మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న బీజేపీ నేతలు
Published Fri, Aug 5 2016 9:59 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
వెల్గటూరు : వెల్గటూరు మండలం ముత్తునూరులో శుక్రవారం నిర్వహించిన హరితహారంలో పాల్గొని వెళ్తున్న అటవీశాఖ మంత్రి జోగు రామన్న కాన్వాయ్‌ను బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు కన్నం అంజయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు కాన్వాయ్‌ను అడ్డుకోబోతుండగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అయితే మంత్రి మార్గమధ్యంలో వేరే కార్యక్రమంలో పాల్గొనడంతో ఆయన కాన్వాయ్ ఆలస్యంగా వచ్చింది. మంత్రి కాన్వాయ్ అనుకుని మాజీ జెడ్పీటీసీ వెంకటయ్య కారును అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ముంపు గ్రామాల్లోని నిర్వాసితులకు పూర్తిగా పరిహారం చెల్లించాలని కోరారు. కొమ్ము రాంబాబు, సత్యం, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement