కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ సమావేశం సోమవారం ఉద్రిక్తతకు దారితీసింది. ఇద్దరు టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు పరస్పరం తిట్ల పురాణాన్ని దండించుకున్నారు.
డివిజన్ కాంట్రాక్టు పనుల విషయంపై ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది. ఒకరి వార్డులో మరొకరు జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలతో సమావేశాన్ని రణరంగంగా మార్చారు. అంతటితో ఆగకుండా ఓ మహిళ కార్పొరేటర్ సహనం కోల్పోయి మరో కార్పొరేటర్కు చెప్పు చూపించారు. ఇరువురిని వారించడం ఇతర కార్పొరేటర్లకు కష్టతరంగా మారింది. మహిళా కార్పొరేటర్ల తీరుపై ఇటు అధికారులు, తోటి కార్పొరేటర్లు విస్తుపోయారు.
మహిళా కార్పొరేటర్ల వీరంగం
Published Mon, Jan 11 2016 4:36 PM | Last Updated on Sun, Sep 3 2017 3:29 PM
Advertisement
Advertisement