Comprehensive Development
-
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సీఎం జగన్ నిర్ణయాన్ని బలపరుద్దాం
సీతమ్మధార(విశాఖపట్నం): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దసరా నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభించనున్న సందర్భంగా శుభాకాంక్షలు చెబుతున్నట్లు పరిపాలన వికేంద్రీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ హనుమంతు లజపతిరాయ్ అన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంతో పాటు రాష్ట కుట్రంలోని అన్ని జిల్లాలూ అభివృద్ధి చెందాలని, ముఖ్యమంత్రికి అన్ని మతాల దేవుళ్లు ఆశీర్వాదాలు అందించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విశాఖ వందనం పేరిట ప్రచార రథాన్ని ఏర్పాటు చేశారు. సంపత్ వినాయగర్ ఆలయం వద్ద శనివారం ప్రచార రథానికి పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం కనకమహాలక్ష్మి ఆలయంలో పూజలు చేశారు. లజపతిరాయ్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు తమ జెండా, అజెండాలను పక్కన పెట్టి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సీఎం తీసుకున్న నిర్ణయాన్ని బలపర్చాలని విన్నవించారు. కార్యక్రమంలో మేయర్ గొలగాని హరివెంకటకుమారి, గాజువాక ఎమ్మెల్యే తిప్పలనాగిరెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, నెడ్ క్యాప్ చైర్మన్ కేకే రాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్, హ్యూమన్ రైట్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్రావు, ఏయూ ప్రొఫెసర్ షారోన్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ దశాబ్దం భారత్‌దే
న్యూఢిల్లీ: ప్రస్తుత దశాబ్దం (2030 వరకు) భారత్‌కు ఆశావహం అని, ఎన్నో అవకాశాలు రానున్నాయని టాటా గ్రూపు చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ అన్నారు. దేశ సమగ్ర అభివృద్ధికి కోట్లాది మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే, మరింత మంది మహిళలను ఉద్యోగాల్లోకి వచ్చేలా చూడాలన్నారు. సీఐఐ నిర్వహించిన వ్యాపార సదస్సులో ఆయన మాట్లాడారు. రానున్న దశాబ్దాల్లో 70% ప్రపంచ వృద్ధి అంతా వర్ధమాన దేశాల నుంచే ఉంటుందని చంద్రశేఖరన్ అంచనా వేశారు. అందులోనూ ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్ వృద్ధి రేటు ఎక్కువగా ఉంటుందని, భారత్ ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. సమ్మిళిత వృద్ధి..: ‘‘మనం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నాం. కానీ, ఈ వృద్ధి ఫలాలు అందరూ అనుభవించే విధంగా ఉండాలి. ధనిక, పేదల మధ్య అంతరం పెరగకుండా చూడాలి. నా వరకు ఇదే మూల సూత్రం’’అని చంద్రశేఖరన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కనీస నాణ్యమైన జీవనాన్ని ప్రతి ఒక్కరూ పొందేలా ఉండాలన్నారు. రానున్న పదేళ్లలో కోట్లాది మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలని సూచించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి చూస్తే భారత్ ప్రపంచ జీడీపీలో 3% నుంచి 7%కి చేరింది. ఈ అభివృద్ధి వల్ల గత పదేళ్లలోనే 27 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తులయ్యారు. మనం కొత్త వ్యాపారాలు, కొత్త రంగాల్లోకి అడుగు పెట్టాం. నేడు ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా అవతరించాం. 2022లోనే ఇప్పటి వరకు చూస్తే ప్రతీ వారం ఒక యూనికార్న్ ఏర్పడింది. అయినా, మనం ఇంకా ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉంది. అది మహిళలకు ఉపాధి కల్పించే విషయంలోనూ. ఇప్పటికీ ఎంతో మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. వీరు ఆరోగ్య, విద్యా సదుపాయాలను అందుకోలేకున్నారు’’అని చంద్రశేఖరన్ తెలిపారు. సమస్యలను పరిష్కరించుకోవాలి.. భారత ఆర్థిక వ్యవస్థ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ‘‘5 లక్షల కోట్ల డాలర్లు, 8 లక్షల కోట్ల డాలర్లకు భవిష్యత్తులో చేరుకుంటాం. తలసరి ఆదాయం రెట్టింపు అవుతుంది. కానీ, ఇది సమ్మిళితంగా ఉండాలి’’ అని తెలిపారు. ఈ దశాబ్దం భారత్‌దేనని మరోసారి గుర్తు చేస్తూ ఈ క్రమంలో సమస్యలు, సవాళ్లను పరిష్కరించుకున్నప్పుడే అవకాశాలను అందిపుచ్చుకోగలమన్నారు. సమాజంలోని అంతరాలను తొలగించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. మహిళలకు ప్రాతినిధ్యం పని ప్రదేశాల్లో మహిళల ప్రాతినిధ్యం తగ్గిపోతున్న విషయాన్ని ఎన్.చంద్రశేఖరన్ గుర్తు చేశారు. గత దశాబ్దంలో ఇది 27 శాతం నుంచి 23 శాతానికి దిగివచ్చినట్టు చెప్పారు. అయితే, కొత్త నైపుణ్య నమూనా కారణంగా ఇది మారుతుందన్నారు. ఇంటి నుంచే పని విధానం ఇప్పుడప్పుడే పోదంటూ, అది శాశ్వతంగానూ కొనసాగదన్నారు. -
సమగ్రంగా...సమైక్యంగా...
-
'సమగ్ర అభివృద్ధి'పై సమాలోచన
విజయవాడ : విజయవాడ స్వరాజ మైదానంలో ఏర్పాటు చేసిన బుక్ ఫెస్టివల్లో గురువారం 'సమగ్ర అభివృద్ధి' అనే అంశంపై సమాలోచన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ రఘురాంరాజు, ఆచార్య గోపాల్ గురు, మాజీ సీఎస్ కాకి మాధవరావుతో పాటు పలువురి ప్రముఖులు పాల్గొని ఈ అంశంపై సుదీర్ఘంగా ప్రసంగించారు. -
ప్రతి గ్రామానికి రూ. కోటి
గ్రామాల సర్వతోముఖాభివృద్ధే ధ్యేయం ఎమ్మెల్యే ఇక్బాల్ అన్సారీ గంగావతి : ప్రతి గ్రామాన్ని కోటి రూపాయల నిధులతో సమగ్ర అభివృద్ధి చేపడతామని ఎమ్మెల్యే ఇక్బాల్ అన్సారీ పేర్కొన్నారు. ఆయన గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన సాణాపుర గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. గంగావతి అసెంబ్లీ క్షేత్ర స్థాయిలో 160 గ్రామాలున్నాయని, ఒక్కొక్క గ్రామానికి కోటి రూపాయల నిధులను కల్పించి మౌలిక సదుపాయాలను కల్పిస్తామని భరోసా ఇచ్చారు. తాలూకాలోని సాణాపుర గ్రామ పం చాయతీని నూతనంగా ఏర్పాటు చేశారని, పం చాయతీకి అవసర మైన కంప్యూటర్లు, ఇతర సౌక ర్యాల కోసం రూ.5 లక్షల నిధులను అం దిస్తున్నానన్నారు. మరో దఫా రూ.20 లక్షల నిధులను నూతన పంచాయతీకి అందిస్తామన్నారు. ఈ ప్రాంత గ్రామ ప్రజలు ప్రయాణ సౌకర్యార్థం, 10 సిటీ బస్సులను సాణాపురంకు ఏర్పాటు చేశామన్నారు. గ్రామ పంచాయతీలకు పేద ప్రజలకు అందించే ఇళ్లను గ్రామ సభలు జరిపి పారదర్శకంగా పంపిణీ అయ్యేలా పీడీఓలు శ్రద్ధ వహించాలని సూచించారు. నూతన గ్రా మ పంచాయతీ అభివృద్ధికి సభ్యులు, అ ద్యక్ష, ఉపాధ్యక్షులు కలిసికట్టుగా పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సభ్యులు టీ.జనార్థన్, గ్రామ పంచాయితీ అధ్యక్షులు యశోధ నరసింహులు, సభ్యులు ఎం.వెంకటేష్, తాలూకా పంచాచతీ అధ్యక్షురాలు ఈర మ్మ ముదియప్ప, ఎస్ఎన్.మఠద్, తా లూకా పంచాయతీ సభ్యురాలు రాజేశ్వరి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మల్లికార్జునను ఘనంగా సన్మానించి సత్కరించారు. -
‘సీమ’ సమగ్రాభివృద్ధికి పోరాటమే మార్గం
ప్రత్యేక ప్యాకేజీ సాధన సమితి కన్వీనర్ ఈశ్వరయ్య కడప అగ్రికల్చర్ : రాయలసీమలో విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధనే లక్ష్యంగా రాయలసీమ ప్రజానీకం ఉద్యమానికి సన్నద్ధం కావాలని వైఎస్ఆర్ జిల్లా సీపీఐ కార్యదర్శి, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ సాధన సమితి కన్వీనర్ జి ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. కడప నగరంలో సోమవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. శని, ఆదివారాల్లో కడపలో రాయలసీమ అభివృద్ధి మహాసభలను నిర్వహించామన్నారు. ఈ సభల్లో రాయలసీమ వెనుకబాటు తనం, అందుకు దారితీసిన పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై మేధావులు విపులంగా చర్చించారన్నారు. ఇప్పటికే నష్టపోయిన రాయలసీమ ఇకపై కూడా నష్టపోకుండా ప్రజానీకాన్ని వెన్నుతట్టి ఉద్యమానికి సమాయత్తం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు పారిశ్రామిక అభివృద్ధి, ప్రాజెక్టుల పూర్తి, కృష్ణా నీటిలో నికర జలాల కేటాయింపు, కడపలో ఉక్కు పరిశ్రమ, విద్యా సంస్థల ఏర్పాటు, హైకోర్టు బెంచ్ కోసం ఉద్యమించాలన్నారు. హైదరాబాద్ తరహాలో లక్షల కోట్లతో ఒకే ప్రాంతంలో రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం పూనుకోవడం తగదన్నారు. అంతకు ముందు రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ సాధన సమితి కన్వీనర్‌గా వైఎస్ఆర్ జిల్లా సీపీఐ కార్యదర్శి జి ఈశ్వరయ్యను ఎంపిక చేశారు. చిత్తూరు నుంచి జల్లి విశ్వనాథ్, అనంతపురం నుంచి జాన్సన్, కర్నూలు నుంచి లెనిన్‌బాబు, వైఎస్ఆర్ జిల్లా నుంచి కె సురేష్‌బాబు, ఎల్ నాగసుబ్బారెడ్డిలు సభ్యులుగా ఎంపికయ్యారు. ‘సీమ’ అభివృద్ధి మహాసభ తీర్మానాలు.. - రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులను రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలి. ‘కృష్ణా’లో నికర జలాలు కేటాయించాలి. - రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, పన్నుల మినహాయింపు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలి. - ‘సీమ’ కరువును జాతీయ విపత్తుగా ప్రకటించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలి. - విభజన చట్టంలోని అన్ని అంశాలను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలి. - సెయిల్ ఆధ్వర్యంలో కడపలోనే భారీ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలి. - విద్య, వైద్య సంస్థలు, హైకోర్టు బెంచ్‌ను ‘సీమ’లో ఏర్పాటు చేయాలి. - వ్యవసాయ, గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. - రాష్ట్ర రాజధానికి అనుసంధానిస్తూ రోడ్లు, రైల్వే మార్గాలను ఏర్పాటు చేయాలి. - బెరైటీస్, డోలమైట్, చైనా క్లేవ్ ఐరన్‌ఓర్, లైమ్‌స్టోన్, మాంగనీసు, ఇసుక ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలి.