబ్‌నగర్ గుడిసెలోనే ఉంటున్నాం ఇప్పటి వరకు నాకు ఇల్లు మంజూరు కాలేదు. గతంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. కానీ జాగా లేక ఇల్లు కట్టుకోలేదు. ఇప్పుడైనా కేసీఆర్ ఇల్లు కట్టిస్తాడని ఆశగా ఎదురుచూస్తున్నా. - ఎరుకల నర్సమ్మ, వెల్దుర్తి, మెదక్ -
నేటి నుంచి సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు
‘తెలంగాణకు దిశానిర్దేశం’పై చర్చ పొత్తులు, ఎత్తులపై అంతర్మథనం సాక్షి, హైదరాబాద్: భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) కేంద్ర కమిటీ సమావేశాలు నేటి(సోమవారం) నుంచి మూడురోజులపాటు హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు కూకట్పల్లి సమీపంలోని ప్రగతినగర్ లో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, పొలిట్ బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి, బీవీ రాఘవులు, త్రిపుర సీఎం మాణిక్ సర్కార్, తెలంగాణ నుంచి తమ్మినేని వీరభద్రం, ఎస్.వీరయ్య, ఆంధ్రా నుంచి పి,మధు, ఎంఏ గఫూర్, పుణ్యవతి, వి.శ్రీనివాసరావుతో సహా దాదాపు 80 మంది కేంద్రకమిటీ సభ్యులు ఈ భేటీలో పాల్గొంటారు. ఏప్రిల్ 14-19 తేదీల మధ్య విశాఖపట్టణంలో ఆ పార్టీ జాతీయమహాసభలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడిం ది. దక్షిణాదిన పార్టీని బలోపేతం చేసుకోవడంలో భాగంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సీపీఎం భావి స్తోంది. రాజకీయ తీర్మానం, అంతర్గత నిర్మాణం, కొత్త తెలంగాణకు దిశానిర్దేశంపై డాక్యుమెంట్లను ఆమోదిస్తారు. బూర్జువా పార్టీలతో పొత్తు వల్ల పార్టీకి ఏ విధంగా నష్టం జరిగింది.. అందుకు భిన్నంగా ఎటువంటి విధానాలను అనుసరించాలనే దానిపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రగతిశీలశక్తులతో ఫ్రంట్: తమ్మినేని వామపక్ష, ప్రగతిశీలశక్తులు, దళిత, బీసీ, అభ్యుదయవాదులను కలుపుకుని ప్రజాతంత్ర ఫ్రంట్ ఏర్పాటునకు కృషి చేయనున్నట్లు సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి ఈ ఫ్రంట్ రాజకీయ ప్రత్యామ్నాయం గా ముందుకురానున్నట్టు చెప్పారు.