మార్చి నాటికి పెన్నా బ్యారేజీ పూర్తి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) :
జలవనరులశాఖ సీఈ డి.సుధాకర్‌బాబు నెల్లూరు బ్యారేజీ పనులను మంగళవారం పరిశీలించారు. పనుల పురోగతిని, పనితీరును ఆయన అభినందించారు. మార్చి నెలాఖరులోగా బ్యారేజీపనులు పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో శాఖలో జరుగుతున్న పలు నిర్మాణ పనులపై సమస్యాత్మక విషయాలను అధికారులతో చర్చించి నివేదికను పంపాలని కోరారు. తొలుత సర్వేపల్లి రిజర్వాయర్‌కు తాత్కాలిక ప్రాతిపదికన జరిగిన పనులను, కనుపూరు కాలువ పనులను ఆయన పరిశీలించారు. ఎస్ఈ కె.కోటేశ్వరరావు, ఈఈ రమణ, జేఈ సురేష్, నాగరాజులు ఆయన వెంట ఉన్నారు.