Consumer Council
-
ఈకామర్స్ ఫ్లాష్‌సేల్స్, కేంద్రానికి నాస్కామ్ సిఫార్సులు
న్యూఢిల్లీ: ఆన్లైన్ కంపెనీల కార్యకలాపాలకు అనుగుణంగానే వాటి బాధ్యతలను కూడా క్రమబద్ధీకరించాలని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అలాగే వినియోగదారులకు సకాలంలో రీఫండ్ అందేలా చూసేంత వరకు మాతమ్రే వాటి బాధ్యతలను పరిమితం చేయాలని పేర్కొంది. ఈ–కామర్స్ సంస్థల నిబంధనల ముసాయిదాకు సంబంధించి కేంద్రం చేసిన ప్రతిపాదనలపై నాస్కామ్ ఈ మేరకు తన అభిప్రాయాలు తెలియజేసింది. మోసపూరిత ఫ్లాష్ సేల్స్, ఉత్పత్తులు.. సర్వీసులను మోసపూరితంగా విక్రయించడం వంటి వాటిని నిషేధించడానికి, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం జూన్ 21 ఈ నిబంధనలను ప్రతిపాదించింది. వీటిపై పరిశ్రమ వర్గాలు, ప్రజలు అభిప్రాయాలు తెలియజేయడానికి జూలై 6 ఆఖరు తేదీ అయినప్పటికీ ఆగస్టు 5 దాకా పొడిగించింది. వీటిపైనే నాస్కామ్ తాజాగా తమ అభిప్రాయాలు తెలియజేసింది. ప్రతిపాదిత నిబంధనల్లోని కొన్ని అంశాలు వినియోగదారుల రక్షణ చట్టం 2019 పరిధిలోకి కాకుండా కాంపిటీషన్ చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం పరిధిలోకి వచ్చే విధంగా ఉన్నాయని పేర్కొంది. కొన్ని కార్యకలాపాలను నిషేధించడం కాకుండా వినియోగదారుల హక్కులు కాపాడేందుకు అవసరమైతే సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) విచారణ జరిపేలా.. అనుచిత వాణిజ్య విధానాలకు సంబంధించి సూచనప్రాయంగా ఒక జాబితాలాంటిది పొందుపర్చవచ్చని నాస్కామ్ తెలిపింది. -
పరస్పర సహకారంతో మంచి ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: రైల్వేకు, సరుకు రవాణాదారుకు మధ్య పరస్పర సహకారం కొనసాగితే గతేడాది సాధించిన రికార్డుకంటే మెరుగైన ఫలితం సాధించే అవకాశం ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా ఆశాభావం వ్యక్తం చేసారు. దక్షిణ మధ్య రైల్వే 2018–19 ఆర్థిక సంవత్సరానికిగాను భారతీయ రైల్వే లోని అన్ని జోన్లకంటే ఉత్తమ స్థాయిలో సరుకు రవాణా చేసిన రికార్డును పురస్కరించుకొని సరుకు రవాణాలో క్రియాశీలక భాగస్వామ్యంగా ఉన్న పరిశ్రమల అధికారు లు, ప్రతినిధులు, ఇతర కంపెనీలను గురువారం సికింద్రాబాద్ రైల్‌నిలయంలో సన్మానించింది. జీఎం మాట్లాడుతూ జోన్‌లోని అధికారులు, సరుకు వినియోగదారు మధ్య విశ్వసనీయ సంబంధాలు, సమర్థవంతమైన కార్యాచరణ అమలు చేయడం, అందుబాటులోని గూడ్స్ వ్యాగన్ల వినియోగంతో సరుకు రవాణాలో అత్యధిక రికార్డు సాధించిందన్నారు. వినియోగదారుల ప్రతిస్పందన విలువైందని, వాటిని రైల్వే పరిగణనలోనికి తీసుకుంటుందని అన్నారు. గణనీయ స్థాయిలో సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచే కొత్త మార్గాలైన, డబ్లింగ్/ట్రిప్లింగ్ మార్గాలు, విద్యుదీకరణ వంటి మౌళిక సదుపాయాల గురించి వివరించారు. జోన్ చేసిన సరుకు రవాణాలో ఎరువు, ఐరన్ వోర్, ఆహార ధాన్యాలే కాకుండా బొగ్గు (55%), సిమెంట్ (23%) తొలి 2 స్థానాల్లో నిలిచాయని అన్నారు. బొగ్గు ఉత్పత్తి సంస్థల్లో సింగరేణి, విద్యుత్ ఉత్పత్తి కంపెనీల అవసరాలు తీరుస్తూ మొత్తం సరుకు రవాణాలో 39%, కేవలం బొగ్గు రవాణాలో 71% నమోదు చేసిందన్నారు. సమావేశంలో సీఎండీ ప్రభాకరరావు, ఏపీ జెన్కో చైర్మన్ అజయ్ జైన్, సింగరేణి కంపెనీ ఎలక్ట్రికల్ మెకానికల్ డెరైక్టర్ ఎస్.శంకర్ పాల్గొన్నారు. -
ప్రాజెక్ట్ డైరెక్టర్‌ను కలిసిన వినియోగదారుల మండలి
న్యూశాయంపేట : తల్లిపాలను వ్యాపార దృక్పథం తో భారతదేశంలో ఆహార నాణ్యత, భద్రత చట్టం 2006 (ఎఫ్ఎస్ఎస్ఏఐ) పరిధిలోకి తేవాలా, వద్దా అనే అంశంపై కేంద్ర ప్ర భుత్వం వినియోగదారుల సంఘాల ద్వారా అభిప్రాయసేకరణ ప్రారంభిం చింది. దీనిలో భాగంగా జిల్లా వినియోగదారుల మండలి ఆధ్వర్యంలో ఈ మేరకు ప్రతినిధులు సోమవారం మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ను కలిశారు. యూరప్, లాటిన్ అమెరికా, నార్త్ అమెరికా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, కాలిఫోర్నియా, న్యూయార్క్ తదితర ప్రాంతాల్లో తల్లిపాల బ్యాంక్‌ల ద్వారా అవసరం ఉన్న పిల్లలకు తల్లిపాల అమ్మకాలు కొనసాగుతున్నాయి. మనదేశంలో కూడా తల్లిపాల సేకరణ తల్లిపాల బ్యాంకింగ్ కోసం ఎఫ్ఎస్ఎస్ఏఐ చట్టపరిధిలో స్టాండర్స్ ఏర్పరిచే నిమిత్తం తల్లిపాలను వ్యాపార దృక్పథంతో విధాన నిర్ణయాలు చేసే నిమిత్తం కేంద్రం అభిప్రాయ సేకరణ ప్రారంభించింది. ఈ క్రమంలో వినియోగదారుల మండలి అధ్యక్షుడు సాంబరాజు చక్రపాణి, రాష్ట్ర వినయోగదారుల మండలి సంస్థల సమాఖ్య ఉపాధ్యక్షుడు పల్లెపాడు దామోదర్, మండలి ప్రతినిధి రావుల రంజిత్‌లు పీడీ ఐసీడీఎస్ శైలజాకుమారికి అభిప్రాయ సేకరణ సమాచారం, వినతిపత్రాన్ని ఇచ్చారు. జిల్లాలోని అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో తమ అభిప్రాయా లు తెలపాలని మండలి ప్రతినిధులు కోరారు. కార్యక్రమంలో సీడీపీఓ ప్రేమలత తదితరులు పాల్గొన్నారు.