Corporate agriculture
-
ఆ వ్యాపారంలో లేం: రిలయన్స్
సాక్షి, న్యూఢిల్లీ: కార్పొరేట్ లేదా కాంట్రాక్ట్ వ్యవసాయ వ్యాపారంలో తాము లేమని రిలయన్స్ సంస్థ స్పష్టం చేసింది. పంజాబ్‌లో తమ జియో సంస్థ టెలికం టవర్ల ధ్వంసం వెనుక స్వార్థ ప్రయోజనాలను ఆశిస్తున్న శక్తులున్నాయని ఆరోపించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు తమ టవర్లను ధ్వంసం చేయకుండా అడ్డుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరుతూ పంజాబ్, హరియాణా హైకోర్టులో రిలయన్స్ పిటిషన్ దాఖలు చేసింది. ‘మా గ్రూప్ సంస్థలు ఒప్పంద వ్యవసాయ రంగంలో లేవు. భవిష్యత్తులో ప్రవేశించాలన్న ఆలోచనా లేదు. దేశవ్యాప్తంగా ఎక్కడా మేం వ్యవసాయ భూమిని కొనలేదు’ అని పిటిషన్లో రిలయన్స్ పేర్కొంది. సంస్థకు చెందిన రిటెయిల్ యూనిట్లు ఆహార ధాన్యాలు సహా నిత్యావసరాలను అమ్ముతాయన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కూడా రిలయన్స్ స్పష్టత ఇచ్చింది. తాము రైతుల నుంచి నేరుగా ఆహార ధాన్యాలను కొనుగోలు చేయమని వివరించింది. పంజాబ్‌లో ఉన్న 9 వేల జియో టవర్లలో దాదాపు 1,800 టవర్లు ధ్వంసమయ్యాయి. రైతుల పంటలకు న్యాయమైన, లాభదాయకమైన ధరలు లభించాలన్న డిమాండ్‌కు తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు రిలయన్స్ పేర్కొంది. ఆ అఫిడవిట్లో అన్నీ అబద్ధాలే హైకోర్టులో రిలయన్స్ సమర్పించిన అఫిడవిట్లో అన్నీ అబద్ధాలే ఉన్నాయని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. వ్యాపార ప్రయోజనాలను కాపాడుకునేందుకే ఆ సంస్థ ఈ పిటిషన్ వేసిందని ఆల్ ఇండియా కిసాన్ సంఘర్‡్ష కోఆర్డినేషన్ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) విమర్శించింది. మహారాష్ట్రలో, దేశంలోని పలు ప్రాంతాల్లో రిలయన్స్ భూములను కొనుగోలు చేసిందని పేర్కొంది. భూములను రైతులకు వెనక్కు ఇచ్చాక కోర్టును ఆశ్రయించాలని రిలయన్స్‌కు సూచించింది. -
మీ భూములు సురక్షితం
న్యూఢిల్లీ: ఒప్పంద వ్యవసాయం(కాంట్రాక్ట్ ఫా మింగ్) వల్ల రైతుల భూమిని కార్పొరేట్లు స్వాధీనం చేసుకుంటారన్నది అవాస్తవమని, ఆ భయాలు పెట్టుకోవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతులకు భరోసా ఇచ్చారు. కొందరు కావాలనే స్వార్థ ప్రయోజనాల కోసం ఈ అపోహలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఏడు రాష్ట్రాల రైతుల విజయగాధలను శుక్రవారం ప్రధాని విన్నారు. కేంద్రం తాజాగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలతో తాము పొందిన ప్రయోజనాలను అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, హరియాణాలకు చెందిన ఏడుగురు రైతులు ప్రధానికి వివరించారు. ఒప్పంద వ్యవసాయానికి సంబంధించిన తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ‘ప్రధానమంత్రి కిసాన్’ పథకానికి సంబంధించి రూ. 18 వేల కోట్లను ప్రధాని 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. ‘కొందరు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. మీలాంటి వారు చెబితే ఇతరుల్లోనూ తమ భూమి ఎక్కడికీ పోదనే ధైర్యం వస్తుంది’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఒప్పంద ఉల్లంఘనకు గతంలో రైతులకు పెనాల్టీ ఉండేదని, తమ కొత్త చట్టంలో ఆ జరిమానా నిబంధన లేదని వివరించారు. ‘కొత్త చట్టం ప్రకారం ప్రైవేటు కంపెనీ తన ఇష్టానుసారం ఒప్పందం నుంచి వైదొలగే అవకాశం లేదు. కానీ రైతులు, తాము కోరుకుంటే ఒప్పందం నుంచి వైదొలగవచ్చు. ఇది రైతులకు అనుకూల నిబంధన కాదా?’ అని ప్రధాని ప్రశ్నించారు. ఒప్పంద రేటు కన్నా మార్కెట్ రేటు ఎక్కువ ఉంటే దిగుబడులకు రైతులకు బోనస్ లభిస్తుందని వివరించారు. అందుకే చర్చల్లో ప్రతిష్టంభన రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తున్న కొందరి జోక్యం వల్లనే రైతులతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిందని ప్రధాని విమర్శించారు. కొత్త సాగు చట్టాలపై ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే, ఆ చర్చలు ‘సహేతుకమైన, వాస్తవికమైన రైతు అభ్యంతరాల’ పైననే జరగాలన్నారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాలు ఆశిస్తున్న కొందరి చేతుల్లోకి ప్రస్తుతం రైతు ఆందోళనలు వెళ్లాయని, అందువల్లనే అర్థంలేని డిమాండ్లు చేస్తున్నారని విమర్శించారు. కొత్త సాగు చట్టాలను దేశవ్యాప్తంగా రైతులు స్వాగతిస్తున్నారన్నారు. ప్రజాదరణ కోల్పోయి ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు తమ రాజకీయ అస్తిత్వం కోసం రైతులను వాడుకుంటున్నాయని ఆరోపించారు. తనను కొందరు నేతలు, ఆందోళనకారులు అభ్యంతరకర భాషలో దూషించారని, అయినా తాను అవేవీ పట్టించుకోనని ప్రధాని పేర్కొన్నారు. వారికి ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని వ్యాఖ్యానించారు. మోదీ వ్యాఖ్యలపై ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు నిర్వహిస్తున్న రైతు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతుల్లో విబేధాలు సృష్టించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీని ఇచ్చేందుకు, తమ ఇతర డిమాండ్లను నెరవేర్చేందుకు కచ్చితమైన కార్యాచరణ చూపాలని ప్రధానిని కోరారు. మోదీపీఎంగా ఉన్నంతవరకు.. నరేంద్రమోదీ దేశ ప్రధానిగా ఉన్నంతవరకు ఏ కార్పొరేట్ సంస్థ కూడా రైతు భూమిని స్వాధీనం చేసుకోలేదని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ‘ఎమ్మెస్పీ విధానం కొనసాగుతుంది, మండీలు మూతపడవు, మీ భూములను ఎవరూ స్వాధీనం చేసుకోరు’ అని రైతులకు హామీ ఇచ్చారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయన్నారు. దేశ రాజధాని ప్రాంతంలోని కిషన్‌గంజ్ గ్రామంలో రైతులనుద్దేశించి షా ప్రసంగించారు. కొత్త వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అవాస్తవాలు ప్రచారం చేస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత స్మృతి ఇరానీ విమర్శించారు. ౖఆయన సొంత బావ రాబర్ట్ వాద్రానే రైతుల భూమిని ఆక్రమించారని ఆరోపించారు. యూపీలోని అమేథీలో జరిగిన రైతు ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. నేడు నిర్ణయం కేంద్రంతో చర్చలు కొనసాగించే విషయంపై నేడు రైతు సంఘాలు చర్చించనున్నాయి. చర్చలకు రావాలన్న కేంద్రం ప్రతిపాదనకు లిఖితపూర్వక సమాధానాన్ని సిద్ధం చేయనున్నాయి. ఒకటి రెండేళ్లు చూడండి ‘కొత్త సాగు చట్టాలను ఒక ప్రయోగంలా ఒకటి రెండేళ్లు ప్రయత్నించండి. అవి ప్రయోజనకరం కాదని తేలితే ప్రభుత్వం వాటికి అవసరమైన సవరణలు చేస్తుంది’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రైతులకు సూచించారు. ఆందోళనలు చేస్తున్న రైతులంతా తమ వారేనని, వారు రైతు బిడ్డలని, వారంటే తమకు ఎంతో గౌరవమని వ్యాఖ్యానించారు. రైతులకు హాని కలిగించే చర్యలు ప్రధాని మోదీ ఎన్నటికీ చేయరని స్పష్టం చేశారు. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఒక ర్యాలీని ఉద్దేశించి రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో ఆప్ సభ్యుల నిరసన కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని ప్రధాని మోదీ ముందు ఆప్ ఎంపీలు నిరసన తెలిపారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో శుక్రవారం ప్రధాని మోదీ అటల్ బిహారీ వాజ్‌పేయి: ఎ కమామొరేటివ్ వాల్యూమ్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ కార్యక్రమం అనంతరం ఆయన తిరిగి వెళ్తుండగా.. ఆప్ సభ్యులు సంజయ్ సింగ్, భగవంత్ మన్ లేచి నిల్చుని రైతు చట్టాలను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. వాజ్‌పేయి వల్లనే బలమైన భారత్! న్యూఢిల్లీ: భారత్‌ను బలమైన శక్తిగా తీర్చిదిద్దడంలో అటల్ కృషిని దేశం ఎప్పటికీ మరవలేదని ప్రధాని మోదీ ప్రశంసించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 96వ జయంతి సందర్భంగా దేశప్రజలు ఆయన్ను ఘనంగా స్మరించుకున్నారు. పార్లమెంట్ సెంట్రల్హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానితోపాటు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. సమావేశంలో ‘‘అటల్ బిహారీ వాజ్‌పేయి: ఏ కమ్మెమోరేటివ్ వాల్యూం’’ అనే పుస్తకాన్ని ప్రధాని ఆవిష్కరించారు. సదైవ్ అటల్ మెమోరియల్ వద్ద రాష్ట్రపతి రామ్‌నాధ్ వాజ్‌పాయ్‌కు అంజలి అర్పించారు. -
కార్పొరేట్ సాగు మన సంస్కృతికి విరుద్ధం
‘ప్రపంచంలోని 70 శాతం పంటపొలాలలో గడ్డి బీడులను, పండ్లతోటలను ఒక్క శాతం బడా రైతాంగం (కార్పొరేట్లు) మాత్రమే వ్యవసాయం నిర్వహిస్తూ, ప్రకృతి సంక్షోబాలకు కారణమవుతూ సేద్యంలో అసమానత ప్రభావానికి కారకులవుతున్నారని’, ఆక్స్‌ఫామ్, ప్రపంచ అసమానతలపై అధ్యయనం చేస్తున్న సంస్థలతో కలిసి పనిచేసిన అంతర్జాతీయ భూముల అధ్యయన కేంద్రం పరిశోధనలలో తేలింది. 1980 నుండి వ్యవసాయ పొలాల నిర్వహణ పరోక్షంగా కాంట్రాక్టు వ్యవసాయం ద్వారా కేంద్రీకృతమైందని అధ్యయన కేంద్ర ప్రతినిధి వార్డ్ అన్యూన్ తెలిపారు. కాంట్రాక్టు వ్యవసాయం ద్వారా చిన్న, మధ్య తరగతి రైతులను నిర్లక్షం చేస్తూ ఏకపంట సాగుచేస్తుండటంతో భూసారం తగ్గుతూ, జీవవైవిధ్యం నశిస్తున్నది. కార్పొరేట్లు ప్రవేశపెడుతున్న ఈ ఏకపంటల విధానంతో పంజాబ్, హరియాణా రైతులను పెప్సీ, ఐటీసీ కంపెనీలకు బంగాళదుంప, టమాటా తప్ప వేరే పంటలు పండనీయడంలేదు. కనీసం 10 లక్షల ఎకరాలు కాంట్రాక్టు వ్యవసాయానికి సేకరించారు. పెరుగుతున్న భూమి విలువతోపాటు, భూమిని కోల్పోతున్న రైతులను మొదటిసారిగా పరిగణిస్తే ఇప్పటివరకు నమ్మిన దానికంటే 41 శాతం ఎక్కువని నివేదిక తెలియజేస్తున్నది. స్వల్పకాల లాభాలే ధ్యేయంగా కార్పొరేట్ వ్యవసాయం చేయడంతో ప్రపంచ వాతావరణం పైనా, ప్రజారోగ్యంపైనా ప్రతికూల ప్రభావం కల్గిస్తున్నది. పర్యావరణం, మహమ్మారులతో వ్యవసాయం ముడిపడి ఉండటంచేత ఇప్పుడు ప్రజల జీవితంలోని ప్రతీ అంశాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మన దేశంలో 6 శాతం ధనిక రైతుల దగ్గర 51 శాతం భూమి అధీనంలో ఉంది. 5 నుండి 10 ఎకరాలు ఉన్న రైతుల దగ్గర దేశంలోని మొత్తం సాగుభూమిలో సుమారు 10 శాతం ఉంది. 5 ఎకరాల లోపు రైతులు మొత్తం రైతాంగంలో 85 శాతం వరకూ ఉండగా, మొత్తం భూమిలో తమ వాటాగా వీరు 37 శాతం మాత్రమే కలిగిఉన్నారు, వీరిలో 23 శాతం దారిద్య్రపు రేఖ దిగువన ఉన్నారు. భూస్వాములు, పెద్ద రైతుల భూమిని 70 శాతం కౌలురైతులే సాగుచేస్తున్నారు. ఆసియా, ఆఫ్రికా రైతాంగం చిన్నకమతాలను కలిగిఉన్నారు. ఇక్కడి వ్యవసాయం తక్కువ సమయంలో లాభార్జనే ధ్యేయంగా కాకుండా భూసారాన్ని భావితరాలకోసం పరిరక్షిస్తుంటారు. ప్రపంచం మొత్తంలో 80 నుండి 90 శాతం చిన్నకమతాల పొలాలు రైతుకుటుంబాలు మొత్తంగా గానీ లేక రైతుచే సాగుచేయబడుతూ వుండగా, నానాటికీ ఈ కమతాల సంఖ్య కార్పొరేట్ వ్యవసాయానికి బలైపోతూ కుచిం చుకుపోతోంది. గత 40 ఏళ్లనుండి అమెరికా, యూరపులో కార్పొరేట్ వ్యవసాయానికి రైతాంగం బలైపోతూ... వ్యవసాయ పెట్టుబడి నిధులకోసం, కఠినమైన ఒప్పందాలతో సాగుచేయవల్సి వస్తోంది. నేల నాణ్యత క్షీణిస్తూ. ఎరువులు, క్రిమిసంహారకాలు అపరిమితంగా వాడటంతోపాటు, అడవులను నరుకుతూ పర్యావరణ సమస్యలు సృష్టిస్తున్నారు. మెరుగైన పర్యావరణ నిర్వహణ కోసం, రైతాంగ గిట్టుబాటు వ్యవసాయం కోసం చిన్న, మధ్య తరగతి రైతాంగం కోసం, నిబంధనలలో మార్పులు తీసుకొచ్చి, కమ్యూనిటీ రైతులకు కూడా మద్దతును ప్రభుత్వం ప్రకటించాలి. పన్నులు తగ్గించి, ప్రభుత్వ సబ్సిడీలు పెంచి నేరుగా రైతుకే చేరే అవకాశం కల్పించాలి. రైతు గర్వపడే భూ హక్కును కాపాడాలి. చిన్న రైతులు, రైతుకుటుంబాలు, స్వదేశీ ప్రజలు భూమిని సాగుచేయడంలో చాలా జాగ్రత్తలతో మెలకువ వహిస్తారు. కేవలం పెట్టుబడి రాబట్టడానికేగాక రైతుగా గుర్తింపుకోసం, తమ సంస్కతిని భావితరాలు కొనసాగించటం కోసం వ్యవసాయాన్ని చేస్తారు. దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం పర్యావరణాన్ని కాపాడుతూ, సగటు సెంటుభూమిలో ఎక్కువ ఉత్పాదకత చేస్తారు. ఈ విధానాన్ని కార్పొరేట్ వ్యవసాయం చేయలేదు. ప్రకృతిని, నేలను నమ్ముకున్న రైతాంగంలా కార్పొరేట్ వ్యవసాయం సాగు జరగదు. తన లాభాల కోసం కంపెనీలను మార్చినట్లుగా వ్యవసాయం నుండి కార్పొరేట్‌రంగం తప్పుకొంటుంది, భూమిని మాత్రం తన వద్దనే ఉంచుకొని పొలాలను బీళ్లుగా మార్చుతుంది. దీనితో ఆహారభద్రతకు ఆటంకం ఏర్పడుతుంది. ప్రజానీకానికి పట్టెడన్నం పెట్టే రైతును దూరం చేసుకోవద్దు. నేడు ప్రపంచంలో 140 కోట్ల ప్రజలు ప్రత్యక్షంగా భూమిపై ఆధారపడి ఆహారం, వసతిని ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు, వీరిని మనం రక్షించుకోవాలి. ఇటువంటి రైతాంగం అభద్రతకు గురవుతున్న కారణం చేతనే చలిని సైతం లెక్కచేయక, కార్పొరేట్ అనుకూలచట్టాలకు వ్యతిరేకంగా రాజధానికి ఉవ్వెత్తున తరలివచ్చారు. వ్యాసకర్త: బుడ్డిగ జమిందార్, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరమ్ అధ్యక్షులు మొబైల్ : 98494 91969 -
సేంద్రియ వ్యవసాయమే శరణ్యం
భారత్‌లో ఉన్న వైవిధ్యాన్ని బట్టి రైతులు వివిధ పంటలు పండించగలరు. కానీ కార్పొరేట్ వ్యవసాయం ఒకే రకమైన పంటను రుద్దుతోంది. ఇది మన ఆహార భద్రతకు ప్రమాదం. అనాదిగా మన రైతాంగం వృద్ధి చేసుకున్న స్వజాతీయ వంగడాలన్నీ కనుమరుగైపోతున్నాయి. జీవ వైవిధ్యం ధ్వంసమౌతున్నది. సేంద్రియ పద్ధతులతో పండించిన ఆహారోత్పత్తుల కోసం ఇప్పుడు మొత్తం ప్రపంచం ఎదురు చూస్తోంది. కానీ మన వ్యవసాయం ఏ దిశగా నడు స్తోంది? ఇక్కడ జరిగిన వ్యవసాయోత్పత్తులలో రసాయనాలు పరిమితికి మించి ఉంటున్నాయన్నది తీవ్రమైన ఆరోపణ. అందుకే మన పంట దిగుబడులను అమెరికా, యూరోపియన్ యూనియన్ నిషేధించాయి కూడా. మనం పండిస్తున్న పళ్లు, కూరగాయలలో నిషేధించిన హానికరమైన రసాయనాలు ఉన్నాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ జరిపిన అధ్యయనంలోనూ వెల్లడైంది. అనేక దేశాలలో నిషేధానికి గురైన సింథటిక్ పైరిత్రాయిడ్స్‌ను మన రైతులు వినియోగించడం వల్ల మన పొలాల నుంచి వచ్చిన పళ్లు, కూరగాయలంటే చాలా దేశాలు భయపడే పరిస్థితి వచ్చింది. ఎండోసల్ఫాన్‌తో జరిగిన రాద్ధాంతం కూడా మన వ్యవసాయోత్పత్తులకు ఎంతో హాని చేసింది. రెండు విధానాలకు మధ్య ఎంతో తేడా రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందుల సాయంతో పండించిన ఆహారోత్పత్తులపైనా; జన్యుమార్పిడి పంటలపైనా జరిగిన అనేక అధ్యయనాలు కలత రేపే ఫలితాలను మన ముందు ఉంచాయి. అలాంటి పంటల వినియోగం వల్ల ప్రజా రోగ్యం, పర్యావరణం తీవ్రంగా నష్టపోతాయి. అందుకే విశ్వ వ్యాప్తంగా ఇలాంటి వ్యవసాయోత్పత్తుల మీద తీవ్ర వ్యతిరేకత ప్రబలుతోంది. సేంద్రియ ఉత్పత్తుల మీద న్యూకాసిల్ విశ్వవిద్యాలయం (బ్రిటన్) 343 అధ్యయనాలు జరిపి, ఆసక్తికరమైన అంశాలను బయటపెట్టింది. సేంద్రియ ఆహారంలో 69 శాతం కంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని వారు తేల్చారు. అలాగే కేడ్మియం, లిడ్, మెర్క్యురీ వంటి భారీ లోహాలు కూడా సేంద్రియ పంటలలో తక్కువగా ఉన్నాయని తేలింది. రసాయనిక ఎరువులతో దిగుమతి అయిన వ్యవసాయోత్పత్తులతో పోల్చి చూసినపుడు సేంద్రియ పంటలలో నైట్రోజన్ 10 శాతం, నైట్రేట్లు 30 శాతం, నైట్రైట్లు 87 శాతం తక్కువగా ఉన్నాయని ఆ అధ్యయనాలు పేర్కొన్నాయి. భవిష్యత్తు సేంద్రియ పంటలదే సేంద్రియ పద్ధతులలో పండించిన పంటలకు రోజు రోజుకూ ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. డెన్మార్క్‌లో 10 శాతం ఆహార ఉత్పత్తులన్నీ సేంద్రియ వ్యవసాయంతో పండించినవే. అమెరికాలో 5 శాతం ఆహార ఉత్పత్తులు అవే. ప్రస్తుతం దీని మార్కెట్ విలువ 60 బిలియన్ డాలర్లు. ఒక్క యూరప్‌లోనే వాటి మార్కెట్ విలువ 28 బిలియన్ డాలర్లు. సేంద్రియ ఉత్పత్తుల మార్కెట్ సాలీనా 20 శాతం పెరుగుతోంది. 2016 సంవత్సరానికి ఈ మార్కెట్ విలువ 104.5 బిలియన్ డాలర్లకు చేరుతోంది. ఇక 2020 కల్లా 200 బిలియన్ డాలర్లు దాటిపో తుందని అంచనా. భారతదేశంలో కూడా సేంద్రియ ఉత్పత్తుల మీద ఆసక్తి పెరుగుతోంది. కనుమరుగ వుతున్న దేశీయ విత్తన సంపద వ్యవసాయోత్పత్తులకు మార్కెట్ అవకాశాలు కల్పించవలసిన ప్రభుత్వం, వ్యవసాయాన్నే వ్యవసాయ కార్పొరేషన్లకు మార్కెట్‌గా తయారు చేస్తోంది. పంట విత్తిన దగ్గర నుంచి నూర్చే వరకు ఆ కార్పొరేషన్ల మీద రైతు ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒక్క గుంటూరు జిల్లాలోనే పదివేల మంది విత్తన, ఎరువులు, పురుగు మందుల డీలర్లు ఉన్నట్టు అంచనా. హరిత విప్లవంతో మొదలైన కార్పొరేట్ పారిశ్రామిక వ్యవసాయంతో రైతుల ఆత్మహత్యలు, వాతావరణ కాలుష్యం వంటి దుష్పలితాలు సంభవించాయి. ప్రపంచ ఆహార సంస్థ అంచనా ప్రకారం ఒక్క ఆసియాలోనే 50 కోట్ల మంది రైతులు అర్ధాకలితో గడుపుతున్నారు. భారత్‌లో ఉన్న వైవిధ్యాన్ని బట్టి రైతులు వివిధ పంటలు పండించగలరు. కానీ కార్పొరేట్ వ్యవసాయం ఒకే రకమైన పంటను రుద్దుతోంది. ఇది మన ఆహార భద్రతకు ప్రమాదం. అనాదిగా మన రైతాంగం వృద్ధి చేసుకున్న స్వజాతీయ వంగడాలన్నీ కనుమరుగైపోతున్నాయి. జీవ వైవిధ్యం ధ్వంసమౌతున్నది. బీటీ పత్తి వచ్చిన కొద్దికాలానికే దేశీయమైన పత్తి విత్తనాలన్నీ కనుమరుైగైనాయి. ఇప్పుడు బీటీ తప్ప ఇతర పత్తిని పండించే అవకాశమే లేదు. ఇలాంటి దుస్థితి ఇతర పంటలకు పట్టకుండా చూడాలి. ఇప్పటికైనా మన పాలకులు స్పృహలోకి వచ్చి స్వజాతి విత్తనాలను అభివృద్ధి పరచాలి. రైతులు ఇతర విత్తనాల కోసం పడిగాపులు కాచే పరిస్థితి నుంచి విముక్తం చేసి, వారే విత్తనాలను ఎగుమతి చేయగల స్థితికి తీసుకురావాలి. రైతుకు అనుకూలమైన విత్తన చట్టాన్ని తీసుకురావాలి. మేధో సంపత్తి హక్కులను రైతులకు అనుకూలంగా మలచవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం ప్రోత్సహిస్తేనే సాధ్యం సేంద్రియ వ్యవసాయం విస్తరించాలన్నా, ఆ ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు మెరుగుపడాలన్నా ప్రభుత్వ చొరవతోనే సాధ్యమవుతుంది. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇస్తున్న రాయితీలన్నీ రసాయన ఎరువుల, క్రిమి సంహారక మందుల కంపెనీలకే అందుతున్నాయి. జాతీయ ఉద్యానవన మిషన్ సేంద్రియ వ్యవసాయానికి ఇచ్చే రాయితీ రూ. 22 వేలు. ఇందులో అధిక భాగం రసాయన ఎరువులు, క్రిమి సంహారకాలకే పోతోంది. ఇదే సంస్థ సేంద్రియ వ్యవసాయానికి ఇచ్చే సబ్సిడీ హెక్టార్‌కు ఏడు వేల నుంచి పదివేల రూపాయలు. ఇది చాలదన్నట్టు సేంద్రియ వ్యవసాయ సబ్సిడీ పథకాలన్నీ వ్యవసాయ కమతాన్ని ఒక యూనిట్‌గా కాకుండా ఒక పంటను యూనిట్‌గా తీసుకుంటున్నాయి. ఇది వ్యవసాయ విధానానికే విరుద్ధం. ఇంకా ప్రభుత్వ సాయంతో సేంద్రియ వ్యవసాయం చేయాలంటే ఆర్గానిక్ సర్టిఫికేషన్ కావాలి. ఈ సర్టిఫికేషన్ కోసం రైతులు కంపెనీలకు పెద్ద మొత్తంలో సొమ్ము చెల్లించవలసి రావడం మరో విషాదం. సేంద్రియ వ్యవసాయం విస్తరించాలంటే ఈ సర్టిఫికేషన్ విధానం తొలగించాలి. పంటల వారీగా కాకుండా వ్యవసాయ కమతాన్ని లేదా గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోవాలి. వైవిధ్యమైన పంటలు, పంట మార్పిడి, సమగ్ర సస్యరక్షణ, వ్యవసాయానుబంధ రంగాలు పశుపోషణ, పంచగావ్య, జీవామృతం వంటి సేంద్రియ ఎరువుల తయారీ వంటివాటన్నింటికి ప్రోత్సాహం ఇవ్వాలి. అపోహలను తొలగించాలి సేంద్రియ వ్యవసాయం ప్రపంచ ఆహార సమస్యకు పరిష్కారం కాదనీ, ఆకలి తీర్చలేదనీ ప్రచారం ఉంది. ఈ పద్ధతితో దిగుబడులు తగ్గుతాయన్న దుష్ర్పచారం కూడా ఉంది. కానీ ఇవన్నీ అబద్ధాలని పరిశోధనలు చెబుతున్నాయి. రసాయన ఎరువులతో చేసే సేద్యంలో కంటే సేంద్రియ వ్యవసాయం వల్ల దిగుబడులు పెరుగుతాయని, భూసారం కూడా వృద్ధి అవుతుందని బ్రిటన్‌కు చెందిన బ్రాడ్ బాక్ పరిశోధనలో తేలింది. ఆ రెండు వ్యవసాయ పద్ధతులలో ఏది మేలు అన్న అంశం మీద బ్రాడ్ బాక్ 50 ఏళ్ల నుంచి పరిశోధనలు చేస్తోంది. అమెరికాలో ఆరు విశ్వవిద్యాలయాలలో జరిగిన పరిశోధనలు కూడా ఇదే అంశాన్ని ఏకగ్రీవంగా వెల్లడించాయి. బీహార్‌లోని నలందా జిల్లాలో ఇద్దరు రైతులు శ్రీవరి సాగులో సేంద్రియ ఎరువులను ఉపయోగించి హెక్టార్‌కు 120 క్వింటాళ్లు దిగుబడి సాధించారు. ఇది ప్రపంచ రికార్డు కూడా. భాస్కర్ సావే వంటి ఆదర్శ రైతులు సేంద్రియ విధానాల ద్వారా అధిక దిగుబడులను సాధిస్తూనే ఉన్నారు. సుభాష్ పాలేకర్ వ్యాప్తిలోకి తెచ్చిన గోవు ఆధారిత వ్యవసాయానికి కూడా మంచి స్పందన లభించింది. మన రాష్ట్రంలో కూడా ఎందరో రైతులు దేశీయ ఆవుల సాయంతో సేంద్రియ వ్యవసాయాన్ని మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో కూడా రసాయన ఎరువులతో చేసే సేద్యానికి ఇస్తున్న సబ్సిడీలో సేంద్రియ వ్యవసాయానికి దక్కుతున్న సబ్సిడీ 1 శాతమే. ఈ బడ్జెట్లో కూడా దీనికి నిధులు అంతంత మాత్రమే ఇచ్చారు. అది కూడా ఈశాన్య రాష్ట్రాలకు రూ. 100 కోట్లు కేటాయించారు. ఈ ధోరణి మారాలి. సేంద్రియ వ్యవసాయంతో సామాజిక ఆర్థిక లక్ష్యాలు నెరవేడంతో పాటు, ఆహార భద్రత, ఆహార సార్వభౌమాధికారాన్ని కూడా సుసాధ్యం చేసుకోవచ్చు. అదే నిజమైన హరిత విప్లవం. (వ్యాసకర్త జాతీయ ఆయిల్‌పామ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి) - డా॥ కె. క్రాంతి కుమార్ రెడ్డి