corporation chairman
-
AP: బీసీ కార్పొరేషన్ల పదవీకాలం పొడిగింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్ల పదవీ కాలాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 139 వెనుకబడిన కులాలకు 56 సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే రెండేళ్ల కిందట ఏర్పాటు చేసిన ఆ కార్పొరేషన్ల పదవీకాలం ముగిసింది. దీంతో వాటిలో 55 బీసీ కార్పొరేషన్లను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచి్చంది. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఆయా కార్పొరేషన్లకు చెందిన చైర్మన్లు, డైరెక్టర్లు పదవిలో కొనసాగుతారని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, పాల ఏకరి సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టి.మురళీధర్ ఆ తర్వాత జెడ్పీటీసీ సభ్యుడిగా ఎంపికవడంతో ప్రస్తుతానికి ఆ కార్పొరేషన్ పదవీకాలాన్ని కొనసాగించలేదు. సీఎం జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పదవీకాలాన్ని పొడిగించిన నేపథ్యంలో బీసీల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పశి్చమగోదావరి జిల్లా తణుకులో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న ఆధ్వర్యంలో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సమక్షంలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిõÙకం చేశారు. ఏలూరు జిల్లా గణపవరంలో రాష్ట్ర సూర్య బలిజ కార్పొరేషన్ చైర్మన్ శెట్టి అనంతలక్ష్మి ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబును సత్కరించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైఎస్సార్సీపీ కార్యాలయంలో శ్రీశయన, పొందర–కూరాకుల కార్పొరేషన్ చైర్పర్సన్లు చీపురు రాణి, రాజాపు హైమావతి సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిõÙకం చేశారు. బీసీలకు పెద్దపీట: ఏపీ బీసీ సంఘం సీఎం వైఎస్ జగన్ బీసీలకు అన్నింటా పెద్దపీట వేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మారేష్ అన్నారు. బీసీల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. వాటిని, వాటి పదవీ కాలాన్నీ తిరిగి యథాతథంగా కొనసాగిస్తూ శనివారం ప్రభుత్వం జీవో జారీ చేయడంపై యావత్తు బీసీ లోకం హర్షం వ్యక్తం చేస్తోందన్నారు. -
కొత్త కార్పొరేషన్లు ఇవ్వొద్దు.. ప్రజాధనం వృథా చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖలకు కార్పొరేషన్ల చైర్మన్లను నియమించి ప్రజాధనం వృథా చేయొద్దని ఫోరం ఫర్ గుడ్ గవ ర్నెన్స్ (ఎఫ్‌జీజీ) తెలిపింది. రాష్ట్రంలో కార్పొరేషన్లు, డెవలప్మెంట్ అథా రిటీలు కలిపి 70 వరకు ఉన్నాయని, కొన్ని మినహాయిస్తే చాలా కార్పొ రేషన్లు కేవలం కళ తప్పిన రాజకీయ నాయకులను చైర్మన్లుగా నియమిండానికి మాత్రమే ఏర్పాటు చేసినట్లు ఉన్నాయని విమర్శించింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారం పడుతోందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఎఫ్‌జీజీ కార్యదర్శి పద్మనాభరెడ్డి లేఖరాశారు. కార్పొరేషన్లు, డెవలప్మెంట్ అథా రిటీల పనితీరు ఎప్పుడు, ఎవరూ కూడా విశ్లేషణ చేయలేదని, కొన్ని అయితే శాఖల పనిని డూప్లికేట్ చేయగా, మరికొన్ని ఏ పనీ లేకుండా ఉన్నాయని ఆరోపించారు. కార్పొరేషన్ చైర్మన్లకు జీతాలు, కార్యాలయం, తగిన సిబ్బంది, ప్రభుత్వ వాహనం, డ్రైవర్, వారి జీతభత్యాలతో రూ.2 కోట్ల వరకు ప్రజాధనం వృథా అవుతోందని తెలిపారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని పని లేని కార్పొరేషన్లను మూసేయా లని, ఎలాంటి కార్పొరేషన్లు నెలకొల్పవద్దని సీఎస్‌కు రాసిన లేఖలో పద్మనాభరెడ్డి కోరారు. -
కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా అడపా శేషు ప్రమాణస్వీకారం
సాక్షి, అమరావతి : కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా అడపా శేషు శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి, అవంతి శ్రీనివాస్ హజరయ్యారు. అంతకముందు వైఎస్ఆర్, వంగవీటి రంగా విగ్రహాలకు మంత్రులు నివాళి అర్పించారు. -
దేశ చరిత్రలో తొలిసారి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలోనే తొలిసారిగా వెనుకబడిన తరగతులకు చెందిన 139 కులాల సంక్షేమం కోసం 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వీటికి చైర్మన్లు, డైరెక్టర్లను నియమించి చిత్తశుద్ధి చాటుకునేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకంలోనూ బీసీలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. బీసీ కులాల జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. పది లక్షలకు పైన జనాభా ఉన్న కార్పొరేషన్లను ‘ఏ’ కేటగిరీ కింద, లక్ష నుంచి పది లక్షల వరకు జనాభా ఉన్న కార్పొరేషన్లను ‘బి’ కేటగిరీ కింద, లక్షలోపు జనాభా ఉన్న కార్పొరేషన్లను ‘సి’ కేటగిరీ కింద విభజించారు. (దసరాకు 1,850 ప్రత్యేక బస్సులు) 18న చైర్మన్లు, డైరెక్టర్ల నియామకం బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్ల నియామకాలకు అక్టోబరు 18వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. ఒక్కో కార్పొరేషన్‌కు 13 మంది డైరెక్టర్లను నియమించి అన్ని జిల్లాలకు ప్రాతినిథ్యం కల్పించనున్నారు. బీసీ కార్పొరేషన్ల ద్వారా 728 మంది డైరెక్టర్లుగా పదవులు పొందనున్నారు. ఇందులో 50 శాతం పదవులు మహిళలకు దక్కేలా చర్యలు చేపట్టారు. 2.71 కోట్ల మందికి లబ్ధి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన 16 నెలల వ్యవధిలోనే 2,71,37,253 మంది బీసీలకు రూ. 33,500 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. ఇంత భారీగా బీసీల కోసం ఖర్చు చేసిన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు లేదు. బీసీలకు నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పోస్టుల్లో సగం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. (చదవండి: కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో స్వయం సమృద్ధి) -
ఆర్య వైశ్యులకు టీడీపీ చేసిందేమీ లేదు: మంత్రులు
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ఆర్య వైశ్య వేల్ఫేర్, డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా కుప్పం ప్రసాద్ ప్రమాణం చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో కుప్పం ప్రసాద్‌తో మంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, శంకర్ నారాయణ, వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రులు ప్రసంగించారు. వైశ్యులకు గత ప్రభుత్వం చేసిందేమీ లేదు.. గత టీడీపీ ప్రభుత్వం ఆర్య వైశ్యులకు చేసిందేమీ లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. రాష్ట్రంలో 10 శాతం జనాభా ఆర్యవైశ్యులు ఉన్నారని.. వేల కోట్లతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలపరుస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశ్వసనీయత, నిబద్ధతకు నిదర్శనం అయితే.. చంద్రబాబు మోసం, దోపిడీకి నిదర్శనమని పేర్కొన్నారు. చంద్రబాబు.. ఎన్నికలకు ఐదు నెలల ముందు కార్పొరేషన్ ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా నిధులు కేటాయించారని విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వం కుల రాజకీయాలకు చేసిందని ధ్వజమెత్తారు. కుల, మత, పార్టీలకతీతంగా సీఎం జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద వైశ్యులకు కార్పొరేషన్ అండగా నిలవాలని కోరారు. ఆర్య వైశ్యులకు అండగా నిలవాలి.. ఆర్థికంగా వెనుకబడిన వైశ్యులకు అండగా ఉండాలని మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కుప్పం ప్రసాద్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ప్రాంతాలకు అతీతంగా పనిచేసి.. పేదలకు చేయూత నివ్వాలని ఈ సందర్భంగా కోరారు. ప్రభుత్వానికి, వైశ్యులకు సంధాన కర్తగా ప్రసాద్ పనిచేయాలన్నారు. సీఎం వైఎస్ జగన్ తనపై ఉంచిన బాధ్యతను నెరవేర్చాలన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.. వైశ్యులకు ఇచ్చిన మాటను సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపకుండా పొట్టి శ్రీరాములు త్యాగాన్ని అవమానించారని ధ్వజమెత్తారు. నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరిపి సీఎం జగన్ గౌరవించారని పేర్కొన్నారు. ఆయనకు వైశ్యులంతా అండగా ఉండాలని కోరారు. వైశ్యుల ఆరాధ్య దైవం పెనుగొండ వాసవిమాత ఆలయ అభివృద్ధి సీఎం వైఎస్ జగన్ కోటిన్నర నిధులు మంజూరు చేశారని వెల్లడించారు. ఆర్య వైశ్యులకు ఆర్థిక ప్రోత్సాహం ఇచ్చేందుకే కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో పేదలైన ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు. ఆ ఆరోపణలు అవాస్తవం.. ఆర్య వైశ్యుల్లో అధిక శాతం పేదలున్నారని.. కార్పొరేషన్ ద్వారా వారికి ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రోశయ్య సీఎం గా ఉన్నప్పుడు ఆయనను వైఎస్ జగన్ చిన్నచూపు చూశారనే ఆరోపణలు అవాస్తమన్నారు. రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు జగన్ గౌరవించారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ తన పోరాటం సోనియాగాంధీపై చేశారే తప్ప రోశయ్యపై కాదని వివరించారు. రోశయ్యను జగన్ ఎన్నడూ ఒక మాట కూడా అనలేదని.. రోశయ్య సీఎం గా ఉన్నంత కాలం జగన్ కాంగ్రెస్‌లోనే ఉన్నారని పేర్కొన్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి సీఎం అయిన తర్వాతే జగన్ వైఎస్సార్సీపీ పార్టీని స్థాపించారని తెలిపారు. కార్పొరేషన్‌కు సీఎం జగన్ వచ్చే బడ్జెట్లో తగిన నిధులను కేటాయిస్తారని వెల్లడించారు. రాష్ట్రంలో ఆర్య వైశ్యులందరికీ కార్పొరేషన్ ద్వారా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వైశ్యులంతా వైఎస్సార్సీపీ వెంటే.. ఆర్య వైశ్య సమాజం అంతా వైఎస్సార్సీపీ వెంట నడుస్తోందని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాలనా కృషి ఫలితంగానే ఆర్య వైశ్యులంతా వైఎస్సార్సీపీకి అండగా నిలిచారని పేర్కొన్నారు. పేద వైశ్యులకు కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా పరిపుష్టి కల్పించాలని కోరారు. బీసీ సంక్షేమ శాఖ నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. చంద్రబాబు మోసం చేశారు.. వైశ్యులంటే సేవ, నిజాయితీకి నిదర్శనమని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు అన్నారు. గత టీడీపీ పాలనలో అనేక కులాలకు కార్పొరేషన్లు ఇస్తామని చంద్రబాబు మోసం చేశారని దుయ్యబట్టారు. అడిగితే వరాలు ఇచ్చేది దేవుడయితే... పేదల కళ్లలో కష్టాలు చూసి వరాలు ఇచ్చే దేవుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని పేర్కొన్నారు. గాంధీజీ, పొట్టి శ్రీరాములు ఆశయ సాధనలో పాలన సాగిస్తున్న వైఎస్ జగన్‌కు అందరూ అండగా నిలవాలని కోరారు. -
‘రాష్ట్రానికి గోల్డ్ మెడల్ రావడం సంతోషకరం’
సాక్షి, తాడేపల్లి : దేశంలో అత్యున్నత నైపుణ్యం ఇస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూధన్‌రెడ్డి వెల్లడించారు. బెస్ట్ స్కిల్ డెవలప్మెంట్ స్టేట్స్ అవార్డ్స్‌లో మన రాష్ట్రానికి గోల్డ్ మెడల్ రావడం సంతోషకరమని పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడిన ఆయన నైపుణ్యాభివృద్ధిలో ఉత్తమ విధానాలు అవలంబిస్తున్న రాష్ట్రాలకు అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఈ అవార్డును ప్రదానం చేసిందని తెలిపారు. వృత్తి నైపుణ్య శిక్షణలో ఆరు నెలల్లోనే వేలాది మందికి శిక్షణనిచ్చామని వివరించారు. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయానికి అనుగుణంగా యువతకు శిక్షణనిస్తున్నామని తెలియజేశారు. -
నామినేటెడ్ పదవుల పందేరం..
అధికార పార్టీ నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచి.. మంత్రివర్గ విస్తరణ కూడా అయిపోయింది. దీంతో నామినేటెడ్ పదవుల పందేరం మొదలవనుందని గు‘లాబీ’ శ్రేణులు ఆశిస్తున్నాయి. కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర సంస్థలకు పాలకవర్గాలను నియమిస్తారనే ప్రచారం ఊపందుకోవడంతో వివిధ స్థాయిల్లోని నేతలు ఎవరికి వారుగా లాబీయింగ్ ప్రారంభించారు. ఓ వైపు సీఎం కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం, మరో వైపు మంత్రి హరీష్‌రావు అండదండలతో పదవులు పొందేందుకు పావులు కదుపుతున్నారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నామినేటెడ్ పదవుల భర్తీలో టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారనే దానిపైనే నేతల భవితవ్యం ఆధారపడి ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులకు కూడా అవకాశమివ్వాలని కేసీఆర్ నిర్ణయిస్తే నామినేటెడ్ ఆశావహుల జాబితా చాంతాడంత ఉండే అవకాశముంది. వీరిని పక్కనపెట్టాలని భావిస్తే మాత్రం గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన వారు, మొదటి నుంచీ పార్టీలో పనిచేస్తున్న వారు, ఎన్నికలకు ముందు వివిధ పార్టీల నుంచి వచ్చినవారు, వివిధ జేఏసీల్లో క్రియాశీలకం గా పనిచేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన వారు రేసులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ మాత్రం సీనియర్లు, ఉద్యమంలో ఉండి మొదటి నుం చీ పనిచేస్తున్న వారిని పదవుల్లో నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ భవన్ వర్గాల సమాచారం. ఎమ్మెల్సీ పదవులను బట్టి... జిల్లా నుంచి మంత్రి హరీష్‌రావు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం ఇచ్చారు. గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ కోటాలో రాములు నాయక్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా భూపాల్‌రెడ్డిలు ఉన్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కానుంది. ఈ స్థానంలో ప్రస్తుత ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డికే తిరిగి అవకాశం కల్పించవచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో జోగిపేట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ గెలుపుకోసం కృషి చేసిన మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవి రేసులో ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి కానీ, రాష్ట్ర స్థాయిలో ఏదైనా కార్పొరేషన్ పదవి ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే హామీ ఇచ్చినట్లు సమాచారం. మాజీ మంత్రి ఎం.డి.ఫరీదుద్దీన్ ప్రధానంగా ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. అధిష్టానం కూడా సానుకూలంగా ఉందని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ రాని పక్షంలో రాష్ట్రస్థాయిలో ముఖ్య కార్పొరేషన్ పదవిని కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దివంగత మంత్రి కరణం రాంచందర్‌రావు కుమారుడు కరణం సోమశేఖర్ కూడా ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. పదవుల కోసం ఎదురుచూపులు... నామినేటెడ్ పదవుల కోసం పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. సంగారెడ్డికి సంబంధించి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పదవి ఆశిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవి త్యాగం చేసిన తనకు పార్టీ నామినేటెడ్ ఇవ్వటం ఖాయమని ఆయన భావిస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే తూమకుంట నర్సారెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, పొన్నాల రఘుపతిరావు, భూమిరెడ్డి, జోగిపేట నియోజకవర్గం నుంచి కిష్టయ్య, నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి భూపాల్‌రెడ్డి, పటాన్చెరు నుంచి గాలి అనిల్‌కుమార్ తదితరులు కార్పొరేషన్ పదవులకోసం పోటీపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో మాజీ ఎంపీ డాకూరు మాణిక్‌రెడ్డికి ఏదో ఒక పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి చిలుముల కిషన్‌రెడ్డి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి కోసం స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన మాజీ జెడ్పీ చైర్మన్ లక్ష్మీకాంతరావు రాష్ట్రస్థాయి పదవి ఆశిస్తున్నారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి లేదా మరేదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి కోరుతున్నట్లు తెలుస్తోంది. కీలకమైన టీఎస్ఐఐసీ పదవి కూడా జిల్లాకే దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనికోసం ముగ్గురు కీలక నేతల మధ్య పోటీ నెలకొంది. సిద్దిపేట నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌కు సన్నిహితులు ఉన్నారు. వారు ముఖ్యమంత్రితో ఉన్న సాన్నిహిత్యంతో కార్పొరేషన్ పదవుల కోసం పావులు కదుపుతున్నప్పటికీ మంత్రి హరీష్‌రావు ఆశీస్సులు ఉన్నవారికే పదవులు దక్కే అవకాశం ఉంది. హరీష్‌రావు నిర్ణయమే కీలకం... జిల్లా స్థాయి పదవులను ఆశిస్తున్నవారి చిట్టా చాంతాడంత ఉంది. అటు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులు, జిల్లాస్థాయి పదవుల పందేరంలో మంత్రి హరీష్‌రావు నిర్ణయం కీలకం కానుంది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి కాలం త్వరలో ముగియనుంది. దీంతో ఈ పదవి కోసం జిల్లాస్థాయి నేతల నడుమ తీవ్ర పోటీ ఉంది. సీఎం నియోజకవర్గమైన గజ్వేల్, మంత్రి నియోజకవర్గమైన సిద్దిపేట ప్రాంతానికి చెందిన నేతలు గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిపై ప్రధానంగా కన్నేసినట్లు సమాచారం. ఏడుపాయల దుర్గా భవానీ ఆలయం కమిటీ, నాచగిరి లక్ష్మీనర్సింహ్మాస్వామి ఆలయ కమిటీ చైర్మన్ పదవులను మెదక్, గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు ఆశిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, సీడీసీ చైర్మన్ పదవుల కోసం జిల్లా, నియోజకవర్గస్థాయి నేతలు జోరుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇది వరకు మంత్రి హరీష్‌రావును కలిసి పలువురు నేతలు తమ మనస్సులోని మాటను చెప్పుకున్నారు. అయితే వీరిలో ఎంత మందికి పదవులు దక్కుతాయనేది వేచి చూడాల్సి ఉంది. -
మెజారిటీ స్థానాలపై టీఆర్ఎస్ కన్ను
-
మెజారిటీ స్థానాలపై టీఆర్ఎస్ కన్ను
* నేడు 53 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్ల అధ్యక్ష పీఠాలకు ఎన్నికలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 53 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్ల చైర్పర్సన్లు/మేయర్ల పదవులకు గురువారం ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో మెజారిటీ స్థానాలను దక్కించుకునే దిశగా అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పావులు కదుపుతోంది. పూర్తి స్థాయి మెజారిటీ లేనిచోట ప్రతిపక్షాల సభ్యులను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు రాష్ట్రంలో తాము అధికారంలో ఉన్న పరిస్థితికి అనుగుణంగా మలుచుకోవడానికి చూస్తోంది. మొత్తంగా ఉత్తర తెలంగాణలోని ఒకటి రెండు జిల్లాలు మినహా అన్ని మున్సిపాలిటీలనూ టీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతోపాటు నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లతో పాటు రామగుండం స్థానాన్ని కూడా కైవసం చేసుకోవడానికి టీఆర్ఎస్ యత్నిస్తోంది. కాగా ఈ ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇదివరకే ఎంపిక చేసుకున్న మున్సిపాలిటీల్లో ఓటు వేయడానికి అర్హులు. ‘ఆకర్ష్’ మంత్రమే.. మున్సిపాలిటీల్లో తమకు మెజారిటీ కోసం అవసరమైన సంఖ్యాబలం లేని చోట టీఆర్ఎస్ ‘ఆకర్ష్’ మంత్రం ప్రయోగిస్తోంది. చిన్న పార్టీలు, స్వతంత్ర సభ్యులను తిప్పుకోవడంతో పాటు, కాంగ్రెస్ నుంచి కూడా కౌన్సిలర్లను చేర్చుకుంటోంది. వరంగల్ జిల్లాలోని మొత్తం ఐదు మున్సిపాలిటీలను.. కరీంనగర్ జిల్లాలో ఒక్క జగిత్యాల మినహా అన్ని(8) మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకోనుంది. ఖమ్మం జిల్లాలోని నాలుగింటిలో ఒక చోట వైఎస్సార్సీపీ, కొత్తగూడెంను (కాంగ్రెస్ సభ్యులు టీఆర్ఎస్కు మద్దతిస్తున్నట్లు సమాచారం) టీఆర్ఎస్ దక్కించుకోవచ్చని అంటున్నారు. మిగతా రెండింటిని టీడీపీ కైవసం చేసుకోనుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క భైంసా ( దీనిని ఎంఐఎం కైవసం చేసుకోనుంది) మినహా మిగిలినవి టీఆర్ఎస్ వశం కానున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని మూడింటిలో రెండు టీఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్‌కు, రంగారెడ్డి జిల్లాలో రెండు టీఆర్ఎస్కు (అనూహ్యంగా వికారాబాద్ వస్తే), ఒకటి కాంగ్రెస్, రెండు టీడీపీకి, నల్లగొండలోని ఏడు మున్సిపాలిటీల్లో ఐదింటిలో కాంగ్రెస్, ఒకటి టీఆర్ఎస్, ఒకటి బీజేపీ దక్కించుకునే అవకాశాలున్నాయి. మెదక్‌లో ఆరు మున్సిపాలిటీలకుగాను కాంగ్రెస్, టీఆర్ఎస్ చెరిమూడు స్థానాలు దక్కించుకుంటాయని అంచనా. ఇక మహబూబ్‌నగర్‌లో ఎనిమిది మున్సిపాలిటీలు ఉంటే.. నాలుగు కాంగ్రెస్, రెండు టీఆర్ఎస్, ఒక టి టీడీపీ, బీజేపీ దక్కించుకునే అవకాశం ఉంది. కాగా రామగుండం కార్పొరేషన్లో టీఆర్ఎస్కు బలం లేకపోవడంతో.. దానిని ఎంఐఎంకు అప్పగించి, నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో ఆ పార్టీ మద్దతు తీసుకునే అవకాశముంది.