compensation to farmers
-
విజయనగరం జిల్లాలో గ్రామసభ రసాభాస
విజయనగరం: విజయనగరం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పూసపాటిరేగ మండలం పువ్వాడ గ్రామంలో నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. ఎన్వీఎస్ ఫార్మా కంపెనీ పర్యావరణ అనుమతుల కోసం బుధవారం గ్రామసభ నిర్వహించింది. ఈ సభలో రైతులు ఆందోళనకు దిగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. భోగాపురం ఎయిర్‌పోర్టు బాధితులకు ఇచ్చిన విధంగానే తమకు నష్ట పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్‌కు అంగీకరిస్తేనే భూములు ఇస్తామని వారు తేల్చి చెబుతున్నారు. రైతులకు స్థానిక వామపక్ష నేతలు మద్దతుగా నిలిచారు. గ్రామసభలో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు వామపక్ష నేతలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
రాజధాని భూములకు పరిహారం ఇలా: చంద్రబాబు
-
రాజధాని భూములకు పరిహారం ఇలా: చంద్రబాబు
ఏపీ రాజధాని భూసేకరణ ఫలితంగా భూములు కోల్పోయే మెట్ట, జరీబు రైతులకు వేర్వేరుగా పరిహారాలు ఇవ్వనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నాడు సైబరాబాద్ కోసం భూములు ఇచ్చినవాళ్లు ఇప్పుడు సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు. రైతులు తనపై నమ్మకం ఉంచారని, ఆ నమ్మకాన్ని తాను కాపాడుకుంటానని చెప్పారు. రైతుల సంక్షేమ బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. కొత్త రాజధానిలో మొదటి లబ్ధిదారులు రైతులేనని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి చాలామంది రైతులు భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారన్నారు. భూసేకరణను ఏదోలా విఫలం చేయాలని కొన్ని పార్టీలు ప్రయత్నం చేశారని, రాజధాని అంశాన్ని ఆలస్యం చేస్తే.. ఏదో ఒక లబ్ధి ఉంటుందని ఆలోచించారన్నారు. కానీ ఏ రైతూ దీనికి సిద్ధంగా లేరన్నారు. భూములను రెండు విభాగాలుగా వర్గీకరిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. పట్టా ఉన్న మెట్ట భూములకు ఎకరం భూమికి గాను నివాసయోగ్యమైన వెయ్యి చదరపు అడుగుల భూమి కేటాయిస్తున్నామని, వాణిజ్యపరమైన మరో 200 చదరపు అడుగులు కూడా ఇస్తున్నామని వివరించారు. జరీబు భూముల్లో నివాసయోగ్యమైన వెయ్యి చదరపు అడుగులు, వాణిజ్య అవసరాల కోసం 300 చదరపు అడుగులు ఇస్తున్నామని తెలిపారు. జరీబు భూములంటే కృష్ణానదిని ఆనుకున్న భూములని ఆయన వివరణ ఇచ్చారు. -
కాలుష్య కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం
పటాన్చెరు : కాలుష్య కారణంగా జిల్లాలో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని జాతీయ హరిత ధర్మాసనం తీర్పు చెప్పింది. తమ తీర్పులను అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా నోటీసులు జారీ చేసింది. జిల్లాలోని సంగారెడ్డి, పటాన్చెరు, జిన్నారం, కోహీర్ మండలాల్లో 23 గ్రామాలకు చెందిన రైతులకు రూ. 76 లక్షలు చెల్లించాల్సి ఉన్నా, అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకవపోవడంతో రైతుల పక్షాన సుప్రీంకోర్టు న్యాయవాది నిరూప్‌రెడ్డి ధర్మాసనాన్ని ఆశ్రయించారు కాలుష్యం కారణంగా నష్టపోతున్న రైతుల తరఫున గత కొన్నేళ్లుగా ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. మొత్తం 17 అంశాలపై ఆయన న్యాయ పోరాటం చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (జాతీయ హరిత ధర్మాసనం) ప్రిన్సిపల్ బెంచ్ ఎదుట ఈ కేసు సోమవారం విచారణకు వచ్చింది. జస్టిస్ స్వతంత్రకుమార్ తీర్పును వెలువరిస్తూ రైతులకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో విఫలమైన ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తున్నామన్నారు. ఎనిమిది నెలల క్రితం తాము ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర పీసీబీ, కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు కూడా ఈ నోటీసులు జారీచేశారు. రైతులు ఎదుర్కొంటున్న 12రకాల అంశాలపై పరిష్కారం ఎందుకు చూపలేదంటూ నోటీసులు జారీ చేశారు. తీర్పులో ప్రధానంగా రూ. 76 లక్షల పరిహారానికి సంబంధించిన ధర్మాసన ఆదేశాల ధిక్కరణ ప్రధానమైంది. అలాగే 23 చెరువులు, కుంటలు కాలుష్య కారణంగా పాడైనప్పటికీ వాటి పునరుద్ధరణ ఎందుకు చేపట్టలేదో తదితర అంశాలపై ధర్మాసనం ముందు న్యాయవాది నిరూప్‌రెడ్డి వాదించారు. కాలుష్యం కారణంగా నాలుగు మండలాల్లో మనిషి డీఎన్ఏలో మార్పులు సంభవించాయని, వాటిని అధ్యయనం చేసి ప్రత్యేక ఆసుపత్రి, చికిత్సా విధానం రూపొందించాలని వాదించారు.