convey
-
మణిపూర్ సీఎం కాన్వాయ్‌పై దాడి
ఇంఫాల్: మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ కాన్వాయ్‌పై సోమవారం అనుమానిత మిలిటెంట్లు దాడి చేశారు. కాంగ్పోక్పి జిల్లాలో జాతీయ రహదారి 37 వద్ద సోమవారం ఉదయం సాయుధ ఈ ఆకస్మికంగా దాడి జరిగింది. ఈ ఘటనలో సీఎం భద్రతా సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి గాయపడ్డాడు.కాగా జూన్ 6న జిరిబామ్‌కు చెందిన ఓ రైతు హత్యతో అక్కడ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. గత కొన్ని రోజులుగా ఉద్రిక్తంగా మారిన ఇక్కడ పరిస్థితులను సీఎం బీరెన్ సింగ్ మంగళవారం సందర్శించేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే నేడు సీఎం కాన్వాయ్ ఇంఫాల్ నుంచి జిరిబమ్ జిల్లాకు వెళ్తున్న సమయంలో దాడి జరిగింది. సెక్యూరిటీ దళాలపై మిలిటెంట్లు పలుమార్లు ఫైరింగ్ జరిపారు. అయితే ఆ దాడిని భద్రతా బలగాలు తిప్పికొట్టాయి.అయితే దాడి సమయంలో సీఎం సంఘటన ప్రాంతంలో లేనట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా జిరిబామ్‌లో వ్యక్తి హత్యతో కొందరు అరాచకవాదులు రెండు పోలీస్ అవుట్‌పోస్టులు, ఫారెస్టు బీట్ కార్యాలయంతోపాటు మేతీ, కుకీ తెగల వారికి చెందిన దాదాపు 70 ఇళ్లను తగలబెట్టారు. ఈ ఘటన అనంతరం మైతీ వర్గానికి చెందిన వందలాది మంది పౌరులు ఆ ప్రాంతం విడిచి వెళ్లిపోయారు. -
మనవరాలి కోసం లగ్జరీ కొనవే ఏర్పాటు చేసిన ముకేశ్ అంబానీ
-
మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న బీజేపీ నేతలు
వెల్గటూరు : వెల్గటూరు మండలం ముత్తునూరులో శుక్రవారం నిర్వహించిన హరితహారంలో పాల్గొని వెళ్తున్న అటవీశాఖ మంత్రి జోగు రామన్న కాన్వాయ్‌ను బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు కన్నం అంజయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు కాన్వాయ్‌ను అడ్డుకోబోతుండగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అయితే మంత్రి మార్గమధ్యంలో వేరే కార్యక్రమంలో పాల్గొనడంతో ఆయన కాన్వాయ్ ఆలస్యంగా వచ్చింది. మంత్రి కాన్వాయ్ అనుకుని మాజీ జెడ్పీటీసీ వెంకటయ్య కారును అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ముంపు గ్రామాల్లోని నిర్వాసితులకు పూర్తిగా పరిహారం చెల్లించాలని కోరారు. కొమ్ము రాంబాబు, సత్యం, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
వాస్తు దోషంతో సీఎం కాన్వాయ్ రూటు మార్పు
హైదరాబాద్: సచివాలయ ప్రాంగణంలో ‘సీ’ బ్లాక్‌కు వెళ్లే దారిలో వాస్తు దోషం ఉందని, దానిని సరిచేయడానికి తన కాన్వాయ్ వెళ్లే దారిని మార్చాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మింట్‌కంపౌండ్ వైపు నుంచి కొత్తగా ఏర్పాటు చేసిన గేటు ద్వారా లోపలికి ప్రవేశించే ముఖ్యమంత్రి నల్లపోచమ్మ దేవాలయం రావడానికి ముందే కుడివైపు తిరిగి ‘సీ’ బ్లాకు వైపు వెళ్లేవారు. ఈ దారి మలుపుల మయంగా ఉండడం, అదీకాక వాస్తు రీత్యా సరికాదని భావించిన సీఎం ప్రత్యామ్నాయ రహదారిని అధికారులకు సూచించారు.