contract employes
-
ఎలాన్ మస్క్ భారీ షాక్.. మరోసారి వేల మంది ట్విటర్ ఉద్యోగుల తొలగింపు
మల్టీమిలియనీర్, ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ ఉద్యోగులకు మరోసారి భారీ షాక్ ఇవ్వనున్నారు. గత వారంలో ట్విటర్లో పనిచేసే మొత్తం ఉద్యోగుల్లో 50 శాతం అంటే సుమారు 3500 మందిపై వేటు వేశారు. అయితే ఈ వారం ముగిసేలోపే భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగిస్తున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్లాట్ ఫార్మర్ కేసీ న్యూటన్ రిపోర్ట్ ప్రకారం..నవంబర్ 11న (శనివారం) ఎలాన్ మస్క్ ట్విటర్లో పనిచేసే సుమారు 5,500 మందిలో 4,400 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఫైర్ చేసినట్లు తెలిపారు. ఒక వేళ సంస్థ తమని తొలగించిందని ఉద్యోగులు తెలుసుకోవాలంటే ఎలా? అన్న ప్రశ్నకు బదులిచ్చిన కేసీ న్యూటన్..ఫైర్ చేసిన సిబ్బందికి సంస్థతో ఉన్న అన్నీ రకాల కమ్యూనికేషన్లు నిలిచిపోతాయని అన్నారు. ఇక తాజాగా తొలగించిన ఉద్యోగులు యూఎస్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన కంటెంట్ మోడరేషన్, రియల్ ఎస్టేట్, మార్కెటింగ్, ఇంజినీరింగ్‌తో పాటు ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులని పేర్కొన్నారు. మేనేజర్లకే తెలియదు ఇక ట్విటర్, లేదంటే మస్క్ తొలగించిన ఉద్యోగుల్ని మేనేజర్లు గుర్తించడం కష్టమేనని. ఒక్కసారి ఉద్యోగుల్ని తొలగిస్తే వారికి, మేనేజర్ల మధ్య ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థ నిలిచిపోతుందని కేసీ న్యూటన్ ట్విటర్ కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపుపై ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు. సమాచారం అందింది మస్క్ ఫైర్ చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే టెర్మినేషన్ మెయిల్ వచ్చినట్లు సమాచారం. ప్రాధాన్యత, ఖర్చు తగ్గింపు కారణాలతో తొలగించినట్లు, వేటు వేసిన ఉద్యోగుల లాస్ట్ వర్కింగ్ డే ఇవాళేనని (నవంబర్ 14) తెలుస్తోంది. చదవండి👉 8 డాలర్ల కోసం ఎలాన్ మస్క్ కక్కుర్తి.. దిగ్గజ సంస్థకు 1.20 లక్షల కోట్లు నష్టం! -
Karimnagar: కీచకుడిగా మారిన ప్రభుత్వాసుపత్రి కాంట్రాక్టు ఉద్యోగి
సాక్షి, కరీంనగర్: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా ఉద్యోగులకు రక్షణ లేకుండా పోతోంది. కీచకుడిగా మారిన ఓ కాంట్రాక్టు ఉద్యోగి వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. గత ఏప్రిల్‌లో ఓ వార్డు బాయ్ నర్సుపై అత్యాచారయత్నం ఘటన మరువకముందే మరో కామాంధుడి లీలలు వెలుగు చూశాయి. ఆసుపత్రిలోని మొదటి ఫ్లోర్లో గల ఆసుపత్రి అనుబంధ విభాగంలో పనిచేసే ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి గత కొద్ది నెలలుగా మహిళా ఉద్యోగులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. వారిని లోబర్చుకునేందుకు వెకిలి చేష్టలతో వేధిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల హద్దులు దాటి లైంగిక వేధింపులకు గురిచేయడంతో సహనం కోల్పోయిన బాధితులు దీటుగానే ఎదిరించినట్లు సమాచారం. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆసుపత్రి ఉన్నతాధికారికి ఫిర్యాదు చేయగా తూతూమంత్రంగా చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ప్రధాన ఆసుపత్రి నుంచి ఎంసీహెచ్‌కు స్థాన చలనం కల్పించగా అక్కడా విధులు నిర్వహించకుండా తనకు కోవిడ్ పాజిటివ్ అని చెప్పి, విధులకు ఎగనామం పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. కీచకుడిగా మారిన సదరు ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకోకుండా స్థానచలనం కల్పించి, చేతులు దులుపుకోవడం పట్ల బాధితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ కీచకుడిని విధుల నుంచి తొలగించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ విషయమై బాధితులు హెచ్ఆర్సీని కూడా ఆశ్రయించినట్లు, హెచ్ఆర్సీ బాధ్యులు నాలుగు రో జుల క్రితం ఆసుపత్రికి వచ్చినట్లు తెలిసింది. చదవండి: దొంగతనం ఆరోపణతో ఆదివాసి హత్య -
సర్వీసు క్రమబద్ధీకరణ రాజ్యాంగ హక్కు
సాక్షి, హైదరాబాద్ : రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా.. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన వేతనం, ఇతర అలవెన్స్‌లు, పదోన్నతులు ఇవ్వకుండా చేసే కుట్ర, కుతంత్రం, దోపిడీకి గురిచేయడానికే ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపడుతున్నారని హైకోర్టు మండిపడింది. సర్వీసు క్రమబద్ధీకరణ రాజ్యాంగం కల్పించిన హక్కు అని స్పష్టంచేసింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వం టి చట్టబద్ధ సంస్థలో రెగ్యులర్ నియామకాలు చేపట్టకుండా చట్టవిరుద్ధంగా వ్యవహరిం చడం సరికాదని పేర్కొంది. జీహెచ్ఎంసీలో గత పదేళ్లకుపైగా విధులు నిర్వహిస్తున్న 98 మంది శానిటేషన్, ఎంటమాలజీ వర్కర్స్, శానిటరీ, ఎంటమాలజీ ఫీల్డ్ అసిస్టెంట్స్ సర్వీసును 2 నెలల్లో క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సర్వీసు క్రమబద్ధీ కరించే వరకు రెగ్యులర్ ఉద్యోగులతో సమా నంగా పిటిషనర్లకు వేతనం, ఇతర అలవెన్స్ లు వర్తింపజేయాలని స్పష్టంచేసింది. జీహెచ్ ఎంసీలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న జి.శ్రీనివాసచారితో పాటు మరో 97 మంది దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు ఈ మేరకు ఇటీవల తీర్పునిచ్చారు. అలాగే సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఖాళీలను ఎప్పటికప్పుడు రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. పిటిషనర్ల వాదన ఇదీ.. ‘‘పత్రికల్లో నోటిఫికేషన్ ఇచ్చి 2008–11 మధ్య పిటిషనర్లను ఔట్సోర్సింగ్ పద్ధతిలో జీహెచ్ఎంసీ నియమించుకుంది. ఎటువంటి ఆరోపణలు లేకుండా పదేళ్లకుపైగా సర్వీసు పూర్తి చేశారు. స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు మా సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని కోరాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ జగ్జీత్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు విన్నవించాం. ఈ రెండు తీర్పులను జీహెచ్ఎంసీ ఉల్లంఘించింది. మేం బానిసల్లాగా పనిచేయాలని భావిస్తోంది. మాకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు చట్టబద్ధ సంస్థ విఘాతం కల్గిస్తోంది. 2009, 2018లో మా సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని జీహెచ్ఎంసీకి వినతిపత్రం సమర్పించాం. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మా సర్వీసును క్రమబద్ధీకరించేలా ఆదేశించండి’’అని పిటిషనర్ల తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. తీర్పులో ఏమన్నారంటే.. ‘‘ఔట్సోర్సింగ్ విధానమంటేనే వారి సర్వీసులను ఎక్కువ కాలం కొనసాగించకుండా, వారికి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు అందకుండా చేసే కుట్ర, కుతంత్రంలో భాగమే. ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా.. 14 ఏళ్లుగా రెగ్యులర్ నియామకాలు చేపట్టకుండా ఔట్ సోర్సింగ్ విధానంలో నియామకాలు చేప ట్టడం రాజ్యాంగ విరుద్ధం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రెగ్యులర్ నియామకాలు చేపట్టాలి. పదేళ్లకుపైగా వీరు సేవలు అందిస్తున్న నేపథ్యంలో రెగ్యులర్ పద్ధతిలో వీరి నియామకం చేపట్టలేదు కాబట్టి వీరి సర్వీసు క్రమబద్దీకరించడానికి వీల్లేదన్న వాదన సరికాదు. పిటిషనర్లు ఏ పోస్టులో పనిచేస్తుంటే ఆ పోస్టుకు వీరి సర్వీసును 2 నెలల్లో క్రమబద్ధీకరించాలి. నియామకం ఏదైనా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నారా లేదా అన్నది మాత్రమే చూడాలని ఇదే హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పిటిషనర్లకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనం ఇవ్వాల్సిందే. పిటిషనర్లకు చెల్లించాల్సిన అదనపు వేతనాన్ని ఈ పిటిషన్ ఫైల్ చేసినప్పటి నుంచి జూలై 31 వరకు పిటిషనర్ల ఖాతాల్లో నేరుగా జమ చేయాలి. ఈ ప్రక్రియను సెప్టెంబర్ 15 లోగా పూర్తి చేయాలి’’అని తీర్పులో పేర్కొన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను తొలగించాలంటూ జీహెచ్ఎంసీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టేశారు. జీహెచ్ఎంసీ ఏమందంటే.. ‘‘పిటిషనర్లను జీహెచ్ఎంసీ నేరుగా నియమించుకోలేదు. ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా వారిని నియమించుకున్నాం. వారికి వేతనాలు ఎంత ఇవ్వాలన్నది సదరు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు చూస్తాయి. వారి జీతభత్యాలతో జీహెచ్ఎంసీకి సంబంధం ఉండదు. వీరి ఎంపిక ప్రక్రియ కూడా వేరుగా ఉంటుంది. వీరిని నియమించుకున్న ఏజెన్సీలను ఈ పిటిషన్లో ప్రతివాదిగా చేర్చలేదు. శానిటేషన్ వర్కర్స్, ఎంటమాలజీ వర్కర్స్ వేతనాన్ని రూ.12,500 నుంచి రూ.14 వేలకు, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్, ఎంటమాలజీ ఫీల్డ్ అసిస్టెంట్స్‌కు రూ.12 వేల నుంచి రూ.14,500కు పెంచుతూ మునిసిపల్ శాఖ 2017లో ఉత్తర్వులు జారీచేసింది. వీరి నియామకానికి మేం ఎటువంటి నోటిఫికేషన్ జారీచేయలేదు. వీరి నియామకం రాజ్యాంగ విరుద్ధంగా జరిగింది. కాబట్టి వీరికి ఉమాదేవి కేసు వర్తించదు. ఎన్ఎంఆర్/డైలీ వేజ్/కంటింజెంట్ ఎంప్లాయిగా పిటిషనర్లను జీహెచ్ఎంసీ నేరుగా నియమించుకోలేదు. వీరికి ఏజెన్సీ/కాంట్రాక్టర్ వేతనాలు ఇచ్చారు. వీరి సర్వీసును క్రమబద్ధీకరించేందుకు నిబంధనలు అనుమతించవు’’అని జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది నివేదించారు. -
‘భవిత’కు భరోసా ఏది..!
పై చిత్రంలో కనిపిస్తున్న బాలుడి పేరు దుమాల ఆశన్న. జైనథ్ మండల కేంద్రానికి చెందిన దుమాల చిన్నక్క, నడిపెన్న దంపతుల చిన్న కుమారుడు. ఆశన్న పుట్టుకతోనే మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడు. సాధారణ పిల్లల్లాగా కాకుండా శారీరక, మానసిక ఎదుగుదల లోపం కనిపించడంతో జైనథ్‌లోని భవిత విలీన విద్య కేంద్రంలో చేర్పించారు. కొన్నేళ్లుగా ఆటపాటలతో విద్య నేర్చుకుంటున్నాడు. ఏప్రిల్ 14నుంచి ఈ కేంద్రం మూసి వేయడంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. ‘‘అప్పటి నుంచి మరింతగా మానసిక వేదన చెందుతున్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు స్పృహ తప్పి పడిపోతున్నాడు. దినం, రాత్రి కంటికిరెప్పలా కాపాడుకోవాల్సి వస్తంది..’’ అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. భవిత కేంద్రం తెరిచి ఉంటే పిల్లలతో కలిసి ఆటపాటలతో కొంత ఉల్లాసంగా గడిపేవాడని తెలిపారు. ఆదిలాబాద్‌టౌన్ : పుట్టుకతో వచ్చే వివిధ రకాల శారీరక, మానసిక వైకల్యాలకు వైద్యం అందించడంతోపాటు కనీస విద్య సామర్థ్యాలను పెంపొందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం భవిత విలీన విద్యావనరుల కేంద్రానికి శ్రీకారం చూట్టింది. మానసిక వైకల్యం గల పిల్లలతోపాటు వైకల్యం గల పిల్లలకు చదువు, ఆటపాటలు నేర్పించి సాధారణ పిల్లలుగా మారే విధంగా చేయడమే భవిత కేంద్రాల లక్ష్యం. వైకల్యం గల పిల్లలకు ఫిజియోథెరపి చికిత్స అందించి వారికి ప్రయోజనం చేకూర్చాలి. కానీ.. గత రెండు నెలలుగా కేంద్రాలు మూతపడ్డాయి. పిల్లలకు చదువుతోపాటు ఆటపాటలు, వైద్య సేవలు అందడం లేదు. సాధారణ పాఠశాలల మాదిరిగా ఈ కేంద్రాలకు కూడా విద్యశాఖ సేవలు ఇవ్వడంతో వైకల్యంతో బాధపడుతున్న చిన్నారుల బాధలు వర్ణనాతీతం. చిన్నారుల రాత మార్చే భవిత కేంద్రాలు తెరవకపోవడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇలాగైతే వారి ‘భవిత’వ్యం ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో.. ప్రత్యేక అవసరాలు ఉన్న శారీరక, మానసిక దివ్యాంగులకు మండల కేంద్రాల్లో భవిత కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో 17 కేంద్రాలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన మండలాల్లో కేంద్రాలు ఇంకా ఏర్పాటు చేయలేదు. జిల్లా వ్యాప్తంగా 251 మంది చిన్నారులు భవిత కేంద్రాల్లో చదువుకుంటున్నారు. 131 మంది చిన్నారులు ఫిజియోథెరఫి వైద్య చికిత్సలను పొందుతున్నారు. 88 మంది చిన్నారులు ఇంటి వద్ద చదువు నేర్చుకుంటున్నారు. భవిత కేంద్రాల్లో 23 మంది ఐఈఆర్పీ(ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్)లు చిన్నారులకు సేవలు అందిస్తున్నారు. ఆరుగురు ఫిజియోథెరఫిస్టులు, 17 మంది కేర్‌గీవర్స్ పనిచేస్తున్నారు. పిల్లల భవితవ్యం పట్టదా.. దివ్యాంగులకు వివిధ అంశాల్లో ఆట, పాటల ద్వారా శిక్షణ ఇచ్చి క్రమంగా వారి సామర్థ్యాలను పెరిగేలా చూడాలి. దీంతోపాటు వారంలో ఒకసారి అవసరమైన వారికి ఫిజియోథెరఫితోపాటు ఇతర థెరఫిలు చేయిస్తారు. ఈ పిల్లల అంశాలను గుర్తించి తమ పనులు తాము చేసుకునేలా చూడడం, కాస్త క్రీయాశీలకంగా ఉన్న వారి సామర్థ్యాలను మరింతగా పెంచి సాధారణ విద్యార్థులతో కలిసిపోయేలా చేయడం దీని లక్ష్యం.. కానీ సర్వశిక్ష అభియాన్ అధికారుల నిర్లక్ష్యం వల్ల నీరుగారిపోతోంది. కాగా భవిత కేంద్రాలకు ఏప్రిల్ 13 నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. దీంతో భవిత కేంద్రానికి వచ్చి ఫిజియోథెరఫి చేసుకునే పిల్లలు ఇబ్బందులు గురవుతున్నారు. ఫిజియోథెరఫి క్రమం తప్పకుండా చేయాలి. లేనట్లయితే పరిస్థితి మొదటికి వస్తుంది. కండరాలు బిగిసుకుని చచ్చుబడిపోతాయి. ప్రైవేటుగా ఫిజియోథెరఫి చేయించుకోలేని వారే అధికంగా ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి శనివారం కేంద్రాలకు రాలేని స్థితిలో ఉన్న పిల్లలకు వారి ఇంటికి వెళ్లి ఐఈఆర్పీలు చదువు నేర్పిస్తారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఫిజియోథెరఫి చేసే విధానం చూపిస్తారు. వారిలో మనోధైర్యం నింపుతారు. ఇవన్నీ నిలిచిపోయి ఇప్పటికే నెల రోజులు దాటింది. భవిత కేంద్రాలు మళ్లీ వచ్చే నెల 12న ప్రారంభమయ్యే అవకాశాలు ఉండడంతో రెండు నెలలపాటు సేవలు నిలిచిపోయినట్లే. ఉద్యోగ భద్రతా కరువే.. మానసిక వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులను సాధారణ స్థితికి తీసుకువస్తున్న ఐఈఆర్పీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సంవత్సరానికి 10 నెలల వేతనం మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో ఈ ఉద్యోగంపై ఆధారపడి జీవిస్తున్నవారి కుటుంబ పోషణ ఇబ్బందిగా మారుతోంది. ఏప్రిల్‌లో 13 వరకే వేతనం చెల్లించారు. మే నెలకు వేతనం లేకపోగా, జూన్ మాసంతో 20 రోజుల వేతనం ఇవ్వనున్నారు. వీరు గత కొన్నేల్లుగా ఉద్యోగం చేస్తున్నా ప్రతి సంవత్సరం రీఎంగేజ్ (రెన్యువల్) చేస్తుండడంతో ఉద్యోగ భద్రత లేదు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంకా రెన్యువల్ చేయలేదు. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో వేతనాలు అధికంగా ఉండగా మన రాష్ట్రంలో రూ.15వేలు మాత్రమే చెల్లిస్తున్నారని పేర్కొంటున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలి గత 15 సంవత్సరాలుగా వైకల్యం గల పిల్లలకు సేవలు అందిస్తున్నాను. ఐఈఆర్పీలకు ఉద్యోగ భదత్ర కల్పించాలి. హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. కనీస వేతనం రూ.28,940 చెల్లించాలి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 6 నెలల మాతృత్వ సెలవులు మంజూరు చేయాలి. ఒక్క రోజు విరామంతో తిరిగి పునర్నియామకం చేయాలి. – పుష్పవేణి, ఐఈఆర్పీ ఆదిలాబాద్ -
ఉద్యోగ భద్రత.. ఎన్నాళ్లీ వ్యథ..!
పాలకొల్లు టౌన్: బాబు వస్తే జాబు వస్తుంది.. 20 14 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రధాన అంశం. ఇదొక్కటే కాదు ఎన్నో అమలుకాని హామీలను ఇచ్చి తీరా గద్దెనెక్కిన తర్వాత టీడీపీ పాలకులు వీటి అమలును మరిచిపోయారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు తొలగిస్తున్నారని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా తమకు ఉద్యోగ భద్రత, వేతనాలు లేవని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. కాంట్రాక్ట్ హెల్త్ ఉద్యోగుల విధానాన్ని 2002లో ప్రవేశపెట్టిన చంద్రబాబు ఉద్యోగుల కుటుంబాలకు భద్రత లేకుండా చేశారని ఆరోపిస్తున్నా రు. దీనిపై తాడోపేడో తేల్చుకునేందుకు మంగళవారం కాంట్రాక్ట్ ఉద్యోగులు విజయవాడలోని అలంకార సెంటర్లో ధర్నా చేయడానికి పూనుకున్నట్టు యూ నియన్ నాయకులు తెలిపారు. జిల్లాలో వందలాది మంది జిల్లాలోని 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హెల్త్అసిస్టెంట్లు, ఫార్మసిస్టులు, ల్యాబ్టెక్నీషియన్లు, ఏఎన్ఎంలు సుమా రు 500 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో, సు మారు 10 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉ ద్యోగులు పనిచేస్తున్నారు. 2002లో కాం ట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని అప్పటి సీఎం చంద్రబాబు కమిటీ వేసినా నివేదికను పక్కనపెట్టారని ఉద్యో గులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2004లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాంట్రాక్ట్ హెల్త్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారని, అయితే ఆయన ఆకస్మిక మృతితో విషయం మరుగునపడిపోయిందన్నారు. 2014లో తిరిగి అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడంతో పాటు ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని పట్టించుకోలేదని వాపోతున్నారు. జీఓ 27తో నిరాశ ప్రభుత్వం స్పందించకపోవడంతో కాం ట్రాక్ట్ ఉద్యోగులు సుప్రీంకోర్టుçను ఆశ్రయించారు. దీంతో కోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిందని ఉద్యోగ సంఘ నాయకులు చెబుతున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో సీఎం చంద్రబాబు సమాన పనికి సమాన వేతనం ఇస్తానని కాంట్రాక్ట్ ఉద్యోగులను నమ్మించి డిసెంబర్లో మంత్రి వర్గ కమి టీ ఏర్పాటు చేయడంతో వేతనాలు పెరుగుతాయని ఆశించగా జీఓ 27న విడుదల చేసి నిరాశకు గురిచేశారని ఉద్యోగులు అంటున్నారు. బేసిక్, డీఏ, హెచ్ఆర్ఏలను మినహాయించి పర్మినెంట్ వేత నం ఇచ్చేలా జీఓ 27 రూపొందించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్యను సంప్రదించగా విషయాన్ని మంత్రివర్గ కమిటీ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారని అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమ డిమాండ్ల సాధనకు కాంట్రాక్ట్ హెల్త్ ఉ ద్యోగులు పోరాటానికి సిద్ధమయ్యారు. -
వర్సిటీ.. అక్రమాల పుట్ట
విక్రమ సింహపురి యూనివర్సిటీ అక్రమాలకు, అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. పాలన గాడి తప్పింది. కింది స్థాయి ఉద్యోగాల నియామకాల నుంచి భవనాల నిర్మాణాలు, అద్దెభవనాలు, యూనివర్సిటీకి చెల్లించాల్సిన అఫిలియేషన్ ఫీజు రాబట్టడం, సిబ్బందికి జీతాలు పెంచడంలో వర్సిటీ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పరీక్షల్లో ప్రైవేటు కళాశాలలకు అనుకూలంగా వ్యవహరించడం తదితర విషయాల్లోనూ అక్రమాలకు పాల్పడుతున్నారు. నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట, అర్బన్): గ్రామీణ ప్రాంతాల్లో పేదలందరికీ ఉన్నత విద్యను అందించాలనే ఉన్నతాశయంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాకో యూనివర్సిటీని ప్రకటించారు. అందులో భాగంగానే పదేళ్ల క్రితం నెల్లూరులో విక్రమసింహపురి యూనివర్సిటీని(వీఎస్‌యూ) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాణ్యమైన విద్య అందించడం, పరిశోధనలకు ఆలంబనగా నిలవడం యూనివర్సిటీ చేయాల్సిన ప్రథమ కర్తవ్యం. అయితే వీఎస్‌యూలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. పాలనాధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఆ ఇద్దరికే జీతాలు పెంపు యూనివర్సిటీలో ఆరు, ఏడు సంవత్సరాల నుంచి డిగ్రీ అర్హతతో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బంది సుమారు 25 మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.9,700 ఇస్తున్నారు. వీరిని కాదని మూడున్నరేళ్ల క్రితం చేరిన ఇద్దరికి జీతం రూ.11,400 జీతం చొప్పున పెంచుతూ అధికారులు ఫైలును శనివారం సిద్ధం చేశారు. మిగతా వారి నోట్లో మట్టికొట్టారు. జీతాలు పెంచేందుకు కారణం పరిశీలిస్తే.. ఒకరు జిల్లా మంత్రికి సంబంధించిన వారు కాగా మరొకరు వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ భవన్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ కీలక అధికారి బంధువు. జీతాలు జూనియర్లకు పెంచడానికి, సీనియర్లకు పెంచకపోవడానికి కారణాలు గురించి రిజిస్ట్రార్ మాట్లాడుతూ విద్యార్హత, సీనియర్ అనే విషయం కీలకం కాదన్నారు. వారు గతంలో ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు, ఆ పోస్టుకు నిబంధనల ప్రకారం ఎంత జీతం ఇవ్వాలి అనే అంశంపై ఆధారపడి ఇక్కడ జీతం పెంచేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఈ మాటే వాస్తవమైతే గతంలో కావలి పీజీ సెంటర్లో ల్యాబ్అసిస్టెంట్గా దరఖాస్తు చేసుకుని కొంతకాలం కావలిలో పనిచేసిన వ్యక్తిని వర్సిటీ ఏడీ కార్యాలయానికి బదిలీ చేయించారు. అంతేకాకుండా పరీక్షలకు సంబంధించి కోడింగ్, డీకోడింగ్ తదితర కీలక బాధ్యతలు అప్పజెప్పారు. రిజిస్ట్రార్ చెప్పింది వాస్తవమైతే ఈ వ్యక్తి దరఖాస్తు చేసుకున్న ల్యాబ్ అసిస్టెంట్‌ను కాదని మరో బాధ్యతలు ఎలా అప్పజెప్పారో అర్థం కావడం లేదు. ఖాళీభవనానికి రూ.వేలల్లో అద్దె చెల్లింపు వర్సిటీ పరిపాలనా కార్యాలయాన్ని నెల్లూరు నుంచి కాకుటూరులోని సొంత భవనంలోకి ఏడాదిన్నర క్రితమే తరలించారు. అయితే పీజీ సెట్ సెంటర్‌ను మాత్రం తరలించలేదు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ పక్కన పీజీ సెట్ భవనాన్ని ఖాళీగా ఉంచారు. ప్రతి నెలా రూ.20వేలు అద్దె చెల్లిస్తున్నారు. ఇందులో ఒక అధికారికి భారీగా కమీషన్ అందుతుందని ఆరోపణలున్నాయి. పైగా ఈ ఏడాది పీజీ సెట్‌కు సంబంధించి ఎంబీఏలో కొన్ని విభాగాలకు అడ్మిషన్లు ఇవ్వకుండా ఆపేశారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఇచ్చే కమీషన్ల కోసమే ఈ పని చేశారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా అక్రమాలు ♦ వీసీ పదవీ కాలం మరో నెలలో ముగియనుంది. ఆరు నెలల ముందు నుంచే ఉద్యోగ నియామకాల కోసం ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకూడదు. అయితే ఇక్కడ వీసీ ఆధ్వర్యంలో అధ్యాపక పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలొచ్చాయి. అనేక వివాదాలకు కేంద్ర బిందువైన అప్పటి రిజిస్ట్రార్ శివశంకర్‌ను ఈ పోస్టుల దరఖాస్తులకు స్క్రూటినీ అధికారిగా నియమించడం దారుణమని విద్యార్థులు వాపోతున్నారు. ఇందులో గత రిజిస్ట్రార్‌పై వీసీకి అంత ప్రేమ ఎందుకని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఒకే కాలనీలో .. ఒకే వర్గానికి చెందిన బం««ధుమిత్రులకు కిందిస్థాయిలో 32 పోస్టులను కట్టబెట్టారు. మిగతా వర్గాల వారికి ఎందుకివ్వలేదని ప్రశ్నిస్తున్నారు. ♦ ఎంతో మంది సీనియర్లు వర్సిటీలో పని చేస్తుండగా రెండు నెలల క్రితం కేవలం నలుగురు నమ్మిన బంట్లుగా ఉన్న ఉద్యోగుల పేర్లు మాత్రమే టైం స్కేల్(రెగ్యులర్) కింద అనుమతివ్వాలని బోర్డుకు ప్రతిపాదనలు పంపారు. మిగతా వారిని కాదని నలుగురికే టైంస్కేల్ వర్తింపజేయడానికి బోర్డు అంగీకరించలేదు. దీంతో ఒక ఉద్యోగి తనకు ఎలాగూ టైం స్కేల్ ఇప్పించలేకపోయారని తన భార్యకు పోస్టు ఇవ్వాలని కోరడు. కాంట్రాక్ట్ బేస్‌లో వీసీ ఆమెకు ఈ నెల ఒకటో తేదీన ఉద్యోగం ఇచ్చారని తెలిసింది. అధికారం ఉంటే ఒక పద్ధతి, రోస్టర్ ఏమీ లేకుండా ఉద్యోగం కల్పించడం తగునా అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. సహకరించకపోతే ఇబ్బందులే.. ♦ ఐదు రోజుల క్రితం కావలి పీజీ సెంటర్లో ఇంటర్నల్ పరీక్ష రాసేందుకు వర్సిటీ ఉన్నతాధికారి బంధువుగా ప్రచారం జరుగుతున్న ఒక విద్యార్థిని వచ్చారు. హాజరు లేని కారణంగా పరీక్ష రాయించేందుకు అక్కడి అధ్యాపకురాలు అంగీకరించలేదు. ఇలా అంగీకరించనందుకు ఆమెకు ఉన్నతాధికారుల వేధింపులు మొదలయ్యాయి. యూనివర్సీటికీ ప్రైవేటు కళాశాలల బకాయి ♦ యూనివర్సిటీ ఆర్థిక కష్టాల్లో ఉంది. అయితే వర్సిటీకీ అఫిలియేషన్ ఫీజు కింద అన్ని ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలలు కలిసి సుమారు రూ.కోటి వరకు ఫీజు చెల్లించాలి. విద్యార్థులను ముక్కు పిండి వసూలు చేస్తున్న ప్రైవేటు కళాశాలల యజమానులు వర్సిటీకి బకాయిపడిన ఫీజు మాత్రం చెల్లించడం లేదు. ఇంతపెద్ద మొత్తంలో బకాయిలు ఆగిపోవడానికి కారణం ప్రైవేటు కళాశాలలు వర్సిటీ ఉన్నతాధికారులకు ఇస్తున్న తాయిలాలేనని తెలుస్తోంది. ఇలా తవ్వే కొద్దీ అక్రమాలెన్నో వెలుగు చూస్తున్నాయి. అంతా పారదర్శకంగానే నేను బాధ్యతలు చేపట్టి వారం రోజులే అయింది. అంతా పారదర్శకంగా జరిగేందుకు కృషి చేస్తా. సీనియర్లను కాదని ఇద్దరు జూనియర్లకు జీతాలు పెంచే విషయంలో తప్పులు జరగలేదు. వారు గతంలో దరఖాస్తు చేసుకున్న పోస్టునుబట్టి జీతాలు పెరగబోతున్నాయి. యూనివర్సిటీకి ప్రైవేటు కళాశాలలు బకాయిలున్న మాట వాస్తవమే. వారందరి దగ్గర అఫిలియేషన్ ఫీజులు వసూలు చేస్తాం. అప్పటి వరకు వారికి సర్వీసులు నిలిపేస్తాం. ప్రస్తుతం వర్సిటీలో ఉన్న రూములు సరిపోవడం లేదు. అందుకే పీజీ సెట్ కార్యాలయం ప్రైవేటు భవనంలోనే ఉంది. అవినీతి అనేది ఉత్తిదే. –దుర్గాప్రసాద్, నూతన రిజిస్ట్రార్, వీఎస్‌యూ -
కాంట్రాక్ట్ ఉద్యోగులకు 50శాతం జీతాలు పెంపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సర్కార్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు 50 శాతం జీతాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి పెంచిన జీతాలు అమల్లోకి రానున్నాయి. ఈ సందర్భంగా మంత్రులు కామినేని శ్రీనివాస్, కాల్వ శ్రీనివాసులు మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ... ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించమని, కాంట్రాక్ట్ ఉద్యోగులను ఆయా శాఖలు రెన్యువల్ చేస్తాయన్నారు. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి భవిష్యత్‌లో ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి అని వారు తెలిపారు. -
కార్పొరేషన్‌కు కాంట్రాక్ట్ భారం
సాక్షి, నెల్లూరు: అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల పుణ్యమా అని నెల్లూరు నగర పాలకసంస్థకు కాంట్రాక్ట్ ఉద్యోగులు భారమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. నేతలు చెప్పిందే తడవుగా నిబంధనలు పాటించక ఇబ్బడిముబ్బడిగా కాంట్రాక్ట్ సిబ్బందిని నియమించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. నాటి అధికారపార్టీ నేతల ఆదేశాలతో అప్పటి కమిషనర్ ఇష్టానుసారం తాత్కాలిక ఉద్యోగులను నియమించారు. ఇప్పుడు అధికార టీడీపీ నేతలు తాము చెప్పిన వారందరికీ కార్పొరేషన్లో ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తున్నారు. మరోవైపు కొందరు అధికారులు అధికార పార్టీ నేతలు,దళారులతో కుమ్మక్కై అందినకాడికి దండుకుని కాంట్రాక్ట్ సిబ్బంది నియామకాలు సాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తాజాగా ఉద్యోగాల కోసం అధికారపార్టీ నేతల జాబితా చాంతాడంత అయ్యింది. ఈ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్‌కు తాత్కాలిక ఉద్యోగనియామకాలు మరింత భారంగా మారాయి. ఇప్పటికే కార్పొరేషన్ పరిధిలోని హెల్త్ విభాగంలో 800 మంది, ఇంజనీరింగ్ విభాగంలో 300 మంది, 70 మంది వరకూ కంప్యూటర్ ఆపరేటర్లతో కలిపితే 1170 మంది కాంట్రాక్ట్ సిబ్బంది పనిచేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పర్మినెంట్ ఉద్యోగులు ఉన్నది కేవలం 900 మంది మాత్రమే. ఇది కార్పొరేషన్‌కు మరింత భారంగా మారింది. తాజాగా టీడీపీ అధికారం చేపట్టడం, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇక్కడి వారే కావడం, ఇక వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గెలిచిన మేయర్ అబ్దుల్ అజీజ్ అధికారపార్టీ తీర్థం పుచ్చుకోవడంతో నగరపాలకలో కాంట్రాక్ట్ ఉద్యోగాలకు మరింత డిమాండ్ పెరిగింది. ఇప్పటికే గ్రూపులుగా విడిపోయి ఉన్న అధికారపార్టీ నేతలు కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం పోటీలు పడి కమిషనర్‌పై ఒత్తిళ్తు తెస్తున్నట్లు తెలుస్తోంది. ‘అధికారం మాదే. ఉద్యోగాలు ఇవ్వకుంటే మీసంగతి తేలుస్తాం’ అంటూ కొందరు నేతలు బెదిరింపులకు దిగుతున్నట్లు సమాచారం. మరోవైపు కార్పొరేటర్లు సైతం కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. వీరేకాక ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షలు వసూలు చేసిన కొందరు నేతలు, దళారులు సైతం కార్పొరేషన్లో ఉద్యోగాల కోసం అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు సైతం నెలకు రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకూ జీతం ఇస్తుండటంతో వీటికి పోటీ పెరిగింది. దీంతో కొందరు నేతలు,దళారులు అభ్యర్థుల నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ వసూళ్లు చేస్తున్నారు. మొత్తంగా కాం్రట్రాక్ట్ ఉద్యోగాల కోసం వచ్చిన జాబితా చాంతాడంత అయినట్లు కార్పొరేషన్లో పనిచేస్తున్న ఓ కీలక ఉద్యోగి పేర్కొన్నారు. ఇప్పటికే కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు నెలకు రూ.90 లక్షలు పైనే ఉన్నట్లు తెలుస్తోంది. సిబ్బంది నియామకాలు భారమని తెలిసినా అధికారులు మాత్రం అవేవీ చెప్పక ఇష్టానుసారం నియామకాలు సాగించారు. వీరిలో ఎక్కువ మంది కార్పొరేషన్ కార్యాలయానికి మొక్కుబడిగా వచ్చి నెలజీతం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎవరు పని చేస్తున్నారో, ఎవరు చేయడంలేదో కూడా అధికారులకు తెలియని పరిస్థితి నెలకొంది. విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి: కార్పొరేషన్లో ఎంతమంది తాత్కాలిక ఉద్యోగులున్నారు? వారి విధులు ఏమిటి? ఎవరు ఏఏ విభాగాల్లో పని చేస్తున్నారు? వారికి నిజంగా పని ఉందా? వారిని ఎప్పుడు ఎవరు నియమించారు?లాంటి విషయాలపై అధికారులు సమగ్ర విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకావముంది. అవసరం లేకున్నా సిబ్బందిని నియమించి జీతాలు చెల్లించడం దారుణం. అసలే నిధుల లేమితో అభివృద్ధి పనులు అంతంతమాత్రంగా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టడం దారుణం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమగ్రవిచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.