కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ వచ్చే నెల 7న విజయవాడకు రానున్నట్టు బీజేపీ నగర అధ్యక్షుడు దాసం ఉమామహేశ్వరరాజు ఆదివారం మీడియాకు తెలిపారు.
కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ వచ్చే నెల 7న విజయవాడకు రానున్నట్టు బీజేపీ నగర అధ్యక్షుడు దాసం ఉమామహేశ్వరరాజు ఆదివారం మీడియాకు తెలిపారు. ఆ రోజు జరగనున్న పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. అదే రోజు నగరంలో బహిరంగ సభ కూడా ఉంటుందన్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి ఆదివారం ఇక్కడ పాలప్రాజెక్టు ఫంక్షన్ హాల్లో బీజేపీ నాయకులు చర్చించారు.