Conference on the future activity of the Congress
-
లోపాలపై దాడి.. విమర్శల జడి
కాంగ్రెస్ కార్యాచరణ సదస్సులో పార్టీ పెద్దల తీరును తూర్పారబట్టిన శ్రేణులు రంగారెడ్డి జిల్లా: ‘కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సు’లో ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు నిర్మొహమాటంగా అభిప్రాయాలను వెల్లడించారు. పది కీలకాంశాలపై చర్చకు వేర్వేరు బృందాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ బృందాలు ప్రత్యేకంగా నిర్వహించిన బేటీల్లో దాదాపు 1500 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు తమ సలహాలు, సూచనలు వెల్లడించారు. ఈ వివరాలన్నింటినీ క్రోడీకరించి సోమవారం జరిగిన రెండోరోజు సదస్సులో వాటిని ప్రస్తావించారు. కాంగ్రెస్‌కు చావు లేదు: జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చావులేదని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అభివర్ణించారు. ‘ఫినిక్స్ పక్షి పూర్తిగా భస్మమయ్యాక కూడా బూడిదలోంచి పైకి లేస్తుంది. కాంగ్రెస్ కూడా ఫినిక్స్ లాంటిదే’ అని వ్యాఖ్యానించారు రాష్ట్రంలో ఏ ఊరు వెళ్లినా కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చిందని చెబుతున్నారని పేర్కొన్నారు. కఠినంగా వ్యవహరించాలి: డి.శ్రీనివాస్ పార్టీలో క్రమశిక్షణ కీలకాంశం. కాని దీనికి తగిన ప్రాధాన్యత లేకుండా పోయింది. పార్టీలో పనిచేస్తూ ఇతర పార్టీలకు సహకరిస్తున్నారు. దీంతో కిందిస్థాయి నేతల్లో చులకన భావం కలుగుతోంది. ఇకనైనా కఠినంగా వ్యవహరించాలి. దళితుల్లో నమ్మకాన్ని కలిగించాలి: గీతారెడ్డి దళితులకు పార్టీలో పాధాన్యత తగ్గుతోంది. గ్రామస్థాయి నుంచి పీసీసీ వరకు ఎస్సీ, ఎస్టీలకు పదవుల పంపిణీ జరగాలి. ఆర్థికంగా వెనకబడిన నాయకులకు అండగా నిలవాలి. గ్రామాలవారీగా పరిస్థితిని సమీక్షించేందుకు సమావేశాలు నిర్వహించాలి. బీసీల బలాన్ని గమనించాలి : వీహెచ్ సీఎం కేసీఆర్ తలపెట్టిన సర్వేలో బీసీల స్థానమేంటో తెలిసిపోయింది. 60 శాతం ఉన్న బీసీలకు పదవుల్లో తీవ్ర అన్యాయం జరుగుతోంది. మండల, డీసీసీ పదవుల్లో కీలకభాగం ఈ వర్గానికివ్వాలి. బీసీ సబ్‌ప్లాన్ కోసం ఉద్యమాన్ని లేవనెత్తాలి. మైనార్టీలకు అదనపు పదవులివ్వాలి: షబ్బీర్ అలీ మైనార్టీ నాయకులను కేవలం ఆ వర్గానికి సంబంధించిన పదవులకే పరిమితం చేస్తున్నారు. దీంతో ప్రధాన విభాగాల్లో వీరి ప్రాధాన్యం బాగా తగ్గింది. అలా కాకుండా అన్ని విభాగాల్లో మైనార్టీలకు పదవులను ఇవ్వాలి. మనకూ పేపర్, టీవీ కావాలి: సురేష్‌రెడ్డి కాంగ్రెస్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రచారం చేయడంలో పూర్తిగా విఫలమయ్యాం. మన ఓటమికి ప్రధాన కారణమిదే. మన కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలంటే మనకూ ఒక దినపత్రిక, టీవీ చానల్ అవసరం. -
ఏకత్వంలో భిన్నత్వం!
కాంగ్రెస్ సదస్సులో నేతల భిన్న స్వరాలు ఐక్యంగా ఉన్నామంటూనే పరస్పర విమర్శలు పార్టీని అన్ని స్థాయిల్లో ప్రక్షాళన చేయాలన్న గుత్తా సుఖేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ కోవర్టులున్నారన్న పొంగులేటి సుధాకర్‌రెడ్డి పార్టీలో క్రమశిక్షణ లేకుండా పోయిందన్న డి. శ్రీనివాస్ హైదరాబాద్: నైరాశ్యంలో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలనే లక్ష్యంతో టీపీసీసీ నిర్వహించిన ‘కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సు’లో రాష్ర్ట నేతలు కత్తులు దూసుకోవడం కార్యకర్తలను కలచివేసింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో ఐక్యంగా ఉన్నామనే సందేశాన్ని పంపడానికి ప్రయత్నిస్తూనే ముఖ్య నేతలంతా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం పార్టీ వర్గాలను విస్మయానికి గురిచేసింది. క్షేత్ర స్థాయిలో కాం గ్రెస్ బలోపేతానికి అనుసరించాల్సిన విధానాలను సూచిస్తూ.. మరోవైపు నాయకత్వంలోని లుకలుకలను బయటపెట్టుకోవడం కార్యకర్తల్లో నిరాశ కలిగించింది. వాస్తవాలు చెబుతున్నామంటూ పలువురు నాయకులు నాయకత్వం, ఇతర అంశాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘పార్టీలో క్రమశిక్షణ అంటే అర ్థం లేకుండా పోయింది. పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారంటూ సస్పెండ్ చేస్తారు. మళ్లీ తెల్లారేసరికి దాన్ని ఎత్తేస్తారు. ఇదేం పద్ధతి?’ అని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తప్పుబట్టారు. రైతుల రుణమాఫీపై మనమంతా ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదని ఇప్పుడిది హాట్ టాపిక్. ఈ అంశంపై ఇప్పుడు స్పందించవద్దని మన నాయకులు అంటున్నారు. పరిస్థితులకు తగినట్టు స్పందించాలేగానీ ముహూర్తాలు పెట్టుకుంటే లాభంలేదు. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతుల రుణమాఫీపై మనమంతా ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు. ఇప్పుడిది హాట్ టాపిక్. ఈ అంశంపై ఇప్పుడు స్పందించవద్దని మన నేతలు అంటున్నారు. పరిస్థితులకు తగినట్టు స్పందిం చాలేగానీ ముహూర్తాలు పెట్టుకుంటే లాభంలేదు. పార్టీ జెండా మోసేందుకు బీసీలు కావాలి గానీ అధికారంలోకి వస్తే బీసీలు పనికిరారా? అని టీపీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్ చిత్తరంజన్ దాస్ మండిపడ్డారు. బీసీలను దగ్గరకు తీయకుంటే 2019 లోనూ అధికారంలోకి రామన్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి అభ్యర్థి కాదన్న విషయాన్ని పార్టీ శ్రేణులకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం అభ్యర్థుల్లో పోటీ ఎక్కువైనందునే ఎన్నికల్లో ఓడిపోయామని ఆయన విశ్లేషించారు. చిన్నారెడ్డి మాట్లాడుతూ .. తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టమైన సకల జనుల సమ్మెలో మన ప్రాధాన్యత తక్కువగా కనిపించింది. ఈ అంశాన్ని టీఆర్ఎస్ అనుకూలంగా మార్చుకుని ఎన్నికల్లో విజయం సాధించింది. మనం కూడా కాలేజీ స్థాయిలో వంద శాతం సభ్యత్వ నమోదు చేపట్టాలి. యువత మనవైపు ఉంటే తిరుగుండదు. అదేవిధంగా కమిటీల్లో యువతకు 50 శాతం పదవులు ఇవ్వాలి. డి.శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఫేస్బుక్, ట్విట్ట ర్ లాంటి సామాజిక మీడియాను వినియోగించాల్సిన ఆవశ్యకత ఉంది. పీసీసీ, డీసీసీ స్థాయి లో ప్రత్యేక ఖాతాలు తెరిచి సమాచారాన్ని గ్రామ స్థాయిలో క్షణాల్లో పంపించే ఏర్పాటు చేయాలి ఎంత మంది పార్టీని వీడారో, ఏయే పదవుల్లో ఉన్నవారు కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారనే లెక్కలు కూడా పీసీసీ దగ్గర లేవని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. బ్లాక్ స్థాయి నుంచి పీసీసీ వరకు పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ పొంగులేటి మాట్లాడుతూ.. ఇతర పార్టీలతో మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నోళ్ల వల్లే కాంగ్రెస్‌కు ఈ దుస్థితి వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ అడుగులకు మడుగులొత్తే వాళ్లు ఇంకా ఉన్నారని, రాజీవ్‌ను తిట్టిన నేతలు కూడా పారీ ్టలో కొనసాగడం కాంగ్రెస్ దౌర్భాగ్యమన్నారు.పునాదులను నిర్మించడంలో పార్టీ విఫలమైందని ఐఎన్టీయూ విభాగం నేత, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ నాయకుడు రాఘవయ్య విమర్శించారు. నేతలంతా ఆత్మస్తుతికే పరిమితమవుతున్నారని రాజ్యసభ సభ్యుడు రాపోలు అన్నారు. నిజమైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో పోటీకి ఎంత ఖర్చు పెడతావ్.. ఎంత డబ్బు ఇస్తావ్? పెద్ద నేతలే అడిగితే ఎలాగని ఎంపీ నంది ఎల్లయ్య వాపోయారు. డబ్బు ఉన్నోళ్లకే టిక్కెట్లు ఇస్తున్నారని, ఆ తర్వాత వారు పార్టీని నాశనం చేసి వెళ్లిపోతున్నారని మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ ప్రశ్నించారు. నల్గొండ జడ్పీ చైర్మన్ బాలూ నాయక్ సహా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కార్యకర్తలమంతా ఐక్యంగానే ఉన్నాం. ఐక్యంగా ఉండాల్సిందిమీరే. లేకపోతే మళ్లీ అధికారంలోకి రాం’’ అని వేదికపై ఉన్న నేతలకు చురకలంటించారు. -
హస్తం.. హడావుడి!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో పరాభవాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్‌లో విజయాలను సాధించే దిశగా తలపెట్టిన ‘కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సు’ ఆదివారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ముందుగా తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆదివారం ఇబ్రహీంపట్నంలోని శ్రీఇందు ఇంజినీరింగ్ కళాశాలలో ప్రారంభమైన ఈ సదస్సుకు రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఎన్నికల్లో ఓటమికి కారణాలను విశ్లేషించి కొత్తవ్యూహాల రచనే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహించారు. దేశంలోనే మొదటగా రాష్ట్రంలో సదస్సు ఏర్పాటు చేసిన నేపథ్యంలో టీపీసీసీ ప్రతిష్టాత్మకంగా భావించి సదస్సును విజయవంతం చేసే దిశగా ఏర్పాట్లు చేసింది. పార్టీ ఓటమి పాలవ్వడంతో శ్రేణుల్లో నిరుత్సాహం ఉన్నప్పటికీ.. సదస్సుకు భారీగా తరలిరావడం, హడావుడి వాతావరణం కన్పించడంతో కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. కాగా కొత్తగా తలపెట్టిన ఈ తరహా సదస్సులో ప్రధాన నేతలు మినహా.. ఇతర కీలక నేతలు, ద్వితీయశ్రేణి నాయకులకు, ఇతర కార్యకర్తలకు ప్రసంగించే అవకాశం ఇవ్వలేదు. దీంతో సభానంతరం పలువురు నేతలు పెదవి విరిచారు. జట్లుగా విడగొట్టి.. అభిప్రాయాలు సేకరించి.. ప్రధాన నేతల ప్రసంగం అనంతరం సదస్సుకు వచ్చిన శ్రేణుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు పార్టీ కొత్త వ్యూహాన్ని రచించింది. సామాజిక అంశాలవారీగా పది బృందాలను ఏర్పాటు చేసి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలను ఆయా బృందాలకు బాధ్యులుగా నియమించారు. సదస్సుకు వచ్చిన కార్యకర్తలు వారి మనోభావాలను ఆయా బృందాల వద్ద వ్యక్తపర్చే అవకాశం ఇచ్చారు. ఈ పది బృందాలను సదస్సు జరిగిన ఆవరణలోనే ఇతర బ్లాకుల్లో వినతులు, అభిప్రాయాలు స్వీకరించే ఏర్పాటు చేశారు. దీంతో ఆయా బృందాల వద్దకు కార్యకర్తలు వెళ్లి వారి ఆలోచనలు, సూచనలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ జెండా రెపరెపలు.. ఇబ్రహీంపట్నం మండలంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సదస్సుకు నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. సదస్సు జరిగే ప్రాంతమంతా కాంగ్రెస్ జెండాలు, ఫ్లెక్సీలతో అలంకరించారు. సాగర్ రింగురోడ్డు నుంచి సదస్సు ప్రధాన ద్వారం వరకు పలువురు నాయకులతో కూడిన ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డిజిటల్ స్క్రీన్లు.. భవిష్యత్ కార్యాచరణ సదస్సు ప్రాంగణం భారీగా ఉండడం.. పెద్ద సంఖ్యలో నాయకగణం హాజరుకావడంతో పార్టీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సభావేదికలో ఉన్న పెద్దలు.. ప్రసంగించే నాయకులు స్పష్టంగా కనిపించేలా డిజిటల్ స్క్రీన్లు ఏర్పాట్లు చేశారు. దీంతో సభకు వచ్చిన కార్యకర్తలు, నాయకులు ఆసక్తిగా నేతల ప్రసంగాలను తిలకించారు. ప్రసంగం ప్రారంభం, ముగింపు సమయంలో కరతాలధ్వనులతో సందడి చేశారు. కాగా ఈసదస్సులో జిల్లాకు చెందిన డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, టి.రామ్మోహన్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి, క్రమశిక్షణా సంఘం చైర్మన్ కోదండరెడ్డి, పీసీసీ సీనియర్ నేత ఉద్దెమర్రి నర్సింహారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇక సదస్సు రెండవరోజు సోమవారం కూడా కొనసాగుతుంది. ఈసందర్భంగా పార్టీకి సంబంధించిన పలు కీలక తీర్మానాలు చేయనున్నారు.