corporation meeting
-
మంత్రి పదవి రాలేదని...
నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశం బహిష్కరణ గోరంట్లకు టీడీపీ కార్పొరేటర్ల సంఘీభావం కోరం లేకపోవడంతో వాయిదా వేసిన మేయర్ నగరాన్ని అభివృద్ధి చేయాలని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని టీడీపీ ప్రజాప్రతినిధులు తమ స్వప్రయోజనాలకు వాడుకోవడంతో నగర పాలక సంస్థ అభివృద్ధిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరికి మంత్రి పదవి దక్కనందున టీడీపీ కౌన్సిలర్లు మూకమ్మడిగా నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశానికి డుమ్మా కొట్టారు. దీంతో బడ్జెట్ సమావేశం సోమవారం నిర్వహించిన నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశం వాయిదా పడింది. ఆనం కళాకేంద్రం ఎదురుగా ఉన్న పార్టీ కార్యాలయంలో సమావేశమై బహిష్కరణ వ్యూహానికి పదును పెట్టారు., సీనియారిటీని గుర్తించడంలో సీఎం చంద్రబాబు అనుసరించిన తీరుకు నిరసనగా గోరంట్లకు సంఘీభావం ప్రకటిస్తూ పార్టీ కార్యాలయంలోనే ఉండిపోయారు. నగర పాలక సంస్థ సమావేశానికి హాజరైన గోరంట కాసేపు ఉండి.. టీడీపీ సభ్యులు లేకపోవడం చూసి ఆయన కూడా పార్టీ కార్యాలయానికి వెళ్లిపోయారు. బడ్జెట్ సమావేశం జరిగేలా చూడాలన్న సూచనకు వారు ససేమిరా అన్నారు. నగర ప్రగతికి ఎంతో కీలకమైన బడ్జెట్లను కాదని అలకబూనడం విచారకరమని విపక్షం మండిపడింది. సాక్షి, రాజమహేంద్రవరం : టీడీపీలోని అంతర్గత రాజకీయాలు నగర పాలక సంస్థపై పడింది. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరికి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడం, పార్టీ పదవికి ఆయన రాజీనామా చేయడం సోమవారం నిర్వహించిన నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశంపై ప్రభావం చూపింది. నగరపాలక సంస్థ సముదాయంలోని క్రొవిడి లింగరాజు మందిరంలో నిర్వహించ తలపెట్టిన బడ్జెట్ సమావేశం కోరం లేక వాయిదా పడింది. ఈ సమావేశానికి టీడీపీ కార్పొరేటర్లు హాజరుకాలేదు. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఆరుగురు, స్వతంత్రులు నలుగురు, బీఎస్పీ ఒకరు, బీజేపీకి చెందిన కార్పొరేటర్ ఒకరు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. తొలుత కోరం లేనందున మేయర్ పంతం రజనీశేషసాయి గంటపాటు సమావేశాన్ని వాయిదా వేశారు. తర్వాత నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్ది అప్పారావు సమావేశానికి వచ్చారు. తిరిగి 11:30 గంటలకు సభను ప్రారంభించిన మేయర్ అప్పడు కూడా కోరం లేకపోవడంతో సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. తిరిగి ఎప్పుడు ఏర్పాటు చేసేది కమిషనర్ వి.విజయరామరాజు తెలియజేస్తారని చెప్పారు. ఇది రెండో సారి... సమావేశాన్ని బహిష్కరించిన టీడీపీ కార్పొరేటర్లు నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశం రెండోసారి వాయిదా పడినట్లయింది. మార్చి 31న ఈ సమావేశం వాయిదా పడిన విషయం విదితమే. ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నందున ఈ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు అప్పట్లో ప్రకటించారు. ముక్కిపోయిన సమోసా పెడతారా? సభ్యులు, అధికారులు, మీడియా వారికి పెట్టిన సమోసాలు ముక్కిన వాసన రావడంతో స్వతంత్ర కార్పొరేటర్ నండూరి వెంకటరమణ అధికారులను ప్రశ్నించారు. ‘మీకు ఎలాంటి సమోసాలు కావాలి’అని అధికారులు అడగడంతో నండూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిలో జరిగే నాలుగు సమావేశాలల్లో స్నాక్స్, టీ కోసం రూ.10 లక్షలు ఖర్చు చేస్తున్నారని, ఆ నిధులకు లెక్కలు చెప్పాలని నిలదీశారు. నిధుల వినియోగంపై లెక్కా పత్రం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. నగర బడ్జెట్‌ను తాకట్టు పెట్టారు.. ఆర్థిక సంవత్సరం ముగిసినా కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసం నగరపాలక సంస్థ బడ్జెట్‌ను టీడీపీ కార్పొరేటర్లు తాకట్టు పెట్టారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ బడ్జెట్ సమావేశాన్ని బహిష్కరించడంతో.. నగర అభివృద్ధిపై వారి చిత్తశుద్ధిని తెలియజేస్తోందని అన్నారు. బడ్జెట్ సమావేశం వాయిదా పడిన తర్వాత కార్పొరేటర్లు గుత్తుల మురళీధర్‌రావు, మజ్జి నూకరత్నం, పిల్లి నిర్మల, బాపన సుధారాణి, బొంతా శ్రీహరిలతో కలిసి ఆమె విలేకర్లతో మాట్లాడారు. నిబంధనల ప్రకారం కోరం లేదని సభను వాయిదా వేసిన పాలకులు.. మార్చి 31లోపు బడ్జెట్‌ను ఆమోదించాలన్న నిబంధనలు తెలియదాని ప్రశ్నించారు. ఇప్పటికే మూడు రోజుల పాటు ఎలాంటి చెల్లింపులు చేయలేదని కమిషనర్ చెబుతున్నారని పేర్కొన్నారు.యీ సమావేశం తిరిగి ఎప్పడు నిర్వహించేదీ చెప్పలేదని, అప్పడువరకూ నగరపాలక సంస్థలో లావాదేవీలు పూర్తిగా నిలిచిపోతాయన్నారు. మెజారిటీ ఉందన్న భావనతో టీడీపీ కార్పొరేటర్లు ఇలా చేయడం భావ్యం కాదని సూచించారు. స్వప్రయోజనాల కోసం ఐదు లక్షల మంది నగర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. -
అలా ముగించేశారు !
– పాలకవర్గం తీరుకు నిరసనగా కార్పొరేటర్ల వాకౌట్ – రూ.58 కోట్లకు బడ్జెట్ ఆమోదం అనంతపురం న్యూసిటీ : ప్రజాసమస్యల ప్రస్థావన లేకుండానే నగర పాలక సంస్థలో శనివారం నిర్వహించిన బడ్జెట్ సమావేశం తూతూ మంత్రంగా ముగించారు. తొలుత ప్రజాసమస్యలపై చర్చ జరిగాకే బడ్జెట్‌ను ఆమోదించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పట్టుబట్టినా మేయర్ స్వరూప ఏమాత్రం పట్టించుకోలేదు. చివరికి వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు సమావేశాన్ని వాకౌట్ చేసి వెళ్లిపోయారు. ప్రతిపక్ష పార్టీకి మద్దతుగా నలుగురు ఇండిపెండెంట్ కార్పొరేటర్లు, ఇద్దరు టీడీపీ కార్పొరేటర్లు బయటకు వచ్చేశారు. చివరకు మేయర్ రూ.58 కోట్లతో బడ్జెట్‌కు ఆమోదించగా అందుకు టీడీపీ కార్పొరేటర్లు ఓకే చెప్పేశారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్ సీపీ పట్టు బడ్జెట్ సమావేశం ప్రారంభమైనప్పటి నుంచి వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు గంగన హిమబిందు, బోయ గిరిజమ్మ, జానకి, బాలాంజినేయులు, గూడురు మల్లికార్జున, షుకూర్ ప్రజా సమస్యలపై చర్చించాలని పట్టుబట్టారు. నగరంలో పందులు, కుక్కలు స్వైర్య విహారం చేస్తున్నాయని, పారిశుద్ధ్యం పడకేసిందని, నగరపాలక సంస్థలో పాలన స్తంభించిందని ధ్వజమెత్తారు. బడ్జెట్ చదవడాన్ని ఆపాలంటూ అకౌంటెంట్ దేవశంకర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ స్వరూప జోక్యం చేసుకుని తొలుత బడ్జెట్ చదవాలని ప్రజా సమస్యలపై మళ్లీ మాట్లాడుదామని అల్టిమేటం జారీ చేశారు. కమిషనర్ సత్యనారాయణను చుట్టుముట్టి సమస్యలపై మాట్లాడాలని ఇది వరకే మీ దృష్టికి తీసుకువచ్చినా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో కలెక్టర్ అనుమతితో కేవలం బడ్జెట్ అంశంపై మాత్రమే చర్చించాలంటూ తోసిపుచ్చారు. అందుకు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు.. కలెక్టర్ ఎక్కడైనా ప్రజా సమస్యలపై మాట్లాడవద్దని చెప్పారా.. అని నిలదీస్తే కమిషనర్ నోట మాట రాలేదు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఏవిధంగా బడ్జెట్ సమావేశం నిర్వహించారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై రోజూ నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చి చెట్లకు, గోడలకు చెప్పి వెళ్లాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అరగంటపాటు తీవ్ర గందరగోళం నెలకొనింది. అంతలోనే 9వ డివిజన్ కార్పొరేటర్ పద్మావతి నీటి కొళాయికు బిరడా వేయలేని నిస్సహాయ స్థితిలో పాలకవర్గం, అధికారులు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేసవిలో నీరు సరిగా రావడం లేదన్నారు. టీడీపీ రెబెల్ కార్పొరేటర్ ఉమామహేశ్వర్ సైతం ప్రజా సమస్యలపై ప్రస్తావించాలని పట్టుబట్టారు. చివరకు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు పాలకవర్గం, అధికారుల తీరును తప్పుబడుతూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లతో నలుగురు స్వతంత్య్ర, ఇద్దరు టీడీపీ కార్పొరేటర్లు సమావేశం నుంచి బయటకు రావడం గమనార్హం. పందికొక్కుల్లా మెక్కుతున్నారు : వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు కనీస మౌళిక సదుపాయాలు కల్పించడంలో పాలకవర్గం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు గంగన హిమబిందు, బోయ గిరిజమ్మ, జానకి, బోయ పక్కీరమ్మ, బోయ సరోజమ్మ,బాలాంజినేయులు, షుకూర్, పోతులయ్య, గూడురు మల్లికార్జున, చింతకుంట సుశీలమ్మ, వెంకటరమణమ్మ ధ్వజమెత్తారు. సమావేశాన్ని వాకౌట్ చేసిన అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ పందికొక్కుల్లా ప్రజాధనాన్ని మెక్కుతున్నారని ఆరోపించారు. త్వరలో పాలకవర్గం అవినీతి, అక్రమాలను ఎండగడతామని హెచ్చరించారు. రూ 58 కోట్లకు ఆమోదం : గతేడాది మిగులు బడ్జెట్ రూ.3.98 కోట్లు, ఈ ఏడాది బడ్జెట్ రూ. 54.55 కోట్లను కలుపుకుని రూ. 58.53 కోట్లతో బడ్జెట్‌కు పాలకవర్గం ఆమోదం తెలిపింది. అందులో రూ 54.55 కోట్ల సాధారణ రాబడులు కాగా రూ.46.87 కోట్లు ఖర్చులున్నట్లు బడ్జెట్లో పేర్కొన్నారు. సమావేశంలో కమిషనర్ సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ గంపన్న, ఈఈ రామ్మోహన్ రెడ్డి, డీఈ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరి మహిళా కార్పొరేటర్ల తిట్ల పురాణం
-
మహిళా కార్పొరేటర్ల వీరంగం
కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ సమావేశం సోమవారం ఉద్రిక్తతకు దారితీసింది. ఇద్దరు టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు పరస్పరం తిట్ల పురాణాన్ని దండించుకున్నారు. డివిజన్ కాంట్రాక్టు పనుల విషయంపై ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది. ఒకరి వార్డులో మరొకరు జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలతో సమావేశాన్ని రణరంగంగా మార్చారు. అంతటితో ఆగకుండా ఓ మహిళ కార్పొరేటర్ సహనం కోల్పోయి మరో కార్పొరేటర్‌కు చెప్పు చూపించారు. ఇరువురిని వారించడం ఇతర కార్పొరేటర్లకు కష్టతరంగా మారింది. మహిళా కార్పొరేటర్ల తీరుపై ఇటు అధికారులు, తోటి కార్పొరేటర్లు విస్తుపోయారు.