construction of capital
-
కన్సల్టెన్సీలకు స్వస్తి
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణం పేరుతో కన్సల్టెన్సీల ఇష్టారాజ్యానికి తెరపడింది. ఏ విభాగంలోనూ కన్సల్టెన్సీలు ఇకపై కొనసాగరాదని సీఆర్డీఏ, ఏడీసీ (అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్)లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 30 కన్సల్టెన్సీల సేవలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. జూలై 31వ తేదీ నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. దుబారా లెక్కలపై ఆరా తీయటంతో.. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ పెద్దల సూచనలకు అనుగుణంగా రాజధానిలో ప్రతి పనికి సీఆర్డీఏ, ఏడీసీలు ఇష్టానుసారంగా కన్సల్టెన్సీలను నియమించుకుని కోట్ల రూపాయలు ముట్టచెప్పాయి. అవసరం లేకున్నా విదేశీ, స్వదేశీ కన్సల్టెన్సీలను ఎడాపెడా నియమించాయి. ఈ భారం రూ.460 కోట్లకుపైనే ఉండగా గతంలోనే రూ.329 కోట్లను చెల్లించారు. కన్సల్టెన్సీలు ఇప్పటికీ సీఆర్డీఏ, ఏడీసీ కార్యాలయాల్లో తిష్ట వేసి పని లేకపోయినా పెత్తనం చలాయిస్తున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దుబారా వ్యయాలపై దృష్టి సారించడంతో కన్సల్టెన్సీల లెక్కలు బయటకు వచ్చాయి. గత ఐదేళ్లలో నియమించిన కన్సల్టెన్సీలు, పనులు, ఖర్చుల గురించి ఉన్నతాధికారుల కమిటీ ఇటీవలే నివేదిక అందచేసింది. దీని ప్రకారం 30 కన్సల్టెన్సీలను తాత్కాలికంగా ఉపసంహరించుకుంటున్నట్లు గత నెల 31వ తేదీన సమాచారం ఇచ్చారు. తక్షణం పనులు నిలిపివేయాలని ఆదేశించారు. తదుపరి వాటిని కొనసాగించాల్సిన అవసరం ఉంటే సమాచారం ఇస్తామని తెలిపారు. అన్ని విభాగాల డైరెక్టర్లకు నియమించిన కన్సల్టెన్సీలు, చేపట్టిన పని, చెల్లించిన సొమ్ము, ప్రస్తుతం వాటి అవసరం ఉందా? అనే అంశాలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కన్సల్టెన్సీలకు కోట్లకు కోట్లు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో నిపుణులైన అధికారులతోపాటు దేశంలో నైపుణ్యం కలిగిన పలు సంస్థలున్నా పట్టించుకోకుండా టీడీపీ హయాంలో భారీ వ్యయంతో ఇష్టానుసారంగా కన్సల్టెన్సీలను నియమించారు. మొత్తం 70కిపైగా కన్సల్టెన్సీలను నియమించగా సీఆర్డీఏలో 50, ఏడీసీలో 20 వరకు కన్సల్టెన్సీలున్నాయి. పరిపాలనా నగరం డిజైన్ల పేరుతో హడావుడి చేసిన నార్మన్ పోస్టర్ సంస్థకు సీఆర్డీఏ ద్వారా రూ.112 కోట్లను చెల్లించారు. హఫీజ్ కాంట్రాక్టర్‌ను పార్టనర్‌గా నియమించుకునేలా లండన్ కంపెనీ నార్మన్ ఫోస్టర్‌పై ఒత్తిడి తెచ్చి అదనంగా రూ.60.72 కోట్లు ముట్టచెప్పారు. ఈ రెండు సంస్థలు అందచేసిన రంగుల బొమ్మల కోసమే రూ.173.31 కోట్లు వ్యయం చేశారు. పెత్తనం అంతా వాటిదే! ఒకపక్క వందల సంఖ్యలో కొత్తగా ఇంజనీర్ల నియామకం మరోపక్క డిప్యుటేషన్లపై వివిధ శాఖల నుంచి పనిచేయించుకుంటూనే ప్రాజెక్టుల నిర్వహణ పేరుతో గత సర్కారు ప్రతి పనికి మేనేజ్మెంట్ కన్సల్టెంట్లను నియమించింది. ఈ నిర్వహణ సంస్థలకే రూ.100 కోట్లకుపైనే చెల్లించింది. రాజధాని ప్రకటనకు ముందే మాస్టర్‌ప్లాన్ కోసం సింగపూర్‌కు చెందిన సుర్బానా ఇంటర్నేషనల్‌ను కన్సల్టెన్సీగా నియమించుకున్న టీడీపీ సర్కారు రూ.14.8 కోట్లు చెల్లించింది. బ్లూ కన్సల్టెంట్, గ్రీన్ కన్సల్టెంట్, రాజధాని స్ట్రాటజీ ప్రోగ్రాంను తయారు చేసేందుకు రూ.29 కోట్లు చెల్లించి మెకన్సీని నియమించింది. సీఆర్డీఏ కమిషనర్ కార్యాలయానికి సలహాలిచ్చేందుకు కూడా ఒక కన్సల్టెంట్‌ను నియమించుకున్నారు. సీఆర్డీఏ, ఏడీసీ కార్యాలయాల్లో అసలు ఉద్యోగుల కంటే ఈ కన్సల్టెంట్ల హడావుడే ఎక్కువగా ఉంది. -
రాజధాని నిర్మాణం కోసం.. స్కేటింగ్ చేస్తున్న పదేళ్ల చిన్నారి
ప్రకాశం (ఒంగోలు): ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం స్కేటింగ్ చేస్తూ నిధులు సేకరిస్తుందో ఓ చిన్నారి. అందులో భాగంగా తిరుపతి నుంచి బయలుదేరిన చిన్నారి అకుల ఏషా(10) గురువారం ఒంగోలు పట్టణానికి చేరుకుంది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. -
రాజధాని నిర్మాణానికి సహకరించండి
విజయవాడలో జరిగిన ఉగాది వేడుకల్లో కలెక్టర్ బాబు.ఎ విజయవాడ : నూతన రాజధాని అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కలెక్టర్ బాబు.ఎ కోరారు. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, కృష్ణాజిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో విజయవాడలోని ఘంటసాల సంగీత కళాశాలలో శనివారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కలెక్టర్ ప్రసంగించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం సమష్టిగా కృషి చేస్తామని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు సభికులతో ప్రతిజ్ఞ చేయించారు. మునిసిపల్ కమిషనర్ వీరపాండియన్ మాట్లాడుతూ కృష్ణాజిల్లాను స్మార్ట్‌సిటీగా మార్చటానికి ప్రజలు కృషి చేయాలన్నారు. జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, కార్పొరేటర్ కొండపల్లి అనసూయ, కాకు మల్లికార్జున యాదవ్, సీనియర్ పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావు తదితరులు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ముగింపు సభలో ఎంపీ కేశినేని నాని పాల్గొని ప్రసంగించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. నాదస్వరం, వేదపఠనం, పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం జరిగాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవులు వలివేటి శివరామకృష్ణ, ఆచార్య తమ్మారెడ్డి నిర్మల, సీహెచ్ బృందావనరావు, వి.ఉమామహేశ్వరి, పింగళి వెంకట కృష్ణారావు, పాణిగ్రాహి రాజశేఖర్, అవనిగడ్డ సూర్యప్రకాష్, మేరీ కృపాబాయి, ఎరుకలపూడి గోపీనాథరావు, కాటూరి రవీంద్ర త్రివిక్రమ్, కవయిత్రి శైలజ తదితరులు తమ కవిత్వంతో ఆకట్టుకున్నారు. పలువురు విద్యార్థులు తమ నృత్య ప్రదర్శనలతో అలరించారు. అనంతరం అతిథులకు ఉగాది పచ్చడి అందజేశారు. ఈ కార్యక్రమానికి న్యాయవాది వేముల హజరత్తయ్య గుప్తా వ్యాఖ్యాతగా వ్యవహరించగా, జిల్లా పౌరసంబంధాల అధికారి కె.సదారావు పర్యవేక్షించారు. నగర పరిధిలో వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టించుకున్న వారికి, ఈ-పోస్ విధానం అమలుచేస్తున్న డీలర్లకు ప్రభుత్వం పురస్కారాలు అందజేసింది. రాజధాని నిర్మాణాం, కలెక్టర్ బాబు.ఎ, సహకరించండి, -
పంటలెందుకు వేసుకోనివ్వడం లేదు?
రాజధాని ప్రాంతంపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న విచారణ 23కి వాయిదా సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణం కోసం భూములు సమీకరించాలని తలపెట్టిన ప్రాంతాల్లో రైతులను ఎందుకు పంటలు వేసుకోనివ్వడం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని అదనపు అడ్వొకేట్ జనరల్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. రాజధాని నిర్మాణం కోసం ఆంధ్రపదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) చట్టం కింద చేస్తున్న భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) నుంచి తమ భూములను మినహాయించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన రైతులు భీమిరెడ్డి శివరామిరెడ్డి, మరో 31 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం న్యాయమూర్తి ఎ.రాజశేఖరరెడ్డి విచారించారు. పిటిషనర్ల తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ముందుగా సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపి స్తూ పిటిషనర్లు పేద రైతులని, వారికున్న కొద్దిపాటి పొలమే వారికి జీవనాధారమని, ప్రభుత్వం ఇప్పుడు వారికి జీవనాధారం లేకుండా చేయాల్సి చూస్తోందని చెప్పారు. రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వం వీరి భూములను వీరి ఇష్టానికి వ్యతిరేకంగా, బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని నివేదించారు. భూ సమీకరణను పిటిషనర్లతో పాటు చాలా మంది రైతులు కూడా వ్యతిరేకిస్తున్నారని, వారిని ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోందని తెలిపారు. భూ సమీకరణను వ్యతిరేకించిన ఆరు గ్రామాల్లోని రైతులకు చెందిన పంటలను, పంపులను, షెడ్లను గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టారని చెప్పారు. భూ సమీకరణపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, వాటిని అధికారులకు సమర్పించామని, ఇప్పటి వరకు వాటిపై ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదని, ఇది చట్ట నిబంధనలకు విరుద్ధమని ఆయన వివరించారు. ఈ సమయంలో దమ్మాలపాటి శ్రీనివాస్ జోక్యం చేసుకుంటూ అభ్యంతరాలపై ఉత్తర్వులు జారీ చేయకముందే పిటిషనర్లు కోర్టుకు వచ్చారని, అందువల్ల ఇది అపరిపక్వ వ్యాజ్యమని చెప్పారు. అభ్యంతరాల సమర్పణకు గడువు తేదీ పొడిగించామని, ఆ తేదీ తరువాత మరో 15 రోజులకు ఉత్తర్వులు జారీ చేసేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉందని తెలిపారు. దీనికి న్యాయమూర్తి పిటిషనర్లను ఉద్దేశించి.. ‘మీ హక్కులకు ఈ దశలో ఎటువంటి భంగం కలగడం లేదు కదా? మరి అలాంటప్పుడు మీకున్న భయాందోళనలు ఏమిటి?’ అంటూ వ్యా ఖ్యానించారు. భూ సమీకరణ పేరుతో అధికారులు రైతులను పంటలు వేసుకోనివ్వడం లేదని సుధాకర్‌రెడ్డి న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై న్యాయమూర్తి.. అలా ఎందుకు చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిం చారు. పూర్తి వివరాలను తమ ముందుంచాలని అదనపు ఏజీని ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేశారు.