Contract and outsourcing employees
-
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.786 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 11వ వేతన సవరణలో భాగంగా కాంట్రాక్టు ఉద్యోగులతోపాటు ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాలను కూడా పెంచింది. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెంచిన వేతనాలను ఈ నెల నుంచే అమలు చేయనున్నట్లు ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్.రావత్ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. వేతనాల పెంపు ద్వారా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏటా అదనంగా రూ.786 కోట్ల మేర ప్రయోజనం చేకూరనుంది. దళారీ వ్యవస్థ లేకుండా.. రాష్ట్రంలో 1,00,996 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులున్నారు. దళారీ వ్యవస్థతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇక్కట్లను గుర్తించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్ (ఏపీసీఓఎస్)ను ఏర్పాటు చేసింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఈ కార్పొరేషన్ కిందకు తీసుకురావడమే కాకుండా ప్రతీ నెలా 1వ తేదీనే వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లప్రస్తుతం వేతనాల రూపంలో ఏటా రూ.1,860 కోట్లు చెల్లిస్తున్నారు. ఇప్పుడు 11వ వేతన సవరణ ప్రకారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచడంతో ఏడాదికి అదనంగా రూ.430 కోట్ల మేర ప్రయోజనం పొందనున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను మూడు కేటగిరిలుగా వర్గీకరించి వేతనాలను పెంచుతూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మినిమమ్ టైమ్ స్కేల్ అమలు.. కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా 11వ వేతన సవరణ ప్రకారం మినిమమ్ టైమ్ స్కేలును అమలు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు వెలువరించింది. వేల సంఖ్యలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.661 కోట్లు చెల్లిస్తోంది. ఈ నెల నుంచి పెరిగిన వేతనాల ద్వారా కాంట్రాక్టు ఉద్యోగులకు ఏటా రూ.356 కోట్ల మేర అదనపు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నవారు, యూనివర్సిటీలు, సొసైటీలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని ఆర్ధిక శాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పూర్తి సమయం, ఎన్ఎంఆర్, రోజువారీ వేతనం, కన్సాలిడేటెడ్ పే, పార్ట్ టైం ఉద్యోగులకు కూడా 11వ వేతన సవరణ మేరకు మినిమమ్ టైమ్ స్కేలు అమలు చేస్తూ ఆర్థిక శాఖ మరో ఉత్తర్వులను కూడా ఇచ్చింది. వీరికి కూడా ఈ నెల నుంచే మినిమమ్ టైమ్ స్కేలును వర్తింప చేయనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కేటగిరీల వారీగా పెరిగిన వేతనాలు కేటగిరి–1 (పెరిగిన నెల వేతనం రూ. 21,500) సీనియర్ అసిస్టెంట్, సీనియర్ స్టెనో,సీనియర్ అకౌంటెంట్, ట్రాన్స్‌లేటర్,డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ కేటగిరి–2 (పెరిగిన నెల వేతనం రూ. 18,500) డ్రైవర్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో, టైపిస్ట్, టెలిఫోన్ ఆపరేటర్, స్టోర్ కీపర్, ఫొటోగ్రాఫర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్, లైబ్రేరియన్, ల్యాబ్ అసిస్టెంట్, సూపర్వైజర్, మేనేజర్ కేటగిరి–3 (పెరిగిన నెల వేతనం రూ. 15,000) ఆఫీస్ సబార్టినేట్, వాచ్మెన్, కుక్, వాచ్మెన్, కుక్ చౌకీదార్, సైకిల్ ఆర్డర్లీ, లిఫ్ట్ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్, దఫేదార్, జిరాక్స్ ఆపరేటర్, రికార్డ్ అసిస్టెంట్ -
‘ఉపాధి’ సిబ్బందికి లోకేశ్ ఝలక్
సాక్షి, అమరావతి: రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం తన శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నిలువునా మోసం చేశారు. కేంద్రం ఇస్తున్న ఉపాధి హామీ పథకం నిధుల్లోంచే దాదాపు రూ.రెండున్నర కోట్లు ఖర్చు పెట్టి ఆ విభాగంలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పిలిపించుకుని, వారిచే సన్మానం చేయించుకుని.. ఆ సన్మాన సభలో జీతాలు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం జీవో నంబర్ 52ను జారీ చేసినట్టు తెలిపారు. ప్రభుత్వ వెబ్సైట్లో ఆ జీవో గురించి చూస్తే.. దానిని కాన్ఫిడెన్షియల్‌గా పేర్కొంటూ వివరాలు కనిపించనీయకుండా జాగ్రత్త పడ్డారు. ఐఏఎస్‌ల సమక్షంలోనే అధికారుల లోకేశ్ భజన ఉపాధి కూలీలకు గతేడాది డిసెంబర్ నుంచి దాదాపు రూ.360 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. అయినా ఆ శాఖ మంత్రి లోకేశ్.. ఆ పథకం నుంచే రూ.రెండున్నర కోట్లు ఖర్చుపెట్టి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో తన సన్మాన కార్యక్రమం నిర్వహించుకున్నారు. సిబ్బందికి జీతాలు పెంచుతున్నట్టు ఆశ పెట్టి, రాష్ట్రవ్యాప్తంగా ఆ పథకంలో పనిచేసే ఉద్యోగులను ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసిమరీ విజయవాడ రప్పించుకున్నారు. సభలో రాజకీయ నాయకులతో పాటు ఉద్యోగులు కూడా ఐఏఎస్ అధికారుల సమక్షంలోనే మంత్రి లోకేశ్‌ను పులిబిడ్డ.. అంటూ కీర్తించారు. లోకేశ్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో పనిచేసే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల గౌరవ వేతనాన్ని 30 శాతం పెంచుతున్నట్టు ప్రకటించారు. -
‘ఉద్యోగాలను అమ్మేస్తున్నారు’∙
సాలూరు : కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను అధికార పార్టీ నాయకులు లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర విమర్శించారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు మంగళవారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ ఎన్నికల ముందు టీడీపీ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామన్నారని, అధికారం చేపట్టాక పలువురికి అన్యాయం చేశారన్నారు. ఇప్పుడేమో ఏకంగా కాంట్రాక్టు కార్మికులను కాంట్రాక్టర్‌కు అప్పగించాలని చూస్తుండడం దారుణమన్నారు. డబ్బులు తీసుకోకుండా ఒక్కరికీ ఉద్యోగం కల్పించడంలేదన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం రానుందని, అప్పుడు తప్పకుండా అర్హులకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. జీఓ 279ను రద్దుచేయాలని చేస్తోన్న పోరాటాన్ని కార్మికులు ధైర్యంగా కొనసాగించాలని సూచించారు. కార్మికులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్మికులకు మద్దతు తెలిపినవారిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు జరజాపు ఈశ్వరరావు, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వంగపండు అప్పలనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు సువ్వాడ రమణ, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ గిరి రఘు, మాజీ కౌన్సిలర్ రామకృష్ణ ఉన్నారు. -
నోకాంట్రాక్ట్.. నో ఔట్ సోర్సింగ్
-
నోకాంట్రాక్ట్.. నో ఔట్ సోర్సింగ్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో భవిష్యత్తులో భర్తీ చేసే శాశ్వత ఉద్యోగాలకు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సేవలు, నియామకాలు చేపట్టబోమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో ప్రకటించారు. అలాగే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తామని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సమాన అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశంపై సభ్యులు ఆర్.కృష్ణయ్య, అక్బరుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నలపై ముఖ్యమంత్రి స్పందించారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు దుర్మార్గమైన ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానాన్ని తెచ్చి ఉద్యోగులు అర్ధాకలితో ఉండేలా చేశాయని, కానీ తమ ప్రభుత్వం దాన్ని రూపుమాపే చర్యలు తీసుకుందన్నారు. ఏ ఒక్క ఉద్యోగి అర్ధాకలితో ఉండకూడదనేదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. విపక్షాలది దుష్ప్రచారం... ప్రభుత్వోద్యోగాల కల్పన విషయంలో విపక్షాలు పనిగట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై దుష్ప్రచారం చేస్తున్నాయని కేసీఆర్ ధ్వజమెత్తారు. దేశంలో, రాష్ట్రంలో ఉన్న అందరికీ ఎవరూ ఉద్యోగాలు, ఉపాధి కల్పించలేరని, అయినా ఈ విషయంలో ప్రధాని మోదీని, తమను విపక్ష పార్టీలు బద్నాం చేస్తున్నాయని దుయ్యబట్టారు. అనేక రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయని, అందులో ప్రభుత్వపరంగా లభించే ఉద్యోగాలకు పర్మినెంట్ విధానం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తమ ప్రభుత్వం కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరిస్తామంటే కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశాయని... అందుకే గాంధీ భవన్ ముందు కాంట్రాక్టు లెక్చరర్లు ఆందోళన చేశారని సీఎం గుర్తుచేశారు. త్వరలోనే హోంగార్డుల సమస్యను పరిష్కారిస్తామని చెప్పారు. వారిని క్రమబద్ధీకరించే క్రమంలో న్యాయపరమైన చిక్కులు వస్తున్నాయన్నారు. ఉద్యోగ కల్పన విషయంలో రాష్ట్ర ప్రజలు, నిరుద్యోగులకు అవగాహన కల్పించాల్సిన అవసరం శాసనసభకు, సభ్యులకు ఉందన్నారు. అంతకుముందు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ క్రమబద్ధీకరణ విషయంలో న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా అసెంబ్లీలో చట్టం చేయాలని కోరారు. అక్బరుద్దీన్ మాట్లాడుతూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని సూచించారు. రిజిస్టర్ చేయని ఆలయాల అర్చకులకూ వేతనాలపై త్వరలో భేటీ... దేవాదాయశాఖ పరిధిలో రిజిస్టర్ చేయని దేవాలయాలను పరిగణనలోకి తీసుకొని అక్కడి అర్చకులకు సైతం వేతన సౌలభ్యం కల్పించాలన్న అంశంపై ఈ సమావేశాల్లోనే శాసన సభ్యులు, అధికారులతో ప్రత్యేక భేటీ నిర్వహించి నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అర్చకులు, సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అర్చకుల సమస్యలపై శాసనసభలో విపక్ష సభ్యులు సతీశ్ కుమార్, అక్బరుద్దీన్లు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానం ఇచ్చారు. మసీదుల్లో పని చేస్తున్న మౌజన్, ఇమామ్‌లకు గౌరవ వేతనం ఇస్తున్నామని, అయితే వారికి దేవాలయ అర్చకులకు ఇస్తున్న మాదిరే ట్రెజరీ ద్వారా వేతనాలు ఇవ్వాలన్న సభ్యుల సూచనను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా సభ్యులతో భేటీ ఏర్పాటు చేస్తామన్నారు. కొన్ని మసీదుల్లో ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనాలు పెంచుతామని సీఎం తెలిపారు. అన్ని రకాల ఆలయాల అర్చకులను సమానంగా చూడాలంటూ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం స్పందిస్తూ దేశంలో లౌకికవాదం ఎంత బలంగా ఉందో అక్బరుద్దీన్ స్టేట్మెంట్తో తెలుస్తుందన్నారు. -
తీరని వ్యథ
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ కళాశాల కథ మారలేదు. వ్యథా తీరలేదు. అదనపు స్వయం ప్రతిపత్తి కింద కొనసాగుతున్న రిమ్స్‌ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోనున్నట్లు రాష్ట్ర వైద్య విద్య సంచాలకుల నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఆధీనంలోకి రిమ్స్ వస్తే సౌకర్యాలు మెరుగుపడి నాణ్యమైన వైద్యం అందుతుందని ప్రజలు ఆశించారు. కానీ రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన అమలులోకి రావడంతో ఆ ఉత్తర్వులకు అధికారిక ముద్ర పడలేదు. దీంతో పాత పద్ధతిలో సెమీ అటానమస్ విధానం కిందే కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెనుకబడిన జిల్లాల్లోని ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలందించాలనే లక్ష్యంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాకు రిమ్స్‌ను మంజూరు చేశారు. అప్పట్లోనే ప్రత్యేక జీవో ద్వారా రిమ్స్‌కు సెమీ అటానమస్ హోదా కల్పించారు. అయితే రిమ్స్‌లో 15 మంది వైద్యులను మినహాయిస్తే మిగతా వారంతా ఒప్పంద, పొరుగు సేవల్లో పనిచేస్తున్నారు. నిర్వహణ నిధుల్ని సైతం ప్రణాళిక బడ్జెట్ నుంచే కేటాయిస్తున్నారు. కళాశాల ఆరంభమై ఆరేళ్లవుతున్నా..వైద్యశాలలో పూర్తిస్థాయిలో ప్రొఫెసర్లు, విభాగాల వారీగా నిపుణులు భర్తీకాలేదు. దీంతో కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ రోగులకు అసలు సేవలే అందడం లేదు. ప్రతి కేసును గుంటూరు జనరల్ వైద్యశాలకు రిఫర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రోగులకు నాణ్యమైన సేవలందించేందుకు ప్రభుత్వం రిమ్స్‌ను తన ఆధీనంలోకి తీసుకోవాలని భావించింది. ఏప్రిల్ 1 నుంచి రిమ్స్‌ను ప్రభుత్వపరంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు గత ఏడాది డిసెంబర్లో ఉత్తర్వులు జారీ చేశారు. పొరుగు సేవలు, ఒప్పంద విధానంలో కొనసాగుతున్న ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు, వైద్యులు, పారామెడికల్ ఉద్యోగులు, ల్యాబ్ టెక్నీషియన్లు, స్కానింగ్, ల్యాబ్ విభాగాలతో పాటు నాలుగో తరగతి ఉద్యోగుల వరకు ప్రభుత్వమే నియమిస్తుందని స్పష్టం చేశారు. కానీ ఆ గడువు ముగిసినా..ప్రభుత్వం ఆధీనంలోకి రిమ్స్‌ను తీసుకునేలా చర్యలు లేకపోవడంతో పాత విధానంలోనే రిమ్స్ కొనసాగాల్సి వస్తోంది. సెమీ అటానమస్ విధానంలో పనిచేస్తున్న రిమ్స్‌ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలంటే రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతుండటంతో అందుకు అవకాశం లేదు. దీంతో సీమాంధ్ర రాష్ట్రం పూర్తిస్థాయిలో విభజన జరిగి కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తరువాత తీసుకునే నిర్ణయంపై రిమ్స్ వ్యవహారం ఆధారపడి ఉంది. కాంట్రాక్టు గడువు పొడిగించారు డాక్టర్ బీ అంజయ్య, డైరక్టర్ రిమ్స్ రిమ్స్‌లో ఒప్పంద విధానంలో పని చేస్తున్న వైద్యుల పదవీ కాలాన్ని ఈ ఏడాది మార్చి నుంచి మరో ఏడాది వరకు ప్రభుత్వం పొడిగించింది. దీంతో సెమీ అటానమస్ విధానంలోనే రిమ్స్ కొనసాగుతోంది.