computer labs
-
ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ ల్యాబ్‌లపై ప్రత్యేక దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు, నెట్‌వర్క్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఉన్నత విద్యామం డలి నిర్ణయించింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లపై యాజమాన్యాలు వెంటనే చర్యలు చేపట్టేలా చూడాలని జేఎన్టీయూను ఆదేశించింది. అనేక కాలేజీల్లో పనిచేయని కంప్యూటర్లే ఎక్కువగా ఉన్నట్లు ఉన్నత విద్యా మండలి దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో కాలేజీల్లో విద్యార్థులకు సరిపడ కంప్యూటర్లు, పటిష్టమైన నెట్వర్క్ ఉండేలా చర్యలు చేపట్టాలన్న నిర్ణ యానికి వచ్చింది. ఇటీవల ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్ ప్రవేశ పరీక్షలు ఆన్లైన్లో నిర్వ హించడానికి కాలేజీల్లో ల్యాబ్‌లను పరిశీలించగా లోపాలు బయట పడ్డాయి. చాలా కాలేజీల్లో ఆన్లైన్ పరీక్షల నిర్వహణకు సరిపడ సామర్థ్యం లేనట్టు తేలింది. ఓ వైపు దేశ వ్యాప్తంగా భవిష్యత్తులో అన్ని పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించడానికి కసరత్తు జరుగుతుంటే రాష్ట్రంలోని కాలేజీ ల్యాబ్‌ల్లో లోపాలు ఉండటం సరికాదన్న భావనకు మండలి వచ్చింది. ల్యాబ్‌లు పక్కాగా ఉండాలి.. 500 మందికి పైగా విద్యార్థులు ఉన్న కాలేజీల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు పక్కాగా ఉండాలని, యాజమాన్యాలు పటిష్టమైన నెట్వర్క్ ఏర్పాటుకు చర్యలు చేపట్టేలా చూడాలని నిర్ణయించినట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అన్నారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో లోపాలపై ప్రభుత్వం, జేఎన్టీయూ, తామూ చేపట్టిన అనేక సంస్కరణల ఫలితం గానే ప్రస్తుతం లోపాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. గతంలో కంప్యూటర్లు, నెట్వర్క్ సామర్థ్యం తక్కువగా ఉండటంతో రోజుకు కేవలం 6 నుంచి 7వేల మంది విద్యార్థులకే ఆన్లైన్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండేదని, ప్రస్తుతం అది 28 వేలకు చేరిందన్నారు. ఇది మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. -
సెంట్రల్ జైలులో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం
వరంగల్: వరంగల్ సెంట్రల్‌జైలులో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ ల్యాబ్‌ను కలెక్టర్ అమ్రపాలి శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖైదీలు చదువుతో పాటు కంప్యూటర్ నేర్చుకోవాలని సూచించారు. విడుదలైన ఖైదీలకు రుణాలు, డబుల్బెడ్రూం ఇళ్లు, మహి ళా ఖైదీలకు కుట్టు మిషన్లు, సిబ్బంది ఉండే క్వార్టర్స్‌లో చిల్రన్స్‌పార్కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జైలు సూపరింటెండెంట్ మురళీబాబు మాట్లాడుతూ జైళ్ల శాఖ డీజీపీ వినోయ్‌కుమార్‌సింగ్ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ అనే ఖైదీ స్వయంగా గీసిన కలెక్టర్ చిత్రపటాన్ని కలెక్టర్ అమ్రపాలికి బహూకరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్‌జైలు ఉప పర్యవేక్షణ అధికారి జీఎం.శ్రీనివాస్, జైలర్లు నిరంజన్‌రెడ్డి, నర్సింహస్వామి, సక్రూ, అరుణ్‌కుమార్, డిప్యూటీ జైలర్లు ఎం.శ్రీనివాస్, ఆర్.శ్రీనివాస్, ఎ.శ్రీనివాస్, ఎం.శ్రీధర్, కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కంప్యూటర్ మిథ్య
సాక్షి, ఒంగోలు: రోజురోజుకూ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా...ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. అందుకుగాను కోట్లాది రూపాయలను ఖర్చు చేసింది. కానీ సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రవేశపెట్టిన ఈ పథకం అమలు తీరు అధ్వానంగా ఉంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం అందజేసిన వేలాది కంప్యూటర్లు నేడు నిరుపయోగంగా పడున్నాయి. కంప్యూటర్ ల్యాబ్‌ల తాళాలు తీసి ఎన్ని రోజులైందో. కారణం సంబంధిత ఇన్స్ట్రక్టర్లు లేకపోవడమే. ఇన్‌స్ట్రక్టర్ల కాంట్రాక్టు గడువు ముగియడంతో బోధించే వారు లేకుండాపోయారు. తొలుత ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన ఈ పథకం మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కంప్యూటర్లు ఎందుకూ పనికిరాకుండా తయారయ్యాయి. జిల్లాలోని జరుగుమల్లి మండలం కె.బిట్రగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 11 కంప్యూటర్లను మూడు నెలల క్రితం దొంగలు ఎత్తుకెళ్లారు. కొనకనమిట్లలో 4 నెలల క్రితం 20 కంప్యూటర్లను, ఉప్పలపాడు, పొదిలిలోని ప్రభుత్వ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లో ఉన్న కంప్యూటర్లు, సీపీయూలు సైతం దొంగలపాలయ్యాయి. దీన్ని బట్టి కంప్యూటర్ల వినియోగంలో .. వాటి భద్రతపై శ్రద్ధ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. అనేక చోట్ల కంప్యూటర్లు బూజుపట్టి ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. కంప్యూటర్ విద్యను బోధించాల్సిన ఇన్స్ట్రక్టర్లు చేయాల్సిన పనులను ప్రభుత్వం ఉపాధ్యాయులపై రుద్దింది. ఉన్న బాధ్యతలే మోయలేకున్న తమపై మరొకటా అంటూ టీచర్లు పెదవి విరుస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం పుణ్యమా అంటూ ఈ ఏడాది పాఠశాలల్లో చదువు కుంటుపడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సాధారణ పోర్షన్‌ను పూర్తి చేయాలనే లక్ష్యమే ప్రస్తుతం వారి ముందుంది. పదో తరగతి పరీక్షల టైంటేబుల్ సైతం అప్పుడే వచ్చేసింది. కంప్యూటర్ విద్యలో నిష్ణాతులైన ఎందరో నిరుద్యోగులున్నప్పటికీ వారిని ఉపయోగించుకునే విషయంలో ప్రభుత్వానికి నిధుల కొరత అడ్డొస్తోంది. దీంతో ఉన్నత ఆశయం కాస్త నీరుగారుతోంది. ఒంగోలులో.. ఒంగోలు నగర పరిధిలో ఒక్కో ప్రభుత్వ పాఠశాలకు 11 కంప్యూటర్లు మంజూరు చేశారు. అయితే ఇవన్నీ మూలనపడటంతో సుమారు 7 వేల మంది విద్యార్థులు కంప్యూటర్ విద్యకు దూరమయ్యారు. కొండపిలో.. టంగుటూరు, కారుమంచి, తూర్పునాయుడుపాలెం హైస్కూళ్లలో కంప్యూటర్ విద్య నడుస్తుండగా మిగతా ఏడు హైస్కూల్స్‌లో బోధకులు లేరు. నర్సింగోలు, పీరాపురం యూపీ పాఠశాలలకు కంప్యూటర్లు ఇవ్వలేదు. పచ్చవ హైస్కూల్లో బోధకుడు లేకపోవడంతో ఇతర సబ్జెక్ట్ బోధించే ఉపాధ్యాయుడే చెప్తున్నాడు. జరుగుమల్లి ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ విద్య బోధిస్తున్నారు. విద్యుత్ సౌకర్యంలేక పోతే ఉపయోగించుకోవటానికి ఏర్పాటు చేసిన జనరేటర్ మరమ్మతులకు గురై మూలనపడి ఉంది. కామేపల్లి హైస్కూల్లో వేరే సబ్జెక్ట్ టీచరే విద్యార్థులకు కంప్యూటర్ విద్య నేర్పుతున్నారు. కనిగిరిలో.. కనిగిరి మండలంలో మూడు పాఠశాలల్లో మాత్రమే కంప్యూటర్ విద్య అందిస్తున్నారు. తాళ్లూరు ఉన్నత పాఠశాలలో కంప్యూటర్లు చోరీకి గురయ్యాయి. గురువాజిపేటలో ప్రత్యామ్నాయంగా హిందీ టీచర్‌తో కంప్యూటర్ కోర్సు నడుపుతున్నారు. పామూరు మండలంలో రెండు, మూడు పాఠశాలల్లో మాత్రమే ప్రత్యామ్నాయంగా వేరే సబ్జెక్టు టీచర్లతో కంప్యూటర్ విద్య బోధిస్తున్నారు. మార్కొండాపురం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో కంప్యూటర్లు ఆరంభం నుంచి అలంకారప్రాయంగా ఉన్నాయి. మొగళ్లూరు, పి నాగులవరం, ఇమ్మడిచెరువు పాఠశాలలకు కంప్యూటర్లు ఇవ్వలేదు. హనుమంతునిపాడు మండలంలో 7 పాఠశాలల్లో కంప్యూటర్లు మరమ్మతులకు గురయ్యాయి. సీఎస్‌పురంలోని జెడ్పీ ఉన్నత, చెన్నపునాయునిపల్లి, పెదగోగులపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో కంప్యూటర్లు మరమ్మతులకు నోచుకోక నిరుపయోగంగా మారాయి. చెన్నపునాయునిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలోని 5 కంప్యూటర్లు 2011 నుంచి మరమ్మతులకు గురయ్యాయి. మార్కాపురంలో.. పొదిలి మండలంలోని ఉప్పలపాడు, పొదిలి ప్రభుత్వ బాలుర, బాలికోన్నత పాఠశాలల్లో దొంగలు పడి కంప్యూటర్లను, సీపీయూలను ఎత్తుకెళ్లారు. పొదిలి బాలుర ఉన్నత పాఠశాలలో 2 కంప్యూటర్లతో విద్యను అందిస్తున్నారు. -
కంప్యూటర్ విద్య కంచికి
సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: ప్రభుత్వ పాఠశాలల్లోని కంప్యూటర్ గదులకు తాళాలు పడ్డాయి. రెండు నెలల క్రితం ప్రభుత్వం కంప్యూటర్ టీచర్లను తొలగించడంతో విద్యార్థులు ఆ విద్యకు దూరమయ్యారు. అదే సమయంలో కాంట్రాక్టు టీచర్లు రోడ్డున పడ్డారు. మరోవైపు కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన విలువైన కంప్యూటర్లు మూలకు చేరాయి. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ కంప్యూటర్ టీచర్లు ఆందోళనకు సిద్ధమయ్యారు. నిరుపేద విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం కంప్యూటర్ విద్యకు శ్రీకారం చుట్టింది. 2002 నుంచి 2007 వరకు మొదటి విడతగా జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను ప్రారంభించింది. 2008-09 సంవత్సరానికి గాను రెండో విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల పాఠశాలల్లో ఏజెన్సీల ద్వారా కంప్యూటర్ బోధనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందుకు అనుగుణంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిల్లాలో సుమారు 256 పాఠశాలల్లో కాంట్రాక్ట్ పద్ధతిన కంప్యూటర్ టీచర్లను నియమించింది. గత ఐదేళ్లుగా వీరి సేవలను వినియోగించుకున్న రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తూ గత సెప్టెంబర్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు అదే పాఠశాలలో కంప్యూటర్ బోధనపైన ఆసక్తి గల సబ్జెక్ట్ టీచర్లను వినియోగించుకొని తాత్కాలికంగా ల్యాబ్‌లను పర్యవేక్షించాలని ఆదేశించింది. దీంతో జిల్లాలో సుమారు 600 మంది టీచర్లు వీధిన పడ్డారు. గత రెండు నెలలుగా ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ టీచర్లు లేక, ఆసక్తి గల ఉపాధ్యాయులు ముందుకు రాక కంప్యూటర్ ల్యాబ్‌లు తెరుచుకోవడం లేదు. నామమాత్రపు వేతనంతో పని చేస్తున్న కంప్యూటర్ టీచర్లను విద్యా సంవత్సరం మధ్యలో తొలగించడంతో వారిపై ఆధారపడ్డ కుటుంబాలు సైతం అవస్థలు పడుతున్నాయి. ఈ దశలో సదరు టీచర్లు ప్రభుత్వంపై సమరం మోగించేందుకు సిద్ధమయ్యారు. డిసెంబర్ వరకు ప్రభుత్వానికి గడువు ఇచ్చి నెల రోజులపాటు విడతల వారీగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. మూలకు చేరిన కంప్యూటర్లు ఐదేళ్ల క్రితం ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి ప్రతి పాఠశాలలకు పది కంప్యూటర్లు, సర్వర్లు, యూపీఎస్, ప్రింటర్, టేబుళ్లను కొనుగోలు చేసింది. ప్రస్తుతం కంప్యూటర్ ల్యాబ్‌లు తెరిచే వారే లేకపోవడంతో వాటి నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది.