ప్రతి ప్రాజెక్ట్కూ ప్రత్యేక ఖాతా! | Ensure your developer has an escrow account | Sakshi
Sakshi News home page

ప్రతి ప్రాజెక్ట్కూ ప్రత్యేక ఖాతా!

Published Fri, Nov 25 2016 10:57 PM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM

ప్రతి ప్రాజెక్ట్కూ ప్రత్యేక ఖాతా!

ఎస్క్రో అకౌంట్ ఉండాలంటున్న స్థిరాస్తి నియంత్రణ బిల్లు
నిధుల పక్కదారికి చాన్సే లేదు; దీంతో సకాలంలో నిర్మాణం పూర్తి
కానీ, నగరంలో ఖాతా నిర్వహించే బిల్డర్లు తక్కువే
ఎస్క్రో ఖాతా నిర్వహించే సంస్థల్లోనే కొనుగోళ్లు మంచిది: నిపుణులు

‘‘ప్రతి స్థిరాస్తి ప్రాజెక్ట్‌కూ ప్రత్యేక బ్యాంక్ ఖాతా (ఎస్క్రో)ను తెరవాలి. కొనుగోలుదారుల నుంచి వసూలు చేసే సొమ్ములో 70 శాతాన్ని 15 రోజుల్లోగా ఈ ఖాతాలో జమ చేయాలి’’ .. ఇదీ స్థిరాస్తి నియంత్రణ బిల్లు (రెరా)లోని ఓ నిబంధన.

కానీ, భాగ్యనగరంలో ఈ నిబంధనను ఫాలో అయ్యే బిల్డర్లను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఎందుకంటే మనోళ్లు కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన సొమ్మును మళ్లించడంలో సిద్ధహస్తులు కదా! ఇంతకీ ఎస్క్రో ఖాతా అంటే ఏంటి? ఈ ఖాతాతో కొనుగోలుదారులకు ఒరిగే ప్రయోజనాలేంటో వివరించేదే ‘సాక్షి రియల్టీ’ ఈ వారం ప్రత్యేక కథనం!!

సాక్షి, హైదరాబాద్ : స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు ఎంత సురక్షితమో.. ఏమరపాటుగా ఉంటే నష్ట భయం కూడా అంతే! అందుకే ప్రతి అంశాన్ని పక్కాగా పరిశీలించాకే ముందడుగు వేయాలి. భవిష్యత్తు దృష్ట్యా ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య ఎలా అరుుతే పెరుగుతుందో.. అలాగే కొనుగోళ్ల సమయంలో రకరకాల సమస్యలూ ఎదురవుతున్నారుు కస్టమర్లకు. గత కొంతకాలం నుంచి దేశ వ్యాప్తంగా వేలాదిమంది కస్టమర్లు తమ కలల గృహం ఆలస్యం కావటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లో అరుుతే తెల్లాపూర్‌లో ఆకాశహర్మ్యాల నిర్మాణమంటూ భారీ ప్రచారం చేసి కస్టమర్లను నట్టేట ముంచింది ఓ సంస్థ.

కొనుగోలుదారులు చేసే చెల్లింపులను మరో ప్రాజెక్ట్‌కు లేదా వ్యక్తిగత అవసరాలు లేదా ఇతర పనులకు వినియోగించడం వల్లే ఈ పరిస్థితి నెలకొంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సంస్థలు నగరంలో కోకొల్లలు. ఇలాంటి డెవలపర్లను నియంత్రించడం కొనుగోలుదారుల వల్ల అయ్యే పనికాదు. అలాగే సకాలంలో ఫ్లాట్లను అందించేలా చేయనూ లేరు. నిర్మాణంలో జాప్యాన్ని తగ్గించేందుకు, పారదర్శకంగా నిధులను వినియోగించేందుకు అవసరమయ్యేదే ‘‘ఎస్క్రో ఖాతా’’!

 ఎస్క్రో ఖాతా అంటే..
ప్రతి ప్రాజెక్ట్‌కు ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతాను నిర్వహించడమే ఎస్క్రో ఖాతా. ఇందులో జమయ్యే సొమ్మును పూర్తిగా ఆ ప్రాజెక్ట్ నిర్మాణ పనుల కోసమే వినియోగించేలా చేయడమే ఈ ఖాతా ప్రధాన లక్ష్యం. ఇది తాత్కాలిక ఖాతా. ప్రాజెక్ట్ పూర్తిగా డెలివరీ అరుు నిరభ్యంతర ధృవీకరణ పత్రం (ఎన్‌ఓసీ) వచ్చేంతవరకూ ఈ ఖాతా నిర్వహణలో ఉంటుంది. ఎస్క్రో ఖాతాను తెరవాలంటే బిల్డర్ బ్యాంకుతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఖాతా లావాదేవీలను పర్యవేక్షించడానికి ఓ ట్రస్టీని నియమిస్తారు. ఖాతాలోని నిధుల్ని నిర్మాణ పనులకే వాడుతున్నారా? లేదా? అన్నది పర్యవేక్షించడం ఇతని విధి. ఒకవేళ నిధులు అవసరమైతే ట్రస్టీ అనుమతితో ఖాతాలోని 70 శాతం సొమ్మును వినియోగించుకునే వీలుంటుంది.

కస్టమర్లకు ఏం లాభం..
ఎస్క్రో ఖాతా నిబంధనల ప్రకారం బిల్డర్ నిధుల్ని దుర్వినియోగం చేయడానికి, మళ్లించడానికి అవకాశం లేదు. ఇదే సొమ్ముతో కొత్తగా వేరే ప్రాంతంలో భూములను కొనుగోలు చేయాలన్నా కూడా కుదరదు. నిధుల సక్రమ వినియోగంతో గడువులోగా ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఒకవేళ కస్టమర్లు కావాలనుకుంటే ఖాతాలోని సొమ్మును వడ్డీతో సహా వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ‘‘ఫ్లాట్ కొనేటప్పుడు ప్రతి ఒక్కరూ బిల్డర్లను ఎస్క్రో ఖాతాను నిర్వహిస్తున్నారా? లేదా? అని ప్రశ్నించాలి. సరైన జవాబు వచ్చిందా ఓకే. లేకపోతే సదరు బిల్డర్ ఎస్క్రో ఖాతాను నిర్వహించడం లేదని అర్థం. ఇక ఆ బిల్డర్ వద్ద ఫ్లాట్ కొనాలా? వద్దా? అనేది ఎవరికి వారే నిర్ణరుుంచుకోవాల్సిన విషయమని’’ నిపుణులు సూచిస్తున్నారు.

నగరంలోని బిల్డర్ల పరిస్థితి..
సాధారణంగా మౌలిక సదుపాయాల సంస్థలు ఎస్క్రో ఖాతాను ఎక్కువగా నిర్వహిస్తుంటారుు. అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి దేశాల్లో స్థిరాస్తి లావాదేవీలన్నీ ఎస్క్రో ఖాతాలోనే జమ అవుతుంటారుు. తాజాగా కేంద్రం తీసుకొచ్చిన స్థిరాస్తి నియంత్రణ బిల్లులో ప్రతి నిర్మాణ సంస్థ ప్రతి ప్రాజెక్ట్‌కు ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాను ప్రారంభించానే నిబంధనను పెట్టింది. పైగా ఎస్క్రో ఖాతాలను ఆరంభించేలా నిర్మాణ సంస్థలపై ఒత్తిడి తేవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది కూడా.

Advertisement
 
Advertisement
 
Advertisement