కాలుష్య కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం | Compensation to farmers affected by pollution | Sakshi
Sakshi News home page

కాలుష్య కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం

Published Tue, Jul 29 2014 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 11:01 AM

Compensation to farmers affected by pollution

 పటాన్‌చెరు : కాలుష్య కారణంగా జిల్లాలో  నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని జాతీయ హరిత ధర్మాసనం తీర్పు చెప్పింది.  తమ తీర్పులను అమలు చేయని  రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా నోటీసులు జారీ చేసింది. జిల్లాలోని సంగారెడ్డి, పటాన్‌చెరు, జిన్నారం, కోహీర్ మండలాల్లో 23 గ్రామాలకు చెందిన రైతులకు రూ. 76 లక్షలు చెల్లించాల్సి ఉన్నా, అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకవపోవడంతో రైతుల పక్షాన సుప్రీంకోర్టు న్యాయవాది నిరూప్‌రెడ్డి  ధర్మాసనాన్ని ఆశ్రయించారు కాలుష్యం కారణంగా నష్టపోతున్న రైతుల తరఫున గత కొన్నేళ్లుగా ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే.

మొత్తం 17 అంశాలపై ఆయన న్యాయ పోరాటం చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (జాతీయ హరిత ధర్మాసనం) ప్రిన్సిపల్ బెంచ్ ఎదుట ఈ కేసు సోమవారం విచారణకు వచ్చింది. జస్టిస్ స్వతంత్రకుమార్ తీర్పును వెలువరిస్తూ రైతులకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో విఫలమైన ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తున్నామన్నారు. ఎనిమిది నెలల క్రితం తాము ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర  చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర పీసీబీ, కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు కూడా ఈ నోటీసులు జారీచేశారు.

 రైతులు ఎదుర్కొంటున్న 12రకాల అంశాలపై పరిష్కారం ఎందుకు చూపలేదంటూ నోటీసులు జారీ చేశారు. తీర్పులో ప్రధానంగా రూ. 76 లక్షల పరిహారానికి సంబంధించిన  ధర్మాసన ఆదేశాల ధిక్కరణ ప్రధానమైంది. అలాగే 23 చెరువులు, కుంటలు కాలుష్య కారణంగా పాడైనప్పటికీ వాటి పునరుద్ధరణ  ఎందుకు చేపట్టలేదో తదితర అంశాలపై ధర్మాసనం ముందు న్యాయవాది నిరూప్‌రెడ్డి వాదించారు. కాలుష్యం కారణంగా నాలుగు మండలాల్లో మనిషి డీఎన్‌ఏలో మార్పులు సంభవించాయని, వాటిని అధ్యయనం చేసి ప్రత్యేక ఆసుపత్రి, చికిత్సా విధానం రూపొందించాలని వాదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement