పెయిడ్ ఆర్టికల్స్‌పై నిఘా పెట్టాలి
ఎన్నికల కమిషన్ కమ్యూనికేషన్ డివిజన్ అధికారి వీరేంద్ర
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ప్రతికల్లో ప్రచురితమయ్యే, టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే అడ్వర్టైజ్మెంట్లు, పెయిడ్ ఆర్టికల్స్‌పై నిఘా పెట్టాలని ఎన్నికల కమిషన్ కమ్యూనికేషన్ డివిజన్ అధికారి వీరేంద్ర కోరారు.
శుక్రవారం న్యూఢిల్లీ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రతి జిల్లాలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి వివిధ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే పెయిడ్ న్యూస్, ఆర్టికల్స్, అడ్వర్టైజ్మెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి జిల్లా ఎన్నికల అధికారికి నివేదిక సమర్పించాలన్నారు.
రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులుగాని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలు జారీ చేయాలనుకుంటే ఎం.సీ.ఎం.సీ టీముకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. లోక్‌సభ, శాసనసభ అభ్యర్థులకు నిర్ణయించిన ఎన్నికల వ్యయ పరిమితి లోపలే ప్రకటనలు జారీ చేసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రకటనలు జారీ చేయడానికి ఎం.సీ.ఎం.సీ టీముకు దరఖాస్తు చేసుకున్న ప్రకటన ప్రచురణకుగాని, ప్రసారానికి అనుకూలంగా లుకుంటే తిరస్కరించవచ్చునని సూచించారు.
కలెక్టర్ టి.చిరంజీవులు మాట్లాడుతూ జిల్లాలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ డాక్టర్ హరిజవహర్‌లాల్, ఎం.సీ.ఎం.సీ టీమ్ సభ్యులు డీఆర్ఓ వెంకట్రావు, జిల్లా పౌర సంబంధాల అధికారి డి.నాగార్జున, రేడియో ఇంజినీర్ రాజరత్నం పాల్గొన్నారు.