congratulate letter
-
శ్రీలంక కొత్త ప్రధానికి మోదీ లేఖ.. భారత్ మద్దతుకు భరోసా!
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక ప్రధానిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టారు దినేశ్ గుణవర్దెన. ఈ క్రమంలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న శ్రీలంకకు భారత్ నుంచి మద్దతు కొనసాగుతుందని భరోసా కల్పించారు. ఆ దేశం ఆర్థికంగా పుంజుకుంటుందని, ప్రజల జీవనం సాధారణ స్థితికి వస్తుందని ఆకాంక్షించారు. ఈ మేరకు కొలంబోలోని భారత్ హైకమిషన్ ట్వీట్ చేసింది. ‘ప్రధాని గుణవర్ధెనకు భారత ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు. తమ పొరుగు దేశమైనందున శ్రీలంక ప్రజలకు భారత్ నుంచి మద్దతు కొనసాగుతుందని భరోసా కల్పించారు. అలాగే.. ఆర్థికంగా త్వరగా పుంజుకుంటుందని, సుసపన్నత, ప్రజల జీవన విధానం మెరుగుపడుతుందని ఆకాంక్షించారు.’ అని పేర్కొంది హైకమిషన్. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీలంకకు సాయం చేయటంలో భారత్ ఎప్పుడూ ముందుంటుంది. అవసరమైన సమయంలో సాయం చేసే దేశాల జాబితాలో కచ్చితంగా ఉంటుంది. 2022 ప్రారంభం నుంచి శ్రీలంకలో పరిస్థితులు మరింత దిగజారాయి. ప్రజలకు నిత్యావసరాలు సైతం దొరకనంత దుర్భర పరిస్థితి నెలకొంది. ప్రజాగ్రహంతో గొటబయ రాజపక్స రాజీనామా చేయగా.. రణీల్ విక్రమ సింఘే ఆ పదవిని చేపట్టారు. ప్రధానిగా దినేశ్ గుణవర్ధెనను నియమించారు. ఇదీ చదవండి: Gotabaya Rajapaksa: సింగపూర్లో ‘గొటబయ’కు ఊహించని షాక్.. క్రిమినల్ కేసు నమోదు! -
మోదీకి 11ఏళ్ల పాక్ బాలిక ఆసక్తికర లేఖ
-
మోదీకి 11ఏళ్ల పాక్ బాలిక ఆసక్తికర లేఖ
ఇస్లామాబాద్ : ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయంపై అభినందనలు తెలుపుతూ ప్రధాని నరేంద్రమోదీకి 11 ఏళ్ల పాక్ బాలిక ఆసక్తికర లేఖ రాసింది. బీజేపీ అద్భుత విజయంపై అభినందనలు తెలియజేసిన పాకిస్తానీ బాలిక, ఇదేమాదిరి మరింత మంది ఇండియన్స్, పాకిస్తానీ హృదయాలను గెలుచుకోవాలని సూచించింది. ఇరు దేశాల మధ్య శాంతి సంబంధాలు నెలకొల్పాలని పేర్కొంది. తన లేఖలో అకిదత్ నవీద్, భారత్, పాక్ ల మధ్య శాంతి అవసరమనే సందేశాన్ని హైలైట్ చేసింది. ఈ ప్రక్రియను ప్రధాని నరేంద్ర మోదీ వేగవంతం చేయడానికి సాయపడాలని పేర్కొది. ''ప్రజల హృదయాలను గెలుచుకోవడం, ఓ అద్భుత విషయమని ఒకసారి మా నాన్న నాకు చెప్పారు. అదేమాదిరి మీరు భారతీయులను మనసులను మీ సొంతం చేసుకున్నారు. యూపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. కానీ ఇంకా ఎక్కువమంది భారతీయ, పాకిస్తానీ ప్రజల హృదయాలను గెలుచుకోవాంటే, ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక, శాంతి సంబంధాలను నెలకొల్పేందుకు మీరు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇరు దేశాలకు సత్సంబంధాలు ఎంతో అవసరం. బుల్లెట్స్ కొనకూడదు, బుక్సే కొనాలని మీము నిర్ణయించుకున్నాం.. అదేమాదిరి గన్స్ కొనకుండా.. పేదప్రజలకు మందులు కొనుగోలు చేసేలా నిర్ణయించాం'' అని పేర్కొంటూ రెండు పేజీల లేఖను ఈ బాలిక మోదీకి రాసింది. శాంతినా.. సమస్యనా ఏది ఎంచుకోవాలో ఛాయిస్ మనదేనంటూ మోదీకి ఈ ఆసక్తికర లేఖను పంపించింది. యూపీ ఎన్నికల్లో అద్భుత విజయానికి అభినందనలు తెలుపుతూ తన సందేశాన్ని ముగించింది. లాహోర్ కు చెందిన ఈ బాలిక, అంతకుముందు కూడా విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ కు లేఖ రాసింది. ఆ లేఖలో కూడా ఇరుదేశాల మధ్య శాంతి సంబంధాలు అవసరమని పేర్కొంది.