మోదీకి 11ఏళ్ల పాక్ బాలిక ఆసక్తికర లేఖ | Pakistani girl congratulates PM Modi for UP victory, calls for turning focus on 'peace' | Sakshi
Sakshi News home page

మోదీకి 11ఏళ్ల పాక్ బాలిక ఆసక్తికర లేఖ

Published Wed, Mar 15 2017 10:17 AM | Last Updated on Sat, Mar 23 2019 8:37 PM

మోదీకి 11ఏళ్ల పాక్ బాలిక ఆసక్తికర లేఖ - Sakshi

మోదీకి 11ఏళ్ల పాక్ బాలిక ఆసక్తికర లేఖ

ఇస్లామాబాద్ : ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయంపై అభినందనలు తెలుపుతూ ప్రధాని నరేంద్రమోదీకి 11 ఏళ్ల పాక్ బాలిక ఆసక్తికర లేఖ రాసింది. బీజేపీ అద్భుత విజయంపై అభినందనలు తెలియజేసిన పాకిస్తానీ బాలిక, ఇదేమాదిరి మరింత మంది ఇండియన్స్, పాకిస్తానీ హృదయాలను గెలుచుకోవాలని సూచించింది. ఇరు దేశాల మధ్య శాంతి సంబంధాలు నెలకొల్పాలని పేర్కొంది. తన లేఖలో అకిదత్ నవీద్, భారత్, పాక్ ల మధ్య శాంతి అవసరమనే సందేశాన్ని హైలైట్ చేసింది. ఈ ప్రక్రియను ప్రధాని నరేంద్ర మోదీ వేగవంతం చేయడానికి సాయపడాలని పేర్కొది.
 
''ప్రజల హృదయాలను గెలుచుకోవడం, ఓ అద్భుత విషయమని ఒకసారి మా నాన్న నాకు చెప్పారు. అదేమాదిరి మీరు భారతీయులను మనసులను మీ సొంతం చేసుకున్నారు. యూపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. కానీ ఇంకా ఎక్కువమంది భారతీయ, పాకిస్తానీ ప్రజల హృదయాలను గెలుచుకోవాంటే, ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక, శాంతి సంబంధాలను నెలకొల్పేందుకు మీరు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇరు దేశాలకు సత్సంబంధాలు ఎంతో అవసరం. బుల్లెట్స్ కొనకూడదు, బుక్సే కొనాలని మీము నిర్ణయించుకున్నాం.. అదేమాదిరి గన్స్ కొనకుండా.. పేదప్రజలకు మందులు కొనుగోలు చేసేలా నిర్ణయించాం'' అని పేర్కొంటూ రెండు పేజీల లేఖను ఈ బాలిక మోదీకి రాసింది.
 
శాంతినా.. సమస్యనా ఏది ఎంచుకోవాలో ఛాయిస్ మనదేనంటూ మోదీకి ఈ ఆసక్తికర లేఖను పంపించింది. యూపీ ఎన్నికల్లో అద్భుత విజయానికి అభినందనలు తెలుపుతూ తన సందేశాన్ని ముగించింది. లాహోర్ కు చెందిన ఈ బాలిక, అంతకుముందు కూడా విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ కు లేఖ రాసింది. ఆ లేఖలో కూడా ఇరుదేశాల మధ్య శాంతి సంబంధాలు అవసరమని పేర్కొంది.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement