communal marriages
-
కల్యాణ వైభోగమే..
డి.హీరేహాళ్ : గొడిశలపల్లిలో సీతారాముల కల్యాణోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు రామన్న తనయుడు హనుమంతరెడ్డి 16 జంటలకు ఆంజనేయస్వామి ఆలయం వద్ద సామూహిక వివాహాలు నిర్వహించారు. హనుమంతరెడ్డి నూతన వధూవరులకు పెళ్లి వస్త్రాలతో పాటు మంగళ సూత్రాలను అందించారు. కర్ణాటకలోని కురుగోడు మాజీ శాసనసభ్యులు సూర్యనారాయణరెడ్డి తనయుడు భరత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వివాహాలకు హాజరైన వధూవరుల బందువులకు భోజన వసతి కల్పించారు. కార్యక్రమానికి తహసీల్దార్ మారుతి, టీడీపీ నాయకులు ఆనందరెడ్డి, మోహనరెడ్డి, అంగడి రాజశేఖర్, మాజీ ఎంపీపీ పుష్పావతి, మహాబలిలతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు హాజరయ్యారు. -
నీలకంఠాపురంలో సామూహిక వివాహాలు
మడకశిర : మండలంలోని నీలకంఠాపురంలో గురువారం పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో 30 జంటలకు ఉచిత సామూహిక వివాహాలు చేశారు. హాజరైన వారందరికీ భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. గ్రామంలోని శ్రీనీలకంఠేశ్వరస్వామి సన్నిధిలో ఉదయం 8గంటలకు కర్నాటక రాష్ట్రం శిర తాలూకా పట్టనాయకనహళ్ళి శ్రీ నంజావధూతస్వామి ఆశీస్సులతో ఈ వివాహాలు జరిపించారు. ప్రతి ఏడాదీ శ్రీరామనవమి సందర్భంగా రఘువీరారెడ్డి కుటుంబసభ్యులు 1982 నుంచి క్రమం తప్పకుండా సామూహిక వివాహాలు చేయిస్తున్నారు. వధూవరులకు తాళిబొట్లు, కొత్త బట్టలు, కాలిమెట్టెలు తదితర పెళ్లి సామగ్రిని ఉచితంగా అందిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కోటాసత్యం, స్థానిక మాజీ ఎమ్మెల్యే కె.సుధాకర్, పెనుకొండ కాంగ్రెస్ ఇన్చార్జ్ కేటీ శ్రీధర్, పీసీసీ చీఫ్ సోదరుడు చెలువమూర్తి, అనిల్‌కుమార్, స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎస్ ప్రభాకర్‌రెడ్డి, బచ్చలయ్యపాళ్యం నరసింహమూర్తి, నాగేంద్ర, మంజునాథ్, మందలపల్లి నాగరాజు, విశ్వనాథ్‌గుప్త తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా సామూహిక వివాహాలు
– ఒక్కటైన 55 జంటలు –తరలివచ్చిన అశేష జనవాహిని కొత్తచెరువు : వైఎస్సార్సీపీ నేత, కొత్తచెరువు సర్పంచ్ మాణిక్యబాబా బుధవారం స్థానిక ఫాంహౌస్‌లో 55 జంటలకు సామూహికంగా వివాహాలు జరిపించారు. వధూవరులకు తాళిబొట్టు, తలంబ్రాలను సర్పంచ్ మాణిక్యం బాబా అందించగా, ఉదయం 10–30 గంటలకు పండితులు ప్రతి జంట వద్దకు వెళ్లి పెళ్లితంతును జరిపించారు. వధూవరులను ఆశీర్వదించటానికివచ్చిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారయణ, పుట్టపర్తి నియోజకవర్గ వైస్సార్పార్టీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ, పార్టీలో క్రియాశీలక నాయకుడిగా రాణిస్తూ పేద ప్రజలకోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న సర్పంచ్ మాణిక్యంబాబా పార్టీకి ఆణిముత్యంలాంటి వాడని కొనియాడారు. వివాహ వేడుకలో వైస్సార్సీపీ సీజీసీ సభ్యుడు గిర్రాజు నాగరాజు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు డీఎస్ కేశవరెడ్డి, ముస్తాక్ అహమ్మద్, మండల కన్వీనర్ నారేపల్లి జగన్మోహన్రెడ్డి, పరిశీలకులు అవుటాల రమణరెడ్డి, నూతన వధూవరులను ఆశీర్వదించారు. అదేవిధంగా కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటాసత్యం, పుట్టపర్తి మునిసిపల్ చైర్మన్ పీసీ గంగన్న, కాపు సంగం జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ సూరి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వధూవరుల బంధువులు, ఇతర ప్రాంతాల ప్రజలు దాదాపు 30 వేలకు పైగా తరలి వచ్చారు.14 రకాలతో కూడిన విందుభోజనాలను సర్పంచ్ బాబా ఏర్పాటు చేశారు. -
ఘనంగా సామూహిక వివాహాలు
హిందూపురం అర్బన్ : స్థానిక సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ధర్మశాలలో ఆదివారం పది జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. ఈ సందర్భంగా నవ దంపతులకు పట్టు వస్త్రాలు, తాళి బొట్టు, కాలిమెట్టలు సమకూర్చి ఉచితంగా వివాహాలు చేశారు. కార్యక్రమానికి దంపతుల తల్లిదండ్రులు, బంధుగణం, సత్యసాయి సేవాద⌠æరాష్ట్ర కోఆర్డినేటర్ లాలాలజపతిరాయ్, జిల్లా ఇన్చార్జి కిరణ్‌కుమార్, ఎస్కే యూనివర్శిటీ డీన్, జిల్లా అధ్యక్షుడు రామాంజప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు చలం మాట్లాడుతూ కరుణమూర్తి సత్యసాయిబాబా ఆశీస్సులు అందరిపై ఉండాలన్నారు. అనంతరం నూతన వధూవరులకు ఆశీర్వాదాలు అందించి భక్తులకు భోజనాలు ఏర్పాటు చేశారు.