control bill
-
భారత్ జనాభా నియంత్రణ చట్టం అతిత్వరలో..
న్యూఢిల్లీ: దేశంలో పెరిగిపోతున్న జనాభా నియంత్రణకు ప్రత్యేక చట్టం దిశగా కేంద్రం చర్యలను వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర మంత్రి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి(ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్) మంగళవారం.. రాయ్‌పూర్(ఛత్తీస్గడ్)లో జనాభా నియంత్రణ చట్టం మీద వ్యాఖ్యలు చేశారు. గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్‌కు హాజరైన ఆయనకు జనాభా పెరిగిపోతుండడం, కట్టడికి చట్టం మీద ఓ ప్రశ్న మీడియా నుంచి ఎదురైంది. ‘‘ఆందోళన అక్కర్లేదు. జనాభా నియంత్రణ చట్టం త్వరలోనే రాబోతోంది. బలమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఇలాగే ఉంటుంది. అది కచ్చితంగా.. అతి త్వరలోనే వచ్చి తీరుతుంద’’ని వ్యాఖ్యానించారు. పాపులేషన్ కంట్రోల్ బిల్లు 2019లో జులైలో రాజ్య సభలో ప్రవేశపెట్టారు బీజేపీ నేత రాకేశ్ సిన్హా. సిన్హా ప్రతిపాదించిన 2019 బిల్లులో.. ఇద్దరు పిల్లల విధానాన్ని పాటించని దంపతులకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించడం, ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హత వంటి జరిమానాలను ప్రవేశపెట్టడం లాంటి అంశాలను ప్రస్తావించింది. దేశంలో జనాభా నియంత్రణే ధ్యేయంగా ఈ చట్టం రాబోతోంది. మరో దశాబ్ద కాలంలో చైనా జనాభాను అధిగమించి.. భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా దేశంగా అవతరించబోతోందని ఐక్యరాజ్యసమితి ఓ నివేదికలో వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే.. జనాభా నియంత్రణ బిల్లు రూపకల్పన తెర మీదకు వచ్చింది. బిల్లు ప్రతిపాదనపై 125 మంది ఎంపీలు సంతకం చేశారు. అయితే ఇస్లాం విధానాలకు ఈ బిల్లు వ్యతిరేకంగా ఉందంటూ కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. -
కొత్త బిల్లు.. సీఎం యోగి మెడకే చుట్టుకుంటుందా ?
UP Population Control Bill లఖ్నౌ: జనాభా నియంత్రణకు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ తీసుకువచ్చిన జనాభా నియంత్రణ బిల్లు అధికార పార్టీ మెడకు చుట్టుకుంటుందా ? పైకి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, బీజేపీ ప్రముఖులు ఈ బిల్లు సూపర్ అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నా.. అంతర్గత సమావేశాల్లో దీనిపై గుర్రుగా ఉన్నటు సమాచారం. జనాభా నియంత్రణే లక్క్ష్యం జనాభా నియంత్రణ లక్క్ష్యంగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం బర్త్ కంట్రోల్, స్టెబిలైజేషన్, వెల్ఫేర్ బిల్లును ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనేందుకు అనర్హులుగా ప్రకటించారు. ఈ నిబంధనే ఇప్పుడు అధికార పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకు మింగుడు పడటం లేదు. బీజేపీ మెడకే ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీలో అధికార బీజేపీకి 304 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ బిల్లు కనున అసెంబ్లీ ఆమోదం పొంది చట్టంగా మారి.. అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఈ చట్టం వర్తిస్తే... ప్రస్తుత ఎమ్మెల్యేల్లో సగానికి పైగా పోటీకి అనర్హులు అవుతారు. ఎందుకంటే వీరందరికీ ముగ్గురు లేదా అంత కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. అసెంబ్లీలో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 387 సీట్లు ఉండగా ఇందులో అధికార పార్టీ బంపర్ మెజార్టీ సాధించింది. కమలం గుర్తు తరఫున మొత్తం 304 మంది అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. అయితే ఇందులో 152 మంది ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉండటం గమనార్హం. ఇక్కరు లేదా ఇద్దరు పిల్లలు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య కేవలం 137 మాత్రమే. మరో 15ను మందికి సంబంధించిన డేటా అందుబాటులో లేదు. ఈ సమాచారం ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ అధికారిక వెబ్సైట్లో ఉంది. పార్లమెంటులో ఇదే చట్టాన్ని పార్లమెంటుకు అన్వయిస్తే ప్రస్తుతం ఉన్న లోక్‌సభ సభ్యుల్లో 168 మంది అనర్హులు అవుతారు. ఇక్కడ కూడా బీజేపీదే సింహభాగం. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన ఎంపీలు బీజేపీ తరఫున 105 మంది పార్లమెంటుకు ఎన్నికయ్యారు. మరీ విచిత్రం ఏటంటే జనాభా నియంత్రణ బిల్లు -2019ను ప్రైవేటు బిల్లుగా పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు బీజేపీ ఎంపిక చేసిన జాబితాలో ఉన్న బీజేపీ ఎంపీ, భోజ్‌పూరి నటుడు రవిశంకర్‌కి ఏకంగా నలుగురు పిల్లలు ఉన్నారు. భిన్న స్వరాలు యోగి సర్కార్ జనాభా నియంత్రణ విధానాన్ని అధికార పార్టీలో పైకి ఎవరు విమర్శలు చేయకున్నా ‘ఆఫ్ ది రికార్డు’ సంభాషనల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారను. ఈ రోజు స్థానిక సంస్థలు రేపు అసెంబ్లీ ఎన్నికలు అంటే తమ పరిస్థితి ఏంటని మథనపడుతున్నారు. పైగా క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకునే నాయకులు అనర్హులైతే, ఆ... అసంతృప్తి అంతా తమకు చేటు తెస్తుందేమో అని మల్లగుల్లాలు పడుతున్నారు. 8 మంది పిల్లలు యూపీ అసెంబ్లీ వెబ్సైట్ వివరాల ప్రకారమే ఒక ఎమ్మెల్యేకు 8 మంది పిల్లలు ఉండగా మరో ఎమ్మెల్యేకు 7 గురు పిల్లలు ఉన్నారు. ఇక ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు 6 గురు పిల్లలు ఉన్నారు. 15 మందికి 5గురు సంతానం, 44 మందికి నలుగురు సంతానం ఉన్నారు. ముగ్గురు సంతానం కలిగిన ఎమ్మెల్యేలు 83 మంది ఉన్నారు. అధిక సంతానం కలిగిన పిల్లలు బీజేపీఎమ్మెల్యేల సంఖ్య సంఖ్య 1 8 1 7 8 6 15 5 44 4 83 3 103 2 34 1 -
ప్రతి ప్రాజెక్ట్కూ ప్రత్యేక ఖాతా!
• ఎస్క్రో అకౌంట్ ఉండాలంటున్న స్థిరాస్తి నియంత్రణ బిల్లు • నిధుల పక్కదారికి చాన్సే లేదు; దీంతో సకాలంలో నిర్మాణం పూర్తి • కానీ, నగరంలో ఖాతా నిర్వహించే బిల్డర్లు తక్కువే • ఎస్క్రో ఖాతా నిర్వహించే సంస్థల్లోనే కొనుగోళ్లు మంచిది: నిపుణులు ‘‘ప్రతి స్థిరాస్తి ప్రాజెక్ట్కూ ప్రత్యేక బ్యాంక్ ఖాతా (ఎస్క్రో)ను తెరవాలి. కొనుగోలుదారుల నుంచి వసూలు చేసే సొమ్ములో 70 శాతాన్ని 15 రోజుల్లోగా ఈ ఖాతాలో జమ చేయాలి’’ .. ఇదీ స్థిరాస్తి నియంత్రణ బిల్లు (రెరా)లోని ఓ నిబంధన. కానీ, భాగ్యనగరంలో ఈ నిబంధనను ఫాలో అయ్యే బిల్డర్లను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఎందుకంటే మనోళ్లు కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన సొమ్మును మళ్లించడంలో సిద్ధహస్తులు కదా! ఇంతకీ ఎస్క్రో ఖాతా అంటే ఏంటి? ఈ ఖాతాతో కొనుగోలుదారులకు ఒరిగే ప్రయోజనాలేంటో వివరించేదే ‘సాక్షి రియల్టీ’ ఈ వారం ప్రత్యేక కథనం!! సాక్షి, హైదరాబాద్ : స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు ఎంత సురక్షితమో.. ఏమరపాటుగా ఉంటే నష్ట భయం కూడా అంతే! అందుకే ప్రతి అంశాన్ని పక్కాగా పరిశీలించాకే ముందడుగు వేయాలి. భవిష్యత్తు దృష్ట్యా ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య ఎలా అరుుతే పెరుగుతుందో.. అలాగే కొనుగోళ్ల సమయంలో రకరకాల సమస్యలూ ఎదురవుతున్నారుు కస్టమర్లకు. గత కొంతకాలం నుంచి దేశ వ్యాప్తంగా వేలాదిమంది కస్టమర్లు తమ కలల గృహం ఆలస్యం కావటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లో అరుుతే తెల్లాపూర్‌లో ఆకాశహర్మ్యాల నిర్మాణమంటూ భారీ ప్రచారం చేసి కస్టమర్లను నట్టేట ముంచింది ఓ సంస్థ. కొనుగోలుదారులు చేసే చెల్లింపులను మరో ప్రాజెక్ట్‌కు లేదా వ్యక్తిగత అవసరాలు లేదా ఇతర పనులకు వినియోగించడం వల్లే ఈ పరిస్థితి నెలకొంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సంస్థలు నగరంలో కోకొల్లలు. ఇలాంటి డెవలపర్లను నియంత్రించడం కొనుగోలుదారుల వల్ల అయ్యే పనికాదు. అలాగే సకాలంలో ఫ్లాట్లను అందించేలా చేయనూ లేరు. నిర్మాణంలో జాప్యాన్ని తగ్గించేందుకు, పారదర్శకంగా నిధులను వినియోగించేందుకు అవసరమయ్యేదే ‘‘ఎస్క్రో ఖాతా’’! ఎస్క్రో ఖాతా అంటే.. ప్రతి ప్రాజెక్ట్‌కు ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతాను నిర్వహించడమే ఎస్క్రో ఖాతా. ఇందులో జమయ్యే సొమ్మును పూర్తిగా ఆ ప్రాజెక్ట్ నిర్మాణ పనుల కోసమే వినియోగించేలా చేయడమే ఈ ఖాతా ప్రధాన లక్ష్యం. ఇది తాత్కాలిక ఖాతా. ప్రాజెక్ట్ పూర్తిగా డెలివరీ అరుు నిరభ్యంతర ధృవీకరణ పత్రం (ఎన్ఓసీ) వచ్చేంతవరకూ ఈ ఖాతా నిర్వహణలో ఉంటుంది. ఎస్క్రో ఖాతాను తెరవాలంటే బిల్డర్ బ్యాంకుతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఖాతా లావాదేవీలను పర్యవేక్షించడానికి ఓ ట్రస్టీని నియమిస్తారు. ఖాతాలోని నిధుల్ని నిర్మాణ పనులకే వాడుతున్నారా? లేదా? అన్నది పర్యవేక్షించడం ఇతని విధి. ఒకవేళ నిధులు అవసరమైతే ట్రస్టీ అనుమతితో ఖాతాలోని 70 శాతం సొమ్మును వినియోగించుకునే వీలుంటుంది. కస్టమర్లకు ఏం లాభం.. ఎస్క్రో ఖాతా నిబంధనల ప్రకారం బిల్డర్ నిధుల్ని దుర్వినియోగం చేయడానికి, మళ్లించడానికి అవకాశం లేదు. ఇదే సొమ్ముతో కొత్తగా వేరే ప్రాంతంలో భూములను కొనుగోలు చేయాలన్నా కూడా కుదరదు. నిధుల సక్రమ వినియోగంతో గడువులోగా ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఒకవేళ కస్టమర్లు కావాలనుకుంటే ఖాతాలోని సొమ్మును వడ్డీతో సహా వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ‘‘ఫ్లాట్ కొనేటప్పుడు ప్రతి ఒక్కరూ బిల్డర్లను ఎస్క్రో ఖాతాను నిర్వహిస్తున్నారా? లేదా? అని ప్రశ్నించాలి. సరైన జవాబు వచ్చిందా ఓకే. లేకపోతే సదరు బిల్డర్ ఎస్క్రో ఖాతాను నిర్వహించడం లేదని అర్థం. ఇక ఆ బిల్డర్ వద్ద ఫ్లాట్ కొనాలా? వద్దా? అనేది ఎవరికి వారే నిర్ణరుుంచుకోవాల్సిన విషయమని’’ నిపుణులు సూచిస్తున్నారు. నగరంలోని బిల్డర్ల పరిస్థితి.. సాధారణంగా మౌలిక సదుపాయాల సంస్థలు ఎస్క్రో ఖాతాను ఎక్కువగా నిర్వహిస్తుంటారుు. అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి దేశాల్లో స్థిరాస్తి లావాదేవీలన్నీ ఎస్క్రో ఖాతాలోనే జమ అవుతుంటారుు. తాజాగా కేంద్రం తీసుకొచ్చిన స్థిరాస్తి నియంత్రణ బిల్లులో ప్రతి నిర్మాణ సంస్థ ప్రతి ప్రాజెక్ట్‌కు ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాను ప్రారంభించానే నిబంధనను పెట్టింది. పైగా ఎస్క్రో ఖాతాలను ఆరంభించేలా నిర్మాణ సంస్థలపై ఒత్తిడి తేవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది కూడా.