communal politics
-
శ్రద్ధా హత్యోదంతం.. లవ్ జిహాద్ కాదు!
హైదరాబాద్: సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్యోదంతంపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గురువారం స్పందించారు. ఈ కేసుకు మతం రంగు పులమడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. ఇది లవ్ జిహాద్ ఘటన కాదంటూ ఉద్ఘాటించారు. ‘‘ఈ వ్యవహారాన్ని మత కోణంలో బీజేపీ చూస్తోంది. బీజేపీ రాజకీయాలు పూర్తిగా తప్పు. ఇది లవ్ జిహాద్ ఘటన కాదు. కానీ.. ఒక మహిళపై హేయనీయంగా ప్రవర్తించడం, వేధించడం.. దాడికి సంబంధించింది. ఆ కోణంలోనే ఈ కేసును చూడాలి.. అంతా ఖండించాలి కూడా’’ అని ఒవైసీ పేర్కొన్నారు. ఇక ఆజామ్‌ఘడ్‌లో ఓ వ్యక్తి తన భార్యను కిరాకతంగా చంపి.. సూట్‌కేసులో కుక్కిన ఘటనపైనా స్పందించారు ఒవైసీ. ఇలాంటి ఘటనలు బాధాకరమని, వీటికి హిందూ-ముస్లిం రంగులు పులిమి రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. శ్రద్ధా వాకర్ హత్య కేసును ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ప్రముఖంగా ప్రస్తావించింది. ఆదివారం ఈశాన్య ఢిల్లీలో జరిగిన రోడ్ షోలో అసోంముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. మెహ్రౌలీ(శ్రద్ధా కేసు) ఘోర హత్య తనను కలిచివేసిందని అన్నారు. దేశానికి యూనిఫామ్ సివిల్ కోడ్‌తో పాటు లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా కఠిన చట్టం తేవాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ దేశానికి అఫ్తాబ్(శ్రద్ధా హత్యకేసు నిందితుడు) లాంటి వాళ్ల అవసరం లేదని, శ్రీరాముడులాంటి వ్యక్తి.. నరేంద్ర మోదీ నేతల అవసరం ఉందని అసోం సీఎం వ్యాఖ్యానించారు. -
గరీబుకూ ..ఖరీదైన వైద్యం
సాక్షి, హైదరాబాద్: ఖరీదైన వైద్యసేవలు పూర్తిగా అందరికీ అందుబాటులోకి రావాలని, నిరుపేదలు దోపిడీకి గురికాకూడదనే ఆలోచనతో హైదరాబాద్ నలు దిక్కులా ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యాధునిక ఆసుపత్రులను నెలకొల్పుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలో 1.64 కోట్ల జనాభా నివసిస్తోందని, అంతేకాక చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ జనాభా బాగా పెరుగుతోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ నగరం మీద మాత్రమే వైద్య సేవల భారం మొత్తం పడకూడదనే ఉద్దేశంతో ఈ ఆసుపత్రులు నిర్మిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ (టిమ్స్) పేరుతో హైదరాబాద్ గడ్డిఅన్నారం, ఎర్రగడ్డ, అల్వాల్ ప్రాంతాల్లో నిర్మించనున్న మూడు ఆసుపత్రులకు సీఎం కేసీఆర్ మంగళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా అల్వాల్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. అందుబాటులో ఖరీదైన వైద్య సేవలు ‘ఏ సమస్య వచ్చినా గాంధీకో, ఉస్మానియాకో, నీలోఫర్కో పరిగెత్తకుండా ఈ ఆసుపత్రుల నిర్మా ణం ద్వారా నగరానికి నలువైపులా (ఇప్పటికే గచ్చిబౌలిలో టిమ్స్ ఉంది) నిరుపేదలకు ఖరీదైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. కొత్త ఆసుపత్రు లతో కలిపి మొత్తం 6 వేలకు పైగా పడకలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో 1,000 నుంచి 1,500 వరకూ ఐసీయూ పడకలు ఉండేలా చూస్తున్నాం. నిమ్స్‌లో కూడా 2 వేల పడకలను పెంచుతు న్నాం. టిమ్స్‌లో అన్ని సేవలతో పాటు వందో, రెండు వందల పడకలతోనో ప్రత్యేకమైన ప్రసూతి కేంద్రం కూడా ఇక్కడే నిర్వహించినట్లైతే మళ్లీ వేరేచోటికి పోయే అవసరం రాదు. ఆరోగ్య శాఖ ఈ మేరకు చర్యలు తీసుకోవాలి..’అని సీఎం అన్నారు. పటిష్టమైన వైద్య వ్యవస్థతో తక్కువ నష్టం ‘మానవులు ఈ భూగోళం మీదకు 4 లక్షల ఏళ్ల క్రితం వచ్చారు. కానీ వైరస్‌లన్నీ మనుషులు రావడానికి 4 లక్షల ఏళ్ల క్రితమే వచ్చాయని ఎంటమాలజిస్టులు చెప్పారు. అవి ఎప్పుడెప్పుడు ప్రకోపం చెందుతాయో అప్పుడు వ్యాప్తి చెందుతాయి అని చెప్తే.. నేను బేజారై కరోనా అయిపోదా అంటే కరోనా తాతలు కూడా భవిష్యత్తులో రానున్నాయన్నారు. కాబట్టి కరోనా లాంటి వ్యాధులు మళ్లీ మళ్లీ విజృంభించే అవకాశాలున్నాయి. వైరస్లు లేకుం డా చేసే వ్యవస్థ లేదు. కానీ అవి వచ్చినప్పుడు ఎవరికైతే పటిష్టమైన వైద్య వ్యవస్థ ఉంటుందో వారు తక్కువ నష్టంతో బయటపడతారు. ఎక్కడైతే వైద్య వ్యవస్థ బాగా ఉండదో అక్కడ లక్షల మంది చనిపోతారు. విద్య, వైద్యం పేదలకు అందాలనేదే మా లక్ష్యం. వైద్య విద్య మీద బాగా దృష్టి పెట్టనున్నాం. కొత్తగా మరిన్ని వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నాం’ అని కేసీఆర్ తెలిపారు. టీకా సెంటర్‌గా హైదరాబాద్ ‘ఎక్కడెక్కడ నుంచో ఇక్కడకి వచ్చి తమ సంస్థలు పెట్టడానికి కంపెనీలు ఆసక్తి చూపిస్తుండడం వల్లే హైదరాబాద్‌లో 7 ఏళ్లలో 2.30 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. వీటి ద్వారా 10–15 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. హైదరాబాద్‌లో 14 వేల ఎకరాల్లో ఫార్మాసిటీ, యూనివర్సిటీ తేనున్నాం. ప్రపంచంలోనే 33% టీకాలు తయారు చేసే సెంటర్ హైదరాబాద్..’అని సీఎం పేర్కొన్నారు. సంపద సృష్టిస్తున్నాం.. పేదలకు పంచుతున్నాం ‘మనది కొత్త రాష్ట్రం. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ ఇవన్నీ ఎప్పటినుంచో పెద్ద రాష్ట్రాలుగా కొనసాగుతున్నాయి. కానీ మన తలసరి ఆదాయం వీటన్నింటినీ మించి నమోదైంది. సంపద సృష్టిస్తున్నాం.. పేదలకు పంచుతున్నాం. తెలంగాణ పచ్చబడాలె, ఇంకా ముందుకు పోవాలె. దేశానికి తలమానికంగా ఉండేలా మారాలె. దాని కోసం ఎంతధైర్యంగానైనా ముందుకు పోతాం. ఎవరితోనైనా పోరాడతాం..’అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, వేముల, సబిత, తలసాని, మల్లారెడ్డి, ఎంపీలు కేకే, సంతోశ్, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, సాయన్న, మైనంపల్లి హన్మంతరావు, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. టిమ్స్ అంటే మామూలుగా ఏదో చిన్న దవాఖానా కట్టరు. ఇక్కడ 16 స్పెషాలిటీ, 15 సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు లభిస్తాయి. ఎయిమ్స్ తరహాలో టిమ్స్‌కు రూపకల్పన చేస్తున్నాం. వీటి ద్వారా నూటికి నూరు శాతం ప్రభుత్వ ఖర్చుతో పేదలకు కార్పొరేట్ వైద్యం అందుతుంది. కొందరు మత విద్వేషంతో మాట్లాడుతున్నారు.అన్ని మతాలు, కులాలని సమానంగా ఆదరించే గొప్ప దేశం మనది. ఈ సామరస్య వాతావరణం చెడిపోతే ఎటూ గాకుండా పోతాం. సామరస్యతను దెబ్బతీసే కేన్సర్ లాంటి జబ్బు మనల్ని పట్టుకుంటే చాలా ఇబ్బందులు పడతాం. ఇవాళ తెలంగాణలో కరెంటు పోతే వార్త. కానీ దేశంలో కరెంటు ఉంటే వార్త. ప్రధాని ప్రాతినిధ్యం వహించిన గుజరాత్లో కూడా రైతులు రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేస్తున్నారు. కానీ ఏడేళ్ల క్రితం పుట్టిన పసికూన తెలంగాణ రాష్ట్రంలో రాత్రింబవళ్లు కష్టపడి 24 గంటల కరెంటు అన్ని రంగాలకూ ఇస్తున్నాం. – సీఎం కేసీఆర్ కులం, మతం పేరిట చిల్లర రాజకీయాలు ‘రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు (మంగళవారం) రాజకీయ సభలు జరుపుతున్నాయి. కానీ మనం కంటోన్మెంట్లో ఆరోగ్యానికి సంబంధించిన సభ పెట్టుకున్నాం. ఇదీ వాళ్లకు మనకూ ఉండే తేడా. ఇలాంటి పరిస్థితు ల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రం వచ్చాక మారిన పరిస్థితులు చూడాలి. ఫలానా వాళ్ళ షాపులో పూలు కొనొద్దు. ఫలానా వాళ్ల షాపులో ఇది కొనొ ద్దు. అది కొనొద్దు అని కొందరు మత విద్వేషంతో మాట్లాడుతున్నారు. దీనిపై ప్రజలుగా మీరు ఆలోచన చేయాలి. కొందరు కులం, మతం పేరిట చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారు. మతపిచ్చి అనేది ఏదో తాత్కాలికంగా మజా అనిపిస్తుంది. కానీ శాశ్వతంగా మన ప్రయోజనాలు దెబ్బతింటాయి. విదేశాల్లో పనిచేస్తున్న 13 కోట్ల మంది భారతీయుల్ని ఇలాగే వెనక్కి పంపిస్తే వారికి ఉద్యోగాలు ఎవరివ్వాలి? అందువల్ల అటువంటి సంకుచిత ధోరణులకు తెలం గాణలో ఆస్కారమివ్వొద్దు’ అని విజ్ఞప్తి చేశారు. -
అసదుద్దీన్ ఒవైసీ విమర్శలపై విజయశాంతి ఫైర్
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై సినీ నటి, బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. ఇస్లాం వ్యతిరేకత లేదని, భయం లేకుండా ఉండాలని ముస్లింలను ఉద్దేశించి ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్ సందేశం ఇచ్చిన విషయం తెలిసిందే. దానిని తప్పుబడుతూ ఒవైసీ నిన్న ట్వీట్లు చేశాడు. ఈ మేరకు ఆమె తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఓ సుదీర్ఘ పోస్ట్ చేశారు. హైదరాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. ఈ మేరకు ట్విటర్లో ఆమె.. ‘‘భారతదేశ సమగ్రతను, సమైక్యతను చాటిచెప్పే విధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించిన తీరు చూస్తుంటే... రామ అనే పదం కూడా కొంతమంది అవకాశవాదులకు బూతుగా వినిపిస్తుందనే సామెత నిజమయ్యిందేమో అన్న అనుమానం కలుగుతోంది. దేశంలో ముస్లింలతో పాటు మైనార్టీ వర్గాల ప్రజలపై కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న మూక దాడులను ఖండించడంతోపాటు... ఈ రకమైన దాడులకు పాల్పడేవారు హిందూత్వ సిద్ధాంతాలకు వ్యతిరేకమని మోహన్ భగవత్ సదుద్దేశంతో వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని కూడా అర్థం చేసుకోలేని స్థితిలో అసదుద్దీన్ ఓవైసీ ఉండటం చాలా విడ్డూరం. sounding synonymous to the claims that flares up religious hatred. It would be no surprise if the tolerant statements of Mohan Bhagavath ji sound criminal for a person like mr Asaduddin who is horribly habituated to delight upon hearing... — VijayashanthiOfficial (@vijayashanthi_m) July 5, 2021 మొదట్లో భారతీయులుగా ఉన్నవారే మారుతున్న పరిస్థితుల కారణంగా ముస్లింలు గాను, ఇతర మైనార్టీ వర్గాల వారీగా రూపాంతరం చెందారని... ఎవరు ఏ మతంలో ఉన్నా, అందరూ భారతీయులమని మోహన్ భగవత్ దేశ సమైక్యతను చాటి చెప్పారు. కానీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మాటలు అసదుద్దీన్ గారి దృష్టిలో నేరస్తులు చేసే వ్యాఖ్యలుగా కనిపించాయి. తరచూ హిందూ, ముస్లింల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టే ఎంఐఎం నేతల ప్రసంగాలను విని, ఆనందిస్తూ, అలవాటు పడిపోయిన అసదుద్దీన్ గారికి.. భగవత్ గారి అభిప్రాయం క్రిమినల్ ఆలోచన గానే కనిపిస్తుంది. Why Mr. Asaduddin maintained complacence when Akbar said that if the police close their eyes and refrain themselves from their duties, he would definitely witness the end of Hindus. — VijayashanthiOfficial (@vijayashanthi_m) July 5, 2021 అయితే భగవత్ వ్యాఖ్యలను తప్పు పడుతున్న ఓవైసీ, గతంలో తన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ హిందువులను ఉద్దేశించి చేసిన కామెంట్లను గుర్తు చేసుకోవాలి. అక్బరుద్దీన్ గతంలో ఓ సభలో మాట్లాడుతూ, ఐదు నిమిషాలు పోలీసులు గనుక విధులు నిర్వహించకుండా కళ్లు మూసుకుంటే, హిందువుల అంతు చూస్తానని, తన తడాఖా చూపిస్తానని విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగం చేసినప్పుడు అసదుద్దీన్ ఎందుకు నోరు మెదపలేదు? ఇప్పుడు మోహన్ భగవత్ మీద వచ్చిన పౌరుషం ఆరోజు ఏమైందో చెప్తే బాగుంటుంది'' అని విజయశాంతి వరుస ట్వీట్లలో ఒవైసీని నిలదీశారు. -
బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి
లక్నో: మతతత్వ బీజేపీకి వ్యతిరేకంగా 2019 సాధారణ ఎన్నికలకు ముందే మహాకూటమి ఏర్పాటవుతుందని జేడీయూ మాజీ ఎంపీ శరద్‌యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయకోసం చేసే ఈ పోరాటంలో ఒంటరిగా ముందుకు వెళ్లడం సాధ్యం కాదని, బీజేపీ విస్తరించిన మతతత్వాన్ని అడ్డుకోవాలంటే మహా కూటమిగా ఏర్పడాలని అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అతిపెద్ద పోరాటం సామాజిక న్యాయం కోసమే. బీజేపీ విస్తరించిన మతతత్వ వాదానికి అడ్డుకట్ట వేస్తేనే ఇది సాధ్యపడుతుంది. 2019 ఎన్నికలకు ముందే బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటవుతుందనే నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు మారిపోయాయని, సమాజంలోని ఏ వర్గం బీజేపీపై సంతోషంగా లేరని, ఈసారి బీజేపీ హిందూ–ముస్లిం అజెండా పనిచేయబోదని చెప్పారు. -
నాయనమ్మ, నాన్నల్లాగే నన్నూ చంపేస్తారేమో: రాహుల్
తన నాయనమ్మ, నాన్న కులమత రాజకీయాలకే బలైపోయారని.. అలాగే తనను కూడా ఏదో ఒకరోజు చంపేస్తారేమోనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. విద్వేష రాజకీయాలు దేశ లౌకికతత్వాన్ని దెబ్బతీస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ మతతత్వ రాజకీయాలకు పాల్పడుతోందంటూ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో మతఘర్షణలు జరిగిన ముజఫర్‌నగర్ ప్రాంతంలో తాను పర్యటించినప్పుడు హిందూ ముస్లింలు ఇద్దరితోనూ మాట్లాడానని, వాళ్ల మాటల్లో తన సొంత జీవితగాధే కనిపించిందని చెప్పారు. ''వాళ్ల దుఃఖంలో నా ముఖమే కనిపించింది. అందుకే నేను వాళ్ల (బీజేపీ) రాజకీయాలకు వ్యతిరేకం.. వాళ్లేం చేస్తున్నారు? ముజఫర్‌నగర్‌లో మంటలు పెట్టారు, గుజరాత్లో మంటలు పెట్టారు, ఉత్తరప్రదేశ్, కాశ్మీర్.. అన్నిచోట్లా ఇదే చేస్తున్నారు. వాళ్లు మంటలు పెడితే మేం ఆర్పాల్సి వస్తోంది. ఇది దేశాన్ని నాశనం చేస్తోంది'' అని రాహుల్ గాంధీ అన్నారు. ఇలాంటి రాజకీయాలు ఆగ్రహావేశాలకు దారితీసి హింసాత్మక ఘటనలలో అమూల్యమైన ప్రాణాలు పోతున్నాయని చెప్పారు. ''మా నాయనమ్మ హత్యకు గురైంది. మా నాన్ననూ హతమార్చారు. బహుశా ఏదో ఒకరోజు నన్ను కూడా చంపేస్తారేమో. అయినా దాని గురించి నేను బాధపడట్లేదు. నా గుండెల్లో ఏముందో మీకు చెప్పాలి'' అన్నారు. ఇటీవల పంజాబ్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే తన వద్దకు వచ్చారని, 20 ఏళ్ల క్రితం కలిసుంటే మిమ్మల్ని కూడా కోపంలో చంపేసి ఉండేవాళ్లమేమోనని ఆయన అన్నారని రాహుల్ తెలిపారు. బీజేపీ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. తన నాయనమ్మను చంపిన సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ దీపావళి రోజున ఇందిరాగాంధీపై బాంబు వేద్దామనుకున్నారని, వాళ్లమీద కోపం తనకు 10-15 ఏళ్లకుగానీ తగ్గలేదని రాహుల్ చెప్పారు.