ప్రాజెక్ట్ డైరెక్టర్‌ను కలిసిన వినియోగదారుల మండలి
Published Tue, Aug 9 2016 12:18 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
న్యూశాయంపేట : తల్లిపాలను వ్యాపార దృక్పథం తో భారతదేశంలో ఆహార నాణ్యత, భద్రత చట్టం 2006 (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) పరిధిలోకి తేవాలా, వద్దా అనే అంశంపై కేంద్ర ప్ర భుత్వం వినియోగదారుల సంఘాల ద్వారా అభిప్రాయసేకరణ ప్రారంభిం చింది.
దీనిలో భాగంగా జిల్లా వినియోగదారుల మండలి ఆధ్వర్యంలో ఈ మేరకు ప్రతినిధులు సోమవారం మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ను కలిశారు. యూరప్, లాటిన్ అమెరికా, నార్త్ అమెరికా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, కాలిఫోర్నియా, న్యూయార్క్ తదితర ప్రాంతాల్లో తల్లిపాల బ్యాంక్‌ల ద్వారా అవసరం ఉన్న పిల్లలకు తల్లిపాల అమ్మకాలు కొనసాగుతున్నాయి. మనదేశంలో కూడా తల్లిపాల సేకరణ తల్లిపాల బ్యాంకింగ్ కోసం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చట్టపరిధిలో స్టాండర్స్ ఏర్పరిచే నిమిత్తం తల్లిపాలను వ్యాపార దృక్పథంతో విధాన నిర్ణయాలు చేసే నిమిత్తం కేంద్రం అభిప్రాయ సేకరణ ప్రారంభించింది. ఈ క్రమంలో వినియోగదారుల మండలి అధ్యక్షుడు సాంబరాజు చక్రపాణి, రాష్ట్ర వినయోగదారుల మండలి సంస్థల సమాఖ్య ఉపాధ్యక్షుడు పల్లెపాడు దామోదర్, మండలి ప్రతినిధి రావుల రంజిత్‌లు పీడీ ఐసీడీఎస్ శైలజాకుమారికి అభిప్రాయ సేకరణ సమాచారం, వినతిపత్రాన్ని ఇచ్చారు. జిల్లాలోని అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో తమ అభిప్రాయా లు తెలపాలని మండలి ప్రతినిధులు కోరారు. కార్యక్రమంలో సీడీపీఓ ప్రేమలత తదితరులు పాల్గొన్నారు.
Advertisement